శాన్ ఫ్రాన్సిస్కో
అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పశ్చిమాన పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉన్న అందమైన నగరం శాన్ ఫ్రాన్సిస్కో (San Francisco). పసిఫిక్ సముద్రతీరానికి దీనిని ద్వారంగా వ్యవహరిస్తారు. దీని జనాభా సుమారు ఎనిమిది లక్షలు. ఇది జనాభా పరంగా రాష్ట్రంలో నాల్గవస్థానంలోనూ, జనసాంద్రత విషయంలో అమెరికాలో ఇది రెండవస్థానంలోనూ ఉంది. ఈ పట్టణం కొండలకు ప్రసిద్ధి. ఈ పట్టణంలో 50 కొండలు ఉన్నాయి. ఈ కొండలను సుందర పర్యాటక కేంద్రంగా మలచారు. ఇవికాక పర్యాటక కేంద్రాలైన అనేక దీవులు ఉన్నాయి.
నగర చరిత్ర
[మార్చు]పురాతత్వ పరిశోధనల ఆధారంగా క్రీ.పూ. 3000 సంవత్సరాల నుండి ఇక్కడ మానవ నివాసమున్న ఋజువులు ఉన్నాయి.[1] ఎలము గుంపుకి చెందిన ఒహ్లోన్ ప్రజలు ఇక్కడ అనేక చిన్న చిన్న పల్లెలలో నివాసము ఉన్నారని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. గాస్పర్ డీ పోర్టోలా నాయకత్వములో స్పెయిన్ దేశస్థులు ఈ ద్వీపకల్పములోని తీరంలోని స్వర్ణద్వారము (గోల్డెన్ గేట్) సమీపంలో కోటను నిర్మించి నివాసము ఏర్పరుచుకున్నారు. అటుపైన "మిషన్ సాన్ ఫ్రాన్సిస్కో డి అస్సిసి" లేదా మిషన్ డోలోరెస్ అనే పేరుతో ఒక మిషనరీని అభివృద్ధి చేసారు.
స్పెయిన్ దేశము నుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత ఈ ప్రాంతం మెక్సికోలో ఒక భాగంగా ఉంది. 1835వ సంవత్సరములో విలియమ్ రిచర్డ్సన్ ప్రస్తుతము పోర్త్స్ మౌత్ సమీపంలో అల్కల్డే ఫ్రాన్సిస్ డీ హేరోతో చేర్చి ఒక వీధి రూపకల్పన చేసి నిర్మించి దానికి యర్బా బ్యూనే అని నామకరణము చేశాడు. ఇది అమెరికా వాసులను ఇక్కడ స్థిర నివాసము ఏర్పరచుకునేలా ఆకర్షించడము మొదలు పెట్టినది. 1846వ సంవత్సరములో జరిగిన 1846 మెక్సికన్ యుద్ధంలో జాన్ డి.స్లాట్ నాయకత్వములో అమెరికా కాలిఫోర్నియాని వశపరచుకుంది. రెండు రోజుల తరువాత వచ్చిన జాన్ బి.మోన్ట్ గోమరీ నాయకత్వములో యర్బాబ్యూనే అమెరికా వశమైంది. తరువాతి కాలంలో యర్బాబ్యూనేకి తిరిగి శాన్ ఫ్రాన్సిస్కోగా నామాన్ని స్థిరపరచారు. 1848వ సంవత్సరంలో ఇక్కడ శాన్ఫ్రాన్సిస్కో గోల్డ్ రష్|బంగారు గనులు కనిపెట్టిందువలన ఇక్కడకు ప్రజాప్రవాహము దేశము నలుమూలల నుండి ప్రపంచములోని ఇతర ప్రాంతాలనుండి వచ్చి, ఇక్కడ నివాసము ఏర్పరుచుకున్నారు. వీరి రాకతో నగరం అతి శీఘ్రగతిని అభివృద్ధి వైపు పయనించింది. బంగారు వేటలో చేరిన జనప్రవాహము వరదలా నగర జనాభాని 1,000 జనసంఖ్య నుండి 25,000 వేల జనసంఖ్యగా అభివృద్ధి చెందేలా మార్చింది. తరువాతికాలంలో 1906వ సంవత్సరములో సంభవించిన భూకంపము, అగ్ని ప్రమాదము ఈ నగరాన్ని అతలాకుతలము చేసి చాలా వరకు ధ్వంసము చేసాయి. అతి శీఘ్రగతిలో దీనిని అభివృద్ధి చేసి దీనిని బేటా సిటీగా గుర్తింపు పొందేలా చేయడంలో నగరపాలక సంస్థ తన సామర్ధ్యాన్ని చాటుకుంది. బంగారు గనుల కారణంగా ఇక్కడకు వచ్చిన ధనవంతులు వదిలివేసిన ఓడలు రేవుని నావారణ్యముగా మార్చింది. శీఘ్రముగానే కాలిఫోర్నియా అమెరికా ప్రభుత్వముచే రాష్ట్రీయ హోదాను సంతరించుకుంది. అమెరికా రక్షణ వ్యవస్థ స్వర్ణద్వారము వద్ద ఒకటి, అల్కాట్రాజ్ దీవి వద్ద ఇంకొక