యామిజాల సుశర్మ
బిరుదు " సాహితీ సేవా దురంధర" యామిజాల సుబ్రహ్మణ్య శర్మ (సుశర్మ పేరుతో సుప్రసిద్ధులు) | |
---|---|
జననం | యామిజాల సుబ్రహ్మణ్య శర్మ 1947 జూలై 3 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | తెలుగు పండితులు |
జీవిత భాగస్వామి | శ్రీమతి రాధామణి |
పిల్లలు | రామకృష్ణప్రసాద్ , దుర్గామారుతీ మోహన్ |
తల్లిదండ్రులు | తండ్రి :యామిజాల రామలింగం తల్లి :శ్రీమతి కనకదుర్గాంబ |
యామిజాల సుశర్మ, యామిజాల వంశం సంస్కృతి సాహిత్య రంగాలలో పేరుగాంచింది. ఆ వంశములో సుబ్రహ్మణ్య శర్మగా నామకరణం పొందిన వీరు 'సుశర్మ'గా కవిగా కలం పేరుతో సార్థక నామధేయులయ్యారు. వీరికి "సాహితీ సేవాదురంధర"అనే బిరుదము కలదు. వీరి తాత గారు సుబ్రహ్మణ్యం గారు ఉపాధ్యాయులుగా పేరు గాంచినారు. ఆ కుటుంబంలో కనకదుర్గాంబ, రామలింగం గార్లకు జ్యేష్ట కుమారునిగా పొలమూరు గ్రామంలో 03-07-1947లో జన్మించారు. ప్రాధమిక, మాధ్యమిక విద్యలు పొలమూరులోనూ, కళాశాల విద్యాభ్యాసం భీమవరంలో చేసిన పిదప M.A. (తెలుగు) ఆంధ్రా యూనివర్సిటీ. M.A. (ఇంగ్లీషు) ఆంధ్రా యూనివర్సిటీ.B.Ed. ఆంధ్రా యూనివర్సిటే. తదుపరి ఉపాధ్యాయ శిక్షణ పొంది తణుకులో ఉపాధ్యాయులుగా చేరారు.
వివాహx, కుటుంబx
[మార్చు]తణుకు ఆంధ్రా సుగర్స్ లో క్యాషియర్ గా పనిచేసిన వి.యన్.మూర్తి, సుబ్బలక్ష్మి గార్ల కుమార్తె రాధామణి ని 1972లో వివాహం చేసుకున్నారు. శ్రీమతి రాధామణి జిల్లపరిషత్ ఉన్నత పాఠశాల,ఇలపకుర్రులో తెలుగు పందడితులుగా పనిచేస్తున్నారు.వీరికి ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు వై.రామకృష్ణ ప్రసాద్, MCA, చదివి హైదరాబాద్ లో కంప్యూటరు ఫ్రోగ్రామర్ గా పనిచేస్తున్నాడు. రెండవ కుమారుడు వై.దుర్గా మారుతీ మోహన్ MBA పూర్తి చేశారు.
పొందిన అవార్డులు
[మార్చు]1972 నుండి తణుకులో వివిధ పాఠశాలల్లో పని చేస్తూ ఉపాధ్యాయునిగా మంచి పేరు సంపాదించారు. వీరి కృషిని అధికారులు, అనధికారులు, తల్లిదండ్రులు, బాలబాలికలు ప్రశంసించారు. ఆవిధంగా వారి కృషికి నిదర్శంగా 1995 లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, 1996లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు,ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుగారి చేతులమీదుగా పొందారు.తదుపరి 2000లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చాయి. తణుకులో గల ప్రసిద్ధమైన సాహితీ సంస్థశ్రీ నన్నయ భట్టారక పీఠంలో చాలా కాలం నుండి సాహితీ సేవ చేస్తున్నారు. తణుకు పట్టణంలో జరిగే అనేక కార్యక్రమములకు ప్రయోక్తగా వీరు పేరు గాంచారు. దేశసమైఖ్యత, మతసామరస్యము, అక్షరయజ్ఞము మొదలగు విషయములను దృష్టిలో ఉంచుకుని వ్రాసిన కవితలు రసజ్ఞుల మన్ననలు పొందాయి. ఆ కవితా ఖండికల స్వరూపమే 'కవితా కేతనం'. 1990, 1996 సంవత్సరములో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలలో కవిగా పాల్గొన్నారు.జాతీయ సమైఖ్యత, మతసామరస్యము, కుటుంబనియంత్రణ, అక్షరదీక్ష, జన్మభూమి వంటి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై కవితాఖండికలు రచించారు. అనేక సాహితీ రూపకాలలో వివిధ పాత్రలు నిర్వహించారు. బాలబాలికలకు ఉపయోగించు "గాంధీ సూక్తి కధావళి" అనే పుస్తకాన్ని వ్రాశారు. తణుకులో గోస్తనీ నది తీరంపై నన్నయ విగ్రహం ఏర్పాటుకు కృషి చేసి సఫలీకృతులయ్యారు.
