నాగూర్ బాబు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
నాగూర్ బాబు
NagurBabu.jpg
వ్యక్తిగత సమాచారం
సుపరిచితుడు మనో
రంగం నేపధ్య గాయకుడు, కర్నాటక సంగీతం
వృత్తి గాయకుడు, నటుడు
వాద్యపరికరం గాయకుడు
క్రియాశీల కాలం 1985–ఇప్పటివరకు (నటుడిగా 1979-1992)

నాగూర్ బాబు సుప్రసిద్ధ గాయకుడు, మరియు డబ్బింగ్ కళాకారుడు. ఈయనకే మనో అనే పేరు కూడా ఉంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరియు హిందీ భాషల్లో అనేక పాటలు పాడాడు.

నాగూర్ బాబు విజయవాడ లోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన తల్లి షహీదా, తండ్రి రసూల్. తండ్రి ఆలిండియా రేడియోలో పనిచేసేవాడు. నేదునూరి కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. గాయకుడిగా పరిచయమవక ముందే నీడ అనే చిత్రంలో బాలనటుడిగా కనిపించాడు. ఇళయరాజా ఆయన పేరును మనో గా మార్చాడు.

మనో అన్నయ్య తబలా వాద్యకారుడు. తనని సంగీత దర్శకులు చక్రవర్తి దగ్గర చేరుద్దామని చెన్నై తీసుకెళ్ళాడు. వాళ్ళ ప్రతిభను గుర్తించిన ఆయన అక్కడే సహాయకుడిగా ఉండిపొమ్మన్నాడు. ఆయన దగ్గర పనిచేయడం ద్వారా నేపథ్యగానంలో మెళకువలు సంపాదించాడు. తెలుగులో నాగూర్‌బాబుగా, తమిళంలో మనోగా ఆయన ఇప్పటికిపాతిక వేల పాటలు పాడారు.

గాయకుడిగా ఆయన మొదటి పాట మురళీ మోహన్ జయభేరి పతాకం మీద తీసిన కర్పూరదీపం అనే సినిమా లోది.రజనీకాంత్ తెలుగు చిత్రాలకు ఆయనకు గాత్రదానం చేసి ఆయన మెప్పు పొందాడు.బుల్లితెర పై పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు.

ఇష్టాలు[మార్చు]

ఆయన అభిమాన గాయకులు, కిషోర్ కుమార్, రఫీ, జేసుదాసు, బాలు, జానకి, సుశీల, వాణీ జయరాం. [1]. ఘంటసాల పాడిన మనసున మనసై అనే పాట ఆయనకు ఎంతో ఇష్టం. ఇంకా హిందీలో గుల్షన్ కుమార్ తో మంచి హిట్లున్నాయి. పాకీస్థాని గాయకుడు గులాం అలీ అంటే కూడా బాగా అభిమానిస్తాడు.

మత సామరస్యం[మార్చు]

  • "పేరుకు ముస్లిం సంప్రదాయమైనా మేం అన్ని మతాలను గౌరవిస్తాం. రంజాన్‌ని ఎంత ఘనంగా చేసుకుంటామో దీపావళి, క్రిస్‌మస్‌లను కూడా అంతే గొప్పగా జరుపుకొంటాం.--నాగూర్ బాబు
  • "మేం ఏటా తిరుమలకు కాలినడకన వెళతాం. ఆయన శబరిమలైకి వెళ్లి అయప్పస్వామిని దర్శించుకుంటారు."--నాగూర్ బాబు భార్య జమీలా.[2].

అస్థిపాస్తులు[మార్చు]

నాగూర్ బాబు స్థిరాస్తి వ్యాపారం ద్వారా దాదాపు 500 కోట్ల రూపాయలు సంపాదించాడు.[3]

మూలాలు[మార్చు]

  1. ఫిబ్రవరి 1, 2009 ఈనాడు ఆదివారం సంచిక
  2. ఆగస్ట్ 8, 2010 ఈనాడు వసుంధర
  3. http://www.greatandhra.com/viewnews.php?id=24542&cat=1&scat=5