శివరాజ్ పాటిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Shivraj V. Patil
Governor of Punjab and Administrator of Chandigarh
In office
22 January 2010 – 21 January 2015
అధ్యక్షుడుPratibha Patil
Pranab Mukherjee
అంతకు ముందు వారుSunith Francis Rodrigues
తరువాత వారుKaptan Singh Solanki
Minister for Home Affairs
In office
22 May 2004 – 30 November 2008[1]
ప్రథాన మంత్రిManmohan Singh
అంతకు ముందు వారుLal Krishna Advani
తరువాత వారుP. Chidambaram
10th Speaker of Lok Sabha
In office
10 July 1991 – 22 May 1996
DeputyS. Mallikarjunaiah
అంతకు ముందు వారుRabi Ray
తరువాత వారుP.A. Sangma
Member of Parliament, Lok Sabha
In office
18 January 1980 – 17 May 2004
అంతకు ముందు వారుUdhavrao Patil
తరువాత వారుRupatai Patil
నియోజకవర్గంLatur, Maharasthra
వ్యక్తిగత వివరాలు
జననం (1935-10-12) 1935 అక్టోబరు 12 (వయసు 88)
Latur, Hyderabad State, British India
పౌరసత్వంIndia
జాతీయతIndian
రాజకీయ పార్టీIndian National Congress
జీవిత భాగస్వామిVijaya Patil
సంతానంShailesh Patil, Swapna Patil
తల్లిదండ్రులుVishwanath Patil
నివాసంChakur, Latur, Maharashtra, India
చదువుBachelor of science, LLB
కళాశాలOsmania university, Mumbai university
వృత్తిPolitician

శివరాజ్ విశ్వనాథ్ పాటిల్, (జ:1935 అక్టోబరు 12) ఒక భారతీయ రాజకీయ నాయకుడు,అతను 2004 నుండి 2008 వరకు భారతదేశ హోం వ్యవహారాల మంత్రిగా, 1991 నుండి 1996 వరకు 10వ లోక్‌సభ స్పీకరుగా వ్యవహరించాడు. అతను పంజాబ్ గవర్నరుగా, రాజస్థాన్ గవర్నర్‌గా, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ రాష్ట్రానికి 2010 నుండి 2015 వరకు అడ్మినిస్ట్రేటర్‌గా చేసాడు. [2] ముంబైపై తీవ్రవాద దాడుల తర్వాత విస్తృతంగా విమర్శలు వెల్లువెత్తడంతో, దాడులకు దారితీసిన భద్రతా లోపానికి నైతిక బాధ్యత వహిస్తూ పాటిల్ 2008 నవంబరు 30న హోంమంత్రి పదవికి రాజీనామా చేసాడు. [3]

జీవితం తొలిదశలో[మార్చు]

పాటిల్ భారతదేశ అప్పటి రాచరిక రాష్ట్రమైన హైదరాబాద్ రాజ్యం , (అప్పటి మరాఠ్వాడ ప్రాంతం) ప్రస్తుత మహారాష్ట్ర లోని లాతూర్ జిల్లా, చకూర్ గ్రామంలో 1935 అక్టోబరు 12న జన్మించాడు. అతను హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివి, సైన్స్‌లో పట్టా పొందాడు. ముంబయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించాడు. 1967-69 సమయంలో అతను స్థానిక ప్రభుత్వ (లాతూర్ పురపాలక సంఘ) కార్యకలాపాలలో పాల్గొన్నాడు. కేశవరావు సోనవానే, మాణిక్రావు సోనవానే లాతూర్ నియోజకవర్గం నుండి శివరాజ్ పాటిల్‌ మొదటిసారి నిలబడే అవకాశం పొందడానికి అతనికి సహాయం చేసారు.[4] పాటిల్ లింగాయత్ వర్గానికి చెందినవాడు. [5] అతను 1963 జూన్ లో విజయ పాటిల్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు - ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. [6]

రాష్ట్ర రాజకీయాల్లో[మార్చు]

అతను 1973 నుండి 1980 వరకు రెండు పర్యాయాలు 1973 నుండి 1978 వరకు, 1978 నుండి 1980 వరకు లాతూర్ రూరల్ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా మహారాష్ట్ర శాసనసభ నందు కొనసాగాడు. ఆదే సమయంలో అతను పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ అధ్యక్షుడు, ఉప మంత్రి (చట్ట, న్యాయవ్యవస్థ, నీటిపారుదల, ప్రోటోకాల్), శాసనసభ ఉప సభాపతి, సభాపతి పదవుల నిర్వహించాడు.

కేంద్ర రాజకీయాల్లో[మార్చు]

1980లో లాతూర్ నియోజకవర్గం నుంచి 7వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1999 నాటికి, అతను 1980, 1984, 1989, 1991, 1996, 1998, 1999లో వరుసగా ఏడు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాడు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో 8సారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబడి రూపతాయ్ పాటిల్ నీలంగేకర్ చేతిలో ఓటమిచెందాడు.

