కన్నెగంటి బ్రహ్మానందం

వికీపీడియా నుండి
కన్నెగంటి బ్రహ్మానందం
Brahmanandam cu.jpg
king
జన్మ నామం కన్నెగంటి బ్రహ్మానందం
జననం ఫిబ్రవరి 01 1956 (1956-02-01) (వయసు 57)
Flag of Indiaఇండియా
స్వస్థలం చాగంటివారిపాలెం గ్రామం, ముప్పాళ్ల మండలం, గుంటూరు జిల్లా
నివాసం హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్
ఇతర పేర్లు బ్రహ్మానందం
అరగుండు
ఖాన్ దాదా
కత్తి రాందాసు
వృత్తి హాస్య నటుడు
మతం హిందూ
సంతానం 2-కొడుకులు
గౌతమ్
తండ్రి నాగలింగాచారి
తల్లి లక్ష్మీనరసమ్మ

బ్రహ్మానందం ప్రముఖ తెలుగు హాస్య నటుడు. ఈయన పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి మరియు తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. అరగుండుగా, ఖాన్ దాదాగా, కత్తి రాందాసుగా, శంకర్‌దాదా ఆర్.ఎమ్.పి.గా... వైవిధ్యమైన పాత్రల పేర్లతో పేరుగాంచిన నటుడు.
స్వల్పకాలములోనే వివిధ భాషలలో 900 కి పైగా సినిమాలలోనటించి, ప్రపంచములోనే అరుదయిన రికార్డు సృష్టించాడు. ఈ విషయం గిన్నీస్ ప్రపంచ రికార్డులు(2008వ సంవత్సరం)వారు గుర్తించారు. ఇప్పటికి ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో చాలా ఎక్కువ సినిమాలలో నటిస్తూవున్న హాస్య చక్రవర్తి.

విషయ సూచిక

బాల్యం [మార్చు]

బ్రహ్మానందం ఫిబ్రవరి 1, 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించాడు. తను పుట్టగానే తల్లికి గుర్రపువాతం వచ్చి, అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు. అప్పటికే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి, ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి. తల్లి ప్రాణాలు దక్కినా, బ్రహ్మానందం అనే పసివాడిపై మాత్రం అందరిదీ శీతకన్నే.

చదువు [మార్చు]

సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసాడు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎమ్మే పట్టా పుచ్చుకొన్నాడు. బ్రహ్మానందం అత్తిలి లో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్‌గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టాడు.

సినీరంగ ప్రవేశం [మార్చు]

బ్రహ్మానందం

ఇప్పట్లోలా ఇలా వెళ్లి అలా సినిమాలు చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబంలో మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటూ జనాభా కూడా ఎక్కువే! అమ్మ అప్పుడప్పుడూ ఇరుగు పొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే తనకు వినోదం! తండ్రి రంగస్థల నటుడే అయినా సీరియస్ ప్రొఫెషనేమీ కాదు. తల్లిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకీ అబ్బిందేమోనని బ్రహ్మానందం భావిస్తాడు. బాల్యంలో మారాం చేయకుండా బడికి బుద్ధిగానే వెళ్ళినా, ఎస్.ఎస్.ఎల్.సి. లో గట్టిగానే పాసైనా, చిన్న తప్పులు చేసినా, తండ్రి నుంచి బుద్ధితక్కువ వాడంటూ చివాట్లు తప్పేవి కావు. అయితే తెలివితక్కువ వాడని మాత్రం ఆయన ఎన్నడూ అనలేదంటాడు. చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు (మిమిక్రీ) చేయడం, సాంస్కృతిక బృందాలలో (కల్చరల్ ఆర్గనైజషన్) చురుకుగా పాల్గొనడం ఈయనకు అలవడింది. అత్తిలిలో ఉపన్యాసకుడుగా ఉంటూనే పలు నిజజీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలూ పొందిన బ్రహ్మానందం 1985లో దూరదర్శన్ లో వచ్చిన 'పకపకలు' కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించగా, మంచి స్పందన వచ్చింది. దూరదర్శన్ తప్ప, ఇతర ఛానెళ్ళేవీ లేని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ బ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తు పట్టేవారు.

తొలి సినిమా [మార్చు]

బ్రహ్మానందంను మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవ్యక్తి దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ . నరేశ్ కథానాయకుడిగా నటించిన 'శ్రీ తాతావతారం' అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించాడు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1 వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌ తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా, తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన "సత్యాగ్రహం".

