లక్కీఛాన్స్

వికీపీడియా నుండి
(లక్కీచాన్స్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లక్కీఛాన్స్
(తెలుగు సినిమా)
దర్శకత్వం శివనాగేశ్వరరావు
నిర్మాణం సి. శరత్ బాబు
కథ మల్లాది వెంకట కృష్ణమూర్తి
చిత్రానువాదం శివనాగేశ్వరరావు
తారాగణం రాజేంద్రప్రసాద్, కంచన్ బ్రహ్మానందం
సంగీతం శ్రీ
సంభాషణలు తనికెళ్ళ భరణి
ఛాయాగ్రహణం బి.ఎన్.రావు
కూర్పు కె. రమేష్
నిర్మాణ సంస్థ శ్రీ మాధవ్ ఆర్ట్స్
నిడివి 114 ని.
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

లక్కీ ఛాన్స్ 1994 తెలుగు కామెడీ చిత్రం, శ్రీ మాధవ్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ క్రింద సి. శరత్ బాబు నిర్మించగా, శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహించాడు. ఇందులో రాజేంద్ర ప్రసాద్, కాంచన్ ప్రధాన పాత్రలలో నటించారు. శ్రీ సంగీతం సమకూర్చాడు.[1] ఈ చిత్రం 1954 క్లాసిక్ చిత్రం చక్రపాణి నుండి ప్రేరణ పొందింది, ఇది మల్లాది వెంకట కృష్ణ మూర్తి నవల విటమిన్ ఎమ్ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నమోదైంది.[2]

కథ[మార్చు]

ఈ చిత్రం ఇద్దరు స్నేహితులు ధర్మరావు (సత్యనారాయణ), వీరభద్రం (ఎం. బాలయ్య) లు ఒక సరదా పందెం వేసుకోవడతో మొదలౌతుంది. ఎవరి పిల్లలు ముందు మనవడిని ఇవ్వబోతున్నారనేది ఆ పందెం. అందువల్ల, వారు తమ కుటుంబ న్యాయవాది నాయుడమ్మ (కోట శ్రీనివాసరావు) సమక్షంలో రూ .2 లక్షలను బ్యాంకులో జమ చేయడం ద్వారా పందెపు ఒప్పందం కుదుర్చుకుంటారు. గెలిచినవారు వడ్డీతో సహా ఆ మొత్తాన్ని పొందుతారు.

సంవత్సరాలు గడిచిపోతాయి, పెద్దవాళ్ళు గతించి పోతారు. బ్యాంకు లోని సొమ్ము రూ .50 లక్షలవుతుంది. నాయుడమ్మకు తప్ప ఆ కోడ్ మరెవరికీ తెలియదు. వీరభద్రానికి ముగ్గురు కొడుకులు, శేషగిరి (గిరిబాబు), అంజనేయులు (తనికెళ్ళ భరణి), బోసు (రాజేంద్ర ప్రసాద్) ఉన్నారు. ధర్మరావుకు ఇద్దరు కుమారులు, శివరాం (ఎవిఎస్), రాజబాబు (చిన్నా), ఒక కుమార్తె భాను (కాంచన్) ఉన్నారు. రెండు కుటుంబాల మధ్య ఇప్పటికీ స్నేహపూర్వక సంబంధాలే ఉన్నాయి. నాయుడమ్మ ఒక మోసగాడు కాబట్టి, అతను 50% వాటా కోసం బేరం పెట్టి బోసుకు ఈ సంగతి చెబుతాడు. వాస్తవానికి, బోసు భానును ప్రేమిస్తాడు, కానీ ఆమె స్టేట్స్‌లో స్థిరపడాలని కోరుకుంటున్నందున ఆమె ప్రేమకు వ్యతిరేకంగా ఉంటుంది. బోసు పందెం రహస్యాన్ని ఆమెకు చెప్పి, ఆమెను పెళ్ళికి ఒప్పిస్తాడు.

ఇంతలో, నాయుడమ్మ అల్లుడు దక్షిణామూర్తికి (బ్రహ్మానందం) కూడా ఈ రహస్యం తెలుస్తుంది. దాన్ని అతడు రాజా బాబుకు చెబుతాడు. ఈ విధంగా, అందరికీ దాని సంగతి తెలిసిపోతుంది. ఆ తరువాత, ఆడవాళ్లందరూ ఒకేసారి గర్భం ధరిస్తారు. ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకుంటారు. ఒక దశలో భానుపై విషప్రయోగం జరిగి చావుబతుకుల్లో ఆసుపత్రిలో చేరుతుంది. అప్పుడు అమెకు బోసు విలువ తెలుస్తుంది. బోసుకు మగ పిల్లవాడు కలుగుతాడు. రెండు కుటుంబాలు ఏకమౌతాయి. ఇప్పుడే, నాయుడమ్మ, దక్షిణా మూర్తిలు ఒక్కటైపోయి, నవజాత శిశువును తస్కరిస్తారు. బోసు తన కుటుంబసభ్యుల సహాయంతో కొడుకును రక్షించుకుంటాడు. చివరగా, బోస్ రూ .50 లక్షలు గెలుచుకుంటాడు. అతను ఆ మొత్తాన్ని కుటుంబంతో పంచుకుంటాడు.

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటలకు శ్రీ సంగీతం సమకూర్చాడు. SEA రికార్డ్స్ ద్వారా సంగీతం విడుదలైంది.[1]

సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."తాతల నాటి"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం4:16
2."స్వీటీ సింగారమా"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రాదిక4:21
3."రావోయి చందమామా"రాజేంద్ర ప్రసాద్, కె.ఎస్.చిత్ర5:16
4."ఆజా ఆజా రాజా"మనో, చిత్ర6:04
5."జాగ్రత్త నా జోలికి వస్తే"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం4:19
6."ఉడుతా ఉడుతా హూత్"మనో, చక్రవర్తి3:16
Total length:27:32

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Lucky Chance (Cast & Crew)". Archived from the original on 2018-10-03. Retrieved 2020-08-11.
  2. "Lucky Chance (Review)".