రాయంకుల శేషతల్పశాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయంకుల శేషతతల్పశాయి
రాయంకుల శేషతల్పశాయి,పొనుగుపాడు
RST Sai
జననంరాయంకుల శేషతతల్పశాయి
1956 అక్టోబరు,10
గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం,పొనుగుపాడు గ్రామం
నివాస ప్రాంతంగుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలం,పొనుగుపాడు
ప్రసిద్ధిచివరగా “తెహ్రీ” హైడ్రోడెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ మాజీ చైర్మెన్, మేనేజింగు డైరెక్టరు (రుషికేష్)
పదవీ కాలంచైర్మెన్, మేనేజింగు డైరెక్టరుగా 2007 మార్చి,8 నుండి 2016 నవంబరు,30 వరకు
పిల్లలుఆదిత్య,అవనిస్
తండ్రితాతయ్య
తల్లిలీలావతి

శేషతల్పశాయి పొనుగుపాడు గ్రామంలో ది.10.11.1956 న రాయంకుల తాతయ్య, లీలావతి దంపతులకు జన్మించాడు.

ప్రాథమిక విద్యాభ్యాసం స్వగ్రామం పొనుగుపాడులో ఇతని ముత్తాత రాయంకుల తాతయ్య స్థాపించిన వీధి బడిలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన ఇతని తండ్రి రాయంకుల తాతయ్య వద్ద జరిగింది. ఉన్నత పాఠశాల విద్య తొమ్మిదవ తరగతి వరకు పొనుగుపాడులోనూ, పదవ తరగతి ఇతని మేనమామ వంకాయలపాటి సాంబశివరావు ప్రధానోపాధ్యాయుడుగా పనిచేసిన ప్రకాశం జిల్లా, దూపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాడు.ఇంటర్మీడియట్ విద్యను నరసరావుపేట యస్.యస్.యన్. కళాశాలలో చదివాడు.ఆ తరువాత వరంగల్ రీజనల్ ఇంజనీరింగు కాలేజిలో బి.టెక్. (ఎలెక్ట్రికల్ ఇంజనీరింగు) పూర్తిచేసి (1973-1977)లో గ్రాడ్యేయేట్ పట్టా పొందాడు.

వివాహం,సంతానం.

[మార్చు]

ప్రకాశం జిల్లా, ఒంగోలు మండలం, త్రోవగుంట గ్రామానికి చెందిన మండువ పిచ్చయ్య, చింపిరమ్మ దంపతుల రెండవ కుమార్తె పద్మావతిని వివాహమాడాడు. ఈ దంపతుల సంతానం ఇద్దరు కుమారులు. ఆదిత్య, అవనిష్. వీరిద్దరూ అమెరికాలో సాప్టువేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు.

ఉద్యోగ ప్రస్థానం.

[మార్చు]

తొలుత స్టేటుబ్యాంకు ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆపీసరుగా కొంత కాలం పనిచేసాడు. ఉద్యోగం విరమించుకొని బెంగుళూరు, ఐ.ఐ.యమ్. యూనివర్శిటీలో పి.జి.డి.యమ్.కోర్సు పూర్తి చేసాడు. (1980 -1982).డిల్లీ యూనివర్శిటీలో యల్.యల్.బి. పూర్తి చేసి ‘లా’ పట్టా పొందాడు.

ఉన్నత,కీలక పదవులు.

[మార్చు]

యన్.టి.పి.సి, పవర్ గ్రిడ్, ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు మొదలైన సంస్థలలో వివిధ కీలక, ఉన్నత పదవులలో ఇరువది ఆరు సంవత్సరాలు (2005 వరకు) పనిచేసాడు. తరువాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ నందుగల “తెహ్రీ” హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ లో ఫైనాన్స్ డైరెక్టరుగా చేరి ది.05.05.2005 నుండి ది.07.03.2007 వరకు పనిచేసాడు.అదే “తెహ్రీ” హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ చైర్మెన్, మేనేజింగు డైరెక్టరుగా ది.08.03.2007న బాధ్యతలు స్వీకరించాడు.[1]. ఆ పదవిలో ఇతను 2016 నవంబరు 30 వరకు పనిచేసి పదవీ విరమణ పొందాడు.

