మిజోరం జానపద నృత్యాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిజో ప్రజలు గాంగ్/గంట , డ్రమ్/డోలు వంటి కొన్ని సంగీత వాయిద్యాలతో పాటు అనేక రకాల నృత్యాలను కలిగి ఉంటారు. మిజోరాంలోని జానపద నృత్యం, సంగీతం, అన్ని చోట్ల మాదిరిగానే, ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది, స్థానికుల రంగుల దుస్తులు స్ఫూర్తిని ప్రతిబింబిస్తాయి . ఇక్కడ చాలా నృత్య రూపాలు బృంద నృత్యాలు వున్నాయి. ఈశాన్య భారత రాష్ట్రంలో చేరా అనేది ప్రధాన నృత్య రూపం. వెదురు నృత్యంగా కూడా పేర్కొనబడింది, చెరా మిజోస్ యొక్క పురాతన నృత్యాలలో ఒకటి.ఈ నృత్య రూపకం సమయంలో ప్రజలు పొడవైన వెదురు కర్రలను ను ఉపయోగిస్తారు. బాలికలు సాంప్రదాయ మిజో దుస్తులను ధరిస్తారు, అందువల్ల నృత్యం చాలా ఖచ్చితత్వంతో ఆకర్షనీయంగా ప్రదర్శించబడుతుంది. ఉపయోగించే చాలా వాయిద్యాలలో డ్రమ్స్/డోళ్లు , గంటలు తప్పనిసరిగా వుంటాయి.[1]

మిజోల పేరెన్నికగన్న కొన్ని జానపద నృత్యాలు:

1. ఖుల్లాం[మార్చు]

ఖూల్లాం నృత్య ప్రదర్సన-2004 రిపబ్లిక్ డే-జనవరి26

ఖుల్లాం అంటే అతిథుల నృత్యం.అని అర్థం. ఇది సాధారణంగా 'ఖువాంగ్‌చావి' అనే వేడుకలో చేసే నృత్యం. మిజో సమాజంలో ఒక విశిష్ట స్థానాన్ని పొందేందుకు, స్వర్గం లేదా పియల్రాల్‌లో స్థానం పొందాలంటే తాంగ్‌చువా అనే గౌరవనీయమైన బిరుదును పొందాలిఅని మిజో ప్రజల నమ్మిక . ఈ బిరుదు పొందడానికి మిజో సమాజంలో రెండు మార్గాలు ఉన్నాయి.మొరిగే/గర్జించే మృగాలను,జింక, అడవిపంది,ఎలుగుబంటి, అడవి గయాల్(ఎద్దు లేదా ఆవు), వైపర్, గద్ద మొదలైన జంతువులతో సహా అనేక జంతువులను చంపడం ద్వారా వేటలో లేదా యుద్ధంలో తన సత్తాను నిరూపించుకోవడం ద్వారా మొదట తాంగ్‌చువా అనే బిరుదును పొందవచ్చు.విన్యాసాలు, నృత్యాలు చేయడం ద్వారా తాంగ్‌ చువా బిరుదు లభిస్తుంది. కాబట్టి ధైర్యవంతులు లేదా ధనవంతులు మాత్రమే తాంగ్‌ చువాను సాధించగలరు. రెండవ పద్ధతిలో నిర్వహించే వేడుకలను ఖువాంగ్‌చావి అంటారు.[2]ఖువాంగ్‌చావి వేడుకలో ఇతర గ్రామాల నుండి ఆహ్వానించబడిన అతిథులు ఖుల్లాం నృత్యం చేస్తూ రంగ ప్రవేశం చేస్తారు. పుండుం అని పిలువబడే సాంప్రదాయ చేతితో నేసిన చేనేత మిజో వస్త్రాన్ని భుజాలపై చుట్టి,వస్త్రాన్ని ఊపుతూ నృత్యం చేస్తారు.ఖువాంగ్‌చావి వేడుకలో ఇతర గ్రామాల నుండి ఆహ్వానించబడిన అతిథులు ఖుల్లాం నృత్యం చేస్తూ రంగ ప్రవేశం చేస్తారు. పుండుం అని పిలువబడే సాంప్రదాయ చేతితో నేసిన చేనేత మిజో వస్త్రాన్ని భుజాలపై చుట్టి, వస్త్రాన్ని ఊపుతూ నృత్యం చేస్తారు. ఈ పువాండం నలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగు చారలను కలిగి ఉంటుంది.[3] . విశేషమేమిటంటే, పువాండం అనేది ఒక అనివార్యమైన వస్తువు, ఇది ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకునేటప్పుడు వెంట తీసుకెళ్లాలి. ఆమె భర్త చనిపోయినప్పుడు మృతదేహాన్ని కప్పడానికి ఉపయోగిస్తారు. మిజోస్‌లోని ఇతర జానపద నృత్యాల వలె, ఈ నృత్యం దర్బు అని పిలువబడే గంటల సమితితో కూడి ఉంటుంది, ఏ పాట కూడా పాడబడదు. ఇది సాధారణంగా పెద్ద సంఖ్యలో నిర్వహిస్తారు. [2]

