రాజేంద్ర ప్రసాద్ (నటుడు)
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
| రాజేంద్ర ప్రసాద్ | |
| జన్మ నామం | గద్దె రాజేంద్ర ప్రసాద్ |
| జననం | జూలై 19 1956 (వయసు 56) |
| ఇతర పేరు(లు) | నట కిరీటి |
| ప్రముఖ పాత్రలు | ఎర్ర మందారం (1991), లేడీస్ టైలర్ (1985), అహ నా పెళ్ళంట (1987) |
రాజేంద్రప్రసాద్ తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. ఆయన పండించే హాస్యం తెలుగు సినిమా ను ప్రపంచస్థాయికి తీసుకెల్లింది. ఆయన నటించిన సినిమాలలో అహ నా పెల్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్ర్ఫిల్ 1 విడుదల, మాయలోడు మంచిపేరు తెఛ్ఛిపెట్టాయి.
నట కిరీటి గురించి [మార్చు]
హీరో అంటే పైల్టు, పాలు అనే మార్కును తొలగించి... హాస్యాన్నే ప్రధానంశంగా తీసుకుని సినిమాలు చేసి, విజయం సాధించిన నటుడు రాజేంద్రప్రసాద్. కేవలం హాస్యాన్నే గాక.. నవరసాల్ని పండించి, కథానాయకుడిగా ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. నటుడిగా వివిధ భాషల్లో రెండు వందల పైచిలుకు చిత్రాల్లో నటించాడీ ఆంధ్రా చార్లీచాప్లిన్. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు స్ఫూర్తితో... సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన రాజేంద్ర ప్రసాద్ ప్రేమించు పెళ్లాడు సినిమాతో హీరోగా మారాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న రోజుల్లో...హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి వారి దర్శకత్వంలో అద్భుతాలు నమోదు చేసిన ఘనత రాజేంద్రప్రసాదుది. కేవలం నవ్వించడమే కాదు ఏడిపించడంలోనూ మన నటరాజు సిద్ధహస్తుడే. కేవలం టాలీవుడ్ కే పరిమితం కాకుండా... నటకిరీటి కీర్తి క్విక్ గన్ మురుగన్ సినిమాతో హాలీవుడ్ దాకా పాకింది. రెండు నంది అవార్డుల సహా ఒక ఫిలింఫేర్ పురస్కారం రాజేంద్రప్రసాద్ ఖాతాలో ఉంది. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటాడు. రాజేంద్ర ప్రసాద్ నటుడే కాదు నటి కూడా. మేడమ్ సినిమా ఇందుకు చక్కని ఉదాహరణ.
నటించిన సినిమాలు [మార్చు]
Julayi
- మొగుడు (సినిమా)(2011)
- బావ (సినిమా) (2010)
- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)
- ఎర్ర మందారం
- మాయలోడు
- లేడీస్ టైలర్
- ఆ ఒక్కటీ అడక్కు
- రాజేంద్రుడు గజేంద్రుడు
- చాలెంజ్
- ఆ నలుగురు
- ఇట్లు మీ శ్రేయోభిలాషి
- ఖుషీ ఖుషీగా
- హిట్లర్
- కొబ్బరి బోండాం
- సరదా సరాదాగా
- శ్రీరామ చంద్రులు
- క్షేమంగా వెళ్ళి లాభంగా రండి
- క్విక్ గన్ మురుగన్
- ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం
- అప్పుల అప్పారావు
- [మాయలొదు]