బాడీలైన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బిల్ వుడ్‌ఫుల్ బాడీలైన్ బంతిని తప్పించుకున్నాడు

1932-33 ఆస్ట్రేలియా పర్యటన కోసం ఇంగ్లీష్ క్రికెట్ జట్టు రూపొందించిన క్రికెట్ వ్యూహం, బాడీలైన్. దీన్ని ఫాస్ట్ లెగ్ థియరీ బౌలింగ్ అని కూడా అంటారు. ప్రముఖ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాన్ని ఎదుర్కోవడానికి దీన్ని రూపొందించారు. బాడీలైన్ డెలివరీ అనేది బ్యాట్స్‌మన్ శరీరానికి గురిపెట్టి పేస్‌తో బౌల్ చేయడం, బ్యాట్స్‌మన్ దాన్నుండి రక్షించుకునే ప్రయత్నంలో బ్యాట్‌ను అడ్డుపెట్టినపుడు బంతి దానికి తగిలి, ఎగిరి లెగ్‌సైడులో చాలా దగ్గరగా మోహరించిన ఫీల్డర్లకు క్యాచ్ అందేలా చేయడం దాని ఉద్దేశం.

ఆ సమయంలో, హెల్మెట్‌లు గానీ, శరీర పైభాగానికి రక్షణనిచ్చే ఉపకరణాలు గానీ ధరించేవారు కాదు. సాంప్రదాయకంగా క్రీడాస్ఫూర్తి సంప్రదాయాలను సమర్థించే ఈ ఆటలో ఇలాంటి వ్యూహాన్ని భయపెట్టడంగా, శారీరిక హాని తలపెట్టే బెదిరింపుగా విమర్శకులు భావించారు. [1] ఇంగ్లండ్ జట్టు వ్యూహాన్ని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లో కొందరు అతి దూకుడుగా, అన్యాయంగా భావించారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు ముప్పు కలిగించేంత స్థాయికి ఈ వివాదం రూపుదాల్చింది. ఆ తరువాత పరిస్థితి సద్దుమణిగింది. [2] [3]

ఈ లెగ్ థియరీ ఫీల్డ్ సెట్ చేసినప్పుడు షార్ట్-పిచ్డ్ డెలివరీల వల్ల తీవ్రమైన గాయాలు కలగకపోయినా, ఈ వ్యూహంతో రెండు జట్ల మధ్య సుహృద్భావం గణనీయంగా దెబ్బతింది. ప్రత్యేకించి ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్లకు దెబ్బలు తగిలినపుడు, ప్రేక్షకులు మండిపడ్డారు.

హెల్మెట్‌లను ప్రవేశపెట్టిన తర్వాత, షార్ట్-పిచ్ ఫాస్ట్ బౌలింగ్, 90 mph వేగంతో, బ్యాట్స్‌మన్‌ను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, క్రికెట్‌లో అనుమతించబడుతూనే ఉంది. పొదుపుగా ఉపయోగించినప్పుడు దీన్ని చట్టబద్ధమైన బౌలింగ్ వ్యూహంగానే పరిగణిస్తున్నారు.

కాలక్రమేణా, బాడీలైన్ వ్యూహాన్ని నిరుత్సాహపరచేందుకు, కంకషన్ బ్రేక్‌లు, తనిఖీల వంటి పద్ధతులతో ఆటగాళ్ల భద్రతను పెంచడానికి క్రికెట్‌లో అనేక చట్టాలను మార్చారు.

పుట్టుక[మార్చు]

లెగ్ థియరీ బౌలింగ్[మార్చు]

19వ శతాబ్దంలో, లెగ్ స్టంప్ వద్ద బంతిని బౌల్ చేయడాన్ని, బ్యాట్స్‌మెన్ లెగ్ సైడ్‌లో కొట్టడాన్నీ చాలా మంది క్రికెటర్లు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా భావించేవారు. కానీ 20వ శతాబ్దపు ప్రారంభ సంవత్సరాల్లో, కొంతమంది బౌలర్లు, సాధారణంగా స్లో లేదా మీడియం-పేస్ బౌలర్లు లెగ్ థియరీని వ్యూహంగా ఉపయోగించారు; ఫీల్డర్‌లను లెగ్ సైడున మోహరించి బంతిను లెగ్ స్టంప్ రేఖకు వెలుపల వేసేవారు. బ్యాట్స్‌మాన్ సహనాన్ని పరీక్షించడం, ర్యాష్ స్ట్రోక్‌ కొట్టేలా చెయ్యడం వంటివి చేసేవారు.[4] 1903-04లో జార్జ్ హిర్స్ట్, 1911-12లో ఫ్రాంక్ ఫోస్టర్ అనే ఇద్దరు ఇంగ్లీష్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు ఆస్ట్రేలియాలో టెస్ట్ మ్యాచ్‌లలో ఫీల్డర్లను దిట్టంగా మోహరించిన లెగ్ సైడ్ ఫీల్డ్‌లకు బౌలింగ్ చేశారు; [5] ఆస్ట్రేలియా తరఫున వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ కూడా దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించాడు. [6] మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు సంవత్సరాలలో, చాలా మంది బౌలర్లు ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో లెగ్ థియరీని ఉపయోగించారు. [4]

యుద్ధం తర్వాత క్రికెట్ పునఃప్రారంభమైనప్పుడు, అతి కొద్దిమంది బౌలర్లే ఈ వ్యూహాన్ని కొనసాగించారు. ఈ పద్ధతి అప్పటికే ప్రేక్షకులలో ఆదరణ పొందలేదు. వోర్సెస్టర్‌షైర్ బౌలరు ఫ్రెడ్ రూట్, దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించి, కౌంటీ క్రికెట్‌లో గణనీయమైన విజయాన్ని సాధించాడు. తరువాతి కాలంలో రూట్, తన లెగ్ థియరీ, బాడీలైన్‌ను సమర్థించుకున్నాడు. ఆఫ్ స్టంప్ వెలుపల బౌలింగ్ చేసినప్పుడు, బ్యాట్స్‌మెన్ షాట్ ఆడకుండా బంతిని వదిలేసే అవకాశం ఉంటుంది, అంచేతనే వాళ్ళు ఫిర్యాదు చేయరు అని అన్నాడు. [7]

డోనాల్డ్ బ్రాడ్‌మాన్[మార్చు]

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు 1930లో ఇంగ్లండ్‌లో పర్యటించింది. ఆస్ట్రేలియా ఐదు- టెస్టుల సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. [8] డొనాల్డ్ బ్రాడ్‌మాన్ 139.14 బ్యాటింగ్ సగటుతో 974 పరుగులు చేశాడు. ఈ రికార్డు ఈనాటికీ ఉంది. [9] [10] తదుపరి 1932-33 యాషెస్ సిరీస్ సమయానికి, బ్రాడ్‌మన్ సగటు 100కి చేరుకుంది. ఇది మిగతా ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌ల కంటే దాదాపు రెండింతలు.[11] [12] బ్రాడ్‌మాన్ తన సొంత ఆస్ట్రేలియన్ పిచ్‌లపై మరింత విజయవంతం కాకుండా నిరోధించడానికి నిర్దిష్ట వ్యూహాలు అవసరమని ఇంగ్లీష్ క్రికెట్ అధికారులు భావించారు; [13] వాల్టర్ రాబిన్స్, ఇయాన్ పీబుల్స్ ల బౌలింగులో ఆడడానికి అతను ఇబ్బంది పడిన కారణంగా లెగ్-స్పిన్ బౌలింగ్‌కు వ్యతిరేకంగా బ్రాడ్‌మన్ అత్యంత బలహీనంగా ఉన్నాడని కొందరు భావించారు; దాంతో 1932-33 ఇంగ్లాండు పర్యాటక జట్టులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లను చేర్చుకున్నారు. [14]