పేరు తెచ్చిన పాత్ర [మార్చు]

"...పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్‌రా రేయ్... నాశనమై పోతావ్..." అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే అహ! నా పెళ్ళంట ! లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. "అరగుండు వెధవా" అని కోట తో తిట్టించుకొన్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం, తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. జంధ్యాల తను దర్శకత్వం వహిస్తున్న "చంటబ్బాయ్" సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవి కి పరిచయం చేయడం, తర్వాత "పసివాడి ప్రాణం" లో ఓ చిన్న పాత్ర వేయడం. ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం అహ నా పెళ్ళంట లో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నటజీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాలను, అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు ను, ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిని ఎప్పటికీ మరువలేను అంటాడు. ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో యేడాదికి 35 చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం.

ప్రజాదరణ పొందిన ఊత పదాలు [మార్చు]

  • నీ యంకమ్మా (చిత్రం భళారే విచిత్రం చిత్త్రంలోని సంభాషణ)
  • పండగ చేసుకో (భిక్షగాడి పాత్ర ఆలీతో పోకిరి చిత్రం లో అర్థ రూపాయి దానం చేసి అనే సంభాషణ)
  • రకరకాలుగా ఉంది మాస్టారూ (నువ్వు నాకు నచ్చావ్ చిత్రం)
  • ఖాన్ తో గేమ్స్ ఆడకు... శాల్తీలు లేచిపోతాయి... (మనీ మనీ చిత్రం)
  • దొరికాడా ఏశెయ్యండి...(పట్టుకోండి చూద్దాం)
  • జఫ్ఫా (చాలా చిత్రాలలో)

కుటుంబం [మార్చు]

బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ కథానాయకుడిగా పల్లకిలో పెళ్ళికూతురు అనే చిత్రం వచ్చింది.

నటించిన చిత్రాలు [మార్చు]

