వాషింగ్టన్ సుందర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాషింగ్టన్ సుందర్
2019–20 విజయ్ హజారే ట్రోఫీలో వాషింగ్టన్ సుందర్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1999-10-05) 1999 అక్టోబరు 5 (వయసు 24)
చెన్నై
మారుపేరువాషి[1]
ఎత్తు185 cm (6 ft 1 in)[2]
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలింగు ఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 301)2021 జనవరి 15 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2021 మార్చి 4 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 220)2017 డిసెంబరు 13 - శ్రీలంక తో
చివరి వన్‌డే2023 జనవరి 24 - న్యూజీలాండ్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.5
తొలి T20I (క్యాప్ 72)2017 డిసెంబరు 24 - శ్రీలంక తో
చివరి T20I2023 ఫిబ్రవరి 1 - న్యూజీలాండ్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.5 (formerly 55)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016–presentతమిళనాడు
2017రైజింగ్ పూణే సూపర్‌జయింట్
2018–2021రాయల్ చాలెంజర్స్
2022–presentసన్‌రైజర్స్ హైదరాబాదు (స్క్వాడ్ నం. 5)
2022లాంకషైర్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే టి20I
మ్యాచ్‌లు 4 16 35
చేసిన పరుగులు 265 233 107
బ్యాటింగు సగటు 66.25 29.12 10.70
100s/50s 0/3 0/1 0/1
అత్యధిక స్కోరు 96* 51 50
వేసిన బంతులు 526 516 675
వికెట్లు 6 16 29
బౌలింగు సగటు 49.80 27.18 28.03
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/89 3/30 3/22
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 4/– 12/–
మూలం: ESPNcricinfo, 24 March 2023

వాషింగ్టన్ సుందర్ (జననం 1999 అక్టోబరు 5) భారత క్రికెట్ జట్టు తరఫున ఆడుతున్న భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, దేశీయ క్రికెట్‌లో తమిళనాడు తరపున కూడా ఆడుతున్నాడు. సుందర్ ఎడమచేతి వాటం బ్యాటరు, కుడిచేతి ఆఫ్ స్పిన్నరు. [3] [4] అతను 2017 డిసెంబరు 13 న శ్రీలంకపై తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.

తొలి జీవితం[మార్చు]

వాషింగ్టన్ సుందర్ 1999 అక్టోబరు 5 న తమిళనాడులోని చెన్నైలో ఒక తమిళ హిందూ కుటుంబంలో జన్మించాడు. [5] సుందర్ తండ్రికి కూడా చిన్నతనంలో క్రికెట్‌పై అభిరుచి ఉండేది. అది గమనించి అతనికి సాయపడిన PD వాషింగ్టన్ అనే వ్యక్తి గౌరవార్థం తన తన కుమారుడికి అతని పేరు పెట్టుకున్నాడు.[6][7] అతని సోదరి శైలజా సుందర్ కూడా ప్రొఫెషనల్ క్రికెటర్.[8] [9] సుందర్ నాలుగైదు సంవత్సరాల వయస్సు నుంచి క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. [10] అతను ప్రారంభ విద్య సెయింట్ బెడేస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదివాడు.[11]

దేశీయ, IPL కెరీర్[మార్చు]

అతను 2016 అక్టోబరు 16న 2016–17 రంజీ ట్రోఫీలో తమిళనాడు తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసాడు.[12] రవిచంద్రన్ అశ్విన్ లాగానే వాషింగ్టన్ సుందర్ కూడా ముందు బ్యాట్స్‌మెన్‌గా మొదలుపెట్టి, ఆఫ్‌స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2017 అక్టోబరులో అతను 2017-18 రంజీ ట్రోఫీలో త్రిపురపై తమిళనాడు తరపున బ్యాటింగ్ చేస్తూ తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించాడు.[13] అతను 2016లో ఇండియా U-19 ప్రపంచ కప్‌కు కూడా ఎంపికయ్యాడు.

2017లో, రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ అతన్ని ఎంపిక చేసింది. అతను 2017 ఏప్రిల్ 22 న 2017 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ తరపున తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు [14] అతను IPL 2017 క్వాలిఫైయర్ 1 లో ముంబై ఇండియన్స్, పూణే సూపర్‌జెయింట్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఇందులో అతను 16 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు.