డగ్లస్ జార్డిన్[మార్చు]

A head shot of a man.
1932-33 సిరీస్‌లో డగ్లస్ జార్డిన్ ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఉన్నాడు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తరపున 1921 ఆస్ట్రేలియన్ టూరింగ్ జట్టుపై అజేయంగా 96 పరుగులు చేసినపుడు జార్డిన్‌కు ఆస్ట్రేలియాపై మొదటి అనుభవం కలిగింది. జార్డిన్ శతకం చేరుకోవడానికి అనుమతించనందుకు పర్యాటకులను పత్రికలు విమర్శించాయి.[15] జార్డిన్ జీవిత చరిత్ర రచయిత క్రిస్టోఫర్ డగ్లస్ దీనిని ఖండించినప్పటికీ, ఆస్ట్రేలియన్ల పట్ల జార్డిన్‌కు వ్యతిరేకత కలగడానికి ఈ సంఘటన దోహదపడిందని ఊహాగానాలు ఉన్నాయి. [16] అతను 1928-29లో ఆస్ట్రేలియాలో పర్యటించిన తర్వాత ఆ జట్టు పట్ల జార్డిన్ వైఖరి గట్టిపడింది. [17] అతను ప్రారంభ ఆటలలో వరుసగా మూడు సెంచరీలు సాధించినప్పుడు, నెమ్మదిగా ఆడినందుకు తరచూ ప్రేక్షకులు అతన్ని ఎగతాళి చేసేవారు. ఆస్ట్రేలియా ప్రేక్షకులు అతని పట్ల అసహ్యం పెంచుకున్నారు, ప్రధానంగా అతని హెచ్చులు పోయే వైఖరి, ఫీల్డింగులో ఇబ్బంది పడడం, ముఖ్యంగా అతని టోపీ పట్ల ప్రేక్షకుల్లో వ్యతిరేకత ఉండేది. [18] ఆ టోపీ విజయవంతమైన ఆక్స్‌ఫర్డ్ క్రికెటర్లకు ఇచ్చే హార్లెక్విన్ క్యాప్‌. జార్డిన్ కేవలం మూఢనమ్మకాలతో ఆ టోపీని ధరించినప్పటికీ, అది ప్రేక్షకులలో ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించింది; అతన్ని ఉద్దేశీంచి, "ఏడీ.. మీ కోసం బ్యాట్‌ను తీసుకెళ్ళే మీ బట్లర్ ఎక్కడ ఉన్నాడు?" అనేవారు [19] ఈ దశలో జార్డిన్ ఆస్ట్రేలియన్ జనాల పట్ల తీవ్రమైన అయిష్టతను పెంచుకున్నాడు. పర్యటన ప్రారంభంలో అతని మూడవ సెంచరీ సమయంలో, ప్రేక్షకుల నుండి దుర్భాషల సమయంలో, అతను హంటర్ హెండ్రీకి "ఆస్ట్రేలియన్లందరూ చదువుకోనివారు వికృత గుంపులు" అని అన్నాడు. [18] ఇన్నింగ్స్ తర్వాత, ఆస్ట్రేలియన్ ప్రేక్షకులు జార్డిన్‌ను ఇష్టపడరని సహచరుడు పాట్సీ హెండ్రెన్ వ్యాఖ్యానించినప్పుడు, అతను "ఇది ఫకింగ్ మ్యూచువల్" అని బదులిచ్చారు. [18] [20] పర్యటనలో, జార్డిన్ బౌండరీలో ప్రేక్షకుల పక్కన ఫీల్డింగ్ చేశాడు. అక్కడ, అతను తన ఇబ్బందికరమైన ఫీల్డింగ్ కోసం, ముఖ్యంగా బంతిని ఛేజింగ్ చేస్తున్నప్పుడు తీవ్రంగా దుర్భాషలాడాడు వెక్కిరించాడు. [21] ఒకానొక సందర్భంలో, అతను చివరిసారిగా పొజిషన్‌ను మార్చినప్పుడు బౌండరీపై ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుల వైపు ఉమ్మివేశాడు. [18]

1932-33 యాషెస్ సిరీస్[మార్చు]

1932-33లో ఆస్ట్రేలియాలో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టు. వెనుక వరుస: జార్జ్ డక్‌వర్త్, టామీ మిచెల్, నవాబ్ ఆఫ్ పటౌడీ, మారిస్ లేలాండ్, హెరాల్డ్ లార్వుడ్, ఎడ్డీ పేంటర్, డబ్ల్యూ. ఫెర్గూసన్ (స్కోరర్). మధ్య వరుస: పెల్హామ్ వార్నర్ (కో-మేనేజర్), లెస్ అమెస్, హెడ్లీ వెరిటీ, బిల్ వోస్, బిల్ బోవ్స్, ఫ్రెడ్డీ బ్రౌన్, మారిస్ టేట్, RCN పలైరెట్ (కో-మేనేజర్). ముందు వరుస: హెర్బర్ట్ సట్‌క్లిఫ్, బాబ్ వ్యాట్, డగ్లస్ జార్డిన్, గుబ్బి అలెన్, వాలీ హామ్మండ్

పర్యటనలో ప్రారంభ ఘటనలు[మార్చు]

1932-33లో ఆస్ట్రేలియాలో పర్యటించిన ఇంగ్లాండ్ జట్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, కొంతమంది మీడియం పేసర్లు ఉన్నారు; ఇంత భారీ సంఖ్యలో పేస్‌ బౌలర్లుండడం ఆ సమయంలో అసాధారణం. బ్రాడ్‌మన్‌తో సహా ఇతర ఆటగాళ్ల నుండి, ఆస్ట్రేలియన్ ప్రెస్ నుండీ దానిపై వ్యాఖ్యలు వచ్చాయి.[22] ప్రయాణంలో, జార్డిన్ తన బృందానికి పర్యటనలో ఎలా వ్యవహరించాలో సూచించాడు. లార్‌వుడ్‌తో సహా పలువురు ఆటగాళ్లతో వ్యూహాలను చర్చించాడు; [23] ఈ దశలో, అతను తన ప్రధాన వ్యూహంగా పూర్తి బాడీలైన్ కాకపోయినా లెగ్ థియరీపై స్థిరపడినట్లు తెలుస్తోంది.[24] ఆస్ట్రేలియన్‌లను ఓడించాలంటే వారిని ద్వేషించమని చెప్పాడని, బ్రాడ్‌మన్‌ను "ది లిటిల్ బాస్టర్డ్" అనమని చెప్పినట్లూ కొంతమంది ఆటగాళ్ళు ఆ తర్వాత చెప్పారు. [23] ఆస్ట్రేలియాలో అడుగు పెట్టాక త్వరగానే, జార్డిన్ తన పద్ధతులు, విధానాల ద్వారా పత్రికలను, ప్రజలనూ దూరం చేసుకున్నాడు. [25] [26]