2.చెరా నృత్యం[మార్చు]

చెరా నృత్య ప్రదర్సన

మిజోల యొక్క చాలా పురాతన సాంప్రదాయ నృత్యం చెరా. 13వ శతాబ్దం A.D.లో చిన్ హిల్స్‌కు వలస వెళ్లడానికి ముందు, మిజోలు చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఎక్కడో ఉండగా, 1వ శతాబ్దం A.D.లో ఈ నృత్యం ఉనికిలో ఉందని నమ్ముతారు. ఆగ్నేయాసియాలో నివసిస్తున్న కొన్ని తెగలు ఒకే విధమైన నృత్యాలను ఒక రూపంలో లేదా మరొకటి వేర్వేరు పేర్లతో కలిగి ఉంటాయి. [4] నేలపై ముఖాముఖిగా కూర్చున్న పురుషులు రిథమిక్ బీట్స్‌లో పొడవాటి జతల క్షితిజ సమాంతర, క్రాస్ వెదురు పుల్లలను చదరం లా తెరుస్తూ- మూస్తూ వుంటారు. 'పుంచేయ్', 'కవర్చెయ్' రంగుల మిజో కాస్ట్యూమ్స్‌లో ఉన్న అమ్మాయిలు. వెదురు దరువుల మధ్య(మూస్తూ తెరుస్తూ వున్న వెదురు బద్దెల క్రాస్ లో వకీరియా, తిహ్నా నృత్యం చేస్తారు.ఈ నృత్యం ఇప్పుడు దాదాపు అన్ని పండుగ సందర్భాలలో ప్రదర్శించబడుతుంది. 'చెరా' యొక్క ప్రత్యేక శైలి అది ప్రదర్శించబడిన ప్రతిచోటా గొప్ప ఆకర్షణ గా వుంటుంది. నృత్యానికి తోడుగా గంటలు, డోళ్లు ఉపయోగించడుతాయి. నేడు ఆధునిక సంగీతం కూడాఈ నృత్యాన్ని జోడింప బడి ప్రదర్శింపబడుచున్నది.[2]

3.సర్లంకై/సోలాకియా నృత్యం[మార్చు]