Year Movie Name Role Language Co-Stars
2013 Baadshah[1] Telugu NTR Jr., Kajal Aggarwal
Saradha[2] Telugu (filming) Pawan Kalyan, Samantha Ruth Prabhu
Sukumarudu Telugu (filming) Aadi, Nisha Aggarwal
Autonagar Surya Telugu (Filming) Naga Chaitanya, Samantha
Jaffa Telugu
Hindi
Brahmanandam - Directed By Vennela Kishore
Kadavul Paathi Mirugam Paathi Tamil
(Filming)
Arya, Narain, Aadhi
Vaalu Tamil (filming) Silambarasan Rajendar, Hansika Motwani
Mirchi Veera Pratap Telugu Prabhas, Anushka, Richa Gangopadhyay
Naayak Jilebi Telugu Ram Charan Teja, Kajal Aggarwal, Amala Paul
2012 Krishnam Vande Jagadgurum Rampam(Rangasthala Pandit) Telugu Rana Daggubati, Nayantara
Lucky Telugu Meka Srikanth, Meghana Raj
Cameraman Gangatho Rambabu Telugu Pawan Kalyan, Tamanna Bhatia,
Rebel Telugu Prabhas, Tamanna Bhatia, Deeksha Seth
Denikaina Ready Telugu Vishnu Manchu, Hansika Motwani
Vennela 1 1/2 Telugu Krishna Chaitanya, Monal Gajjar, Vennela Kishore
Shirdi Sai Sandeham Telugu Nagarjuna
Sudigadu Jaffa Reddy Telugu Allari Naresh, Monal Gajjar
All the Best Gochi Savithri Telugu Meka Srikanth, J. D. Chakravarthy, Lucky Sharma
Rachcha Rangeela Telugu Ram Charan Teja, Tamannaah Bhatia
Devudu Chesina Manushulu Lord Vishnu Telugu Ravi Teja, Ileana D'Cruz
Gabbar Singh Recovery Ranjith Telugu[3] Pawan Kalyan, Shruti Haasan
Dammu Telugu NTR Jr., Trisha Krishnan
Daruvu Vidhya Balan Telugu Ravi Teja, Taapsee Pannu
Damarukam Rudraksha Telugu Nagarjuna, Anushka Shetty
Nuvva Nena Telugu Allari Naresh, Shriya Saran
Mr. Nookayya Telugu Manoj Manchu, Kriti Kharbanda, Sana Khan
Nippu Kaasi Telugu Ravi Teja, Deeksha Seth
Dhoni As Prakash Raj's Boss Tamil
Telugu
Prakash Raj, Akash Puri, Radhika Apte
2011 Panjaa Paparayudu Telugu Pawan Kalyan, Sarah Jane Dias, Anjali Lavania
Seema Tapakai Melimbangaram Telugu Allari Naresh,
Madatha Kaja Padmasri Telugu Allari Naresh, Sneha Ullal
Sri Rama Rajyam Guest Telugu Nandamuri Balakrishna, Nayantara
Bejawada Sketch Gopi Naga Chaitanya, Amala Paul
Dookudu Padmasri Mahesh Babu, Samantha
Badrinath Batting BABA Allu Arjun, Tamannaah Bhatia, Prakash Raj
Desadrohii Filming Namitha
Mr. Rascal Balu Telugu Paruchuri Ravindranath, Harika
Vaanam Tamil Silambarasan Rajendar, Bharath, Anushka Shetty, Prakash Raj
Mr. Perfect Jalsa Kishore Telugu Prabhas, Kajal Aggarwal, Taapsee Pannu, Prakash Raj
Katha Screenplay Darshakatvam Appalaraju SriSailam Sunil
Payanam/Gaganam Rajesh Kapoor(Film Director) Tamil
Telugu
Nagarjuna, Prakash Raj, Poonam Kaur
Wanted Gopichand, Deeksha Seth
2010 Anaganaga O Dheerudu Jeffa Siddharth Narayan, Shruti Haasan, Lakshmi Manchu
Ragada Brahmam Nagarjuna, Anushka Shetty, Priyamani
Nagavalli Assistant Venkatesh, Anushka Shetty, Richa Gangopadhyay, Kamalinee Mukherjee, Shraddha Das, Poonam Kaur
Orange Puppy Ram Charan Teja, Genelia D'Souza
Kalyanram Kathi Kalyan Ram, Shaam, Sana Khan
Collector Gari Bharya Prakash Raj, Bhumika Chawla
Brindaavanam Bommarillu Father NTR Jr., Kajal Aggarwal, Samantha, Prakash Raj
Khaleja Miriyam Mahesh Babu, Anushka Shetty, Prakash Raj
Don Seenu Vishwas Ravi Teja, Shriya Saran, Srihari, Sayaji Shinde
Maryada Ramanna Sunil, Saloni Aswani
Panchakshari Kala Bhairava Anushka Shetty
Vedam Brother Bairagi Allu Arjun, Manoj Manchu, Anushka Shetty, Manoj Bajpai
Rama Rama Krishna Krishna Subba Rao Ram, Priya Anand, Arjun Sarja, Gracy Singh
Simha Compounder Balakrishna, Nayantara, Namitha, Sneha Ullal
Varudu Allu Arjun, Arya, Bhanu Sri Mehra
Yagam Navdeep, Bhumika Chawla, Kim Sharma, Rahul Dev
Kedi Nagarjuna, Mamta Mohandas
Bindaas Parabrahmam Manoj Kumar Manchu, Sheena Shahabadi, Ahuti Prasad
Namo Venkatesa Paris Prasad Venkatesh, Trisha Krishnan
Adhurs Bhattacharya (Bhattu) NTR Jr., Nayantara, Sheela
Maa Nanna Chiranjeevi Jagapati Babu
2009 Kasko Mahesh Babu Vaibhav Reddy, Shweta Prasad, Gauri Pandit
Saleem Vishnu Vardhan Babu, Ileana D'Cruz
Pravarakhyudu Jagapati Babu, Priyamani
Prayanam Satyanarayana Swamy Manoj Manchu, Payal Ghosh
Arya 2 Mr. Dasavathaaram Allu Arjun, Kajal Aggarwal, Navdeep
Ek Niranjan Prabhas, Kangana Ranaut, Sonu Sood
Jayeebhava Narasimha Sastry Kalyan Ram, Hansika Motwani, Mukesh Rishi
Mahatma Srikanth, Bhavana Menon
Ganesh Comedy Don Yagadiri Ram, Kajal Aggarwal, Poonam Kaur, Ashish Vidyarthi
Josh Political Lerner Naga Chaitanya, Karthika Nair, J. D. Chakravarthy
Anjaneyulu Prabhakar Ravi Teja
Magadheera Ram Charan Teja, Kajal Aggarwal
Evaraina Epudaina Varun Sandesh
Current Sushanth
Kick Halwa Raj/Prakash Raj Ravi Teja and Ileana D'Cruz