ప్రారంభ మ్యాచ్‌లలో, ఇంగ్లిష్ బౌలర్లు బంతిని షార్ట్‌గా పిచ్ చేసి వారి పేస్‌ ద్వారా బ్యాట్స్‌మన్‌లకు ఇబ్బంది కలిగించిన సందర్భాలు ఉన్నప్పటికీ, అప్పటికింకా పూర్తి బాడీలైన్ వ్యూహాలను ఉపయోగించలేదు. [27] ఇంగ్లిష్ బౌలింగ్‌లో ఫాస్ట్ బౌలర్ల సంఖ్య మినహా మిగతా అంతా మామూలు గానే ఉంది. లార్‌వుడ్, వోస్‌లకు జార్డిన్ తొలి మ్యాచ్‌లలో తక్కువ శ్రమ ఇచ్చాడు. [26] నవంబరు మధ్యలో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా XI జట్టుతో జరిగిన ఆటలో మొదటిసారి పూర్తి బాడీలైన్ వ్యూహాలు అమలు చేయడంతో ఇంగ్లీష్ వ్యూహాలు మారిపోయాయి. [28] [29] జార్డిన్ జట్టులో చేరలేదు. అతని బదులుగా బాబ్ వ్యాట్ జట్టుకు నాయకత్వం వహించాడు. తమ జట్టు బాడీలైన్ బౌలింగ్‌ను కాస్త తేలికైన రూపంలో వాడే ప్రయోగాలు చేసిందని అతను తర్వాత రాశాడు. లార్‌వుడ్, వోస్, బోవ్స్ ల బౌలింగ్ వ్యూహాలకు వ్యతిరేకంగా ఆడేటపుడు బ్రాడ్‌మన్ అసౌకర్యంగా ఉన్నట్లు అతను జార్డిన్‌కి నివేదించాడు. ప్రేక్షకులు, ప్రెస్, ఆస్ట్రేలియన్ ఆటగాళ్ళు తాము ఇంగ్లాండు బౌలింగు తీసు చూసి ఆశ్చర్యపోయారు. బౌలర్లు బ్యాట్స్‌మెన్ తలలనే లక్ష్యంగా చేసుకున్నారని భావించారు. బ్రాడ్‌మన్ అసాధారణమైన వ్యూహాలను అవలంబించాడు-వంగడం, వెనక్కి వాలడం, క్రీజులో అటూ ఇటూ జరగడం-వంటివి చేసేవాడూ. దీనికి ఆస్ట్రేలియన్ల నుండి సర్వామోదం లభించలేదు. అతను మ్యాచ్‌లో కేవలం 36, 13 పరుగులు చేశాడు. [30]


తదుపరి గేమ్‌లో వోస్ (లార్‌వుడ్, బోవ్స్ లు ఈ గేమ్‌లో ఆడలేదు), న్యూ సౌత్ వేల్స్‌పై ఇదే వ్యూహాన్ని కొనసాగించాడు. ఆ మ్యాచ్‌లో జాక్ ఫింగిల్టన్ సెంచరీ చేశాడు. ఈ ప్రక్రియలో అనేక దెబ్బలు తిన్నాడు. బ్రాడ్‌మన్ మళ్లీ రెండుసార్లు విఫలమయ్యాడు. పర్యాటక జట్టుపై ఆరు ఇన్నింగ్స్‌లలో కేవలం 103 పరుగులు చేశాడు; చాలా మంది ఆస్ట్రేలియన్ అభిమానులు ఇప్పుడు బ్రాడ్‌మన్ ఫామ్‌పై ఆందోళన చెందారు. [31] ఇంతలో, జార్డిన్ ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ టెక్నిక్ గురించి ఫెండర్‌కు రాస్తూ, తన వద్దనున్న సమాచారం సరైనదేనని, తాను మరింత ఎక్కువ మంది ఫీల్డర్‌లను లెగ్ సైడ్‌లోకి తరలించవలసి ఉందని రాశాడు: "ఇది కొనసాగితే నేను జట్టు మొత్తాన్నీ లెగ్‌వైపు తరలించవలసి ఉంటుంది." అని రాసాడు. [32] [33]

ఆస్ట్రేలియన్ ప్రెస్ దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్యంగా లార్వుడ్ చూపిన శత్రుత్వాన్ని విమర్శించింది. [34] ఈ వ్యూహాలు నైతికంగా తప్పని కొందరు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు విమర్శలకు దిగారు. కానీ ఈ దశలో, అందరూ దాన్ని వ్యతిరేకించలేదు. [35] ఆస్ట్రేలియన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఇంగ్లీష్ జట్టు నిజాయితీ గానే బౌలింగు చేసిందని విశ్వసించింది. [36] మరోవైపు, పర్యటన సాగుతున్న కొద్దీ జార్డిన్ బాడీలైన్ విషయంలో టూర్ మేనేజర్ వార్నర్‌తో విభేదించాడు. [37] వార్నర్ బాడీలైన్‌ను అసహ్యించుకున్నాడు కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. అతను ఏదో ఒకవైపున అభిప్రాయం చెప్పనందుకు అతనిపై విమర్శలు వచ్చాయి.[38] ప్రత్యేకించి పర్యటన ప్రారంభంలో అతను వ్యక్తం చేసిన భావాల తర్వాత. అప్పుడు అతను ఇలా అన్నాడు: "నిజానికీ, నిజాయితీకీ క్రికెట్ పర్యాయపదంగా మారింది. 'అది క్రికెట్ కాదు' అని చెప్పటం అంటే ఏదో అండర్ హ్యాండ్‌^గా ఉత్తమమైన ఆదర్శాలకు అనుగుణంగా లేనిదేదో ఉన్నట్లు సూచిస్తుంది, ... ఆటగాళ్ళుగాని, అధికారులుగాని, ప్రేక్షకులుగానీ.. దీన్ని ఇష్టపడేవారందరూ, జాగ్రత్త వహించాలి. అలా కానిపక్షంలో వాళ్ళు చేసేది ఏదైనా క్రికెట్‌కు హాని చేస్తుంది" [39]

మొదటి రెండు టెస్టు మ్యాచ్‌లు[మార్చు]

Photograph shows telegrams describing the events of the first day of the second test.
బ్రాడ్‌మాన్ వికెట్‌తో సహా రెండో టెస్టులో ఆట వివరణ. ప్రతి రోజు ఆటను క్లుప్తంగా వివరించే తంతులు విలేఖరులచే ఇంగ్లాండ్‌కు పంపబడ్డాయి, అక్కడ వాటిని ప్రసారం కోసం స్క్రిప్ట్‌లుగా మార్చారు.

బ్రాడ్‌మాన్ సిడ్నీలో జరిగిన మొదటి టెస్ట్‌కు దూరమయ్యాడు. సుదీర్ఘంగా క్రికెట్ ఆడడం వలన, బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌తో కొనసాగుతున్న వాదన వలనా అతను అలసిపోయాడు. [40] జార్డిన్ ఆ తర్వాత రాస్తూ, దానికి అసలు కారణం బ్యాట్స్‌మన్ నాడీ విచ్ఛిన్నానికి గురవడం అని రాసాడు. [28] [41] ఇంగ్లీష్ బౌలర్లు మొదటి మ్యాచ్‌లో అడపాదడపా బాడీలైన్‌ను ఉపయోగించారు. ప్రేక్షకులు అసంతృప్తిని వెలిబుచ్చారు. [42] ఆస్ట్రేలియన్లు పది వికెట్ల తేడాతో గేమ్‌ను కోల్పోయారు. లార్వుడ్ 124 పరుగులకు పది వికెట్లు పడగొట్టాడు. [43] ఇంగ్లీష్ బౌలర్లలో ఒకరైన గుబ్బి అలెన్ లెగ్ సైడ్ ఫీల్డర్లతో బౌలింగ్ చేయడానికి నిరాకరించాడు. ఈ వ్యూహాలపై జార్డిన్‌తో గొడవపడ్డాడు. [44] ప్రభావం చూపిన ఏకైక ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మన్ స్టాన్ మెక్‌కేబ్. అతను నడుము కంటే పైన వచ్చిన ఉన్న ప్రతిబంతిని హుక్ చేసాడు, పుల్ చేసాడు. [45] 233 బంతుల్లో నాలుగు గంటల్లో 187 నాటౌట్ స్కోర్ చేశాడు. [43] [28] తెరవెనుక, నిర్వాహకులు పరస్పరం ఆందోళనలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ ఆంగ్ల వ్యూహాలపై అప్పటికీ సర్వత్రా అసమ్మతి రాలేదు; ఇంగ్లిష్ బౌలింగ్‌పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మాంటీ నోబుల్ ప్రశంసలు కురిపించాడు. [46]

