వాణీ జయరామ్

వికీపీడియా నుండి

వాణీ జయరామ్ దక్షిణ భారతదేశానికి చెందిన సినిమా నేపథ్యగాయకురాలు.

వాణీ జయరాం తమిళనాడు లోని వెల్లూరు లో జన్మించారు. వాణీ జయరాం వారి తల్లిదండ్రుల ఎనిమిది మంది సంతానం లో ఐదవ పుత్రిక. వారి తల్లి గారు ప్రఖ్యాత వీణా విద్వాంసులు రంగ రామనుజ అయ్యంగార్ శిష్యురాలు. వాణి జయరాం పసి ప్రాయం లోనే బాల మేధావి గా విశేష ప్రతిభ కనబర్చారు. ఎనిమిదవ ఏట నే ఆవిడ ఆల్ ఇండియా రేడియో పాల్గొన్నారు.

వాణి జయరాం కర్నాటక సంగీతం కడలూరు శ్రీనివాస అయ్యంగార్, టి.ఆర్, బాలసుబ్రమణియన్ మరియు ఆర్.యెస్ మణి ల వద్ద అభ్యసించగా, హిందుస్తాని సంగీతం ప్రఖ్యాత ఉస్తాద్ అబ్దుల్ రహ్మాన్ ఖాన్ వద్ద నేర్చుకున్నారు.

వివాహానంతరం భర్త తో ముంబయి లో స్థిరపడ్డ వాణి జయరాం అనుకోని విధంగా హిందీ సంగీత దర్శకుడు వసంత్ దేశాయ్ ని కలవడం అలా ఆవిడ హృషీకేష్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ప్రముఖ హిందీ చలన చిత్రం "గుడ్డి" లోని "బోలె రే పపీ హరా" ద్వారా సినీనేపధ్య గాయకురాలిగా ఆరంగేట్రం చేసి తన చిన్ననాటి కలను నిజం చేసుకొన్నారు,


[మార్చు] తెలుగు సినిమాలు

[మార్చు] బయటి లింకులు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు