రాజుకాలవ
Jump to navigation
Jump to search
రాజుకాల్వ | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°51′05″N 80°52′17″E / 15.851417°N 80.871356°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | రేపల్లె |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,200 |
పిన్ కోడ్ | 522264 |
ఎస్.టి.డి కోడ్ |
రాజుకాల్వ, బాపట్ల జిల్లా, రేపల్లె మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఇది రేపల్లె పట్టణానికి 23కి.మీ. దూరంలో ఉంది.ఈ గ్రామం ఒక పంచాయితీ కేంద్రం.ఇందు మూడు గ్రామాలు ఉన్నాయి. అవి శాంతినగర్, రాజులచెరువు, లక్ష్మిపురం. ఈ గ్రామంలో 400 కుటుంబాలు వరకు ఉండునని అంచనా. ఇది కృష్ణా నది వెంబడి ఆనుకొని వుంటుంది.
ప్రదానంగా ఇక్కడ పండించు పంట వరి. ఇదే ఇక్కడి జీవనాదారం. ఇక్కడి నుండి ఎదురుమొండి అనే గ్రామం, కృష్ణా జిల్లాకి సంబంధించినడి. ఇక్కడికి లాకుల ద్వారా నదిలో నుండి నీరు సరఫరా జరుగుతుంది. ఈ నీటిని వారు త్రాగు, వ్యవసాయానికి వాడుకొంటారు. ఈ గ్రామానికి 10కిలోమీటర్ల సమీపంలో పోలీస్ స్టేషను ఉంది. ఇక్కడి నుండి రేపల్లెకు బస్సు సౌకర్యం ఉంది.