మహ్మద్ హరీస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహ్మద్ హరీస్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (2001-03-30) 2001 మార్చి 30 (వయసు 23)
పెషావర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్
మారుపేరుమిస్టర్ గూగుల్[1]
ఎత్తు5 ft 4 in (163 cm)[2]
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ బౌలర్
పాత్రMiddle-order batter
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 234)2022 జూన్ 8 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే2023 మే 5 - న్యూజీలాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.29
తొలి T20I (క్యాప్ 99)2022 సెప్టెంబరు 30 - ఇంగ్లాండ్ తో
చివరి T20I2023 మార్చి 27 - Afghanistan తో
T20Iల్లో చొక్కా సంఖ్య.29
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2020–presentKhyber Pakhtunkhwa (స్క్వాడ్ నం. 100)
2021Karachi Kings
2022-presentPeshawar Zalmi (స్క్వాడ్ నం. 29)
2023–presentSylhet Strikers
మూలం: Cricinfo, 4 May 2023

మహ్మద్ హరీస్ (జననం 2001, మార్చి 30) పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు. 2022 జూన్ లో పాకిస్తాన్ జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.

తొలి జీవితం[మార్చు]

హారిస్ పెషావర్‌కు సమీపంలోని ముష్టర్జాయ్ అనే గ్రామంలో జన్మించాడు. పెషావర్‌లోని మజుల్లా ఖాన్ క్రికెట్ అకాడమీలో క్రికెట్ నేర్చుకున్నాడు. ఆ తరువాత అండర్-19 జట్టుకు, ఒక సంవత్సరం తర్వాత అండర్-19 జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.[3]

2019 డిసెంబరులో 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్ జట్టులో ఎంపికయ్యాడు.[4]

దేశీయ క్రికెట్[మార్చు]

2020 అక్టోబరులో 2020–21 జాతీయ టీ20 కప్‌లో ఖైబర్ పఖ్తుంఖ్వా తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[5]

2021 అక్టోబరులో శ్రీలంక పర్యటన కోసం పాకిస్తాన్ షాహీన్స్ జట్టులో ఎంపికయ్యాడు.[6] ఆ పర్యటనలో అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[7]

2021 జూన్ లో 2021 పిఎస్ఎల్ కోసం మినీ డ్రాఫ్ట్ తర్వాత కరాచీ కింగ్స్ స్క్వాడ్‌లో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు, కానీ ఏ మ్యాచ్‌ల్లోనూ ఆడలేదు.[8]

2021 డిసెంబరులో 2022 పిఎస్ఎల్ కోసం సప్లిమెంటరీ విభాగంలో ఆటగాళ్ల డ్రాఫ్ట్‌ను అనుసరించి పెషావర్ జల్మీ సంతకం చేశాడు.[9]

2020 ఫిబ్రవరిలో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో కరాచీ కింగ్స్‌తో తన పిఎస్ఎల్ అరంగేట్రం చేసాడు. 27 బంతుల్లో 49 పరుగులు చేసి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.[10]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

2021 సెప్టెంబరులో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే జట్టులో ఎంపికయ్యాడు.[11]

2022 ఫిబ్రవరిలో పిఎస్ఎల్ లో ఇతని ఆటతీరు కారణంగా ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ రిజర్వ్ జాబితాలో చేర్చబడ్డాడు.[12]

2022 మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వారి సిరీస్ కోసం పాకిస్తాన్ వన్డే, టీ20 స్క్వాడ్‌లలో ఎంపికయ్యాడు.[13]

2022 మేలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో పాకిస్థాన్ వన్డే జట్టులో అతను ఎంపికయ్యాడు.[14]

2022 జూన్ లో వెస్టిండీస్‌పై తన వన్డే అరంగేట్రం చేసాడు.[15]

2022 సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ కోసం పాకిస్థాన్‌ టీ20ఐ జట్టులో అతను ఎంపికయ్యాడు.[16] ఆ సిరీస్‌లో తన టీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[17]

మూలాలు[మార్చు]

  1. "Pakistan's 'Mr Google' searching for final answer". Cricket.com.au. 11 September 2022. Retrieved 2023-09-02.
  2. Husain, Amir (20 September 2019). "Talent Spotter : Mohammad Haris". PakPassion. Retrieved 2023-09-02.
  3. G, Sandip (9 November 2022). "Mohammad Haris: A fearless six-hitter, Mr Google, Mohammad Yusuf lookalike". The Indian Express.
  4. "Pakistan squad for ICC U19 Cricket World Cup 2020 named". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
  5. "23rd Match, Rawalpindi, Oct 13 2020, National T20 Cup". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
  6. "Pakistan Shaheens for Sri Lanka tour named". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
  7. "1st Unofficial Test, Pallekele, Oct 28 - 31 2021, Pakistan Shaheens tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
  8. "Multan Sultans sign Shimron Hetmyer in PSL mini replacement draft". Cricinfo. Retrieved 2023-09-02.
  9. "Franchises finalise squad for HBL PSL 2022". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
  10. "PZ vs KK (D/N), 19th match, PSL 2022". ESPNcricinfo. Retrieved 2023-09-02.
  11. "Pakistan name 20-player ODI squad for New Zealand series". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
  12. "Update on Pakistan Test squad". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
  13. "Mohammad Haris, Asif Afridi in Pakistan white-ball squads for Australia series". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
  14. "Fit-again Shadab back, Shafique and Zahid called up for Pakistan's ODIs against West Indies". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
  15. "1st ODI (D/N), Multan, June 08, 2022, West Indies tour of Pakistan". ESPN Cricinfo. Retrieved 2023-09-02.
  16. "Pakistan name squad for ICC Men's T20 World Cup 2022". Pakistan Cricket Board. Retrieved 2023-09-02.
  17. "6th T20I (N), Lahore, September 30, 2022, England tour of Pakistan". ESPN Cricinfo. Retrieved 2023-09-02.

బాహ్య లింకులు[మార్చు]