రేవును నిర్మించి శాన్ ఫ్రాన్సిస్కో సముద్రాన్ని సురక్షితము చేసింది. తర్వాతి కాలంలో కనిపెట్టబడిన వెండి గనులు నగరాన్ని మరింత జనప్రవాహంలో త్వరగానే ముంచెత్తింది. అదృష్టాన్ని వెతుక్కుంటూ వచ్చి చేరిన అల్లరిమూకల వలన నగరంలో, చట్ట అతిక్రమణ సాధారణం అయింది, బార్బరీ కోస్ట్ జూదం, వ్యభిచారం లాంటి నేరాలకు కేంద్రమై నేరస్తుల స్వర్గ సీమగా పేరు తెచ్చుకుంది. పెట్టుబడిదారులు బంగారు ఉత్పత్తుల రంగములో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహము చూపారు. 1852వ సంవత్సరములో వెల్స్ ఫార్గో బ్యాంకును స్థాపించి మొట్టమొదటి విజయాన్ని బ్యాంకర్స్ సాధించారు. లేలాండ్ నాయకత్వములో ప్రముఖవ్యాపార సంస్థ బిగ్ ఫోర్ సమష్టి కృషిలో సెంట్రల్ పసిఫిక్ రైల్ రోడ్ యొక్క పశ్చిమ భాగమైన మొట్టమొదటి ట్రాన్స్ కాంటినెంటల్ రైల్ రోడ్ నిర్మాణమూ, ఓడ రేవు అయిన పోర్ట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో విస్తరణ నగరము వ్యాపార కూడలిగా అభివృద్ధి సాధించడానికి దోహదమైంది. పెరిగిన జనాభా అభిరుచులకు అనుగుణంగా ఆహారశాలలు (హోటల్స్), ఆహార తయారీ సంస్థలు వెలిశాయి. లెవీస్ట్రాస్ డ్రై గుడ్స్ వ్యాపారాన్ని, డొమింగో గిరార్ డెల్లి స్థాపించిన చాక్లెట్ తయారీ ఈకాలములో ఆరంభమైనదే. చైనా వలస కార్మికుల ద్వారా అభివృద్ధి చెందిన చైనాటౌన్, 1873వ సంవత్సరములో మొట్టమొదటి కేబుల్ కార్ వారిచే క్లేస్ట్రీట్ నిర్మాణమూ, విక్టోరియన్ హౌసెస్ నిర్మాణమూ రూపుదిద్దుకున్నాయి. వీటితో నగరం విభిన్న సంస్కృతుల సమాహారమైనది. నగరపాలక సంస్థ వారిచే నిర్మించబడిన బహు సుందరమైన గోల్డెన్ గేట్ పార్క్, శాన్ ఫ్రాన్సికన్లచే నిర్మింపబడిన స్కూల్స్, చర్చిలు, థియేటర్లు నగరజీవితానికి కావలసిన అన్ని హంగులతో నగరం అభివృద్ధి పదంలో అడుగులు వేసింది. పసిఫిక్ తీరములో అతి ముఖ్యమైన అమెరికన్ రక్షణవ్యవస్థను స్థాపించి అభివృద్ధి చేశారు. శతాబ్దపు ఆఖరి దశలో ప్రత్యేక మైన శైలి, విశిష్టమైన హోటల్స్, ఆకర్షణీయమైన నోబ్ హిల్స్ లో నిర్మించబడిన మేడలు, ఉల్లాసమైన కళలతో నగరం విశిష్ట ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ప్రకృతి వైపరీత్యము
[మార్చు]ప్రకృతి వైపరీత్యము 1906 ఏప్రిల్ 18వ సంవత్స్రములో ఉదయము 5 గంటలా పన్నెండు నిమిషాలకు సంభవించిన భూకంపము ఉత్తర కలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని అతలాకుతలము చేసింది. దెబ్బతిన్న గ్యాస్ పైపుల నుండి వెలువడిన వాయువుల వలన రగిలిన మంటలను ఆర్పడానికి కొన్ని రోజుల వరకు అసాధ్యపడమైంది. మంటలను ఆర్పడానికి కాలసిన నీటి సరఫరా లభ్యము కాలేదు. దాదాపు మూడు వంతుల నగరం కంటే ఎక్కువ భాగము ధ్వంసము అయ్యింది. నగర నడిబొడ్డున ఉండే డౌన్ టౌన్ చాలా వరకు శిథిలమైంది. అప్పటి లెక్కలను అనుసరించి 498 మంది అసువును కోల్పోయినట్లు తేలినా నవీన అంచనాల ప్రకారము వేలసంఖ్యలో ఉండచ్చని ఊహిస్తున్నారు. సగము నగ్ర ప్రజల కంటే ఎక్కువగా 40,000 ప్రజలు నిరాశ్రయులైయ్యారు. సముద్ర తీరములోను స్వర్ణద్వారము సమీపములోను, ప్రెసీడియో సమీపములోను గుడారాలలో ప్రజలు తలదాచుకున్నారు. చాలామంది ప్రజలు తూర్పుతీరాలకు శాశ్వతముగా వలస పోయారు.