అదనపు భాధ్యతలు

[మార్చు]

“తెహ్రీ” హైడ్రోడెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ చైర్మెన్, మేనేజింగు డైరెక్టరుగా పనిచేస్తూనే, జాతీయ జల విద్యుత్ సంస్థ (యన్.యచ్.పి.సి) చైర్మెన్, మేనేజింగు డైరెక్టరుగా కొంత కాలం అదనపు బాధ్యతలు నిర్వర్తించాడు.[2]

పురష్కారాలు,విశేషాలు

[మార్చు]
  • తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటడ్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టరుగా పనిచేసిన కాలంలో 2008-09, 2009-10, 2011-12, సంవత్సరాలకు “ఇందిరా గాంధీ రాజభాష” ప్రథమశ్రేణి అవార్డులను, 2010-11. 2012-13 సంవత్సరాలకు ద్వితీయ శ్రేణి అవార్డులను అప్పటి రాష్ట్రపతులు ప్రతిభాపాటిల్, ప్రణబ్ ముఖర్జీల నుండి అందుకున్నాడు.
  • 2004లో “స్కోప్ మెరిటోరియస్ అవార్డ్ ఫర్ బెష్ట్ ప్రాక్టీషు ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజిమెంట్” అవార్డును అప్పటి భారీ పరిశ్రమల శాఖా మంత్రి అనంత గీతే నుండి, తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటడ్ ను పరిధికి మించి ప్రగతి సాధించినందుకు “స్కోప్ మెరిటోరియస్ అవార్డ్ ఫర్ సి.యస్.ఆర్. అండ్ రెష్పాన్సివ్నెస్” అవార్డును 2012లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ నుండి అందుకున్నాడు.
  • ఇందిరా గాందీ రాజభాష పురస్కారం అవార్డును 2014-15 సంవత్సరానికి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి అందుకున్నాడు.[3]
  • 2013-14 సంవత్సరానికి ప్రభుత్వరంగ (టి.యచ్.డి.సి.ఐ.యల్) నిర్వహణలో విశిష్ట సహకారాన్ని అందించినందుకు ప్రతిష్ఠాత్మక అవార్డును (“SCOPE Award for Excellence”) అప్పటి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుండి 11.04.2016న అందుకున్నాడు.[4] ఇతని ఉత్తమ పనితీరుకుగాను పలు అత్యత్తమ అవార్డులు లెక్కకుమించి పొందాడు.

న్యూస్ చానల్స్ ఇంటర్వూలు.

[మార్చు]

యన్.యచ్.పి.సి. చైర్మెన్, మేనేజింగు డైరెక్టరు హోదాలో ఇతనిని ది.09.11.2014న టాక్ టైమ్ న్యూస్ లైన్ వారు పలు ఆసక్తికర విషయాలపై ఇంటర్యూ చేసారు.[5]

పదవీ విరమణ తదుపరి శేష జీవితం.

[మార్చు]

“తెహ్రీ” హైడ్రో డెవలప్మెంట్ కార్పోరేషన్ ఇండియా లిమిటెడ్ చైర్మెన్, మేనేజింగు డైరెక్టరుగా 2016 నవంబరు 30న పదవీ విరమణ తరువాత ప్రస్తుతం సొంత గ్రామం పొనుగుపాడులో ఉంటున్నాడు. న్యాయవాదిగా ఇతని సేవలు ప్రజలకు అందించాలని, గ్రామాభివృద్ఝికి పాటుపడాలనే ఆశయంతో ఉన్నాడు.

మూలాలు.

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-11-13. Retrieved 2017-09-21.
  2. http://www.business-standard.com/article/pti-stories/thdc-chief-r-s-t-sai-gets-additional-charge-of-nhpc-114060900752_1.html
  3. http://www.dailyexcelsior.com/nhpc-conferred-with-rajbhasha-kirti-puraskar/
  4. http://www.tribuneindia.com/news/uttarakhand/community/thdc-gets-scope-award-for-excellence/220990.html[permanent dead link]
  5. https://www.youtube.com/watch?v=Nn0Age7he54

వెలుపలి లింకులు.

[మార్చు]