Mitrudu JB Jan(Jaana Betthudu Janaardhan) Balakrishna, Priyamani
Konchem Ishtam Konchem Kashtam Gachibowli Divakar Siddharth Narayan and Tamannaah
Maska Doctor Ram, Hansika Motwani
2008 King Jayasurya Nagarjuna and Trisha Krishnan
Neninthe Idly Vishwanath Ravi Teja, Siya, Sayaji Shinde, Subbaraju
Chedugudu
Dongala Bandi Climax Thief Allari Naresh
Kotha Bangaru Lokam College Principal Varun Sandesh, Shweta Prasad
Ninna Nedu Repu A.M. Ravi Krishna, Tamannaah Bhatia
Chintakayala Ravi Pinky Venkatesh, Anushka Shetty and Mamta Mohandas
Saroja Guest appearance Tamil film Shiva, Vaibhav Reddy, S. P. B. Charan, Prakash Raj, Jayaram
Baladur Nani Ravi Teja, Anushka Shetty, Krishna
Sathyam Transport office broker Tamil film Vishal Reddy, Nayantara, Upendra
Gajibiji
Aalayam Sivaji
Kathanayakudu Koya dora Jagapathi Babu, Rajnikanth, Meena, Nayantara, Sunil
Ullasamga Utsahamga Yadho Sagar, Sneha Ullal
Hare Ram Nijam Kalyan Ram, Priyamani
Victory Nitin Kumar Reddy, Mamta Mohandas
Ready McDowel Murthy Ram, Genelia D'Souza
Pandurangadu Balakrishna, Sneha, Tabu
Kantri Brahmi Jr. NTR, Ashish Vidyarthi, Prakash Raj, Hansika Motwani
Naa Manasukemaindi
Donga Sachinollu Stalin
Bhale Dongalu Tarun Kumar, Ileana D'Cruz
Sawaal Bharath
Jalsa Pranav Pawan Kalyan, Ileana D'Cruz
Premabhishekam
Lakshmi Putrudu Cameo Appearance
Gamyam Person on a highway Allari Naresh, Sharwanand, Kamalinee Mukherjee
Krishnarjuna Vishnu Vardhan Babu, Mamta Mohandas, Nagarjuna
Nenu Meeku Telusa...? Barmani Manoj Manchu, Sneha Ullal, Riya Sen, Nassar
Mr. Medhavi Genelia D'Souza, Raja, Sonu Sood
Pourudu Sumanth, Kajal Aggarwal, Nassar
Krishna Bobby Ravi Teja, Trisha Krishnan
100 Kotlu Baladitya, Saira Bhanu
Brahmanandam Drama Company Sivaji
Bommana Brothers Chandana Sisters Allari Naresh, Krishna Bhagawan
John Appa Rao 40 plus Krishna Bhagawan
Nee Sukhame Ne Koruthunna Raja, Sneha
Hero Nitin Kumar Reddy, Bhavana Menon, Ramya Krishna
2007 Aata Astrologist Siddharth Narayan, Ileana D'Cruz
Aaroje
Athidhi Uncle of heroine Mahesh Babu, Amrita Rao
Aadavari Matalaku Ardhalu Verule Venkatesh, Trisha Krishnan
Bhajantrilu
Brahma - The Creator
Chiruta Krish Ram Charan Teja, Neha Sharma
Dubai Seenu Rama Krishna Ravi Teja, Nayantara
Dhee Chari Vishnu, Genelia D'Souza
Lakshyam College Canteen Owner Gopichand, Jagapati Babu, Anushka Shetty
Maharajasri
Maisamma IPS Minister Mumaith Khan, Sayaji Shinde, Pradeep Rawat
Mee Sreyobhilashi Panthulu
Athili Sattibabu LKG Ravi Shastri Allari Naresh
Okkadunnadu Satyanarayana Gopichand
Satyabhama
Shankar Dada Zindabad Astrologist Chiranjeevi, Srikanth, Karishma Kotak
Mozhi Apartment President Anantakrishnan Tamil film Jyothika in lead.
Bhagyalakshmi Bumper Draw Joshua Gottam
Vijayadasami
Yamadonga Chitraguptudu NTR Jr., Priyamani, Mohan Babu
2006 Annavaram Purohitudu
Andala Ramudu
Bommarillu Loan Officer Siddharth Narayan, Genelia D'Souza, Prakash Raj
Vikramarkudu Duvva Abbulu Ravi Teja, Anushka Shetty, Ajay
Pellaina Kothalo Jagapati Babu, Priyamani
Stalin Purohitudu Chiranjeevi, Trisha Krishnan
Pokiri Brahmi Mahesh Babu, Ileana D'Cruz, Prakash Raj
Sri Ramadasu Astrologist Devotional Film
Happy Pizza Hut Manager Allu Arjun, Genelia D'Souza
2005 Jai Chiranjeeva Shanthi Swaroop Chiranjeevi
Evadi Gola Vaadidi Sankardada R.M.P Comedy Film
Hungama P.A. of Bobbili Raja Comedy Film
Mogudu Pellam O Dongodu Thief Raja, Shriya Saran
Vennela Pampachek
Athadu Brahmam Mahesh Babu, Trisha Krishnan, Sonu Sood
Super lie-detector Operator Nagarjuna, Ayesha Takia, Anushka Shetty, Sonu Sood
Andarivaadu Reporter Chiranjeevi, Tabu, Rimi Sen, Prakash Raj
Soggadu Servant of Satyannarayana
Radha Gopalam
Balu ABCDEFG Hotel Manager
Allari Bullodu
2004 Swarabhishekam Telugu
Apparao Driving School Losugula Lakshma Reddy
New Tamil
Gilli Pundit Tamil
Suryam Pujari
Andhrawala Home Minister Jr. NTR, Rakshitha, Sayaji Shinde
Konchem Touchlo Vunte Cheputanu
Intlo Srimati Veedhilo Kumari
Leela Mahal Center
Vidyardhi
Vijayendra Varma
Valliddaru Okkate
Satruvu
Athade Oka Sainyam P.A. of Prakash Raj Prakash Raj
Seenu Vasanthi Lakshmi Music Pundit
143
Venky Gajala from Washington, D.C.
Kaasi Tamil film
Nenunnanu Hero's Friend Nagarjuna, Shriya Saran and Aarti Agarwal
Preminchukunnam Pelliki Randi
Nani Father of Ravi Babu Ravi Babu
Adavi Ramudu
Oka Pellam Muddu Rendo Pellam Vaddu
Aithe Enti
Xtra
Koduku
Swamy
Pallakilo Pellikoothuru
Andaru Dongale Dorikithe Chee
Malliswari Balu (Katrina Kaif's Driver) Venkatesh, Katrina Kaif
Ahana Pellanta Govindu Telugu Rajendra Prasad, Kota Srinivasa Rao