నగర పునర్నిర్మాణము
[మార్చు]నగర పునర్నిర్మాణము అతి వేగంగా బృహత్ప్రణాళికలతో చేపట్టి శాన్ ఫ్రాన్సిస్కోను అతివేగంగా మునుపటికంటే బ్రహ్మాండముగా నిర్మించి నగర పునరుద్ధరణలో సఫలీకృతులైనారు. ప్రస్తుతము అమెరికా బ్యాంకిగా మారిన అమేడియో గిన్నిస్, బ్యాంక్ ఆఫ్ ఇటలీ భాధితులకు కావలసిన నిధులను సమకూర్చింది. శిథిలమైన మేన్‌షన్స్ గ్రాండ్ హోటల్స్గా,సిటీ హాల్ మరింత సుందరంగాను నిర్మించారు. 1915వ సంవత్సరము పనామా పసిఫిక్ ప్రదర్శన వద్ద నగర పునః జన్మదినాన్ని ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు. తరువాతికాలంలో నగరం ఆర్థిక పఠిష్టతను సాధించింది. 1929వ సంవత్సరంలో జరిగిన షేర్ మార్కెట్ పతనంలో ఎదుర్కొని శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత బ్యాంకులన్ని నిలదొక్కుకోవడము దానికి నిదర్శనం. శాన్ ఫ్రాన్సిస్కో ఏకకాలంలో శాన్ ఫ్రాసిస్కో-ఓక్ లాండ్ బే బ్రిడ్జ్, గోడెన్ గాట్ బ్రిడ్జ్ రెడు బృహత్తర నిర్మాణాలను చేపట్టి వాటిని వరసగా 1936, 1937 వ సంవత్సరాలలో పూర్తి చేసింది. శాన్ ఫ్రాన్సిస్కో తిరిగి సాధించిన ఘనతను వరల్డ్ ఫైర్, అంతర్జాతీయ గోల్డెన్ గేట్ ఎక్స్పోసిషన్ జరిపటము ద్వారా చాటుకున్నది. ఈ సందర్భములో ఏర్బా బ్యూనే సమీపంలో సముద్ర మద్యములో ట్రెషర్ ఐలాండ్ కృత్రిమ దీవి నిర్మించబడింది.
ముఖ్యసంఘటనలు
[మార్చు]రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఫోర్ట్ మేషన్ సైనికులను ఓడ ఎక్కించే ప్రధాన కేంద్రమైంది. పసిఫిక్ దియేటర్ ఆF ఆపరేషన్ కారణంగా విపరీతముగా పెరిగిన ఉపాధి అవకాశాలు యువతను శాన్ ఫ్రాన్సిస్కో వైపు ఆకర్షించాయి.ప్రధానంగా దక్షిణ ఆఫ్రిక అమెరికన్లని. యుద్ధానంతరము ప్రంచము నలు దిశలనుండి తిరిగి వచ్చిన సైనికులు అక్కడే పనులు చూసుకొని స్థిరపడసాగారు. ఐక్యరాజ సమితి రూపుదిద్దుకొని 1945 నుండి 1951లలో సంతకాలు పెట్టడము లాంటి కార్యక్రమాలు శాంఫ్రాన్సిస్కోలోనే చేశారు. జపాన్ యుద్ధముతో అధికార పూర్వముగా యుద్ధము ముగిసింది.
నగరాభివృద్ది
[మార్చు]నగరాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వ్శాలమైన రహదార్లనిర్మాణము,పాత కట్ట్డాలను పడత్రోసి నూతన కట్టడాలు ఎక్కువగా కట్టసాగారు.1972వ సంవత్సరములో ట్రాన్స్ అమెరికా పిరమిడ్ కట్టి ముగించారు,మేన్ హట్టనిజం ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోగా పిలవబడే బృహత్ వ్యయముతో విస్తారమైన ఉన్నత కట్టడాలటో డౌన్ టౌన్ విస్తరించబడింది.రేవుకు సంబంధించిన కార్యక్రమాలు ఓక్ లాండ్ కు తరలించబడ్డయి. నగరం సంస్థాగత ఉపాధులను కోల్పోవడము ఆరంభమైన కారణము వలన,విహార కేంద్రముగా అభివృద్ధి చెందడము ప్రారంభము అయింది.నగరానికి టూరిజము ప్రధాన ఆర్థిక వనరుగా మారింది.విపరీతమైన నగరపుర అభివృద్ధి వలన నగరం సరికొత్త రూపు రేఖలను సంతరించుకుంది.ఎక్కువభాగము తెల్లవాళ్ళు నగరాన్ని వదిలి వెళ్ళగా ఆసియా,లాటిన్ అమెరికానుండి వలస వచ్చి చేరిన ప్రజలు ఆస్థాన్ని భర్తీ చేశారు.
