మంగమ్మ శపథం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంగమ్మ శపథం
(1965 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.విఠలాచార్య
నిర్మాణం డి.వి.ఎస్.రాజు
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
ఎల్.విజయలక్ష్మి,
రాజనాల,
రేలంగి,
గిరిజ,
ఛాయాదేవి,
బాలకృష్ణ,
రమణారెడ్డి
సంగీతం టి.వి.రాజు
నేపథ్య గానం ఘంటసాల, మాధవపెద్ది సత్యం,
పి.సుశీల, ఎస్.జానకి, జిక్కి
గీతరచన సి.నారాయణరెడ్డి, కొసరాజు
నిర్మాణ సంస్థ డి.వి.ఎస్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

మంగమ్మ శపథం 1965 సంవత్సరంలోని జానపద తెలుగు సినిమా.[1] దీనిని నిర్మాత డి.వి.ఎస్.రాజు డి.వి.ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై బి.విఠలాచార్య దర్శకత్వంలో నిర్మించారు.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు (ఎన్టీయార్) కాముకుడు, స్త్రీలోలుడు. పల్లెటూరి పిల్ల మంగమ్మ (జమున) హుషారుగా వుండే అందగత్తె; స్వాభిమానం, తెగువ గల మగువ. ఆమె పొందుకోరతాడు రాజు; కానీ ఆమె తిరస్కరిస్తుంది. అయినా ఆమెనే పెళ్ళాడతానని సవాలు చేస్తాడు రాజు. అదే జరిగితే, అతనివలనే కుమారుణ్ణి కని, వాడిచేత రాజును కొరడా దెబ్బలు కొట్టిస్తానని తిరిగి సవాలు చేస్తుంది మంగమ్మ. మహారాజు మంగమ్మ మెడలో తాళి కట్టి తన పంతం నెరవేర్చుకొని మంగమ్మను బంధిస్తాడు. తెలివిగల మంగమ్మ దొమ్మరివారి సహాయంతో నాట్యం నేర్చుకొని దొమ్మరిసానిగా వేషం మార్చుకొని రాజును ఆకర్షించి అతనితో ఒక రాత్రి గడుపుతుంది. ఫలితంగా గర్భవతి అవుతుంది. పుట్టిన విజయ్ (ఎన్టీయార్) పెరిగి పెద్దవాడవుతాడు. తల్లికి జరిగిన అవమానాన్ని తెలుసుకొని విజయ్ యుక్తిగా రాజును బంధించి కొరడాలతో కొట్టి తల్లి చేసిన శపథాన్ని నెరవేరుస్తాడు.

పాటలు

[మార్చు]
  1. అందాల నారాజ అలుకేలరా ఔనని కాదని అనవేలరా - పి.సుశీల , రచన: సి.నారాయణ రెడ్డి
  2. అయ్యయ్య ఐసా పైసా చెల్తారే అబ్బబ్బాబ్బా అల్లిబిల్లి బోల్తారే - పి.సుశీల, రచన: కొసరాజు
  3. ఆ ఊరు నీదిగాదు ఈ ఊరు నాదిగాదు ఏఊరు పోదామయ్యా - స్వర్ణలత, మాధవపెద్ది సత్యం , రచన: కొసరాజు
  4. ఓ ఓ ఓ వయ్యారమొలికే చిన్నది ఉడికించు చున్నది - ఘంటసాల, పి.సుశీల - రచన: డా॥ సి.నారాయణ రెడ్డి
  5. కనులీవేళ చిలిపిగ నవ్వెను మనసేవేవో వలపులు - ఘంటసాల, పి.సుశీల - రచన: డా॥ సి.నారాయణ రెడ్డి
  6. డీడిక్కు డీడిక్కు డీడిక్కుడిగ్గ హోయి చమ్మచక్క చమ్మచక్క - జిక్కి, ఎస్.జానకి బృందం , రచన: సి నారాయణ రెడ్డి
  7. నీరాజు పిలిచెను రేరాజు నిలిచెను ఈ రేయీ నీదేకదా - ఘంటసాల, పి.సుశీల - రచన: డా॥ సి.నారాయణ రెడ్డి
  8. రివ్వునసాగే రెపరెపలాడే యవ్వనమేమన్నది పదేపదే సవ్వడి - పి.సుశీల , రచన: సి నారాయణ రెడ్డి

మూలాలు

[మార్చు]
  1. నాటి 101 చిత్రాలు: ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.

బయటి లింకులు

[మార్చు]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.