Coordinates: 17°21′N 78°29′E / 17.350°N 78.483°E / 17.350; 78.483

లాల్ దర్వాజ

వికీపీడియా నుండి
(లాల్ దర్వాజా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లాల్ దర్వాజ
కుడ్య (గోడ) నగరం
Coordinates: 17°21′N 78°29′E / 17.350°N 78.483°E / 17.350; 78.483
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500 053
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంహైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంచాంద్రాయణగుట్ట శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

లాల్ దర్వాజ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పాత శివారు ప్రాంతం.

2016లో లాల్ దర్వాజాలో బోనాల వేడుకలు

చరిత్ర[మార్చు]

1907లో ఈ లాల్ దర్వాజ నిర్మించబడింది. నిజాం ప్రభుత్వ ప్రధాన మంత్రి మహారాజా కిషన్ పెర్షాద్, ఇక్కడి సింహవాహిని మహంకాళి దేవాలయం నుండి బోనాల పండుగను ప్రారంభించాడు. హైదరాబాదు నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఇక్కడి ఆలయానికి, అనేక ఇతర దేవాలయాలకు విరాళాలు, భూమిని ఇచ్చాడు.[1]

నిజాంల కాలంలో ఈ శివారు ప్రవేశద్వారానికి పెద్ద ఎర్ర తలుపు ఉండడం వల్ల దీనికి లాల్ దర్వాజ దర్వాజ అని పేరు పెట్టారు.

సంస్కృతి[మార్చు]

లాల్ దర్వాజలో జరిగే బోనాల పండుగ తెలంగాణలో అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా పరిగణించబడుతుంది.[2][3]

భౌగోళికం[మార్చు]

ఇది చార్మినార్ నుండి 1.5 కి.మీ., కోఠి నుండి 4 కి.మీ., అఫ్జల్‌గంజ్ నుండి 3 కి.మీ., సిబిఎస్ (గౌలిగూడ బస్టాండ్) నుండి 3 కి.మీ., చాంద్రాయణగుట్ట నుండి 1.5 కి.మీ., ఉప్పుగూడ నుండి 0.5 కి.మీ. దూరంలో ఉంది. దీనికి సమీపంలో అలియాబాద్, ఛత్రినాక, గౌలిపుర, రాజన్నబాయి, షాలిబండ మొదలైనవి ఉన్నాయి.

గతంలో లాల్ దర్వాజలో "పాథర్ కి దర్గా" ("స్టోన్ సమాధి") దర్గా కనుగొనబడింది.

వాణిజ్య ప్రాంతం[మార్చు]

ఇక్కడ వివిధ వస్తువులకు సంబంధించిన అనేక దుకాణాలు ఉన్నాయి, సుధ 70 ఎంఎం (సినీపోలిస్) సినిమా థియేటర్ కూడా ఉంది.[4]

రవాణా[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో లాల్ దర్వాజ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. సమీపంలోని ఉప్పుగూడ వద్ద ఎం.ఎం.టి.ఎస్. రైల్వే స్టేషను ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Nizam gave funding for temples, and Hindu educational institutions". 2013-05-28.
  2. "Archived copy". Archived from the original on 24 October 2014. Retrieved 11 January 2021.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. "Lal Darwaza Temple Decked Up Ahead of Bonalu Festival". The New Indian Express.
  4. Show, Book My. "Cinepolis: Sudha Cinemas, Hyderabad | Movie Showtimes & Ticket Booking Near You in Hyderabad". BookMyShow.