విక్రం సారాభాయ్
డా. విక్రం సారాభాయి |
|
| జననం | ఆగష్టు 12 1919 అహ్మదాబాదు, భారతదేశం |
|---|---|
| మరణం | డిసెంబరు 30, 1971 (వయసు 52) కేరళ్, తిరువనంతపురం లోని కోవలం |
| నివాసం | |
| జాతీయత | |
| రంగము | భౌతిక శాస్త్రము |
| సంస్థ | ఇస్రో భౌతిక శాస్త్ర పరిశోధనశాల |
| మాతృ సంస్థ | గుజరాత్ కాలేజి సెయింట్ జాన్ కళాశాల కేంబ్రిడ్జి, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం |
| పర్యవేక్షకుడు | సి.వి.రామన్ |
| ప్రాముఖ్యత | భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ |
| ముఖ్య పురస్కారాలు | పద్మభూషణ్ (1966) పద్మవిభూషణ్ (మరణాంతరం) (1972) |
విక్రం అంబాలాల్ సారాభాయి (ఆగస్టు 12, 1919 – డిసెంబరు 31, 1971) భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ కు ఆద్యుడు.
బాల్యము [మార్చు]
విక్రం సారాభాయ్ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో జన్మించాడు. వారి కుటుంబం ధనవంతులైన వ్యాపారస్తుల కుటుంబం. ఆయన తండ్రి అంబాలాల్ సారాభాయ్ అక్కడ పేరు పొందిన పారిశ్రామికవేత్త. ఆయనకు అక్కడ ఎన్నో మిల్లులు ఉండేవి. అంబాలాల్ , సరళా దేవి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో విక్రం సారాభాయ్ ఒకడు.
తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం సారాభాయి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, మరియు జవహర్‌లాల్ నెహ్రూ మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు.
అహ్మదాబాదులోని గుజరాత్ కళాశాల నుంచి మెట్రిక్ పాసయ్యాడు. తరువాతి చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. 1940లో అక్కడ నుంచి నాచురల్ సైన్సెస్ లో ట్రిపోస్ లో ఉత్తీర్ణుడయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం అప్పటికే ప్రారంభం అవడంతో భారతదేశానికి తిరిగి వచ్చి బెంగుళూరు లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సి.వి. రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపైన పరిశోధన మొదలుపెట్టాడు. రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత 1945 లో తిరిగి కేంబ్రిడ్జి వెళ్ళి పీహెచ్‌డీ పట్టా 1947లో సాధించుకుని వచ్చాడు.
కుటుంబం [మార్చు]
ఇతని భార్య మృణాలిని సారాభాయ్. ఆమె మంచి సాంప్రదాయ నర్తకి. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నై లో జరిగింది. అయితే వీరి పెళ్ళికి విక్రం సారాభాయ్ తరపు బంధువులు అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో బిజీగా ఉండటంతో ఎవరూ హాజరుకాలేకపోయారు. వీరి కుమార్తె మల్లికా సారాభాయ్.ఈమె కూడా మంచి నర్తకి. కొడుకు కార్తికేయ.