ఇదిలా ఉండగా, వుడ్‌ఫుల్ షార్ట్-పిచ్ దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని, ప్రత్యర్థి దూకుడుకు తగ్గట్టుగా ఎడ్డీ గిల్బర్ట్ లేదా లారీ నాష్ వంటి పేస్ బౌలర్‌లను జట్టులోకి తీసుకోవాలని విక్ రిచర్డ్‌సన్ వంటి వారు చెప్పారు.[47] కానీ వుడ్‌ఫుల్ అలా చేయడానికి నిరాకరించాడు. [48] [49] [50] సెలక్టర్లు తనను కెప్టెన్‌గా నిర్ధారించడం కోసం, ఆట మొదలవడానికి కొద్ది నిమిషాల ముందు వరకూ అతను వేచి ఉండవలసి వచ్చింది. [51] [52]

రెండవ టెస్ట్ కోసం, బ్రాడ్‌మాన్ పనిచేస్తున్న వార్తాపత్రిక యజమానులు అతన్ని ఒప్పందం నుండి విడుదల చేసిన తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు.[53] ఇంగ్లాండ్ బాడీలైన్ ఉపయోగించడం కొనసాగించింది. బ్రాడ్‌మన్ మొదటి ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే అవుట్ అయ్యాడు.[notes 1] రెండో ఇన్నింగ్స్‌లో, పూర్తి బాడీలైన్ దాడికి వ్యతిరేకంగా, అతను అజేయ శతకం సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా ఆ మ్యాచ్‌ను గెలిచి, సిరీస్‌ను సమం చేసింది. [56] బాడీలైన్ అంత ముప్పేమీ కాదని విమర్శకులు విశ్వసించడం ప్రారంభించారు. బ్రాడ్‌మాన్ పూర్వపు తన వైఫల్యాలతో కొద్దిగా నష్టపోయిన కీర్తిని పునరుద్ధరించుకున్నాడు. అయితే, పిచ్ సిరీస్‌లోని ఇతర పిచ్‌ల కంటే కొంచెం నెమ్మదిగా ఉంది. లార్‌వుడ్ తన బూట్‌ల సమస్యల కారణంగా అతని ప్రభావం తగ్గింది. [57] [58]

మూడో టెస్టు మ్యాచ్[మార్చు]

అడిలైడ్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది. రెండవ రోజు, శనివారం, 50,962 మంది ప్రేక్షకుల ముందు, [52] [59] ఆస్ట్రేలియా మొదటి రోజున బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మూడో ఓవర్లో లార్వుడ్, వుడ్ ఫుల్‌కు బౌలింగు చేసాడు. ఐదవ బంతి తలకు తగలకుండా వుడ్‌ఫుల్ తృటిలో తప్పించుకున్నాడు. ఆఖరి బంతి, మిడిల్ స్టంప్ లైన్‌లో షార్ట్ పిచ్ అయి, వుడ్‌ఫుల్ గుండెను తాకింది. బ్యాట్స్‌మన్ తన బ్యాట్‌ని పడవేసి, నొప్పితో వంగి ఛాతీని పట్టుకుని దూరంగా జరిగాడు. సానుభూతి తెలిపేందుకు ఇంగ్లండ్ ఆటగాళ్లు వుడ్‌ఫుల్‌ను చుట్టుముట్టారు కానీ ప్రేక్షకులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు. జార్డిన్ లార్‌వుడ్‌ని "బాగా బౌలింగ్ చేసావ్, హెరాల్డ్!" అన్నాడు. ఆ సమయంలో బ్యాటింగ్‌లో ఉన్న బ్రాడ్‌మన్‌ను కలవరపెట్టే లక్ష్యంతో ఈ వ్యాఖ్య చేసినప్పటికీ, వుడ్‌ఫుల్ అది విని విస్తుపోయాడు. [60] [61] కొద్దిసేపు ఆలస్యం తర్వాత, ఆస్ట్రేలియా కెప్టెన్ తెప్పరిల్లాక, ఆట తిరిగి ప్రారంభమైంది. లార్‌వుడ్ ఓవర్ ముగిసినందున వుడ్‌ఫుల్ ఆ తర్వాతి ఓవర్‌లో అలెన్ బౌలింగ్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అయితే, లార్‌వుడ్ మళ్లీ వుడ్‌ఫుల్‌కు బౌలింగ్ చేయడానికి సిద్ధమై, ఫీల్డర్‌లను బాడీలైన్ స్థానాల్లోకి తరలించినప్పుడు ఆట మరోసారి ఆగిపోయింది. దీనివల్ల ప్రేక్షకులు ఇంగ్లండ్ జట్టుపై నిరసనలు తెలుపుతూ దుర్భాషలాడారు. తదనంతరం, లార్వుడ్ ఫీల్డ్ మార్పును చెయ్యమని అడిగాడని జార్డిన్ చెప్పగా, జార్డిన్ తానే అలా చేశాడని లార్వుడ్ చెప్పాడు. [62] చాలా మంది వ్యాఖ్యాతలు ఫీల్డింగు మార్పులను స్పోర్టివ్‌గా లేదని ఖండించారు. కోపంగా ఉన్న ప్రేక్షకులు ఉద్రిక్తంగా మారారు. [63] జార్డిన్, వుడ్‌ఫుల్ ఆడలేని పక్షంలో రెటైర్డ్ హర్ట్ అయి ఉండాల్సిందని ఆ తరువాత రాసినప్పటికీ, ఆ సమయంలో ఫీల్డింగును మార్చినందుకు విచారాన్ని వ్యక్తం చేశాడు. [62] ప్రేక్షకుల ఆవేశం ఎలా ఉందంటే, మరొక్క సంఘటన గానీ జరిగితే అల్లర్లు సంభవించేవి. బాడీలైన్ కారణంగా గత రెండు నెలలుగా పేరుకుంటూ వచ్చిన మనోభావాలకు ప్రేక్షకుల కోపం పరాకాష్ట అని అనేక మంది రచయితలు భావించారు. [63]