ఇది మిజోరాం యొక్క దక్షిణ] భాగంలోని పావి , మారా కమ్యూనిటీల/సమూహంనుండి ఉద్భవించిన ఆకట్టుకునే నృత్యం.ఈ నృత్యాన్ని 'సర్లంకై' అని పిలుస్తారు, అయితే లుషాయిలు దీనిని 'రాళ్లు లాం' అని పిలుస్తారు. పాత రోజులలో, వివిధ తెగలు ఒకరితో ఒకరు నిరంతరం యుద్ధం చేస్తున్నప్పుడు, ఓడిపోయిన శత్రువు యొక్క తల నరికిన పుర్రెను ఎగతాళి చేసే వేడుక సాధారణంగా విజేతచే నిర్వహించబడుతుంది.ఓడిపోయినవానిఆత్మ చనిపోయినప్పుడు కూడా విజేతకు బానిసగా ఉండేలా ఈ వేడుక నిర్వహిస్తారు. ఈ అపహాస్యం వేడుక సాధారణంగా 5 (ఐదు) రోజులు ఉంటుంది. మొదటి రెండురోజులు ఉల్లాసంగా, పానీయాల సేవనతో పాటు, పాడుతూ, మాంసాహార విందులో గడుపుతారు.మూడవ రోజున ఒకపందిని వధించి, విజేత తన శరీరమంతా జంతువు రక్తంతో లేపనం చేస్తాడు, దానిని అతను నాల్గవ రోజు సాయంత్రం లేదా ఐదవ రోజు ఉదయం మాత్రమే కడుగుతాడు.ఈ ఐదురోజుల వ్యవధిలో, విజేత ఏ స్త్రీతోనూశారీరక సంబంధం పెట్టుకోరాదు. [2] అతను అలాతప్పుచేస్తే, ఓడిపోయిన ఆత్మ ఆగ్రహానికి గురై,ఆత్మ విజేతపై కక్ష తీర్చు కుంటుందని నమ్ముతారు, అలాంటి పనిచేసిన ఆ వ్యక్తిలో శాశ్వతఅంగ వైకల్యం ఏర్పడుతుందని విశ్వసిస్తారు. విజేతను ప్రజలు, రాజు, అతని పెద్దలు ఎంతో గౌరవిస్తారు. అందువల్ల, ప్రతి వయోజనుడు అలాంటి హీరోగా ఉండటానికి మొత్తం సామర్థ్యంతో కృషి చేస్తాడు.బాహ్య ఆక్రమణలు/ఇతరుల నుండి దాడి ఎదురైనప్పుడు, అలాంటి వీరుల ధైర్యం, ప్రజలకు ఎంతో ధైర్యం,ఓదార్పునిస్తాయి.ఈ వేడుక లో 'సర్లంకాయి' నృత్యం చేస్తారు. స్పష్టంగా, ఇది యుద్ధంలో విజయం సాధించినందుకు జరుపుకునే ఒక యోధుల నృత్యం.వేడుకలో పాటలు పాడరు; లయకై గంట లేదా తాళాలు లేదా డ్రమ్స్/డోలులు మాత్రమే ఉపయోగించబడతాయి. నృత్యంలో, అబ్బాయిలు, అమ్మాయిలు ప్రత్యామ్నాయ స్థానాల్లో నిలబడి వలయంగా/వృత్తాకారంగా నృత్యం చేస్తారు.వారు సాధారణంగా రంగురంగుల దుస్తులను ధరిస్తారు, అయితే నాయకుడు యోధుని వలె దుస్తులు ధరిస్తారు. [2] [5]

4.చైలం[మార్చు]

చైలం నృత్య ప్రదర్శన

చైలం అనేది మిజోజనుల అతి ముఖ్యమైన పండుగలలో ఒకటైన చాప్చార్ కుట్ సందర్భంగా ప్రదర్శించబడే ఒక ప్రసిద్ధ నృత్యం. ఈ నృత్యంలో, స్త్రీలు పురుషుని నడుముపై, పురుషుడు స్త్రీల భుజంపై పట్టుకుని, పురుషులు, స్త్రీలు వృత్తాకారంలో మారుతూ ఉంటారు. వృత్తం మధ్యలో డోలు, అడవి ఎద్దు(గవయవం) కొమ్ముబూర వాయించే సంగీతకారులు ఉంటారు.డ్రమ్ కొట్టే సంగీతకారుడు నృత్యం యొక్క మొత్తం సూక్ష్మ నైపుణ్యాలను నిర్దేశిస్తూ వుంటాడు అడవి దున్న/ఆవు కొమ్ముబూర ఉన్నవాడు 'చాయ్' పాట యొక్క సాహిత్యాన్ని ఆలపిస్తాడు. డ్యాన్స్ ప్రారంభం కావడానికి సూచనగా డ్రమ్మర్ డ్రమ్‌పై మొదట కొడతాడు,తరువాత డ్రమ్ పై నాల్గవసారి కొట్టగానే,డ్రమ్ యొక్క దరువులకు అనుగుణంగా నర్తకులు ఎడమ, కుడికి లయబద్ధంగా ఊగుతూ,నర్తిస్తుండగా చాయ్ పాట పాడబడుతుంది.అనుసరించిన సూక్ష్మ నైపుణ్యాలపై ఆధారపడి, చైలం' నాలుగు వెర్షన్‌లను కలిగి ఉంది, అవి 'చై లమ్‌థాయ్ I, 'చై లమ్‌థాయ్ II, చై లాంథాయ్ III, 'చై లమ్‌థాయ్ IV'. [6]ఒకప్పుడు రాజు, అతని మనుషులు వేటకు వెళ్లారని పురాణాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తు, వారు ఘోరంగా విఫలమయ్యారు ఒక్కజంతువునుకూడా వేటాడలేక పోయారు.రాజు, తన మనుష్యుల పూర్తి నిరాశను చూసి, వారిని తన రాజభవనంకు ఆహ్వానించి వారికి మద్యం విందుతో ఇచ్చి వారిని ఓదార్చాడు. ఆ సమావేశం మద్య పానం తో కూడిన విందుతోను, పాటలు, విలాసవంతమైన నృత్యంతో ముగిసింది. అప్పటి నుండి, ప్రతి సంవత్సరం, ఆ కమ్యూనిటీ/సామాజికవర్గం వివిధ వినోద కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.తద్వారా మిజోస్‌లో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన 'చాప్‌చార్ కుట్' ఏర్పడింది. ఈ నృత్యంలో, డప్పులు, అడవి ఎద్దు కొమ్ముబూర వంటి సంగీత వాయిద్యాన్ని దరువులు చేయడానికి ఉపయోగిస్తారు. పండుగలు ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయి. పాత రోజుల్లో, 'చాయ్' నృత్యకారులు పాడేటప్పుడు, నృత్యం చేసేటప్పుడు నిరంతరం బియ్యపునుండి చేసిన మద్యం/బీరు తాగేవారు. [2]

