భూటాన్ జానపద నృత్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భూటాన్‌లో ప్రధానమైన మతం బౌద్ధమతం, తరువాత హిందూమతం. ఫలితంగా, భూటానీస్ సంస్కృతి పవిత్రమైన బౌద్ధ విలువలచే చాలా ప్రభావితమైంది. భూటానీయులు వారి మతపరమైన విలువలతో జీవిస్తారు., వారి దేవుళ్ళను, దేవతలను చాలా గౌరవిస్తారు. అందువల్ల, దేశంలో మఠాలు, చోర్టెన్‌లు, లాఖాంగ్‌లు మొదలైన వాటికి కొరత లేదు. కొండలపై, మఠాల ప్రవేశ ద్వారం వద్ద రంగురంగుల ప్రార్థన ఉంటాయి వీటిని పవిత్రంగా భావిస్తారు. దేశంలోని ప్రతి జిల్లా లేదా ద్జోంగ్‌ఖాగ్‌లో ఒక కోట, మఠం యొక్క విశిష్ట కలయిక వుంటుంది.. [1]8వ శతాబ్దంలో భూటాన్‌కు తాంత్రిక బౌద్ధమతాన్ని పరిచయం చేసిన పద్మసంభవ ద్వారా చామ్నృత్యం మొదట ఉద్భవించింది. అప్పటి నుండి, ఈ రకమైన నృత్యం అభివృద్ధి చేయబడింది, బౌద్ధమతం, బౌద్ధమత సన్యాసులను/సాధువులను గౌరవించే చిహ్నంగా భూటాన్ వార్షిక పండుగల అయిన 'త్షెచు సమయంలో ప్రదర్శించబడుతుంది.[2]

జోయెన్పా లెగ్సో డ్యాన్స్[మార్చు]

భూటాన్‌లో, ఈ భూటానీస్ సాంప్రదాయ నృత్యం పేరుకు అక్షరాలా అర్థం "స్వాగతం" అని.ఇది స్వాగత నృత్యం కాబట్టి, ఇది సాధారణంగా ఏదైనా కార్యక్రమం లేదా ప్రత్యేక సందర్భం ప్రారంభంలో ప్రదర్శించబడుతుంది. జోయెన్పా లెగ్సో ప్రదర్శిస్తున్నప్పుడు, పురుషులు, మహిళలు సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు, మగ నృత్యకారులు "ఘో", "త్సోల్హామ్", మహిళా నృత్యకారులు "కిరా", "టెగో", "వోంజు" ధరిస్తారు. డ్యాన్సర్లు ప్రదర్శించే విధానం ఖచ్చితంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది, ప్రేక్షకులందరి నుండి ప్రశంసలను పొందుతుంది.[2]జోయెన్‌పా లెగ్సో ప్రేక్షకులకు , మొత్తం వేడుకకు అదృష్టం ఇస్తుందని దేవతలు ఆశీర్వదించేలా చేస్తుందని నమ్మకం. ఇది మిగిలిన వేడుకలలన్ని ఊత్సహంగాచేసుకునేల ప్రేరణ ఇస్తుంది.భూటాన్‌లో ఈ నృత్యం చేస్తున్నప్పుడు పురుషులు, మహిళలు సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. నృత్య శైలి అందరి దృష్టిని ఆకర్షిస్తుంది,మరియు ప్రజలందరి ప్రశంసలను పొందుతుంది. ప్రత్యక్షంగా ప్రదర్శించేటప్పుడు చూడటం నిజంగామరుపురాని అనుభవం.[3] [4]

డ్రామెట్సే న్గా చామ్ డ్యాన్స్[మార్చు]