వృత్తి,ప్రవృత్తి
[మార్చు]1965 వ సంవత్సరం నుండి తణుకులో ఉపాధ్యాయుడిగా పనిచేశారు.ప్రవృత్తి సాహితీ సేవలో తణుకులోని ప్రముఖ సాహితీ పీఠం శ్రీ నన్నయ భట్టారక పీఠంలో ప్రధానకార్యదర్శిగా సాహితీ సేవ చేస్తున్నారు. ఈ సాహితీ సంస్థ ద్వారా వెలువడే "సాహితీ విపంచి"సంపాదకులుగా ఉన్నారు.
వ్యాసంగం
[మార్చు]వ్యాసంగం : పద్యరచన దేశసమైక్యత, మతసామరస్యము, అక్షరయజ్ఞం, మొదలగు విషయములపై వ్రాసిన కవితలు సమ్మేళనమే: కవితాకేతనము బాలబాలికలకు ఉపయోగించు పుస్తకం "గాంధీ సూక్తి కథావళి"అలాగే ప్రతీ సంవత్సరం జరిగే "ఉగాది కవిసమ్మేళనంలో ఉగాది కవితలు వ్రాయడం. తెలుగు సాహిత్య వ్యాసాలు వ్యాసగోస్తని
ప్రవచనాలు
[మార్చు]తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా సార్లు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు . అష్టావధానాలలో, శతావధానాలలో, సహస్రావధానాలలో, పాల్గొనేవారు. "శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం । నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం॥ తణుకు లోని ప్రముఖ సంస్థ శ్రీ రామకృష్ణ సేవాసమితిలో ఆగస్టు 3 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు జరిగిన జగద్గురు ఆది శంకరాచార్య స్తోత్ర వైభవం పై ప్రముఖ కవి, స్థానిక సాహితీ పీఠం శ్రీ నన్నయ భట్టారక పీఠం ప్రధాన కార్యదర్శి శ్రీ సుశర్మ గారి ప్రవచనాలు చాలా అద్భుతంగా జరిగాయి.ఆరు రోజులపాటు ప్రతీ రోజూ సాయంత్రం 6.30 గంటలనుండి 8 గంటల వరకూ జరిగాయి.అందులోని ముఖ్య విషయం గురు పరంపరలోని గురువు లందరినీ స్మరించుకుని ధన్యులయిన పుణ్య దినం.ప్రస్తుతమ్ మన దేశంలో భక్తి, జ్ఞాన రంగాలలో గురువులు ఎవరు ఎటువంటి విధానాలను ప్రబోధించినా దానికి ప్రేరణ, ఆత్మ సంకల్పం సాక్షాత్తూ శ్రీ వేద వ్యాసులే "వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం"భగవద్గీతను సమస్త లోకానికీ బోధించిన శ్రీ కృష్ణుడు జగద్గురువు "కృష్ణం వందే జగద్గురుం "అంటారు అందుకే.అలాంటి భగవద్గీతను గ్రంథస్తం చేసి భారతీయులకు అందించిన వేదవ్యాస మహర్షి ఇంకొక జగద్గురువు "వ్యాసం వందే జగద్గురుం "ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాసి మనకు అందించిన శ్రీ ఆది శంకర భగవత్పాదులు ఇంకో జగద్గురువు!ఈ సృష్టి ఉన్నంతవరకూ భారత దేశమంతటా భక్తజన బృందాలూ, దేవాలయాల్లోనూ పఠించి తరించే స్తోత్ర శ్లోకాలలో 80 శాతం శ్రీ శంకరాచార్య కృతమే .వేలాది సంవత్సరాలుగా గురుశిష్య పరంపరగా మనవరకూ అందించిన మహానుభావులూ పరమగురువులూ వేల మంది ఉన్నారు.ఐతే భారతీయ విద్యలన్నింటి లోకీ ఆధ్యాత్మిక విద్య ఉత్తమోత్తమంగా భావిస్తాము సదాశివ సమారంభాం శంకరాచార్య మాధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం "నారాయణం పద్మభువం వసిష్టం శక్తిం చ తత్పుత్రం పరాశారంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్రం తదస్య శిష్యం శ్రీ శంకరాచార్య ఆధాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తమ్ తోటకం వార్తికాకార మన్యాన్ అస్మద్ గురూన్ సంతతమాన తోస్మి .ఆదిలో ఈ జ్ఞానాన్ని నిర్గుణ పరతత్వమైన ఈశ్వరుడి నుండి గ్రహించిన నారాయణుడితో గురు పరంపర ఆరంభమై నారాయణుడి నుండి బ్రహ్మకు, బ్రహ్మ నుండి వసిష్టుడికి, వశిష్టుడి నుండి శక్తికి, శక్తి నుండి పరాశరునుకి, పరాశరుని నుండి శుకుడికి, శుకుడి ద్వారా గౌడ పాదునికి, గౌడపాదుని నుండి గోవింద భగవత్పాదులకు వారి నుంచి శ్రీ శంకరాచార్యులకు వారి ద్వారా పద్మపాదుడు, హస్తామలకుడు, సురేశ్వరుడు, తోటకాచార్యులకు లభించింది.ఇలా పరంపరా గతమై తమ గురువు వరకు సంక్రమించిన ఈ అవిచ్ఛిన్న పరంపరను స్మరించుకుని తరిద్దాము.ఇలా మొదటి రోజునుండి చివరి రోజువరకూ ఎంతో ఆసక్తి కరంగా వారి స్తోత్రాలలోని వైభవాన్ని హృద్యంగా వర్ణించి చెప్పారు.