అవార్డులు - సత్కారాలు [మార్చు]

  • నటుడిగా గుర్తింపు నిచ్చిన 'అహ నా పెళ్లంట' చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించిపెట్టింది. మనీ, అనగనగా ఒకరోజు, అన్న, వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందాడు.
  • ఐదు కళాసాగర్ పురస్కారాలు
  • తొమ్మిది వంశీ బర్కిలీ పురస్కారాలు
  • పది సినీగోయర్స్ పురస్కారాలు
  • ఎనిమిది భరతముని పురస్కారాలు
  • ఒక్క ఫిలింఫేర్ పురస్కారము
  • రాజీవ్‌గాంధీ సద్భావనా పురస్కారం
  • ఆటా (అమెరికా), సింగపూర్, లండన్ డాకర్స్, అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు, షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నాడు
  • విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండేరాన్ని తొడిగి సత్కరించారు
  • పద్మవూహన సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది
  • సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్‌వారు స్వర్ణహస్తకంకణాన్ని బహూకరించారు.
  • అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు ను అందుకున్నాడు
  • విఖ్యాత హస్యనటులయిన రేలంగి, రాజబాబు, చలం, అల్లు, సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం కైవసం చేసుకోవడం అరుదైన ఘటన!

ఇతర విశేషాలు [మార్చు]

  • 'రేలంగి తన ప్యాంటూ షర్టూ మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ తెరమీదికొచ్చాడ' ని కితాబులందు కొన్న నటుడు బ్రహ్మానందం
  • రెండు దశాబ్దాలుగా తన హాస్యనటనతో ఎన్నో మైలురాళన్లి అధిగమించి దాదాపు 745 చిత్రాల్లో నటించిన ఘనత వహించారు.
  • తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పడం విశేషం.
  • ప్రతిష్టాత్మకమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అత్యధిక సినిమాలు నటించి నందుకు చోటు దక్కించుకున్న ఏకైక హాస్య నటుడు.

బయటి లింకులు [మార్చు]

మూలాలు [మార్చు]