సాంస్కృతిక నూతన పోకడలు
[మార్చు]నగరం అభివృద్ధి దిశగా పయనించినంత వేగంగా యవతను తనవైపు ఆకర్షించడము మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా రచయితలకు ప్రేరణ,ఉత్సాహాలకు ఇది కేంద్ర బిందువుగామారింది. 1950వ సంవత్సరములో నార్త్ బీచ్ సమీపములో బీట్ జనరేషన్ తన కార్యక్రమాలను సాగించారు. 1960వ సంవత్సరములో హైట్ ఆష్ బ్యూరీకి హిప్పీల రాక 1967 నుండి1970 లలో శిఖరాగ్రాన్ని చేరుకుంది,నగరం గే రైట్స్ ఉద్యమానికి కేంద్రమై బ్యాంకర్ జాన్ షెన్ నాయకత్వములో కేస్ట్రో జిల్లాలో . గే విలేజ్ వెలసింది. గే విలేజ్ బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్ ఎన్నిక1978 లో ఆయన హత్య,దాని తరువాత మేయర్ జార్జ్ మాస్కాన్ హత్య. 1989వ సంవత్సరములో లోమా ప్రీతా భూకంపము సముద్ర తీరములో విధ్వంసాన్ని జననష్టాన్ని కలిగించి,శాన్ ఫ్రాన్సిస్కో లోని మరీనా, సౌత్ ఆఫ్ మార్కెట్ జిల్లాలలో విధ్వంసాన్ని సృష్టించడమే కాక ఎంబార్ కేషన్ ఫ్రీ వే,సెంట్రల్ ఫ్రీవేని చాలా భాగము విధ్వంసము చేయడంతో డౌన్ టౌన్ ముందున్నట్లుగానే సముద్ర తీరానికి చేరింది.1990 వ సంవత్సరములో మొదలైన డాట్ కాము ప్రభంజనములో చిన్నగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలు ఆర్థికంగా పుంజుకోవడము ఆరంభించాయి.ఎక్కువ సంఖ్యలో వచ్చి చేరిన కంపూటర్ డెవలపర్స్,వ్యాపారులు,మార్కేటింగ్,అమ్మకందారుల కారణంగా నగరపుర వాసుల సాఘిక ఆర్థిక స్థితి మెరుగు పడింది.2001 వ సంవత్సరములో ఈ బుడక పగులు బారడంతో చిన్న కంపెనీల తిరోగమనంవలన ఉద్యోగులు వెనుకకు వెళ్ళినా మంచి కంపెనీలు నగర ఆర్థిక వనరుగా ప్రదానపాత్ర వహిస్తున్నాయి.
భౌగోళికంగా శాన్ ఫ్రాన్సిస్కో
[మార్చు]అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో ద్వీపకల్పానికి ఉత్తర దిశగా చివరి భాగములో పడతిష్ఠితమై ఉన్న నగరం శాన్ ఫ్రాన్సిస్కో పడమటి దిశలో పసిఫిక్ సముద్రము,తూర్పు దిశలో శాన్ ఫ్రాన్సిస్కో సముద్రము దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. ఆల్కాట్రాజ్, ట్రెషర్ ఐలాండ్, ఎర్బా బ్యూనే ఐలాండ్ వీటితో చిన్నచిన్న ద్వీపాలైన ఆల్మెండా, ఏంజల్ ఐలాండ్ రెడ్ రాఖ్ ఐలాండ్స్ వీటితో 43 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న నివాసాలు లేని ఫరలాన్ ఐలాండ్స్ నగరంలోని భాగమే. నగరం ప్రధాన భాగము 11 కిలోమీటర్లు. శాన్ ఫ్రాన్సిస్కో కొండలకు ప్రసిద్ధి పొందిన నగరం. నగర సరిహద్దులలో 50 దాకా కొండలు ఉన్నాయి. సమీపంలోని కొన్ని కొండలు దాని నివాసితుల పేర్లతో పిలవబడుతున్నాయి. ఉదాహరణగా నాబ్ హిల్ల్స్,పసిఫిక్ హైట్స్,రష్యన్ హిల్ల్స్, పోట్రిరో హిల్ల్స్, టెలిగ్రాఫ్ హిల్ల్ చెప్పవచ్చు. నగరానికి మధ్య భాగములో తూర్పు వైపు దక్షిణభాగంలో డౌన్ టౌన్ ప్రాంతము,తక్కువ జనసాంద్రత ఉన్న కొండలు,వీటిలో ప్రత్యేక ఆకర్షణ మౌంట్ సుత్రో మీద ఉన్న ఎరుపు తెలుపు రంగుల రేడియో టెలివిజన్ టవర్.దాని సమీపంలోని నగరంలోని ఉన్నత ప్రదేశాలలో ఒకటై యాత్రికులను ఆకర్షించే ట్విన్ టవర్స్,అత్యున్నతమైనదిగా డేవిడ్సన్ కొండను గుర్తించారు, దీని ఎత్తు 925 అడుగులు. దీనిపై 1934 వ సంవత్సరములో 103 అడుగుల ఎత్తైన శిలువ నిర్మించబడింది. 1906 నుండి 1989 వరకు వ్రరసగాసంభ వించిన భూకంపాలకు సాన్ ఆండ్రీస్,హేవార్డ్ ఫాల్ట్స్ యొక్క భౌగోళిక పరిస్థితులే కారణంగా గుర్తింప బడ్డాయి.ఈ కారణంగా నగర పునర్నిరాణములో విశేష జాగర్తలు తీసుకున్నారు. కొత్త కట్టడాలు పాతవాటికంటే సురక్షితమైనవిగా భావిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో సముద్ర తీరము కృత్రిమ పద్ధతిలో విస్తరించ బడింది. మరీనా,హంటర్ పాయింట్ మొత్తము ఓడ ఎక్కించే ఫ్రీవే నిర్మాణాలు విస్తరించిన భూభాగంలోనిర్మించ బడింది. ఎబ్రాబ్యూనే నుండి సొరంగ మార్గము వేసి నిర్మించిన ట్రెషర్ ఐలాండ్.ఇలాంటి ప్రాంతాలు భూకంపము సంభవించినపుడు భారీ నష్టాన్ని చవి చూస్తున్నట్లు ప్రీతా భూకంపము రుజువు చేసింది.
