అహ్మదాబాద్

వికీపీడియా నుండి

గుజరాత్ రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం అయిన అహ్మదాబాద్ నగరాన్ని సుల్తాన్ అహ్మద్ షా, సబర్మతి నది ఒడ్డున నిర్మించారు. ఫిబ్రవరి 26, 1411 తేదీన సూఫీ సన్యాసుల సమక్షంలో ఈ నాడు ఎలిస్ బ్రిడ్జ్ అని పిలవబడే ప్రదేశంలో సబర్మతి నది ఒడ్డున శంకుస్థాపన చేశాడు. ఈ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఇప్పటికీ చూడచ్చు ఈ ప్రదేశాన్ని మానెక్ బుర్జ్ అంటారు. అయితే ఈ శంకుస్థాపన తేది గురించి అనేక వివాదాలున్నాయి. చరిత్రకారులు ఎక్కువగా విశ్వసించే తేది మాత్రం ఇదే. దీనికి ఆధారం రత్నమణి భీమ్‌రావ్ జోట్ 1928లో వ్రాసిన "గుజరాత్‌ను పట్నగర్ అమ్దావాద్" మరియు అనేక ఇతర చారిత్రాత్మక పుస్తకాలు. అహ్మదాబాద్ గెజిటీర్ ప్రకారం ఈ పట్టణానికి పునాది రాళ్ళు పడిన తేది మార్చి 4, 1411. "మాంచెస్టర్ ఆప్ ఇండియా" అని యూరోపియన్లతో శతాబ్దాల క్రితం కొనియాడబడిన ఈ నగరం లో ఎన్నో సుందరమైన పురాతన కట్టడాలను ఈ నాటికీ పాత పట్టణం (ఓల్డ్ సిటీ)లో చూడొచ్చు. ప్రహరీ కలిగిన ఈ పాత పట్టణంలో అనేక సుందరమైన రాతి తలుపులు (దర్వాజాలు) మనసుని మైమరిపిస్తాయి.

Sayyadsiddiki.jpg

విషయ సూచిక

చరిత్ర [మార్చు]

భౌగోళికం [మార్చు]

వాతావరణం [మార్చు]

నగర రూపురాఖలు [మార్చు]

పూల తోటలు మరియు పార్క్‌లు [మార్చు]

ప్రజాపరిపాలన [మార్చు]

ఆర్ధికం [మార్చు]

జనసంఖ్య [మార్చు]

సంస్కృతి [మార్చు]

పండుగలు [మార్చు]

ఆహార సంస్కృతి [మార్చు]

కళలు మరియు వాజ్మయం [మార్చు]

క్రీడలు [మార్చు]

ప్రయాణ సౌకర్యాలు [మార్చు]

వాయు మార్గం [మార్చు]

రైలు మార్గం [మార్చు]

రహదారి మార్గం [మార్చు]

అహ్మదాబాద్ బి ఆర్ టి ఎస్ [మార్చు]

అహ్మదాబాద్ మెట్రో [మార్చు]

విద్యారంగం [మార్చు]

మాద్యమం [మార్చు]

ఇవి కూడా చూడండి [మార్చు]

పరిశీలనలు [మార్చు]

మరిన్ని వివరాలు. [మార్చు]

  1. అహ్మదాబాద్ ఫిబ్రవరి 26, 1411 లో నిర్మించబడినా, దానికి పఠిష్టమైన, శత్రుదుర్భేధ్యమైన ప్రహరీని సుల్తాన్ మహమ్మద్ బేగ్డా 1486 లో నిర్మించాడు.

తరువాత 1857 లో ఇంకా కొన్ని ప్రదేశాలను కలుపుని అహ్మదాబాద్ విస్థీర్ణం 5.56 చదరపు కి.మీ. అయింది.