2018 జనవరిలో జరిగిన, 2018 IPL వేలంలో అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.[15] 2018 అక్టోబరులో అతను, 2018–19 దేవధర్ ట్రోఫీ కోసం ఇండియా సి జట్టులో ఎంపికయ్యాడు.[16]

2022 IPL వేలంలో, సుందర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ₹8.75 కోట్లకు కొనుగోలు చేసింది. [17]

2022 ఆగస్టులో సుందర్, రాయల్ లండన్ వన్-డే కప్, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లాంకషైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు. నార్తాంప్టన్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. [18]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

2017 నవంబరులో, శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం భారత ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) జట్టులో సుందర్ ఎంపికయ్యాడు. [19] మరుసటి నెల ప్రారంభంలో, కేదార్ జాదవ్ స్నాయువుకు గాయం కావడంతో, అదే సిరీస్‌కు భారత వన్డే ఇంటర్నేషనల్ జట్టులో కూడా చేర్చుకున్నారు.[20] అతను 2017 డిసెంబరు 13 న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున తన వన్‌డే అరంగేట్రం చేసాడు [21] లహిరు తిరిమన్నె ను క్లీన్ బౌల్డ్ చేసి, అంతర్జాతీయ క్రికెట్‌లో తన తొలి వికెట్‌ తీసుకున్నాడు. సుందర్ 2017 డిసెంబరు 24 న, 18 సంవత్సరాల 80 రోజుల వయస్సులో శ్రీలంకపై మ్యాచ్‌లో T20I అరంగేట్రం చేసాడు.[22] T20I లలో భారతదేశం తరపున అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు, సుందర్.[23]

2018 మార్చిలో అతను, శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో జరిగిన 2018 నిదహాస్ ట్రోఫీకి భారత జట్టులో ఎంపికయ్యాడు. పవర్‌ప్లేలో ఓవర్‌కు 6 పరుగుల కంటే తక్కువ ఇస్తూ వేసిన అతని బౌలింగుకు అతను చాలా మంది ప్రశంసలు అందుకున్నాడు. సిరీస్ సమయంలో, అతను తొలి 3-వికెట్ల హాల్‌ను సాధించాడు. T20Iలో ఆ రికార్డు సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అతని ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. [24] ఆ తర్వాత భారత ట్వంటీ20 జట్టులో సాధారణ సభ్యుడిగా మారాడు.[25]

సుందర్ మొదట్లో భారతదేశపు 2020-21 ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్‌గా మాత్రమే ఎంపికయ్యాడు. అయితే, తోటి బౌలర్లకు అనేక గాయాలు, కోవిడ్-19 మహమ్మారి సమయంలో అమలులో ఉన్న దిగ్బంధం పరిమితుల కారణంగా అతను జనవరి 15న గబ్బాలో జరిగిన సిరీస్ చివరి టెస్ట్ మ్యాచ్‌లో అనుకోకుండా తన మొదటి టెస్ట్ క్యాప్ అందుకున్నాడు.[26][27] అతని మొదటి టెస్ట్ వికెట్ స్టీవ్ స్మిత్. సుందర్ తానాడిన మొదటి టెస్టు ఇన్నింగ్స్‌లో శార్దూల్ ఠాకూర్‌తో కలిసి 123 పరుగుల ఏడవ వికెట్ భాగస్వామ్యంలో 62 పరుగులు చేశాడు. ఇది భారత మొదటి ఇన్నింగ్సులో భారీ లోటు కాకుండా ఆపింది. చివరికి ఆ టెస్టులో భారత జట్టు గెలవడానికి కూడా గొప్పగా దోహదపడింది. [28] తొలి టెస్టులో చేసిన ఆ యాభైతో సుందర్, ఆస్ట్రేలియాలో టెస్టు అరంగేట్రంలోనే అర్ధ శతకం సాధించిన మూడో భారతీయుడిగా నిలిచాడు. [29]

మూలాలు[మార్చు]