శాన్ ఫ్రాన్సిస్కో వాతావరణము
[మార్చు]శాన్ ఫ్రాన్సిస్కో వాతావరణము వేసవి 21 సెంటీగ్రేడ్ అత్యధిక ఉస్ణోగ్రతను, అత్యల్ప ఉషోగ్రత సెంటీగ్రేడ్ సరాసరి ఉష్ణో గ్రతను కలిగి ఉంటుంది. 2000వ సంవత్సరము జూన్ లో నమోదైన 39 సెంటీగ్రేడ్ ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. చలికాలములో సరాసరి ఉష్ణోగ్రత పగటి పూట ఉష్ణోగ్రత 15 సెంటీగ్రేడ్. గడ్డ కట్టించే చలి ఎప్పుడు ఉండదు.1932 వసంవత్సరము డిసెంబరు మాసంలో 11వ తేదీ అత్యల్ప ఉషోగ్రతగా -3 సెంటీగ్రేడ్ గా నమోదైంది. మే నుండి సెప్టెంబరు వరకూ గాలిలో తేమ శాతము తక్కువగా ఉంటుంది. నవంబరు నుండి మార్చి నరకు వర్షాలు సాధారణంగా కురుస్తుంటాయి. మంచు కురవటము అపూర్వము ఇంతవరకు 1852 వ సంవత్సరము నుండి 10 సార్లు మాత్రమే నమోదైంది. 1887 వ సంవత్సరము డౌన్ టౌన్ లో 3.5 అంగుళాలు ఇతర ప్రదేశాలలో 7 అంగుళాలు హిమపాతము కురిసినట్లు నమోదైంది. 1976 వ సంవత్సరములో కురిసిన 2.5 అంగుళాల హిమపాతము లెక్కించతగిన ఆఖరి హిమపాతంగా నమోదైనది. పసిఫిక్ సముద్రపు చల్లని నీరు కలిఫోర్న్యా అధిక ఉష్ణోగ్రత సమ్మిళితమై పడమటి సగభాగములో ఎక్కువ గాను తూర్పు సగ భాగంలో తక్కువ గాను వేసవి ఆరంభంలో మంచు కమ్ముకుంటుంది. వేసవి చివరి లోను ఆకురాలు కాలంలోను మంచు తగ్గుతూ నులివెచ్చని వాతావరణం ఆహ్లాద పరుస్తూ ఉంటుంది.ఎత్తైన కొండ ప్రాంతాలు 20% వరకూ వర్షాలు కురుస్తుంటాయి.ఇవి మంచు నుండి, చలి నుండి పడమటి ప్రాంతముకంటే తూర్పు వాసులను తీవ్రతను తగ్గించి కాపాడుతుంటాయి. శాన్ ఫ్రాన్సిస్కో 260 స్పష్టమైన్ ఎండల కలిగిన రోజుల తోను,105 మబ్బు కమ్మినకమ్మిన రోజులను కలిగిన మితోఉష్ణ ప్రదేశము. మొత్తము మీద సముద్ర తీరాలలోను, దీవులలోను కనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం శాన్ ఫ్రాన్సిస్కోలోనూ ఉండి, వాతావరణ పరంరంగా ఇది ఆకర్షణీయమైన నగరమే.
సంస్కృతి
[మార్చు]శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నత జీవనప్రమాణము కలిగిన నగరం. ఇంటెర్నెట్ విప్లవము ఉన్నత విద్యావంతులు, అధిక ఆదాయము కలిగిన నివాసితులను తీసుకురావడాము వలన విరివైన అవకాశాలూ, విస్తారమైన సంపద ఉత్పత్తి కావడం వలన పరిసరాలు ఆర్థికంగా బలపడ్డాయి. ఆస్తి విలువ, కుటుంబ ఆదాయములో దేశమంతటిలో మొదటి స్థానానికి చేరుకుంది. ఆ కారణంగా పెద్ద హోటల్స్, వినోదలకు సంబంధించిన నిర్మాణాలకు అవకాశము ఇచ్చింది. దీని కారణంగా జీవనవ్యము అధికము కావడముతో మధ్యతరగతి ప్రజల నగర వెలుపలి ప్రాంతాలకు తరలివెళ్ళసాగారు.వ్యాపారానికి, ఆకర్షనీయమీన షాపులకు కేంద్ర మైన డౌన్ టౌన్, ఫైనాన్షియల్ డిస్త్రిక్ సంపన్నుల నిలయమైనా, అక్కాడి వ్యార కేంద్రములోని దార్లలో అన్ని తరగతులవారి సమ్మిస్రితముగా ఉంటాయి.
ఆర్ధిక పరిస్థితి
[మార్చు]శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి ఆర్థికరంగాన్ని పరిపుష్టం చేయటంలో పర్యాటక రంగం ప్రముఖ పాత్ర వహిస్తుంది. సంగీతం, చిత్రరంగం, ప్రత్యేక సంస్కృతి, పర్యాటక కేంద్రాలు నగరానికి అంత్ర్జాతీయ గుర్తింపుని కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించటంలో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో 3 వ స్థానంలో ఉంది. 2005 లో ఈ నగరానికి వచ్చిన సందర్శకుల సంఖ్య1,50,00,000. దీనివలన నగరానికి వచ్చిన ఆదాయం 7500,00,00,000 అమెరికన్ డాలర్లు. వ్యాపార సమావేశాలకు, సభలకు ముఖ్యత్వం ఉన్న 10 అమెరికా నగరాలలో శాన్ ఫ్రాన్సిస్కో ఒకటి. మాస్కోన్ సెంటర్లో ఉన్న అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన హోటల్స్ నగరంలోని ప్రత్యేక వసతులలో ఒకటి.
