మిద్దే రామారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిద్దే రామారావు
జననం
మిద్దే రామారావు

(1945-07-15)1945 జూలై 15
వృత్తిసినీ నిర్మాత
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పదహారేళ్ల వయసు,
పండంటి జీవితం

మిద్దే రామారావు తెలుగు సినిమా నిర్మాతలలో ఒకడు. ఇతడు నిర్మించిన పదహారేళ్లవయసు, పండంటి జీవితం, రామరాజ్యంలో భీమరాజు, గూండా వంటి సినిమాలు విజయవంతంగా నడిచాయి. ఇతడు ఎన్.టి.రామారావు, చిరంజీవి, కృష్ణ, శ్రీదేవి, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, విజయశాంతి, చంద్రమోహన్, శోభన్ బాబు వంటి నటీనటులతో సినిమాలు నిర్మించాడు. ఇతని సినిమాలకు దర్శకత్వం వహించినవారిలో కె.రాఘవేంద్రరావు, ఎ.కోదండరామిరెడ్డి, రేలంగి నరసింహారావు తదితరులు ఉన్నారు.

ఇతడు నిర్మించిన పదహారేళ్ల వయసు సినిమా ద్వారా శ్రీదేవి, పండంటి జీవితం సినిమా ద్వారా విజయశాంతి ప్రఖ్యాతి గాంచి రెండేసి దశాబ్దాలకు పైగా తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలారు. [1][2]

జీవిత విశేషాలు[మార్చు]

ఇతడు తూర్పుగోదావరి జిల్లా, గోకవరంలో 1945, జూలై 15న జన్మించాడు.[3]

ఇతడికి చిన్న తనం నుండే సినిమాలపట్ల ఉన్న ఆసక్తితో తన చదువును మధ్యలో మానివేసి సినిమా ఎగ్జిబిటర్‌గా మారాడు. ఇతడు తన గ్రామంలో సుష్మ అనే టూరింగ్ టాకీసును నిర్మించాడు.[4]

ఒక దశాబ్దం సినిమా ప్రదర్శకుడిగా కొనసాగిన తరువాత సినిమా నిర్మాణ రంగంవైపు దృష్టిని సారించాడు. మొదట్లో తెలుగులో డబ్బింగ్ సినిమాలను నిర్మించడం ప్రారంభించాడు. వాటిలో జెమినీ గణేశన్ నటించిన కొండవీటి వీరుడు, జయశంకర్ నటించిన కక్ష శిక్ష అనే సినిమాలు తమిళం నుండి, రాజ్‌కుమార్ నటించిన ప్రచండ వీరుడు అనే సినిమా కన్నడం నుండి డబ్ చేసినవి ఉన్నాయి.

తరువాత చంద్రమోహన్ హీరోగా, శ్రీదేవి కథానాయికగా, కె.రాఘవేంద్రరావు దర్శకుడిగా ఇతడు నిర్మించిన పదహారేళ్ల వయసు సినిమా సూపర్ హిట్ కావడంతో ఇతడు సినిమా నిర్మాతగా నిలదొక్కుకున్నాడు. ఈ విజయం తర్వాత ఇతడు శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్స్ అనే బ్యానర్‌పై సినిమాలు నిర్మించడం మొదలుపెట్టాడు.

ఇతడు ఇతరభాషలలో విజయం సాధించిన సినిమాలను తెలుగులో పునర్నిర్మించాడు. అంతే కాకుండా తెలుగులో పాపులర్ అయిన నవలలను సినిమాలుగా తీశాడు.

పదహారేళ్ళ వయసు

ఫిల్మోగ్రఫీ[మార్చు]

ఇతడు నిర్మించిన తెలుగు సినిమాలు:

మూలాలు[మార్చు]

  1. http://www.vebtoday.com/movie_interview.php?id=82[permanent dead link]
  2. "Archived copy". Archived from the original on 2008-10-12. Retrieved 2018-02-27.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. వినాయకరావు (21 March 2012). "ఇప్పుడేం చేస్తున్నారు - మిద్దే రామారావు". నవ్య వీక్లీ: 62–64. Retrieved 27 February 2018.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-12-19. Retrieved 2018-02-27.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-30. Retrieved 2018-02-27.

బయటి లింకులు[మార్చు]