విశ్వ ఫెర్నాండో

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశ్వ ఫెర్నాండో
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ముత్తుతంత్రిగే విశ్వ తిలిన ఫెర్నాండో
పుట్టిన తేదీ (1991-09-18) 1991 సెప్టెంబరు 18 (వయసు 32)
కొలంబో, శ్రీలంక
ఎత్తు5 ft 10 in (1.78 m)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలరు
బంధువులుNuwanidu Fernando (brother)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 137)2016 ఆగస్టు 4 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2023 ఏప్రిల్ 24 - ఐర్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 182)2017 ఆగస్టు 20 - ఇండియా తో
చివరి వన్‌డే2019 మార్చి 6 - దక్షిణాఫ్రికా తో
ఏకైక T20I (క్యాప్ 74)2017 డిసెంబరు 20 - ఇండియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2012–2016Bloomfield Cricket and Athletic Club
2020Kandy Tuskers
2023–presentChattogram Challengers
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు టి20 టి20
మ్యాచ్‌లు 16 8 1 8
చేసిన పరుగులు 68 30 2 2
బ్యాటింగు సగటు 5.23 15.00 2.00 2.00
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 38 7* 2 2
వేసిన బంతులు 2,616 297 12 126
వికెట్లు 43 5 0 8
బౌలింగు సగటు 37.30 67.40 - 23.87
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 5/101 1/35 - 2/17
క్యాచ్‌లు/స్టంపింగులు 3/0 0/0 0/0 1/0
మూలం: Cricinfo, 15 May 2022

ముత్తుతంత్రిగే విశ్వ తిలిన ఫెర్నాండో, శ్రీలంక క్రికెటర్. క్రికెట్ లోని మూడు ఫార్మాట్‌లలో శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] మొరటువాలోని సెయింట్ సెబాస్టియన్ కళాశాలలో తన విద్యను అభ్యసించాడు. ఇతడు వర్ధమాన క్రికెటర్ నువానీడు ఫెర్నాండోకి అన్నయ్య.

జననం[మార్చు]

ముత్తుతంత్రిగే విశ్వ తిలిన ఫెర్నాండో 1991, సెప్టెంబరు 18న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.

దేశీయ కెరీర్[మార్చు]

2015 ఆగస్టులో శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్స్ XI వర్సెస్ భారత జాతీయ క్రికెట్ జట్టు మధ్య జరిగిన టూర్ మ్యాచ్‌లో ఆడాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం 15 మంది సభ్యుల జట్టుకు పిలవబడ్డాడు.[2] 2016 జూలైలో ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం శ్రీలంక టెస్టు జట్టులో అతను ఎంపికయ్యాడు.[3]

2018 మార్చిలో 2017–18 సూపర్ ఫోర్ ప్రావిన్షియల్ టోర్నమెంట్ కోసం కొలంబో జట్టులో ఎంపికయ్యాడు.[4][5] తరువాతి నెలలో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం కొలంబో జట్టులో కూడా ఎంపికయ్యాడు.[6]

2018 ఆగస్టులో 2018 ఎస్ఎల్సీ టీ20 లీగ్‌లో కాండీ జట్టులో ఎంపికయ్యాడు.[7] 2019 మార్చిలో 2019 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం దంబుల్లా జట్టులో ఎంపికయ్యాడు.[8] 2021 ఆగస్టులో 2021 ఎస్ఎల్సీ ఇన్విటేషనల్ టీ20 లీగ్ టోర్నమెంట్ కోసం ఎస్ఎల్సీ గ్రీన్స్ జట్టులో ఎంపికయ్యాడు.[9]


అంతర్జాతీయ కెరీర్[మార్చు]

ఫెర్నాండో ఆస్ట్రేలియాతో 2016 ఆగస్టు 4న ప్రధాన పేసర్‌గా జరిగిన రెండో టెస్టులో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి ఓవర్‌లోనే జో బర్న్స్ వికెట్ తీశాడు.[10] అయితే ఈ మ్యాచ్‌లో శ్రీలంక 229 పరుగుల తేడాతో గెలిచి, వార్న్-మురళీధరన్ ట్రోఫీని తొలిసారిగా కైవసం చేసుకుంది.[11]