కలిఫోర్నియా గోల్డ్ రష్ కారణంగా నగరంలో ఆర్థిక సంస్థల స్థాపనకు దోహదమైంది. ఫైనాన్షియల్ డిస్ట్‌రిక్ట్ లోని మోన్ట్‌గోమీ స్ట్రీట్ ఒకప్పుడు వాల్స్ట్ర్ట్ ఆఫ్ ది వెస్ట్ గా గుర్తించబడింది. తరువాతి కాలంలో లాస్ ఏంజలస్, సిలికాన్ వెల్లీ లోని శాండ్ హిల్ రోడ్ ఆస్థానంలోకి వచ్చాయి. ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో, బ్యాంక్ ఆఫ్ అమెరికా, వెల్స్ ఫార్గో, ఒకప్పుడు పనిచేసి ప్రస్తుతం కార్యక్రమాలను ఆపి వేసిన పసిఫిక్ కోస్ట్ స్టాక్ ఎక్స్చేంజి లాంటి ఆర్థిక సంస్థలకు కేంద్రంగా ఉంది. ఆర్థిక సేవలను మధ్యతరగతి పౌరులకు అందించడంలో మార్గదర్శి అయిన బ్యాంక్ ఆఫ్ అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో లోని మొట్టమొదటి అధునాతన ఆకాశహర్మ్యాన్ని నిర్మించింది. 30 కంటే అధికమైన అంతర్జాతీయ కేంద్రాలు, 6 ఫార్చ్యూన్ 500 సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలు 555 కలిఫోర్నియా స్ట్రీట్‌లో ఏర్పరచుకున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని డౌన్‌టౌన్ న్యాయ వ్యవస్థ, ప్రజా సంభధిత సంస్థలు, ఆర్కిటెక్చర్, గ్రాఫిక్ డిజైన్ లాంటి కట్టడ నిర్మాణానికి సహకార సంస్థలు ఇక్కడ చోటు చేసుకున్నాయి.
శాన్ ఫ్రాన్సిస్కో ఆర్థికాభివృద్ధి నగర దక్షిణ ప్రాంతంలోని సిలికాన్ వ్యాలీతో ముడిపడి ఉంటుంది. ఈ ప్రాంతం బయోటెక్నాలజీ, బయోమెడికల్ రంగానికి కేంద్రం. సమీపంలోని మిషన్ బేలో ఉన్న (USSF), క్యాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీజనరేటివ్ మేడిసన్ ప్రధాన కార్యలయము, స్టెమ్ సెల్ రీసెర్చ్, కట్టడ నిర్మాణ సంస్థలు మొదలైన ముఖ్య సంస్థలతో ఈ ప్రదేశం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రభుత్వం
[మార్చు]శాన్ ఫ్రాన్సిస్కో నగరం సమీపంలోని కంట్రీలతో కలసి 1856 నుండి కన్సాలిడేటెడ్ సిటీ-కంట్రీ హోదాను కలిగి ఉంది. కలిఫోర్నియా రాష్ట్రంలో శాన్ ఫ్రాన్సిస్కో మాత్రమే ఇటువంటి హోదాను కలిగిఉంది. నగర పాలనా వ్యవహారాలను నగర మేయర్ ఆధీనంలో ఉంటాయి. బోర్డ్ ఆఫ్ సూపర్‌వైజర్స్ సిటీ కౌన్సిల్స్ గా వ్యవహరిస్తారు.ఇటువంటి మిశ్రిత పాననా విధానం కారణంగా నగరపురాలలోని కంట్రీలలోని ఆస్తులు నగరం ఆధీనంలో ఉంటాయి.ఈ కారణంగా శాన్‌మేటియో కంట్రీలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ శాన్ ఫ్రాన్సిస్కో ఆధీనంలోనే ఉంటుంది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి స్వంతం దీని నిర్వహణ సిటీ, కంట్రీ ఆధ్వైర్యంలో ఉంటుంది. 1913 నుండి రేకర్ యాక్ట్ చట్టం ఆధారంగా యోస్ మైట్ నేషనల్ పార్క్ లో ఉన్న హెచ్ హెచ్య్ వెల్లీ,వాటర్ షెడ్ లు శాశ్వత అధికారాలు శాన్ ఫ్రాన్సిస్కోకు సంక్రమించాయి.
నగరపాలనా వ్యవహారాలు మేయర్ అధీనంలో నగర ప్రజలతో ఎన్నుకొనబడిన ప్రతినిధులు,నియమిత అధికారుల నిర్వహణలో జరుగుతుంది. ప్రెసిడెంట్ తరఫున 11 మంది సభ్యులు కలిగిన ది బోర్డాఫ్ సూపర్‌వైజర్స్ చట్ట అమలు, నిధుల మంజూరీ ఆర్థిక ప్రణాలికలు మొదలైన వ్యవహారాలు నడుస్తుంటాయి.
