మోటార్ సైకిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
A Triumph T110 motorcycle
A Ural motorcycle with sidecar
హర్లే డేవిడ్సన్ మోడల్ మోటార్ సైకిల్

మోటార్ సైకిల్ అనగా రెండు లేదా మూడు చక్రాలు కలిగిన మోటారు వాహనం. దీనిని ఇంకా మోటార్ బైక్, బైక్, మోటో లేదా బండి అని కూడా అంటారు. ఆంగ్లంలో Motorcycle అంటారు. దూర ప్రయాణాలు చేయడానికి, రద్దీగా ఉండే పట్టణ ట్రాఫిక్‌లో నడిపించడానికి, ఉల్లాసంగా వేగంగా ప్రయాణించడానికి, క్రీడ, రేసింగ్‌లకు, లేదా రోడ్డు బయట పరిస్థితులు వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని మోటార్ సైకిళ్ళు రూపొందించబడతాయి, అయితే వీటి రూపకల్పన గణనీయమైన స్థాయిలో మార్పు చెందుతూ ఉంటాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో మోటారు రవాణా వ్యవస్థలో మోటార్ సైకిళ్ళు అత్యంత సరసమైన రకాలు, ప్రపంచ జనాభాలో ఎక్కువగా అత్యంత సాధారణ రకపు మోటారు వాహనాలను వీరు కలిగి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 మిలియన్ మోటార్ సైకిళ్ళు (మోపెడ్స్, మోటార్ స్కూటర్లు, మోటారు సైకిళ్ళు, ఇతర శక్తితో నడిచే రెండు, మూడు చక్రముల వాహనములతో సహా) ఉపయోగిస్తున్నారు, లేదా ప్రతి 1000 మంది సుమారు 33 మోటార్ సైకిళ్ళు కలిగి ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 590 మిలియన్ కార్లతో పోలిస్తే ప్రతి 1000 మందికి సుమారు 91 కార్లు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాలలో జపాన్ మినహా, దక్షిణ, తూర్పు ఆసియా, ఆసియా పసిఫిక్ దేశాలు అత్యధికంగా 58% మోటారు సైకిళ్ళు కలిగి ఉన్నాయి. అయితే కార్ల యొక్క 33% (195 మిలియన్లు) యునైటెడ్ స్టేట్స్, జపాన్ లో కేంద్రీకృతమై ఉన్నాయి. 2006లో చైనా 54 మిలియన్ మోటార్ సైకిళ్ళు కలిగి ఉపయోగిస్తున్నది, ఒక వార్షిక ఉత్పత్తి 22 మిలియన్ యూనిట్లు. 2002 నాటికి భారతదేశం సుమారు 37 మిలియన్ మోటార్ సైకిళ్ళు/మోపెడ్స్ తో ప్రపంచంలో మోటరైజ్డ్ రెండు టూవీలర్ల యొక్క అతిపెద్ద నివాసంగా ఉంది. చైనా 34 మిలియన్ల మోటార్ సైకిళ్ళు/మోపెడ్స్‌తో దగ్గరగా రెండవ స్థానం పొందింది.

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]