డ్రామెట్సే న్గా చామ్ డ్యాన్స్/ముసుకు నృత్యం

డ్రామెట్సే న్గా చామ్ (Drametse Nga Cham) అంటే "డ్రామెట్సే ప్రాంతపు డ్రమ్స్, ముసుగు నృత్యం", ఇది మొదట తూర్పు భూటాన్‌లోని ఒక చిన్న గ్రామమైన డ్రమెట్సేలో ఉద్భవించినది. అందుకే ఆ ప్రదేశం పేరు నృత్యానికి పెట్టబడింది. ముసుగులు ధరించిన నృత్యకారులు డ్రమ్స్‌తో డ్రామెట్సే న్గా చామ్‌ను ప్రదర్శిస్తారు. డ్రామెట్సే పండుగ సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది, ఈ నృత్యం ఉత్సవాల్లో ఉత్తమ భాగం అనిచెప్పవచ్చు.ఈ నృత్యాన్ని 16 మంది మగ నృత్యకారులు, 10 మంది సంగీతకారుల బృందం ప్రదర్శిస్తుంది.నృత్యాన్ని ప్రదర్శించే సమయంలో, నృత్యకారులు వివిధ రంగుల పట్టు వస్త్రాలు, చెక్క జంతువుల ఆకారపు ముసుగులు ధరిస్తారు, అయితే సంగీతకారులు "పేడ" అంటే బాకాలు, "రిమ్" అంటే "తాళాలు", "న్గా " అంటే "డ్రమ్" అని అర్థం. "న్గా ", నిజానికి, మూడు రకాలుగా ప్లే చేయబడుతుంది, ఇందులో "బ్యాంగ్ న్గా" అనేది పెద్ద స్థూపాకార డ్రమ్, "లాగ్ న్గా" అనేది స్థూపాకార హ్యాండ్ డ్రమ్, "న్గా చెన్" అనేది డ్రమ్ స్టిక్‌లతో వాయించే డ్రమ్. డ్రామెట్సే న్గా చామ్ యొక్క ఉత్సాహభరితమైన ప్రదర్శనను ఆస్వాదించడం నిజంగా ఒక ఉత్తేజకరమైన అనుభవం.[2][3] [5]

పా చమ్ డాన్స్[మార్చు]

త్షెచస్‌లో గురు రింపోచే గౌరవార్ధం ఈ నృత్యం)

పా చమ్ నృత్యం అని పిలవడానికి మరొక కారణం ,నృత్యంలో పోవాస్ అనగా నాయకులు (అంటే హీరోలు) అలాగే పామ్స్(అంటే హీరోయిన్లు)అనగా నాయకినిలు. రంగురంగుల పట్టు వస్త్రాలు, తలపై కిరీటాలు ధరించి నృత్యకారులు సంప్రదాయ నృత్యం చేస్తారు. త్షెచస్‌లో గురు రింపోచే గౌరవార్ధం ఈ నృత్యం చేస్తారు. డ్యాన్స్ చేస్తున్నప్పుడు చిన్న స్థూపాకార హ్యాండ్ డ్రమ్‌ని మోస్తున్న నృత్యకారులు పా చమ్‌ను ప్రదర్శిస్తారు.[2][6]

జుంగ్ద్రా డ్యాన్స్[మార్చు]

ఈ నృత్యం భూటాన్‌లోని పురాతన నృత్యాలలో ఒకటిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది ప్రారంభ బౌద్ధ సాధువులలో ఉద్భవించింది. నేడు రాజా దర్బారులలో అలాగే డ్జాంగ్‌లు, మఠాలలో ప్రదర్శించబడుతుంది.ఈ నృత్యంలో సంప్రదాయ వస్త్రధారణ తో, చేతితో చేనేత వస్త్రం అయిన రాచును ధరించిన మహిళలు నృత్యం చేస్తారు.నృత్యమే దేవతలకు నైవేద్యమని నమ్ముతారు. [2]భూటాన్ యొక్క రాచరిక నృత్యం అయిన జుంగ్ద్రా చాలా నెమ్మదిగాకదలికలు కలిగి వుండి ప్రదర్శింపబడే స్వరపరిచిన నృత్య రూపం, ఇది రాజా దర్బారు లో ప్రదర్శించబడుతుంది. ఇది జాంగ్‌లు, మఠాలలో, త్షెచస్‌లోని ఒక భాగములో కూడా ప్రదర్శించబడుతుంది. ఇది ప్రారంభ బౌద్ధ సాధువుల నుండి ఉద్భవించిన భూటాన్‌లోని పురాతన నృత్యాలలో ఒకటిగా నమ్ముతారు. దీనిని స్త్రీలు వరుసలో నిలబడి సంప్రదాయ వస్త్రధారణతో ప్రదర్శిస్తారు. వారు చేతితో నేసిన స్కార్ఫ్‌ని కూడా పట్టుకుని ఒక ఖచ్చితమైన లయలో కలిసి నృత్యం చేస్తారు. నృత్యం చాలా మతపరమైనది, అందుకే వేగవంతమైన కదలికలు ప్రదర్శించబడవు. చేతి కదలికలు చాలా స్పష్టంగా, నెమ్మదిగా ఉంటాయి. [3] [7]