ఓవర్ సమయంలో, లార్‌వుడ్ వేసిన మరొక రైజింగ్ డెలివరీ వుడ్‌ఫుల్ చేతిలోని బ్యాట్‌ను పడగొట్టింది. అతను 89 నిమిషాల పాటు బ్యాటింగ్ చేశాడు. [64] 22 పరుగుల వద్ద అలెన్ అతనిని బౌల్డ్ చేయడానికి ముందు అతనికి మరికొన్ని సార్లు దెబ్బలు తగిలాయి. ఆ తర్వాత రోజు, ఇంగ్లండ్ మేనేజర్లలో ఒకరైన పెల్హామ్ వార్నర్ ఆస్ట్రేలియన్ డ్రెస్సింగ్ రూమ్‌ను సందర్శించాడు. అతను వుడ్‌ఫుల్‌కు సానుభూతి వ్యక్తం చేశాడు. అయితే ఆస్ట్రేలియన్ ప్రతిస్పందనకు అతను ఆశ్చర్యపోయాడు. వార్నర్ ప్రకారం, వుడ్‌ఫుల్ ఇలా సమాధానమిచ్చాడు, "మిస్టర్ వార్నర్, నేను నిన్ను చూడాలని అనుకోవడం లేదు. అక్కడ రెండు జట్లు ఉన్నాయి. ఒకరు క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తున్నారు, రెండవవారు ఆ ప్రయత్నంలో లేరు." [65] వుడ్‌ఫుల్ ఇంకా ఇలా అన్నట్లు ఫింగిల్‌టన్ వ్రాశాడు, "ఈ గేమ్ చెడగొట్టలేనంత మంచిది. దీని నుండి కొంత మంది బయటకు పోవాల్సిన సమయం వచ్చింది." [66] వుడ్‌ఫుల్ సాధారణంగా గౌరవప్రదంగా, మృదువుగా మాట్లాడేవాడు. అతని స్పందన వార్నర్‌కు, అక్కడున్న ఇతరులకూ ఆశ్చర్యం కలిగించింది. [65] [67] వార్నర్ చాలా కదిలిపోయాడు. ఆ రోజు అతను తన హోటల్ గదిలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. [68]

మరుసటి రోజు ఆట లేదు, ఆదివారం విశ్రాంతి దినం, కానీ సోమవారం ఉదయం, వార్నర్, వుడ్‌ఫుల్ మధ్య జరిగిన సంభాషణ అనేక ఆస్ట్రేలియన్ వార్తాపత్రికలలో వచ్చింది. [69] సున్నితమైన ప్రైవేట్ సంభాషణను ప్రెస్‌కు తెలియడంతో ఆటగాళ్లు, అధికారులు ఆందోళన చెందారు. 1933లో ప్రెస్‌కి లీక్‌లు ఇవ్వడమనేది అసలు తెలియడు. విచక్షణ, గౌరవం చాలా విలువైనవి, అంటూ డేవిడ్ ఫ్రిత్, అటువంటి లీక్ "నైతిక నేరాల్లో ప్రథమశ్రేణికి చెందినది" అని పేర్కొన్నాడు. [70] లీక్‌ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని వుడ్‌ఫుల్ స్పష్టం చేశాడు. ఆ తరువాత అతను "క్రికెటర్లు తమ సహ సభ్యులు సరైన పనే చేస్తారని ఎప్పుడూ ఆశించేవాడిని" అని రాశాడు. [71] [72] ఆస్ట్రేలియన్ జట్టు సభ్యుల్లో ఏకైక పూర్తి-కాల జర్నలిస్ట్‌ అయిన ఫింగిల్‌టన్‌పై వెంటనే అనుమానం వచ్చింది. అయితే కథనం ప్రచురించబడిన వెంటనే, దానికి తాను బాధ్యుణ్ణి కానని అతను వుడ్‌ఫుల్‌కి చెప్పాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఫింగిల్‌టన్‌ను అవుట్ చేయగలిగితే వార్నర్ లార్‌వుడ్‌కు ఒక పౌండ్ బహుమతిగా ఇస్తానని చెప్పాడు; లార్వుడ్ అతనిని డకౌట్ చేసాడు. [71] [73] సిడ్నీ సన్ రిపోర్టర్ క్లాడ్ కార్బెట్కు బ్రాడ్‌మన్ నుండి సమాచారం అందిందని ఫింగిల్టన్ ఆ తర్వాత పేర్కొన్నాడు; [74] ఫింగిల్‌టన్, బ్రాడ్‌మన్‌లు లీక్‌కు అతను బాధ్యుడంటే అతనే బాధ్యుడంటూ ఒకరిపై ఒకరు జీవితాంతం ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. [75]

బెర్ట్ ఓల్డ్‌ఫీల్డ్ అతని తల పగలడంతో పడిపోతున్నాడు.

మరుసటి రోజు, ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌ పెద్ద లోటుతో మొదలైంది. 85 పరుగులు చేసిన బిల్ పోన్స్‌ఫోర్డ్‌కు మద్దతుగా బెర్ట్ ఓల్డ్‌ఫీల్డ్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ సమయంలో, ఇంగ్లీష్ బౌలర్లు అతనికి వ్యతిరేకంగా బాడీలైన్‌ను ఉపయోగించారు. అతను అనేక షార్ట్ పిచ్ డెలివరీలను ఎదుర్కొన్నాడు, అయితే లార్‌వుడ్ వేసిన అనేక బంతులను ఫోర్లు కొట్టి 41కి చేరుకున్నాడు [76] కేవలం ఒక ఫోర్ కొట్టిన తర్వాత, లార్వుడ్ కొద్దిగా షార్ట్ పిచ్‌తో, కొంచెం నెమ్మదిగా బౌలింగ్ చేశాడు. ఓల్డ్‌ఫీల్డ్ దాన్ని హుక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతిపై దృష్టి తప్పడంతో, అది అతని కణతపై తగిలింది. అతని తల పగిలింది. ఓల్డ్‌ఫీల్డ్ నడవలేక మోకాళ్లపై పడిపోయాడు. ఆట ఆగిపోయింది. వుడ్‌ఫుల్ పిచ్‌పైకి వచ్చాడు. కోపంగా ఉన్న ప్రేక్షకులు కేకలు వేశారు. మరోసారి అల్లర్లు జరిగే అవకాశం ఉన్నట్లు అనిపించింది. ప్రేక్షకులు మైదానంలోకి వస్తే స్టంప్‌లను ఆయుధాలుగా వాడాలని పలువురు ఇంగ్లీష్ ఆటగాళ్ళు ఆలోచించారు. [77] ఓల్డ్‌ఫీల్డ్‌ను గాయపరిచిన బంతి సాంప్రదాయక, నాన్-బాడీలైన్ ఫీల్డ్‌లోనే వేసారు; [78] లార్వుడ్ వెంటనే క్షమాపణలు చెప్పాడు. అయితే ఓల్డ్‌ఫీల్డ్ మాత్రం డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి పోయే ముందు, తప్పు తనదేనని చెప్పాడు. ఆట కొనసాగింది. [77][notes 2] ఆ తర్వాత జార్డిన్ రహస్యంగా ఓల్డ్‌ఫీల్డ్ భార్యకు సానుభూతి తెలుపుతూ టెలిగ్రామ్ పంపాడు. అతని కుమార్తెలకు బహుమతులు ఇవ్వడానికి ఏర్పాటు చేశాడు. [80]

కేబుల్ మార్పిడి[మార్చు]

మూడవ టెస్ట్ మ్యాచ్ నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి, ఆస్ట్రేలియన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఇంగ్లాండు క్రికెట్ పాలక సంస్థ మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్బుకు (MCC) ఒక కేబుల్ పంపింది:

ఆస్ట్రేలియన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ నుండి MCCకి 1933 జనవరి 18:

బాడీలైన్ బౌలింగ్ అనేది ఆట ప్రయోజనాలకు హాని కలిగించే స్థాయికి చేరింది. తమ శరీరాలను రక్షించుకోవడమే బ్యాట్స్‌మెన్లకు ప్రధానమైన పరిస్థితి ఏర్పడింది. ఆటగాళ్ల మధ్య తీవ్రమైన దుర్భావనలు, గాయాలూ కలుగుతున్నాయి. ఇది క్రీడాస్ఫూర్తి లేకపోవడమేనని మా అభిప్రాయం. దీన్ని వెంటనే ఆపకపోతే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య స్నేహపూర్వక సంబంధాలకు విఘాతం ఏర్పడుతుంది.[81]