5.చాంగ్లైజాన్[మార్చు]

ఇది పావి అని పిలవబడే మిజో కమ్యూనిటీలలో ఒక ప్రముఖ ఫోల్డ్ నృత్యం . ఈ నృత్యం రెండు వేర్వేరు సందర్భాలలో ప్రదర్శించబడుతుంది.

(i) తనభార్య మరణించినందుకు దుఃఖించటానికి భర్తచే దీనిని నిర్వహిస్తారు.భర్త అలసిపోయే వరకు నిరంతరం ఈ నృత్యం చేస్తూనే ఉంటాడు స్నేహితులు, బంధువులు అతనికి ఉపశమనం కలిగించి అతని తరపున నృత్యం చేస్తారు.దీనర్థం వారు దుఃఖితులతో కలిసి దుఃఖిస్తారు.

(ii) చాంగ్‌లైజాన్' పండుగలలో, వేట విజయవంతమైన వేటగాళ్ళు తమ విజయాన్ని ఇతరుల తో సంతోషంగా పంచుకోటానికి ఈ నృత్యవేడుకను నిర్వహిస్తారు.అటువంటి సందర్భాలలో,ఇది పెద్ద సంఖ్యలో సమూహాలలో నిర్వహిస్తారు.వరుసలలో నిలబడిన అబ్బాయిలు, అమ్మాయిలు డప్పుల దరువుకు అనుగుణంగా నృత్యం చేస్తారు.చేతుల కదలికకుసహాయం చేయడానికి అంగ వస్త్రాన్ని ఉపయో గిస్తారు. ఇది నృత్యానికి వర్ణ శోభను కూడా జోడిస్తుంది. ఈ నృత్యంలో డ్రమ్స్ మాత్రమే ఉపయోగిస్తారు. [2]

చాంగ్‌లైజాన్ అనేది ఒక ప్రత్యేకమైన ఆచార నృత్యం. గ్రామపెద్ద లేదా గ్రామానికి చెందిన చాలా డబ్బున్న వ్యక్తి చనిపోయినప్పుడు దీనిని అంత్యక్రియల నృత్యం అని పిలుస్తారు. ఈ ఆచారం పావి గిరిజన సమాజ ప్రజలలో ప్రబలంగా ఉంది. చాంగ్‌లైజాన్ అంటే నృత్యం, యశస్సు గెంతడం లేదా ఎగరడం అని అర్థం.పావీలు మనిషి జీవితంలో రెండు రోజులను అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు: అతను పుట్టిన రోజు, మరణించిన రోజు. నృత్యంలో కీర్తించబడిన చనిపోయిన నాయకునికి గ్రామస్థులు అర్పించే ఒక రకమైన నివాళి. ముఖ్యుల కుటుంబ సభ్యులు గ్రామస్తులకు పందులు, కోడిపిల్లలను బహుమానంగా ఇస్తారు, వీటిని విలాసవంతమైన విందుగా నిర్వహిస్తారు.ఇంతకు ముందు ఒక వ్యక్తి మాత్రమే నృత్యం చేసేవాడు . అతను తుపాకీని పట్టుకునేవాడు, నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ అప్పుడప్పుడు పైకి తుపాకి పేల్చే చేవాడు.కాలక్రమేణా, నృత్యం గణనీయంగా మారిపోయింది, ఇప్పుడు దీనిని సాధారణంగా 16 మంది పురుషులు, 16 మంది మహిళా నృత్యకారులు ప్రదర్శిస్తున్నారు. దాదాపు ఐదుగురు సంగీత విద్వాంసులు వివిధ పరిమాణాల గంటలు , డోళ్లు వాయింస్తూ సంగీతాన్ని అందిస్తారు. [7]