బోడ్రా డాన్స్[మార్చు]

బోయెడ్రా/బోడ్రా అనేది భూటాన్‌లోని మరొక సాంప్రదాయ నృత్యం, ఇది దర్బారు లో వృత్తంలో నిలబడి ఉన్నపురుషులు, స్త్రీలబృందంచే ప్రదర్శించబడుతుంది; అయితే, కొన్నిసందర్భాల్లో,పురుషులు, మహిళలు విడివిడిగా నృత్యాన్ని ప్రదర్శిస్తారు. బోడ్రా నృత్యం యొక్క ప్రతి కదలిక ఏ క్రమాన్ని అనుసరించదు, బదులుగా, ఇది పాట యొక్క లయకు అనుగుణంగా ఉంటుంది; అందువల్ల, ప్రేక్షకులు తదుపరి ఏ దశను చూడబోతున్నారో ఎవ్వరు ఊహించలేరు.ఇది వీక్షకులకు అద్భుతమైన అనుభవం. నిజానికి, బోడ్రా మొదట్లో కేవలం పాటల ప్రదర్శన మాత్రమే, నృత్య విన్యాసాలు చాలా కాలం తర్వాత పరిచయం చేయబడ్డాయి.[2]భూటాన్‌లోని రాచరిక దర్బారు /రాజ ప్రాంగణంలో ప్రదర్శించేమరొక నృత్యం ఇది, బోడ్రాను పురుషులు, స్త్రీల బృందం ప్రదర్శిస్తుంది, వారు ఒక వృత్తాన్ని ఏర్పరచడానికి కలిసి నిలబడి ఉంటారు.కొన్నిసందర్భాల్లో,ఇది పురుషులు, మహిళలు విడివిడిగా నిర్వహిస్తారు. నృత్య భంగిమలు,కదలికలు పాట యొక్క సంగీతానికి అనుగుణంగా ఉంటాయి, దీనికి ఎటువంటి స్థిరమైన స్టెప్పులు/పాద కదలికలు లేవు. ఈ డ్యాన్స్‌లోని గొప్పదనం ఏమిటంటే, ప్రేక్షకులు తదుపరి ఏ స్టెప్ చూడబోతున్నారో వారికి తెలియదు. ప్రారంభంలో బోడ్రా కేవలం పాట ప్రదర్శన.నృత్య పాద కదలికలు/పాదల లయబద్ద విన్యాసం చాలా కాలంతరువాత పరిచయం చేయబడ్డాయి. [3] [8]

5 ఇతర ప్రసిద్ధ భూటాన్ సాంప్రదాయ నృత్యాలు[మార్చు]

లయాబ్ నృత్యం[మార్చు]

ఈ సంప్రదాయ నృత్యంసంచార ప్రజల సాంప్రదాయ నృత్యం.పశ్చిమాన ఎత్తైన ప్రదేశంలో నివసించే భూటాన్ సంచార పశువుల కాపరులు ఈ నృత్యం చేస్తారు. వారు శాశ్వత స్థలాంలో వసించరు ; అందువల్ల, యాక్ అనబడే జడల బర్రెల పెంపకమే వారి సంపాదన & జీవనానికి ప్రధాన వనరు. . [2][9]

యాక్ చామ్ డ్యాన్స్[మార్చు]