అలా కేబుల్ పంపాలని పత్రికలు, ఆటగాళ్ళు, ఆస్ట్రేలియన్లు భావించలేదు. మరీ ముఖ్యంగా భారీ ఓటమి తర్వాత వెంటనే పంపకూడదని భావించారు. [82] క్రీడాస్ఫూర్తి లేమి అనే సూచన పట్ల MCC కి తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఆ సమయంలో జట్టుపై మోపబడిన తీవ్రమైన ఆరోపణలలో ఇది ఒకటి. అదనంగా, MCC సభ్యులు ఆస్ట్రేలియన్లు ఇంగ్లీష్ బౌలింగ్‌కు అతిగా స్పందించారని భావించారు. [83] [84] MCC తన ప్రత్యుత్తరాన్ని రూపొందించడానికి కొంత సమయం తీసుకుంది:

MCC నుండి ఆస్ట్రేలియన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్, 1933 జనవరి 23:

మేము, మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్, మీ కేబుల్‌ను తిరస్కరిస్తున్నాం. క్రీడాస్ఫూర్తి లేని ఆట అన్న మీ అభిప్రాయాన్ని మేము నిరాకరిస్తున్నాం. కెప్టెన్, జట్టు, నిర్వాహకులపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. వారు క్రికెట్ చట్టాలను లేదా ఆట స్ఫూర్తిని ఉల్లంఘించేలా ఏమీ చేయరని నమ్ముతున్నాము. మా విశ్వాసం తప్పని చెప్పేందుకు మాకు ఆధారాలేమీ కనబడలేదు. వుడ్‌ఫుల్, ఓల్డ్‌ఫీల్డ్‌లకు జరిగిన ప్రమాదాలకు మేము చింతిస్తున్నాము. ఈ రెండు సందర్భాల్లోనూ బౌలర్‌ తప్పేమీ లేదని మాకు అర్థమైంది. ఆస్ట్రేలియన్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏదైనా కొత్త చట్టాన్ని లేదా నియమాన్ని ప్రతిపాదించాలనుకుంటే, దాన్ని తగినంత సమయం తీసుకుని జాగ్రత్తగా పరిశీలిస్తాం. ప్రస్తుత పరిస్థితి మీ కేబుల్ చూపిస్తున్నంత తీవ్రంగా లేదని మేము భావిస్తున్నాం. అయితే ఇది ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ల మధ్య సత్సంబంధాలకు విఘాతం కలిగించే విధంగా ఉంటే, మిగిలిన పర్యటనను రద్దు చేయడమే మంచిది అని మీరు భావిస్తే, మేము ఎంతో అయిష్టంగా అంగీకరిస్తాం.[85]

ఈ సమయంలో, సిరీస్‌లోని మిగిలిన భాగం ముప్పులో పడింది. [86] [87] జరుగుతున్న సంఘటనలను, తన బృందం పట్ల ఏర్పడిన ప్రతికూల స్పందనలనూ చూసి అతను కదిలిపోయాడు. ఇంగ్లండ్ ఆటగాళ్ల మధ్య పరస్పరం జరిగిన తగాదాలు, వాదనల గురించి, [88] బహుశా నిరాశ చెందిన నవాబ్ ఆఫ్ పటౌడీ లీకు చేసినవి కావచ్చు, పత్రికలలో కథనాలు వచ్చాయి. జట్టు తనకు మద్దతు ఇవ్వకపోతే బాడీలైన్‌ని ఉపయోగించడం మానేస్తానని జార్డిన్ ప్రతిపాదించాడు. అయితే ఒక ప్రైవేట్ సమావేశం తర్వాత (జార్డిన్, టీమ్ మేనేజర్‌లు దానికి హాజరు కాలేదు) ఆటగాళ్లు కెప్టెన్‌కి, అతని వ్యూహాలకూ పూర్తిగా మద్దతు ఇస్తూ ప్రకటన విడుదల చేశారు. [89] [90] అయినప్పటికీ, "క్రీడాస్ఫూర్తి లేని" ఆరోపణను ఉపసంహరించుకోకపోతే జార్డిన్ నాల్గవ టెస్టులో ఆడేవాడు కాదు. [91]

ఆస్ట్రేలియన్ బోర్డు ఒక ప్రత్యుత్తర తంతును రూపొందించడానికి సమావేశమైంది, దాన్ని జనవరి 30 న పంపించారు. తాము సిరీస్‌ను కొనసాగించాలని కోరుకుంటున్నామనీ, బాడీలైన్ బౌలింగ్ లోని నిజాయితీని పరిశీలించడాన్ని సిరీస్ అయ్యే వరకు వాయిదా వేయాలని సూచించారు. MCC ఫిబ్రవరి 2 న ఇచ్చిన తన ప్రత్యుత్తరంలో, క్రీడాస్ఫూర్తి లేదనే ఆరోపణను ఉపసంహరించుకోకపోతే సిరీస్‌ని కొనసాగించడం అసాధ్యమని సూచించింది. [92]

పరిస్థితి దౌత్య సంఘటనగా మారింది. బ్రిటీష్, ఆస్ట్రేలియన్ ప్రభుత్వాలు రెండింటిలోనూ ఉన్నత స్థాయి వ్యక్తులు, దృఢంగా ఉండాల్సిన అంతర్జాతీయ సంబంధాలు బాడీలైన్ కారణంగా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉందని భావించారు. [2] ఆ సమయంలో ఇంగ్లండ్‌లో ఉన్న దక్షిణ ఆస్ట్రేలియా గవర్నర్, అలెగ్జాండర్ హోర్-రుత్వెన్, ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని డొమినియన్ వ్యవహారాల బ్రిటీష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జేమ్స్ హెన్రీ థామస్‌కు తన ఆందోళన తెలిపాడు. [93] [3] ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి జోసెఫ్ లియోన్స్ ఆస్ట్రేలియన్ బోర్డు సభ్యులతో సమావేశమై, బ్రిటీష్ ప్రజలు ఆస్ట్రేలియన్ వాణిజ్యాన్ని బహిష్కరిస్తే ఆస్ట్రేలియాలో ఏర్పడే తీవ్రమైన ఆర్థిక కష్టాలను వారికి వివరించడంతో ప్రతిష్టంభన సద్దుమణిగింది. ఇంగ్లీషు, ఆస్ట్రేలియా పత్రికలలో గణనీయమైన చర్చలు, వాదనల తరువాత, ఆస్ట్రేలియన్ బోర్డు MCCకి ఒక కేబుల్ పంపింది. బాడీలైన్ బౌలింగ్‌పై తమ వ్యతిరేకతను కొనసాగిస్తూనే, "మీ జట్టు క్రీడాస్ఫూర్తిని ప్రశ్నార్థకంగా ఉందని మేము భావించము" అని పేర్కొంది. [3] [94] అయినప్పటికీ, ఆస్ట్రేలియన్ బోర్డు, MCC ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగాయి. [95]

సిరీస్ ముగింపు[మార్చు]