6.చేహ్లమ్ నృత్యం[మార్చు]

చెహ్లం నృత్య ప్రదర్శన

1900 సంవత్సరం తర్వాత పూమా జాయ్ అని పిలవబడే పాటలు, త్లాంగ్లం అని పిలువబడే నృత్యం యొక్క పంక్తులలో ఛీహ్లామ్' ఉద్భవించింది. ఇది ఆనందం, ఉల్లాసం యొక్క ఆత్మను ప్రతిబింబించే నృత్యం. ఇది 'ఛీహ్ హ్లా' అనే పాటకు అనుగుణంగా ప్రదర్శించబడుతుంది. ప్రజలు నేలపై వృత్తాకారంలో చతికిలబడి కూర్చుండి,డోలు/డ్రమ్ లేదా వెదురు వేణువు యొక్క శబ్ద లయతో పాడతారు, మధ్యలో ఒక జంట నృత్యకారులు నిలబడి, పాటను పాడుతూ సంగీతంతో పాటు నృత్యం చేస్తారు.[2]ఇది సాయంత్రం చల్లగా ఉన్న సమయంలోమద్య పానంచేస్తూ ప్రదర్శించిచే నృత్యం. సాహిత్యం ఆకస్మికంగా, ఆశువుగా వారి వీరోచిత పనులు, తప్పించుకునే సంఘటనలను వివరిస్తుంది.వారు తమ మధ్యలో ఉన్న గౌరవనీయమైన అతిథులను కూడా ప్రశంసిస్తారు.డోలు కొట్టడం లేదా చేతులు చప్పట్లు కొట్టడం ద్వారా ఉత్పన్నమయ్యే ధ్వనితో పాటను పాడుతున్నప్పుడు,ఒక నిపుణుడైన నర్తకి ,శరీరం యొక్క వివిధ కదలికలతో, అవయవాలతో తన నృత్య పఠన శ్లోకాలను పఠిస్తాడు,ఆ సమయంలో ,అతను అవయవాలను శరీరానికి దగ్గరగావుంచి నేలకు అనుకునే క్రిందికి వంగి నర్తిస్తాడు. వేగం పెరిగి ఉత్కంఠ పెరుగుతుండడంతో నేలపై చతికిలబడిన జనం లేచి ఆయనతో కలిసిపోతారు.హాజరైన అతిథులు కూడా నృత్యంలో చేరడానికి ఆహ్వానించ బడతారు . 'ఛీహ్లం' ఏ సందర్భంలోనైనా రంగురంగుల దుస్తులతో ప్రదర్శించబడుతుంది, సాధారణంగా రోజు పని ముగిసినప్పుడు సాయంత్రం సమయంలో ఈ వేడుక వుంటుంది.[2] [8]

7.త్లాంగ్లం నృత్యం[మార్చు]

త్లాంగ్లం నృత్యాన్ని రాష్ట్రం అంతటా నిర్వహిస్తారు. ప్యూమా జై సంగీతాన్ని ఉపయోగించే, ఈ నృత్యంలో అనేక వైవిధ్యాలు ఉన్నాయి. ఈ త్లాంగ్లం నృత్య విశేషం ఈ రోజుల్లో మన వివిధ ప్రదేశాలలో సాంస్కృతిక బృందాలు ప్రదర్శిస్తున్న అత్యంత ప్రాచుర్యం పొందిన నృత్యాలలో ఒకటి.ఈ నృత్యంలో స్త్రీ పురుష నర్తకులు పాల్గొంటారు. [2]త్లాంగ్లం అనేది పంట నృత్యం, దీనిలో పాల్గొనేవారు సంవత్సరంలో మొదటి పండ్లను ఊరేగింపుగా తీసుకువెళతారు.ఇది మిజో సంస్కృతిలో వ్యవసాయం యొక్క ప్రశస్తి, విలువను సూచిస్తుంది. [9]