2017 ఆగస్టులో భారత్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక వన్డే ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[12] 2017 ఆగస్టు 17న భారతదేశంపై శ్రీలంక తరపున తన వన్డే అరంగేట్రం చేసాడు.[13] మూడో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని అవుట్ చేయడంతో అతను తన మొదటి వన్డే వికెట్ తీసుకున్నాడు. 2017 అక్టోబరులో పాకిస్థాన్‌తో జరిగే సిరీస్ కోసం శ్రీలంక ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులో ఎంపికయ్యాడు.[14] 2017 డిసెంబరు 20న భారత్‌పై శ్రీలంక తరపున తన టీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి వికెట్ తీయలేదు.[15]

2018 మేలో 2018–19 సీజన్‌కు ముందు శ్రీలంక క్రికెట్ ద్వారా జాతీయ కాంట్రాక్ట్‌ను పొందిన 33 మంది క్రికెటర్లలో అతను ఒకడు.[16][17]

టెస్ట్ కెరీర్[మార్చు]

2019 ఫిబ్రవరిలో ప్రధాన పేస్ బౌలర్లకు గాయాలు కారణంగా అతను ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ టెస్ట్ కోసం జట్టులోకి వచ్చాడు.[18][19]

2019 ఫిబ్రవరి 16న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫెర్నాండో, కుసల్ పెరీరాతో కలిసి 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఒక వికెట్ తేడాతో మ్యాచ్‌ని గెలిపించాడు. [20] బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నాలుగు వికెట్లు తీశాడు.[21]

2021 జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో, ఫెర్నాండో టెస్ట్ క్రికెట్‌లో మొదటి ఐదు వికెట్లను తీశాడు.[22]

మూలాలు[మార్చు]

  1. "Vishwa Fernando". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  2. "India tour of Sri Lanka, Tour Match: Sri Lanka Board President's XI v Indians at Colombo (RPS), Aug 6–8, 2015". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  3. "Siriwardana left out of Sri Lanka squad for first Test". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  4. "Cricket: Mixed opinions on Provincial tournament". Sunday Times (Sri Lanka). 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-24.
  5. "All you need to know about the SL Super Provincial Tournament". Daily Sports. 26 March 2018. Archived from the original on 2018-03-27. Retrieved 2023-08-24.
  6. "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-24.
  7. "SLC T20 League 2018 squads finalized". The Papare. Retrieved 2023-08-24.
  8. "Squads, Fixtures announced for SLC Provincial 50 Overs Tournament". The Papare. Retrieved 2023-08-24.
  9. "Sri Lanka Cricket announce Invitational T20 squads and schedule". The Papare. Retrieved 2023-08-24.
  10. "Perera bowls Sri Lanka to series triumph". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  11. "Warne-Muralitharan Trophy, 2016 – 2nd Test". ESPNcricinfo. Retrieved 2023-08-24.
  12. "Thisara, Siriwardana return to ODI squad". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  13. "1st ODI (D/N), India tour of Sri Lanka at Dambulla, Aug 20 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  14. "Thisara Perera to captain Sri Lanka in Lahore". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  15. "1st T20I (N), Sri Lanka tour of India at Cuttack, Dec 20 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  16. "Sri Lanka assign 33 national contracts with pay hike". International Cricket Council. Retrieved 2023-08-24.
  17. "Sri Lankan players to receive pay hike". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  18. "Doubts over Lakmal add to Sri Lanka's headaches". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  19. "Slippery fingers aggravate Sri Lanka's torrid day". ESPN Cricinfo. Retrieved 2023-08-24.
  20. "'Wanted to compete every hour, every session' - Karunaratne". ESPN Cricinfo.
  21. "Sri Lanka's green seamers 'caught us off guard', admits Quinton de Kock". ESPN Cricinfo.
  22. "Vishwa Fernando claims maiden five-for as Sri Lanka rally after Dean Elgar century". ESPN Cricinfo. Retrieved 2023-08-24.

బాహ్య లింకులు[మార్చు]