వోస్ సిరీస్‌లోని నాల్గవ టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో లెగ్ స్పిన్నర్ టామీ మిచెల్ వచ్చాడు. లార్‌వుడ్ బాడీలైన్‌ను ఉపయోగించడం కొనసాగించాడు. అయితే వ్యూహాన్ని ఉపయోగించినది అతనొక్కడే; అయినప్పటికీ, అతను దానిని మామూలు కంటే తక్కువగా ఉపయోగించాడు. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కారణంగా అది అంత ప్రభావవంతంగా లేదు. [96] ఎడ్డీ పేంటర్ చేసిన 83 పరుగుల ఇన్నింగ్స్‌కు కారణంగా, ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో ఆటను గెలుచుకుంది. అతను టాన్సిలైటిస్‌తో ఆసుపత్రిలో చేరినప్పటికీ, ఇంగ్లండ్ తమ ఇన్నింగ్స్‌లో కష్టపడుతున్నప్పుడు బ్యాటింగ్ చేయడానికి బయలుదేరాడు. [97] [98] వోస్ ఆఖరి టెస్టుకు తిరిగి వచ్చాడు, కానీ అతను, అలెన్ ఇద్దరూ పూర్తిగా ఫిట్‌గా లేరు.[99] బాడీలైన్ వ్యూహాలను ఉపయోగించినప్పటికీ, ఆస్ట్రేలియా 435 పరుగులను వేగంగా సాధించింది, ఇంగ్లాండ్ అనేక క్యాచ్‌లను జారవిడిచింది. [100] ఈ చివరి గేమ్‌లో ఆస్ట్రేలియా జట్టు లోకి ఫాస్ట్ బౌలర్‌ను తీసుకున్నారు. హ్యారీ అలెగ్జాండర్ కొన్ని షార్ట్ డెలివరీలను బౌలింగ్ చేశాడు, అయితే అతని కెప్టెన్ వుడ్‌ఫుల్, లెగ్ సైడ్‌లో చాలా మంది ఫీల్డర్‌లను మోహరించడానికి ఒప్పుకోలేదు. [101] ఇంగ్లండ్ 19 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది, అయితే లార్వుడ్ కాలి గాయంతో మైదానాన్ని వీడినప్పుడు ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్‌లో వారి వ్యూహాలు చెదిరిపోయాయి; హెడ్లీ వెరిటీ, ఒక స్పిన్నర్, ఆస్ట్రేలియా బౌలింగ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు; [102] ఇంగ్లండ్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి, నాలుగు టెస్టుల సిరీస్‌ను 4-1 తో గెలుచుకుంది. [103]

క్రికెట్ చట్టాల్లో మార్పులు[మార్చు]

1932-33 పర్యటన పర్యవసానంగా [84] MCC, 1935 ఇంగ్లీష్ క్రికెట్ సీజన్ కోసం క్రికెట్ చట్టాలలో కొత్త నియమాన్ని ప్రవేశపెట్టింది. [104] వాస్తవానికి, ఆట సరైన స్ఫూర్తితో ఆడినట్లు నిర్ధారించాల్సింది కెప్టెన్లేనని MCC ఆశించింది. బాడీలైన్ బౌలింగ్ ఈ స్ఫూర్తిని ఉల్లంఘిస్తుందని ఒక తీర్మానాన్ని ఆమోదించింది. [84] [105] అయితే ఇది సరిపోదని తేలడంతో , [84] MCC "డైరెక్ట్ అటాక్" బౌలింగ్ అన్యాయమని ఒక చట్టాన్ని ఆమోదిస్తూ, దాన్ని గుర్తించి ఆపే బాధ్యత అంపైర్లదేనని చెప్పింది. [104] 1957లో, లెగ్ సైడ్‌లో స్క్వేర్ వెనుక ఇద్దరు కంటే ఎక్కువ ఫీల్డర్‌లు నిలబడకుండా చట్టాలను మార్చారు; ఆఫ్ స్పిన్నర్లు, స్లో ఇన్‌స్వింగ్ బౌలర్లు లెగ్ సైడ్‌పై దృష్టి కేంద్రీకరించిన ఫీల్డర్లతో బ్యాట్స్‌మెన్ లెగ్ స్టంప్‌పై గురిపెట్టే ప్రతికూల బౌలింగ్ వ్యూహాలను నిరోధించడం దీని ఉద్దేశం. [106] అయితే, బాడీలైన్ ఫీల్డ్‌లను అమలు చేయడం పరోక్షంగా దీనివలన అసాధ్యమౌతుంది. [84]

"భయపెట్టే షార్ట్ పిచ్డ్ బౌలింగ్" అనే శీర్షిక క్రింద తరువాత చట్టాల్లో మార్పులు చేసారు. ఒక ఓవర్‌లో బౌల్ చేయదగ్గ " బౌన్సర్ల " సంఖ్యను కూడా పరిమితం చేశాయి. ఏది ఏమైనప్పటికీ, బ్యాట్స్‌మన్‌ని భయపెట్టే వ్యూహం ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఇది 1933 లో ప్రజలను ఆశ్చర్యపరిచే స్థాయిలోనే ఉంది. అయితే నేటి ఆటగాళ్ళు హెల్మెట్‌ల వంటి రక్షణాత్మక గేర్‌లను ధరిస్తారు కాబట్టి ఇది తక్కువ ప్రమాదకరంగా ఉంది. [107] [108] క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లతో కూడిన బౌలింగ్ దాడి చేసే 1980ల నాటి వెస్టిండీస్ జట్లు బహుశా అత్యంత భయానకమైన బౌలర్లు. [109]

స్పందన[మార్చు]

ఇంగ్లీష్ ఆటగాళ్ళు, మేనేజ్‌మెంట్ వారి వ్యూహాన్ని ఫాస్ట్ లెగ్ థియరీ అని చెప్పుకుంటూనే ఉన్నారు. దాన్ని సాంప్రదాయికమైన, అభ్యంతరం లేని లెగ్ థియరీ వ్యూహం లోని వైవిధ్యంగానే పరిగణించారు. "బాడీలైన్" అనే ఇన్ఫ్లమేటరీ పదం ఆస్ట్రేలియన్ ప్రెస్ రూపొందించి, శాశ్వతత్వం కలిగించింది. ఆంగ్ల రచయితలు ఫాస్ట్ లెగ్ థియరీ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ పదజాలం అవగాహనలో ఉన్న తేడాలను ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే తాము సాధారణంగా ఉపయోగించే వ్యూహం గురించి ఆస్ట్రేలియన్లు ఎందుకు అంతలా ఫిర్యాదు చేస్తున్నారో మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC) తో సహా ఇంగ్లాండు ప్ర్క్వజలకు అర్థం కాలేదు. ఆస్ట్రేలియన్ క్రికెట్ అధికారులు, ప్రజలు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారని కొందరు నిర్ధారించారు. [110] [111] టూర్ పార్టీలో ఉన్న నలుగురు ఫాస్ట్ బౌలర్లలో, గుబ్బి అలెన్ ఇంగ్లీష్ శిబిరంలో ఉన్న భిన్నాభిప్రాయాలను వినిపించాడు. లెగ్ సైడ్‌లో షార్ట్ బౌలింగ్ చేయడానికి అతను నిరాకరించాడు. [107] జార్డిన్‌ను విమర్శిస్తూ ఇంగ్లండ్‌కు అనేక లేఖలు రాశాడు. అతను దాన్ని ఆస్ట్రేలియాలో బహిరంగంగా వ్యక్తం చేయలేదు.[44] అనేక ఇతర ఆటగాళ్ళు, బయటికి కలసికట్టుగా ఉంటూ, ప్రైవేట్‌గా బాడీలైన్‌ను ఖండించారు. ఔత్సాహికులు బాబ్ వ్యాట్ (వైస్-కెప్టెన్), ఫ్రెడ్డీ బ్రౌన్, పటౌడీ నవాబ్ దీనిని వ్యతిరేకించారు.[107] వాలీ హామ్మండ్, లెస్ అమెస్ వంటి నిపుణులు కూడా దీనిని వ్యతిరేకించారు. [112]