ఇది తూర్పు భూటాన్ తూర్పుప్రాంత సంచార ప్రజల సాంప్రదాయ నృత్యం.సంచార జాతుల మరో ప్రత్యేక నృత్యం ఇది. భూటాన్‌కు తూర్పున నివసించే సంచార జాతులు స్థానిక దేవత - ఓమ్ జోమో (దేవత)ని గౌరవిస్తూ యాక్ చామ్ నృత్యం చేస్తారు.[2]యాక్ చమ్ నృత్యం అనేది కథ-ఆధారిత జానపద నృత్యం.యాక్ చామ్ నృత్యం ఒక పర్వత బాలుడి కథను చెబుతుంది, దేశీయ యాక్‌కి కు భూటాన్ కు వున్న విడదీయరాని బంధాన్ని తెలుపుతుంది. యాక్(జడల బర్రె) స్థానిక బాలుడికి తన ప్రయాణంలో ఎలా మద్దతు ఇచ్చాందోఈ కథ చెబుతుంది.యాక్ బాలుడు, మధ్య భావోద్వేగ సంబంధాన్ని ఈ నృత్యం ప్రదర్శిస్తుంది. ఆర్థిక విషయాలలో యాక్ బాలుడికి ఎలా సహాయం చెసింది ఈ నృత్యంలో ప్రదర్షిస్తారు.[10]

దోయాబ్ డ్యాన్స్[మార్చు]

దక్షిణ భూటాన్లో పురుడు పోసుకున్న నృత్యం ఇది.దోయాబ్ నృత్యం యొక్క పుట్టుక డొరోఖా (సంత్సే జిల్లా) అనే గ్రామం నుండి వచ్చింది. ఈ నృత్యం పరిణామ క్రమంలో భూటాన్‌లోని పురాతన నృత్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.ఈలోయలో నివసిస్తున్న స్థానికులు డొరోఖపాగాప్రసిద్ధి చెందారు, అలాగే పురాతన భూటాన్ నివాసితులలో డొరోఖపాగా తెగవారుఒకరు. [2] [11]

అషాంగ్ గవే డాన్స్[మార్చు]

అషాంగ్ గవే డ్యాన్స్ ప్రత్యేక సందర్భాలలో ప్రదర్శించబడుతుంది.ఈ నృత్యం భూటాన్‌లోని పురాతన సాంప్రదాయ నృత్యం.[2]

తాషి తాషి డ్యాన్స్[మార్చు]

భూటాన్‌లో ప్రదర్షితమైయ్యె వీడ్కోలు నృత్యం ఇది. ఏదైన ప్రదర్షనలో తాషి తాషిని ప్రదర్శించినప్పుడు, అది ప్రదర్శన ముగింపుగా భావించబడుతుంది, వచ్చిన ప్రతి ఒక్కరు నృత్యంలో పాల్కోనుటకు ఆహ్వానించబడతారు.[2]

ఇవికూడా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "dances of bhutan". holidify.com. Retrieved 2024-02-16.
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 "traditional dances of Bhutan". gobhutantours.com ǀaccessdate=2024-02-18.
  3. 3.0 3.1 3.2 3.3 "dances of bhutan". holidify.com. Retrieved 2024-02-16.
  4. "10 traditional dances of Bhutan". manjulikapramod.com. Retrieved 2024-02-16.
  5. "Mask dance of the drums from Drametse". ich.unesco.org. Retrieved 2024-02-16.
  6. "Pacham:dance of heroes". texts.mandala.library.virginia.edu. Retrieved 2024-02-16.
  7. "what are the types of traditional dances". dailybhutan.com. Retrieved 2024-02-16.
  8. "Bhutanese cuturaldanceOboedra)". sdgs.scout.org. Retrieved 2024-02-16.
  9. "10 traditional dances of Bhutan". manjulikapramod.com. Retrieved 2024-02-16.
  10. "yak cham dance-a story of a moutain boy". auchitya.com. Retrieved 2024-02-16.
  11. "Bhutan famous dance". bhutantravellers.medium.com. Retrieved 2024-02-16.