జనాభా
[మార్చు]2006లో జనాభా లెక్కలను అనుసరించి శాన్ ఫ్రాన్సిస్కో జనసంఖ్య 7,44,041. సుమారు ఒక చదరపు మైలు విస్తీర్ణంలో నివసిస్తున్న జన సంఖ్య 16,000. అమెరికాలో ఉన్న పెద్ద నగరాలలోని జన సాంద్రతతో పోల్చినప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో జనసాంద్రత రెండవస్థానంలో ఉంటుంది. శాన్ ఫ్రాన్సిస్కో సముద్ర తీరంలో పూర్వీకులు అధికంగా నివసిస్తున్న శాన్ జోస్, ఓక్‌లాండ్ జనసంఖ్యతో చేరి సమష్టి జనసంఖ్య 7,000,000.
అమెరికాలోని మిగిలిన ప్రధాన నగరాల మాదిరి ఇక్కడ అల్పసంఖ్యాకులే ఎక్కువ. హిస్పానిక్ కాని శ్వేతజాతీయుల సంఖ్య సుమారు నగర జనాభాలో సగం ఉంటుంది. 2005 జనాభా లెక్కలను అనుసరించి హిస్పానిక్ కాని శ్వేతజాతీయులు 44.1%. ఆసియా అమెరికన్లు అధికంగా చైనీస్ సంఖ్య నగర జనసంఖ్యలో 3వ భాగం ఉంటుంది. అన్ని జాతుల హిస్పానికన్లు కలిసి జనసంఖ్యలో 14%. 1970 నుండి 2005 ఆఫ్రికన్ అమెరికన్ల సంఖ్య 13.4% నుండి 7.2% శాతానికి దిగజారింది. స్థానిక శాన్ ఫ్రాన్సిస్కో జనాభా స్వపమే, వారిలో 35% మాత్రమే కలిఫోర్నియాలో జన్మించిన వారు మిగిలిన వారు అమెరికా వెలుపల నన్మించిన వారే. శాన్ ఫ్రాన్సిస్కోలో గే అనబడే స్వజాతి సంపర్కుల సంఖ్య అధికం. మిగిలిన ప్రడ్హఆన నగరాలకంటే వీరి సంఖ్య ఇక్కడ అధికం
.
శాన్ ఫ్రాన్సిస్కోలోని పౌరుల సరాసరి కుటుంబ ఆదాయం $57,833 అమెరికన్ డాలర్లు. దారిద్ర్యరేఖకు దిగివన ఉన్న వాళ్ళు 7.8%. చిన్న పిల్లలు 14.55%. మిగతా అమెరికా నగరాలకంటే ఈ నగరంలో పేదరికం శాతం తక్కువే. నగరంలో అధికంగా ఉన్న నిరాశ్రితుల సంఖ్య 1980 నుండి వివాదాస్పదమౌతుంది. అమెరికాలోని ప్రధాన నగరాలన్నింటి కంటే ఈ నగరంలో నివాస గృహాలు లేని వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు అంచనా. దౌర్జన్యమూ, నేరాలు సరాసరి కంటే అధికం.
అమెరికాలోని 50 ప్రధాన నగరాలలో శాన్ ఫ్రాన్సిస్కో దౌర్జన్యంలో 29వ స్థానంలోనూ, నేరాలలో 30 వ స్థానంలోనూ ఉంది.
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]శాన్ ఫ్రాన్సిస్కో నగరపాలనకు స్వంతమైన శాన్ ఫ్రాన్సిస్కో మునిసిపల్ రైల్వే (ఎమ్ యు ఎన్)ఒక్కటే లైట్ రైల్/సబ్‌వే రైల్స్, ట్రాలీ/డీసిల్ బస్సులను నడుపుతుంది. స్ట్రీట్ కార్లు నగరపురాలలో నేలమీద డౌన్‌టౌన్ ప్రాంతంలో భూమిలోపల మార్గంలోనూ నడుస్తుంటాయి.కాస్ట్రోస్ట్రీట్ నుండి ఫిషర్మేన్ వార్ఫ్, ఐకానిక్‌ల మధ్య శాన్ ఫ్రాన్సిస్కో మునిసిపల్ రైల్వేచే నడపబడే ఎఫ్ మార్కెట్ హిస్టారిక్ స్ట్రీట్ కార్ లైన్, శాన్ ఫ్రాన్సిస్కో కేబుల్ కార్‌సిస్టమ్ పేర్లతో బస్సులు నడుస్తుంటాయి.
బే ఏరియా రాపిడ్ ట్రాన్సిస్ట్ శాన్ ఫ్రాన్సిస్కోను ట్రాన్స్ బే ట్యూబ్ మార్గంలో నగర తూర్పు తీరంవరకు తీసుకుపోతుంది. ఈ రైల్ మార్గం మార్కేట్ స్ట్రీట్ నుండి సివిక్ సెంటర్ వరకు ఉంటుంది. ఇది దక్షిణం వైపు మిషన్ డిస్ట్రిక్ వరకు ఉత్తరంలో శాన్‌మెట్రో కంట్రీ అక్కడినుండి శాన్ ఫ్రాన్సిస్కో ఇన్టర్ నేషనల్ ఎయిర్ పోర్టు లను కలుపుతూ మిల్‌బ్రీ వరకూ సాగుతుంది. 1863 నుండి సదరన్‌పసిఫిక్ సంస్థచే నడపబడే ది కాల్‌ట్రైన్ రైల్స్ శాన్ ఫ్రాన్సిస్కో నుండి పెనిన్‌సుల డౌన్ మీదుగా శాన్‌జోస్ వరకు నడుస్తంటాయి. ది ట్రాన్స్‌బే టెర్మినల్ గే హౌన్డ్,అల్మెడా కంట్రీ వరకు ఎ సి ట్రాన్సిస్ట్ శాన్‌మెట్రో కంట్రీ వరకు శామ్‌ట్రాన్స్ మేరిన్, సొనొమ కంట్రీ వరకు గోల్డెన్ గేట్ ట్రాన్సిస్ట్ మొదలైన సర్వీసులను నడుపుతుంది.ఆమ్‌ట్రాక్ శాన్ ఫ్రాన్సిస్కో నుండి ఎమరీ వెల్లీలో ఉన్న రైల్ స్టేషను వరకు షటిల్ సర్వీసులను నడుపుతూ ఉంటుంది.