ప్రముఖుల అభినందనలు
[మార్చు]జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడైన సదర్భంగా ప్రముఖుల అభినందనలు వారిలోశ్రీ డా.సి.నారాయణ రెడ్డిగారు, శ్రీముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్-చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్, తణుకు, శ్రీ చిట్టూరి సుబ్బారావు చౌదరి-మాజీ పార్లమెంట్ సభ్యులు, బి.బి.రామయ్య -మెంబర్ అఫ్ పార్లమెంట్, వై.టి.రాజా - తణుకు శాసనసభ సభ్యులు, ముళ్ళపూడి రేణుక, తణుకు మునిసిపల్ చైర్పర్సన్, ముళ్ళపూడి వేంకట కృష్ణారావు, మాజీ శాసనసభ సభ్యులు, చిట్టూరి వెంకటేశ్వరరావు, మాజీ శాసనసభ సభ్యులు, ఆరిమిల్లి వేంకటరత్నం గారు, శ్రీ మల్లిన రామచంద్ర రావు గారు, MD.గౌతమి సాల్వెంట్ ఆయిల్స్ లిమిటెడ్, CH.కాశీ విశ్వేశ్వరరావు, MD -కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్, టి.రామబ్రహ్మము, కార్యదర్శి రామకృష్ణ సేవా సమితి, ముళ్ళపూడి హరిబాబు MD. వెంకటరాయ గ్రూప్ అఫ్ కంపెనీస్.వీరందరి అభినందనలను అందుకున్నారు.
సాహిత్య కార్యక్రమాలు
[మార్చు]తణుకులో స్థాపించిన సాహితీ సంస్థ శ్రీ నన్నయ భట్టారకపీఠంలో ప్రతీ ఉగాది ఉత్సవాలలో తెలుగు కవులలో కవితా శక్తిని పెంపొందించాలని పద్యకవితా పోటీలను నిర్వహించి ఉత్తమ పద్యాలు వ్రాసిన కవులలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, పారితోషికాలను, ప్రశంశాపత్రాలను అందజేస్తున్నారు.అలాగే విద్యార్థినీ, విద్యార్థులలో పద్యపఠనా శక్తిని పెంపొందించాలని ఎల్.కే.జి.నుండి కళాశాల స్ఠాయి వరకు పద్యపఠన పోటీలను నిర్వహించి పద్యాలను పిల్లలను కంఠస్థం చేయించి పద్యాలు చూడకుండా చదివేలా చేస్తూ వారికి కూడా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేస్తున్నారు. (ఉదాహరణకు గత ఉగాదికి "ఆశాజ్యోతి అమరావతి" అనే అంశం పై పద్యకవితా పోటీలు నిర్వహించడం జరిగింది) ఈ సంవత్సరం హేమలంబి ఉగాదికి "ప్రగతి పథంలో విజ్ఞానాంధ్ర " అనే అంశం పై పద్యకవితల పోటీలను ఆహ్వానించారు.
మూలాలు, బయటి లింకులు
[మార్చు][1] Archived 2016-03-06 at the Wayback Machine మార్చి 27 2015 ఈనాడు పశ్చిమ గోదావరి జిల్లా ఎడిషన్ లో https://web.archive.org/web/20160306234702/http://andhraamrutham.blogspot.in/2014/11/blog-post_28.html#.Vc3E-7Kqqko http://www.prajasakti.in/index.php?srv=10301&id=1316730[permanent dead link]