లేడీస్ టైలర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
లేడీస్ టైలర్
(1986 తెలుగు సినిమా)
Ladies Tailor.jpg
దర్శకత్వం వంశీ
తారాగణం రాజేంద్ర ప్రసాద్ ,
అర్చన ,
వై.విజయ,
మల్లికార్జునరావు,
శుభలేఖ సుధాకర్,
రాళ్ళపల్లి
సంగీతం ఇళయరాజా
గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
కూర్పు అనిల్ మల్నాడ్
నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

లేడీస్ టైలర్, 1985లో విడుదలైన ఒక చిత్రం. రాజేంద్ర ప్రసాద్, మరియు వంశీల నటజీవితంలో ముఖ్యమైన చిత్రాలలో ఇది ఒకటి.

ఇందులో రాకేంద్ర ప్రసాద్ ఒక నిపుణుడైన మరియు బద్ధకస్తుడైన దర్జీ. అదృష్టం కలిసొస్తే కష్టపడకుండా ధనవంతుడవ్వచ్చునని అతని కోరిక. ఆ ఊరిలో అతనొకడే దర్జీ. అతని సహాయకుడిగా శుభలేఖ సుధాకర్ నటించాడు. మల్లికార్జునరావు బట్టల వ్యాపారి (ఈ సినిమాతో ఇతనికి "బట్టల సత్యం" అనే పేరు స్థిరపడిపోయింది)

తొడమీద పుట్టుమచ్చ ఉన్న పద్మినీ జాతి అమ్మాయిని పెళ్ళి చేసుకొంటే అదృష్టం కలిసొస్తుందని రాజేంద్రప్రసాదుకు రాళ్ళపల్లి జోస్యం చెబుతాడు. ఇక అలాంటి అమ్మాయిని పట్టుకోవడం కోసం రాజేంద్రప్రసాద్ నానా తంటాలు పడడం మొదలెడతాడు. ...

పాటలు[మార్చు]

ఇళయరాజా స్వరపరిచి, సంగీతాన్నందించిన ఈ చిత్ర పాటలు అశేషాదరణ పొందాయి.

  • ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉన్నావు - రచన : సీతారామశాస్త్రి; గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
  • గోపీ లోలా నీ పాల పడ్డానురా - రచన : సీతారామశాస్త్రి; గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  • పొరపాటిది గ్రహపాటిది - రచన : సీతారామశాస్త్రి; గానం : ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి