వట్టి వసంతకుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వట్టి వసంతకుమార్

మాజీ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2004- 2014
నియోజకవర్గం ఉంగుటూరు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1955
పూళ్ల , ఎంఎంపురం, భీమడోలు మండలం , పశ్చిమ గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
మరణం 2023 జనవరి 29
విశాఖపట్నం
జాతీయత  భారతదేశం
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు వట్టి వెంకటరంగ పార్థసారధి , వట్టి వాసుకి [1]
జీవిత భాగస్వామి ఉమాదేవి

వట్టి వసంతకుమార్ (1955 - 2023 జనవరి 29) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

వట్టి వసంతకుమార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పశ్చిమ గోదావరి జిల్లా , భీమడోలు మండలం , ఎంఎంపురం, పూళ్ల గ్రామంలో వట్టి వెంకటరంగ పార్థసారధి , వట్టి వాసుకి దంపతులకు జన్మించాడు. ఆయన 1978లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంబిఎ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

వట్టి వసంతకుమార్ 1970వ దశకం కాంగ్రెస్‌ పార్టీలో సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ఉంగుటూరు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇమ్మని రాజేశ్వరి పై 15719 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసి ఆయన మరణాంతరం కొణిజేటి రోశయ్య మంత్రివర్గంలోనూ గ్రామీణాభివృద్ధి మంత్రిగా పని చేసి అనంతరం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పర్యాటక , సాంస్కృతిక , యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రిగా పని చేశాడు.

వట్టి వసంతకుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం ఎన్నికల్లో పోటీ చేయలేదు.ఆయన 2014లో ఆంధ్ర విశ్వవిద్యాలయం 82వ స్నాతకోత్సవం ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నాడు.[2] వట్టి వసంతకుమార్ 2 నవంబర్ 2018లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు.

మరణం[మార్చు]

వట్టి వసంతకుమార్ అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం క్షిణించి 2023 జనవరి 29న మరణించాడు.[3][4][5]

మూలాలు[మార్చు]

  1. Sakshi (27 September 2015). "వట్టి వసంతకుమార్ మాతృమూర్తి కన్నుమూత". Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
  2. Sakshi (10 September 2014). "వట్టి వసంతకుమార్ కు డాక్టరేట్". Archived from the original on 30 జూలై 2021. Retrieved 30 July 2021.
  3. Prajasakti (29 January 2023). "మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ కన్నుమూత." Archived from the original on 29 January 2023. Retrieved 29 January 2023.
  4. Eenadu (29 January 2023). "మాజీ మంత్రి వట్టి వసంతకుమార్‌ కన్నుమూత". Retrieved 29 January 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  5. Andhra Jyothy (30 January 2023). "విశాఖతో అనుబంధం". Archived from the original on 29 January 2023. Retrieved 29 January 2023.