రాం చరణ్ తేజ

వికీపీడియా నుండి
కొణిదెల రామ్ చరణ్ తేజ
Ramcharan Teja.jpg
జన్మ నామం కొణిదెల రామ్ చరణ్ తేజ
జననం మార్చి 27 1985 (1985-03-27) (వయసు 28)
Flag of భారత దేశం హైదరాబాదు
ఇతర పేరు(లు) చెర్రీ
వెబ్‌సైటు http://www.cherryfans.com/
ప్రముఖ పాత్రలు చరణ్ (చిరుత)
కాళభైరవ (మగధీర)

రామ్ చరణ్ తేజ ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను తెలుగు సినిమా నటుడుగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనరు మరియూ మా టీ.వీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఒకడిగా ప్రసిద్ధి చెందినవాడు.

విషయ సూచిక

వ్యక్తిగత జీవితం [మార్చు]

రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985 న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు. ఇతనికి ఇద్దరు సొదరీమణులు శ్రీజ మరియూ సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని పరిణయమాడాడు.[1]

సినీ జీవితం [మార్చు]

చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిరుత చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయవంతం అవ్వడంతో పాటు తనకు ఆ సంవత్సరానికి ఉత్తమ నూతన నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి గారు దర్శకత్వం వహించిన మగధీర చిత్రం సంచలన విజయం సాధించడం తో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.

ఆపై 2010లో "బొమ్మరిల్లు" భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ తన పూర్వ చిత్రాల్లాగే ఈ చిత్రంలో కూడ చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఒక సంవత్సరం తర్వాత 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ చిత్రంలో నటించాడు. భారీ ఓపెనింగ్లను సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది. 2013లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించింది. ప్రస్తుతం చరణ్ పైడిపల్లి వంశీ దర్శకత్వంలో ఎవడు చిత్రంలో మరియూ అపూర్వ లాఖియా దర్శకత్వంలో తుఫాన్ చిత్రాల్లో నటిస్తున్నాడు

నటించిన చిత్రాలు [మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర కథానాయిక ఇతర విశేషాలు
2007 చిరుత చరణ్ నేహా శర్మ విజేత, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నూతన నటుడు
విజేత, నందీ స్పెషల్ జ్యూరీ అవార్డు
2009 మగధీర హర్ష
కాళభైరవ
కాజల్ అగర్వాల్ విజేత, ఫిలింఫేర్ అవార్డ్ సౌత్ - ఉత్తమ నూతన నటుడు
విజేత, నందీ స్పెషల్ జ్యూరీ అవార్డు
2010 ఆరెంజ్ రాం జెనీలియా
2011 రచ్చ "బెట్టింగ్" రాజ్ తమన్నా
2013 నాయక్ చరణ్
సిద్దార్థ్ నాయక్
కాజల్ అగర్వాల్
అమలా పాల్
2010 ఎవడు శృతి హాసన్
2011 తుఫాన్ విజయ్ ప్రియాంక చోప్రా

వనరులు [మార్చు]

  1. "Ram Charan marries Upasana Kamineni". The Times of India.