శాన్ ఫ్రాన్సిస్కో నగర ఉద్యోగులకోసమూ,పర్యాటకుల కోసమూ ఫెర్రీ బిల్డింగ్,పియర్ 90 ల నుండి మైన్ కంట్రీ,ఓక్‌లాండ్ వరకూ, ఉత్తరంలో ఉన్న వాలెజొ, సొలానా కంట్రీ వరకు బోట్ సర్వీసులు నడుస్తూ ఉంటాయి.
రేవు
[మార్చు]పోర్ట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కో ఒకప్పుడు అత్యంత పెద్దది, అధికంగా పనిచేసే ఓడరేవులలో ఒకటి. పడవల నుండి వచ్చే సరుకులు క్రేన్ల సహాయంతో దించి గోడౌన్లలో చేర్చడానికి నిర్మించిన వరసలు తీరిన పియర్ (నౌకలో సరకులను చేర్చు మార్గం)లు ఇప్పటికీ తీరంలో చూడవచ్చు. ఈ రేవు నుండి ట్రాన్స్-పసిఫిక్, అట్లాంటిక్ వరకు సరుకు రవాణా జరుగుతూ ఉండేది. పడమటి తీర రేవులలో కలప వ్యాపారానికి ఇది కేంద్రంగా ఉండేది. వాణిజ్య సంబంధిత ఓడలు ఒక్‌లాండ్‌కు తరలి వెళ్ళడమూ, రేవులలో సరకు రవాణాకు కంటైనరలు వాడకం దీనిని ఒకింత నిరుపయోగంగా చేశాయి. ఇవి కొంతకాలం విసర్జింపబడినా ఎమ్‌బార్కేషన్ ఫ్రీ వే తొలగించడంతో డౌన్‌టౌన్ సముద్ర తీరానికి సమీపం కావడంతో ఈ రేవు తన పూర్వ వైభవాన్ని తిరిగి సంతరించుకుంటుంది. రేవుకి కేంద్రంగా ఫెర్రీ బిల్డింగ్ ఉద్యొగుల కోసం నడిపే బోట్లు అభివృద్ధి కార్యక్రమాలు పునరుద్దరింప బడ్డాయి. దుస్తుల వ్యాపార కేంద్రంగా ఇది మరికొంత అభివృద్ధి చెందడం ఒక విశేషం. ప్రస్తుతం ఈ రేవుని జలక్రీడలు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పర్యాటక ఆకర్షణ కెంద్రంగా మార్చే ప్రయత్నాలు చేపట్టారు.
విమానాశ్రయాలు
[మార్చు]శాన్ మెట్రో కంట్రీలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో నగరపాలిత సంస్థకు స్వంతమైన శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్, ఎస్ ఎఫ్ ఓ శాన్ ఫ్రాన్సిస్కో అధికార పరిమితికి లోబడి ఉంది. ఎస్ ఎఫ్ ఒ యునైటెడ్ ఎయిర్ లైన్స్‌కు కేంద్రంగా వ్యవహరిస్తుంది. వర్జిన్ అమెరికా విమాన సంస్థ తన సర్వీసులను ఎస్ ఎఫ్ ఓ నుండి నడుపుతూ ఉంటుంది. ఇది అమెరికాకు అంతర్జాతీయ ప్రవేశ ద్వారం (గేట్ వే). 1990లో ప్రారంభమైన ఆర్థికపరిస్థితి అభివృద్ధి పెరిగిన రద్దీ కారణంగా సముద్రతీతాన్ని కృత్రిమంగా విస్తరించి అదనపు రన్‌వేలను నిర్మించారు. తరువాతి కాలంలో వచ్చిన మార్పులు ఈ రద్దీని బాగా తగ్గించాయి. 2000 నుండి 2005 కి రద్దీ బాగా తగ్గింది.[ఆధారం చూపాలి]
సైక్లింగ్
[మార్చు]సైకిల్ శాన్ ఫ్రాన్సిస్కోలో ముఖ్యమైన ప్రయాణ సాధనం. 40,000 మంది పౌరులకు సైకిల్ ద్వారా ఆఫీసులకు పోవడం అలవాటు. నగరంలో 63 మైళ్ళ పొడవున సైక్లింగ్ లైన్ ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో బైసైకిల్ కోయిలేషన్ సభ్యులు దినసరి అవసరాలకు సైకిల్‌లోనే ఎక్కువ ప్రయాణిస్తుంటారు.
మూలాలు
[మార్చు]- ↑ Stewart, Suzanne B. (November 2003). "Archaeological Research Issues For The Point Reyes National Seashore – Golden Gate National Recreation Area" (PDF). Sonoma State University – Anthropological Studies Center. Retrieved June 12, 2008.