రఘునాథ్ మహాపాత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రఘునాథ్ మహాపాత్ర
పార్లమెంటు సభ్యుడు
రాజ్యసభ
In office
2018 జూలై 14 – 2021 మే 9
అంతకు ముందు వారుఅను ఆగా
నియోజకవర్గంనామినేటెడ్ (కళలు)
వ్యక్తిగత వివరాలు
జననం(1943-03-24)1943 మార్చి 24
, పూరి, ఒడిశా భారతదేశం
మరణం2021 మే 9(2021-05-09) (వయసు 78)[1]
భువనేశ్వర్ , ఒడిశా, భారతదేశం
జీవిత భాగస్వామి
రజనీ మహా పాత్ర
(m. 1966)
సంతానం5
వృత్తివాస్తు శిల్పి
పురస్కారాలురాజ్యసభ సభ్యుడు, 2018 పద్మ విభూషణ్, 2013
పద్మభూషణ్, 2001
పద్మశ్రీ, 1976

రఘునాథ్ మహాపాత్ర (24 మార్చి 1943 - 9 మే 2021) [2] ఒక భారతీయ వాస్తుశిల్పి, శిల్పి రాజ్యసభ నామినేటెడ్ సభ్యుడు. రఘునాథ్ మహాపాత్ర 1975లో పద్మశ్రీ 2001లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నాడు [3] భారత 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2013లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించింది. [4]

జీవిత విశేషాలు[మార్చు]

ఒడిశా రాష్ట్రంలోని పూరిలో జన్మించారు, [5] రఘునాథ్ మహాపాత్ర 1976లో అప్పటి భారత రాష్ట్రపతి ఫకీరుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. 2001లో పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్నారు.

2000లో భారత ప్రభుత్వం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో భాగమైన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్)లో రఘునాథ్ మహా పాత్రకు సభ్యుడిగా అవకాశం కల్పించింది.

రఘునాథ్ మహాపాత్ర 1963 నుండి , భువనేశ్వర్, లో హస్తకళల శిక్షణ & డిజైనింగ్ సెంటర్‌లో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్ సూపరింటెండెంట్‌గా పనిచేశాడు [6]

రఘునాథ్ మహాపాత్ర శిల్పకళ ప్రపంచంలో అగ్రగామి వ్యక్తిగా నిలిచారు. రఘునాథ్ మహా పాత్ర భారతదేశ రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. - రఘునాథ్ మహాపాత్ర పూరీలోని పతురియా సాహిలో బిశ్వకర్మ కుటుంబంలో జన్మించారు. రఘునాథ్ మహాపాత్ర చిన్నతనంలో పాఠశాలకు వెళ్లడానికి భయపడేవాడు, కానీ తల్లితండ్రుల సూచనల మేరకు పాఠశాలకు వెళ్లేవాడు. హఠాత్తుగా రఘునాథ్ మహా పాత్ర తండ్రి మరణించడంతో ఆయన మూడవ తరగతిలోనే చదువు ఆపేశాడు. శిల్పకళలో రఘునాథ్ మహాపాత్రకు చిన్నప్పటి నుంచే ప్రావీణ్యం ఉండేది. రఘునాథ్ మహాపాత్ర తాత కూడా శిల్పి కావడంతో శిల్పకళల మీద ఆసక్తి మరింత పెరిగింది.

రఘునాథ్ మహాపాత్ర శిల్ప కళల్లో ఎటువంటి శిక్షణ తీసుకోలేదు. శిల్పకళల మీద రఘునాథ్ మహా పాత్ర మరణించేంతవరకు మక్కువ ఉండేది. రఘునాథ్ మహా పాత్ర రాళ్ళ మీద శిల్పాలని చెక్కేటప్పుడు ఎటువంటి యంత్రాల సహాయం తీసుకునేవాడుకాదు. సుత్తితోనే రాతి మీద బొమ్మలు చెక్కేవాడు.

1960లలో తన 20వ ఏట, రఘునాథ్ మహాపాత్ర దేవతలు దేవుళ్ళ బొమ్మలను రాళ్ల మీద చెక్కి ఊళ్లో ఆ శిల్పాలని అమ్మేవాడు. రఘునాథ్ మహాపాత్ర శిల్పకళల గురించి భువనేశ్వర్‌లోని శిల్పకళ శిక్షణ డిజైనింగ్ సెంటర్ అధికారుల దృష్టికి వచ్చింది. వారు రఘునాథ్ మహాపాత్రకు ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షకుడిగా ఉద్యోగాన్ని అందించారు. తరువాత రఘునాథ్ తను పనిచేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లో సూపరింటెండెంట్‌గా మారాడు.

1974లో రఘునాథ్ మహాపాత్ర పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్రదర్శించబడిన సూర్య భగవానుడి ఆరు అడుగుల ఎత్తైన రాతి విగ్రహాన్ని రూపొందించినందుకు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. 2001లో, రఘునాథ్ మహా పాత్రను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. 2013లో, రాతి శిల్పకళా రంగానికి ఆయన చేసిన కృషికి పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. రఘునాథ్ మహా పాత్ర 2021 మే 9న కరోనా తో బాధపడుతూ ఒడిశాలోని భువనేశ్వర్ లో మరణించారు.

అవార్డులు[మార్చు]

ఏప్రిల్ 05, 2013న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ శ్రీ రఘునాథ్ మహాపాత్రకు పద్మవిభూషణ్ అవార్డును అందజేస్తున్నారు.

మూలాలు[మార్చు]

  1. "Rajya Sabha MP Padma Vibhushan Raghunath Mohapatra dies of Covid-19 | Sambad English". Sambad English (in English). Bhubaneswar: sambadenglish.com. 9 May 2021. Archived from the original on 9 May 2021. Retrieved 9 May 2021.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. Ambaly, Anwesha (20 October 2016). "Salute to doyen". The Telegraph. Archived from the original on 1 August 2017. Retrieved 27 July 2017.
  3. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 21 July 2015.
  4. "Padma Awards". pib. 29 January 2013. Retrieved 29 January 2013.
  5. "Sculptor Raghunath Mohapatra to get Padma Vibhushan". odishanow.in. Archived from the original on 18 April 2017. Retrieved 26 January 2013. Born in Puri, Mohapatra
  6. "Profiles: Padma Vibhushans of 2013 – DNA". dnaindia.com. 2013. Retrieved 5 February 2013. Raghunath served as a senior instructor and superintendent
  7. "Press Information Bureau English Releases". pib.nic.in. 2013. Retrieved 5 February 2013. Shri Raghunath Mohapatra
  8. "The Hindu : News / National : Padma Vibhushan for Yash Pal, Roddam, S.H. Raza, Mohapatra". thehindu.com. 2013. Retrieved 26 January 2013. Renowned sculptor Raghunath Mohapatra and painter S. Haider Raza were chosen for Padma Vibhushan
  9. "Padma Awards Directory (1954–2013)" (PDF). Ministry of Home Affairs. Retrieved 23 April 2014.
  10. Barik, Satyasundar (27 January 2013). "An award for my devotion to sculpture: Mohapatra". The Hindu. Retrieved 7 January 2017.