  1. PTI (5 December 2017). "Father, coaches played big role in my career: Washington". The Times of India. Retrieved 3 February 2020.
  2. Dinakar, S. (23 December 2015). "Belief holds the key to Washington's success". The Hindu (in Indian English). Archived from the original on 17 January 2021. Retrieved 8 February 2021.
  3. K Chakraborty (6 November 2015). "Tamil Nadu teen makes India U-19 cut". The Times of India. Retrieved 7 June 2016.
  4. "Washington Sundar". Retrieved 7 June 2016.
  5. Dinakar, S. (17 May 2017). "The intriguing name of Washington Sundar". The Hindu. Archived from the original on 13 December 2020. Retrieved 17 January 2021.
  6. "The reason behind Washington Sundar's unique name". The Times of India. 5 August 2019. Retrieved 31 January 2020.
  7. "Washington Sundar's father reveals origin of RPS spinner's name". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 3 November 2019. Retrieved 31 January 2020.
  8. "Chicken biriyani, sakkara pongal treat awaits cricketer Washington Sundar on return". The News Minute (in ఇంగ్లీష్). 20 January 2021. Retrieved 20 January 2021.
  9. "Will Spend Quality Time When He Returns: Washington Sundar's Sister Shailaja After India's Test Win". 19 January 2021.
  10. Venugopal, Arun (15 May 2013). "Trying to make a name". The Hindu.
  11. "CSK plans cricket academy". The New Indian Express. 22 December 2017. Retrieved 31 January 2020.
  12. "Ranji Trophy, Group A: Mumbai v Tamil Nadu at Rohtak, Oct 6-9, 2016". ESPN Cricinfo. Retrieved 6 October 2016.
  13. "Washington Sundar's 156* underpins TN's dominance". ESPN Cricinfo. 15 October 2017. Retrieved 15 October 2017.
  14. "Indian Premier League, 24th match: Rising Pune Supergiant v Sunrisers Hyderabad at Pune, Apr 22, 2017". ESPN Cricinfo. Retrieved 22 April 2017.
  15. "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 27 January 2018.
  16. "Rahane, Ashwin and Karthik to play Deodhar Trophy". ESPN Cricinfo. Retrieved 19 October 2018.
  17. "PL Auction 2022 live updates". 12 February 2022. Retrieved 12 February 2022.
  18. "Watch: Washington Sundar claims five-wicket haul on county debut for Lancashire". The Indian Express (in ఇంగ్లీష్). 20 July 2022. Retrieved 19 December 2022.
  19. "Washington Hooda in India's T20 squad". ESPN Cricinfo. 4 December 2017. Retrieved 4 December 2017.
  20. "Washington Sundar replaces injured Jadhav in ODI squad". ESPN Cricinfo. 9 December 2017. Retrieved 9 December 2017.
  21. "2nd ODI (D/N), Sri Lanka tour of India at Chandigarh, Dec 13 2017". ESPN Cricinfo. 13 December 2017. Retrieved 13 December 2017.
  22. "3rd T20I (N), Sri Lanka tour of India at Mumbai, Dec 24 2017". ESPN Cricinfo. 24 December 2017. Retrieved 13 December 2017.
  23. "Washington Sundar youngest to play for India in T20Is". Times of India. Retrieved 24 December 2017.
  24. "Washington Sundar". Sportskeeda. Retrieved 12 February 2019.
  25. "Team India's T20I, ODI and Test squads for Tour of Australia announced". The Board of Control for Cricket in India (in ఇంగ్లీష్). Retrieved 27 October 2020.
  26. Henry, Matthew (17 January 2021). "Thakur and Sundar lead fightback in Brisbane". BBC Sport. Retrieved 17 January 2021.
  27. Dinakar, S. (14 January 2021). "Washington Sundar set to make his Test debut against Australia". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 15 January 2021.
  28. "Washington Sundar, Shardul Thakur fight with backs to wall in record 7th wicket stand at the Gabba". Indian Express (in Indian English). 17 January 2021. Retrieved 17 January 2021.
  29. "Records galore for Washington Sundar as all-rounder achieves rare double on Test debut against Australia". Times Now (in ఇంగ్లీష్). Retrieved 18 January 2021.