8.జంగ్తాళం నృత్యం[మార్చు]

జంగ్తాలం అనేది పురుషులు, మహిళలు చేసే ప్రసిద్ధ పైహ్తే నృత్యం. నృత్యం చేస్తున్నప్పుడు, నృత్యకారులు ప్రతిస్పందించే పాటను పాడతారు. డ్రమ్మర్ నృత్యానికి నాయకుడు, దర్శకుడు. నృత్యం యొక్క వ్యవధి డ్రమ్మర్ మీద ఆధారపడి ఉంటుంది.[2] ఇది మిజో సామాజిక సమూహ నృత్యం ఇక్కడ అందరూ పాల్గొనవచ్చు, సంతోషకరమైన క్షణాలను కలిసి జరుపుకోవచ్చు. మిజోరాం నృత్యాలు ఇక్కడి సాంస్కృతిక ఉత్సాహాన్ని పునరుత్పత్తి చేస్తాయి.కొండ ప్రకృతి దృశ్యాల సహజ వైభవం నుండి ప్రోత్సాహాన్ని పొందిన , మిజోరాం నృత్యాలు మిజోరం యొక్క బహుళ-సాంస్కృతిక రూపానికి సమానం.

జాంగ్తాలం దుస్తులు,ఆభరణాలు

నృత్యకారులు వారి గొప్ప సృజనాత్మకతను ప్రతిబింబించే రంగురంగుల సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. మహిళా ప్రదర్శకులు జాతి ఆభరణాలతో తమను తాము అలంకరించుకుంటారు, ఇందులో ప్రధానంగా నెక్లెస్‌లు(మెడ హారాలు), కంకణాలుమరియు చెవిపోగులు(కర్ణాభరణాలు)ఉంటాయి.

జాంగ్తాలం యొక్క ప్రదర్శన ఇది ఒక సమూహంగా ప్రదర్శించబడుతుంది, ఈ నృత్యంలో పురుషులు, మహిళలు ఇద్దరూ పాల్గొంటారు. గానం, నృత్యం రెండూ ఏకకాలంలో జరుగుతాయి. ఇది లయబద్ధమైన నృత్యం. డ్రమ్మర్ నృత్యానికి నర్తనదర్శకత్వం చేస్తాడు.డ్రమ్మర్ ఎంతసేపు డ్రమ్‌ని కొట్టగలడు అనేదానిపై డ్యాన్స్ వ్యవధి ఆధారపడి ఉంటుంది. మగ నృత్యకారులు మహిళా నృత్యకారులకు ఎదురుగా వరుసలో నిలబడతారు. ఈ నృత్యం లోని అడుగులు సరళం గా ఉన్నప్పటికీ మనోహరంగా ఉంటాయి. కదలికలను ఎవరైనా నిర్వహించవచ్చు.నృత్యం యొక్క వ్యవధి డ్రమ్మర్ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. [10]

ఇవికూడాచదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "folk dances of mizoram". lifestylefun.net. Retrieved 2024-02-16.
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 "about Mizoram dances". mizoram.nic.in. Retrieved 2024-02-16.
  3. "khulam dance". indianetzone.com. Retrieved 2024-02-16.
  4. "cherw folk dances". indianfolkdances.com. Retrieved 2024-02-16.
  5. "dances of mizoram". tribaltoursinindia.com. Retrieved 2024-02-16.
  6. "chailam". indianetzone.com. Retrieved 2024-02-16.
  7. "chawnglaizawn". gaurijog.com. Retrieved 2024-02-16.
  8. "chheih lam". indianetzone.com. Retrieved 2024-02-16.
  9. "Major dances from mizoram". tfipost.com. Retrieved 2024-02-16.
  10. "angtalam". indianetzone.com. Retrieved 2024-02-16.