సీజన్‌లో, వుడ్‌ఫుల్ ప్రదర్శించిన శారీరక దార్ఢ్యం, ధైర్యం, గౌరవప్రదమైన నాయకత్వం అతనికి చాలా మంది అభిమానులను సాధించిపెట్టింది. ప్రతీకార వ్యూహాలను అమలు చేయడానికి అతను నిరాకరించాడు. తనకు, అతని సహచరులకూ పదేపదే దెబ్బలు తగిలినప్పటికీ బహిరంగంగా ఫిర్యాదు చేయలేదు. [113] [114]

అయితే జార్డిన్ మాత్రం తాను గాయం చేయడం కోసం ఆ వ్యూహాన్ని రూపొందించలేదనీ, జట్టును క్రీడాస్ఫూర్తితో పెద్దమనిషి లాగా నడిపిస్తున్నాననీ నొక్కి చెప్పాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్లు ఇబ్బందులను తప్పించుకుంటూ ఆడాలని అతడు వాదించాడు. [80]

అనేక మంది ఆటగాళ్లకు వ్యక్తిగతంగా అభ్యంతరాలు ఉన్నాయని ఆ తర్వాత వెల్లడైంది. అయితే వారు ఆ సమయంలో బహిరంగంగా వ్యక్తం చేయలేదు. [89] [90]

ఇవి కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

  1. Jardine, who was known for being extremely dour even by the standards of the day,[54] was seen to be so delighted that he had clasped his hands above his head and performed a "war dance".[55]
  2. As a result of the injuries in this game, the costs of insurance cover for players doubled.[79]

మూలాలు[మార్చు]

  1. Unit 2 – Managing the Match: Management issues and umpiring Archived 3 అక్టోబరు 2011 at the Wayback Machine. International Institute of Cricket Umpiring and Scoring. Retrieved 2 September 2018.
  2. 2.0 2.1 Frith, pp. 241–59.
  3. 3.0 3.1 3.2 Pollard, pp. 260–261.
  4. 4.0 4.1 Frith, pp. 22–23.
  5. Frith, pp. 18–19.
  6. Frith, p. 25.
  7. Frith, p. 23.
  8. "Statsguru—Australia—Tests—Results list". Cricinfo. Retrieved 21 December 2007.
  9. "Records: Test matches: Batting records: Most runs in a series". ESPNcricinfo. Retrieved 21 October 2017.
  10. Perry, p. 133.
  11. Cashman, pp. 32–35.
  12. Piesse, p. 130.
  13. Frith, pp. 39–41.
  14. Douglas, p. 121.
  15. Fingleton (1981), pp. 81–82.
  16. Douglas, pp. 30–31.
  17. Douglas, p. 64.
  18. 18.0 18.1 18.2 18.3 Frith, p. 71.
  19. Fingleton (1981), pp. 84–85.
  20. Douglas, p. 68.
  21. Douglas, p. 82.
  22. Frith, pp. 54–55.
  23. 23.0 23.1 Frith, pp. 61, 66.
  24. Douglas, pp. 123–24.
  25. Frith, pp. 69, 90–91.
  26. 26.0 26.1 Douglas, p. 126.
  27. Frith, pp. 79–94.
  28. 28.0 28.1 28.2 Harte, p. 344.
  29. Pollard, p. 249.
  30. Frith, pp. 94–96.
  31. Frith, pp. 99–105.
  32. Frith, p. 105.
  33. Douglas, p. 128.
  34. Frith, pp. 97–98.
  35. Frith, pp. 106–7.
  36. Frith, p. 99.
  37. Frith, p. 98.
  38. Growden, pp. 62–63.
  39. Frith, p. 68.
  40. Frith, p. 109.
  41. Haigh and Frith, p. 71.
  42. Frith, pp. 117, 120, 126, 134.
  43. 43.0 43.1 Frith, p. 137.
  44. 44.0 44.1 Frith, p. 116.
  45. Colman, p. 172.
  46. Frith, pp. 134–35.
  47. Whitington and Hele, p. 132.
  48. Frith, p. 134.
  49. Haigh, Gideon (22 October 2007). "Gideon Haigh on Bodyline: A tactic of its time". ESPNCricinfo. Retrieved 1 February 2011.
  50. Colman, pp. 181–182.
  51. O'Reilly, p.88.
  52. 52.0 52.1 Harte, p. 346.
  53. Frith, p. 139.
  54. Piesse, p. 132.
  55. Bowes, p. 107.
  56. Frith, pp. 150, 159–63.
  57. Douglas, p. 137.
  58. Frith, p. 165.
  59. Haigh and Frith, p. 73.
  60. Hamilton, p. 156.
  61. Frith, p. 179.
  62. 62.0 62.1 Frith, p. 180.
  63. 63.0 63.1 Frith, p. 181.
  64. Frith, p. 182.
  65. 65.0 65.1 Frith, p. 185.
  66. Fingleton (1947), p. 18.
  67. Fingleton (1947), p. 17.
  68. Hamilton, pp. 156–57.
  69. Frith, p. 194.
  70. Frith, p. 187.
  71. 71.0 71.1 Frith, p. 188.
  72. Growden, p. 72.
  73. Hamilton, p. 157.
  74. Fingleton (1981), p. 108.
  75. Frith, pp. 187–92.
  76. Frith, pp. 194–96.
  77. 77.0 77.1 Frith, pp. 196–98.
  78. Frith, p. 200.
  79. Frith and Haigh, p. 77.
  80. 80.0 80.1 Frith, p. 201.
  81. Frith, p. 218.
  82. Frith, pp. 218–19.
  83. Watson, Greig (16 January 2013). "Bodyline: 80 years of cricket's greatest controversy". BBC. Retrieved 21 October 2017.
  84. 84.0 84.1 84.2 84.3 84.4 Williamson, Martin. "A brief history ... Bodyline". ESPNCricinfo. Retrieved 6 March 2013.
  85. Frith, pp. 218–22.
  86. Pollard, p. 259.
  87. Frith, p. 227.
  88. Frith, p. 215.
  89. 89.0 89.1 Frith, pp. 214–15.
  90. 90.0 90.1 Douglas, p. 146.
  91. Douglas, pp. 145–46.
  92. Frith, pp. 226–28.
  93. Frith, pp. 242–248.
  94. Frith, pp. 255–259.
  95. Douglas, pp. 145–47.
  96. Frith, pp. 274, 277, 293.
  97. Frith, pp. 288–91.
  98. "England v Australia 1932–33 (Fourth Test)". Wisden Cricketers' Almanack. London: John Wisden & Co. 1934. Retrieved 28 October 2017.
  99. Frith, p. 309
  100. Frith, p. 314.
  101. Frith, pp. 315–18.
  102. Frith, pp. 324–25.
  103. Frith, pp. 328, 330.
  104. 104.0 104.1 Frith, p. 408.
  105. Frith, p. 374.
  106. Chalke, Stephen; Hodgson, Derek (2003). No Coward Soul. The remarkable story of Bob Appleyard. Bath: Fairfield Books. p. 177. ISBN 0-9531196-9-6.
  107. 107.0 107.1 107.2 "A Dummy's Guide to Bodyline". Cricinfo. Retrieved 31 July 2008.
  108. Frith, pp. 10–17.
  109. Dellor, Ralph. "Cricinfo Player Profile, Clive Lloyd". Cricinfo. Retrieved 1 December 2006.
  110. Frith, pp. 142, 222, 231–238.
  111. Pollard, p. 258.
  112. E. W. Swanton. Sort of a Cricket Person, William Collins & Sons, 1972, p. 19.
  113. Colman, p. 171.
  114. Cashman, pp. 322–323.
"https://te.wikipedia.org/w/index.php?title=బాడీలైన్&oldid=4038675" నుండి వెలికితీశారు