  1. 1560 లో అద్బుతమైన కార్వింగ్స్ తో, పట్టణానికే శోభనిచ్చే అందమైన డిజైన్ తో పలుచటి రాతి కిటికీలతో కూడిన సిద్ది సయ్యద్ మసీదు ని నిర్మించారు.
  2. 1636 లో భద్ర ఫోర్ట్ ని ఆజామ్ ఖాన్ నిర్మించాడు. ఇది ఈ నాటికీ తలెత్తుకుని ఉంది.
  3. 1708 లో మరాఠా వీరుడు బాలాజీ విశ్వనాధ్, అహ్మదాబాద్‌ని ముట్టడించాడు.
  4. 1753 లో అహ్మదాబాదు మరాఠా పాలనలోకి వచ్చింది.
  5. 1826 లో మొట్టమొదటి గుజరాతి బడి తెరవబడింది.
  6. 1831, ఏప్రిల్ 22 న అహ్మదాబాద్ మునిసిపాలిటి అయింది.
  7. 1848 మొట్టమొదటి ఆంగ్ల బడి మొదలయింది.
  8. 1849 లో మొట్టమొదటి వారపత్రిక "అమ్దావాద్ వార్తామన్పత్ర" గుజరాత్ వర్నాక్యులర్ సొసైటి వారిచే ప్రారంభించబడింది.
  9. 1869-70 లో సబర్మతీ నది అద్దరి ఇద్దరి ని కలుపుతూ ఇనుముని ఉపయోగించి అందమైన డిజైన్ తో, ఎలీస్ బ్రిడ్జ్ ని రూ.5,29,210 ఖర్చుతో నిర్మించారు. దీనికి నార్త్ జోన్ కమీషనర్ గా ఉండిన సర్ బారో రోబర్ట్ ఎలిస్ పేరు పెట్టారు. (దీన్ని కూలగొట్టకుండా అలాగే ఉంచి. వాహనాల రాకపోకలు నిషేధించి అటు వెళ్ళటానికి, ఇటు రావటానికి రెండు వేరే బ్రిడ్జ్ లను నిర్మించి కాపాడింది అహ్మదాబాద్ మునిసిపల్ కమీషన్.)
  10. 1861 లో మొట్టమొదటి కాటన్ మిల్లుని సేఠ్ రాంచోడ్ లాల్ రానియావాలా నిర్మించాడు.
  11. 1863 లో అహ్మదాబాద్ మరియు సూరత్ ల మధ్య రైలు మార్గం ఏర్పడింది. 1884 లో కాలుపూర్ స్టేషన్ నిర్మించబడింది.
  12. 1885 లో మొట్టమొదటి మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. మొదటి AMC అధ్యక్షుడు రాన్ చోడ్ లాల్ చోటాలాల్.
  13. 1894 లో City Stock Broker's Association ఏర్పడింది.
  14. 1905 లో గుజరాత్ సాహిత్య పరిషద్ ఏర్పడింది.
  15. 1909 లో మూగ చెవిటి వారికోసం బడి తెరవబడింది.
  16. 1915 లో మహాత్మాగాంధి మొదటి సత్యాగ్రహ ఆశ్రమాన్ని కోచ్రబ్ దగ్గర ఏర్పాటుచేసారు. ఫారడే ఎలక్ట్రిసిటిని కనుగొన్న 83 ఏళ్ళ తరువాత ఇక్కడ మొదటి ఎలక్ట్రిక్ బల్బ్ ను "భద్ర కోట" (Bhadra Fort) పైన ఉండే టవర్ లో వెలిగించారు.
  17. 1917 లో రెండవ సత్యాగ్రహ ఆశ్రమాన్ని సబర్మతి వడ్డున ఇప్పుడున్న ప్రదేశం లోనే స్థాపించారు.
  18. 1920 లో గుజరాత్ విద్యాపీఠ్ నవంబర్ 15 తేది న జాతీయతా భావాన్ని బోధించటానికి ఏర్పరచారు. అది ఇప్పటికీ విజయవంతంగా నడుపబడుతూంది
  19. 1921 భారతదేశం లోనే మొట్టమొదటిసారి, మన జాతీయ జండాని ఎగురవేసారు. (తరువాత ఆ ప్రదేశాన్నే VS Hospital అని పిలవబడే ప్రభుత్వ ఆరోగ్యసంస్థ గా మార్చారు.)
"http://te.wikipedia.org/w/index.php?title=అహ్మదాబాద్&oldid=810517" నుండి వెలికితీశారు