ప్రభుత్వంలో[మార్చు]

2004 మే 24న కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన కార్యాలయంలో శివరాజ్ పాటిల్

1982లో అతనికి వాణిజ్య మంత్రిత్వ శాఖ స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు.ఆ పదవిలో 1983 వరకు కొనసాగాడు. ఆ తరువాత సైన్స్ అండ్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, స్పేస్ అండ్ ఓషన్ డెవలప్‌మెంట్ (1983–84) పదవులు నిర్వహించాడు. 1983-86 సమయంలో, అతను భారత శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు వైస్ ప్రెసిడెంటుగా, పార్లమెంటు సభ్యుల, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, జీతాలు, అలవెన్సులతో సహా వివిధ సంఘాలలో పనిచేశాడు. రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో, తరువాత పౌర విమానయాన, పర్యాటక శాఖలకు స్వతంత్ర బాధ్యతలు నిర్వహించాడు.26/11 ముంబై దాడి తరువాత, శివరాజ్ పాటిల్ 2010 నవంబరు నుండి 2015 వరకు పంజాబ్ రాష్ట్ర గవర్నరుగా, [7] చంఢీఘర్ రాష్ట్ర నిర్వహకుడుగా పనిచేసాడు [8] సోనియాగాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అతను పార్టీలో పలు కీలక పదవులు చేపట్టాడు. భారతదేశంలో అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డును 1992లో పాటిల్ ప్రవేశపెట్టినందుకు ఎక్కువగా ప్రసిద్ది చెందాడు. 1999 లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ కార్యాచరణ పత్రిక సంఘం అధ్యక్షుడుగా ఉన్నాడు.

లోక్‌సభ స్పీకర్‌గా, పార్లమెంటు సభ్యులకు సమాచార వ్యాప్తి (కంప్యూటరీకరణ, ఆధునీకరణ ద్వారా), పార్లమెంట్ గ్రంధాలయ భవనం నిర్మాణం, పార్లమెంట్ ఉభయ సభల ప్రశ్నోత్తరాల ప్రత్యక్ష ప్రసారంతో సహా లోక్‌సభ కార్యక్రమాలను ప్రసారం చేయడం వంటి కార్యక్రమాలను అతను ప్రారంభించాడు లేదా అందించాడు.

2004లో హోంమంత్రి పదవిని స్వీకరించాడు.శివరాజ్ పాటిల్ మహారాష్ట్రలోని లాతూర్ నుండి 2004 ఎన్నికలలో ఓడిపోయినా, 2004 జులైలో రాజ్యసభకు ఎన్నికై, కేంద్ర మంత్రివర్గంలో రెండవ అత్యంత ముఖ్యమైన స్థానంగల హోం మంత్రి పదవిని పొందాడు. హోమ్ మంత్రిగా అతని పదవీకాలం పనికిరాని మంత్రి అనే భావన విస్తృతంగా కనిపించింది. మంత్రిగా అతని పదవీకాలం ఒకదాని తర్వాత ఒకటి పరాజయం పాలైంది. అతను తన రాజీనామా కోసం పెరుగుతున్న వత్తిడులు ఎదుర్కొన్నాడు. చివరికి 2008 ముంబై దాడులకు దారితీసిన తరువాత జరిగిన సంఘటనలలో తప్పుగా వ్యవహరించడం వల్ల రాజీనామా బలవంతం చేయబడింది. 2006లో ముస్లిం స్మశాన వాటిక వద్ద జరిగిన మాలేగావ్ బాంబు దాడులను దీనికి ఒక కారణంగా మర్చిపోకూడదు. [9]

యునైటెడ్ స్టేట్స్ రాయబారి డేవిడ్ ముల్ఫోర్డ్ ఒక రాయబార కార్యాలయ ప్రసారాలలో ముంబై తీవ్రవాద దాడి తర్వాత అతనిని తొలగించడం అనివార్యమని వివరించినట్లు బహిర్గతమైంది. అతనిని "అసమర్థుడు" "గడియారం మీద నిద్రపోతున్నాడు" అని పేర్కొన్నాడు. [10] [11] [12] [13] [14]

నందిగ్రామ్‌ ప్రాంతంలో శాంతిభద్రతలను పునరుద్ధరించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పదేపదే అభ్యర్థనలు చేసిన తర్వాత కూడా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌ను నందిగ్రామ్‌కు పంపలేదని పాటిల్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆసంఘటనల ఫలితంగా నందిగ్రామ్‌లో పోలీసులు జరిపిన కాల్పులలో పురుషులు మహిళలు మరణించారు.

2007 రాష్ట్రపతి ఎన్నికలలో పాటిల్ పేరును అభ్యర్థిగా పరిగణించారు. అయితే వామపక్షాలు అతని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంతో, సోనియా గాంధీ రాజస్థాన్ గవర్నర్ ప్రతిభా పాటిల్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించింది. శివరాజ్ పాటిల్ తరువాత భారత ఉపరాష్ట్రపతి పదవికి సంభావ్య అభ్యర్థిగా పరిగణించబడ్డాడు.

2008 నవంబరు 30న, బొంబాయి పేలుళ్ల తర్వాత కేవలం నాలుగు రోజులకే, ఉగ్రవాద దాడులకు దారితీసిన భద్రతా లోపానికి నైతిక బాధ్యత వహిస్తూ పాటిల్ కేంద్ర మంత్రివర్గంలోని తన హోం మంత్రి పదవికి రాజీనామా చేసాడు.

వివాదాలు[మార్చు]

శివరాజ్ పాటిల్‌ను నీరో ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దేశం ఉగ్రదాడిలో ఉన్న సమయంలో అతను బహిరంగ ప్రదర్శనల కోసం బట్టలు మార్చుకున్నట్లు సమాచారం.దేశం ఉగ్రదాడిని చూస్తున్నప్పుడు పాటిల్ తన బట్టలు మార్చుకోవడంపై దృష్టి పెట్టడంతో నగరం కాలిపోతున్నప్పుడు అతని చర్యలను తన ఫిడేల్ వాయించిన నీరోతో పోల్చారు. [15] [16] [17] అతను తన ఆత్మకథ నుండి ఈ ఎపిసోడ్‌ను మినహాయించాడని కూడా విమర్శించారు. [18]

మూలాలు[మార్చు]

  1. Home Minister Shivraj Patil steps down. Ibnlive.in.com. Retrieved on 29 December 2011.
  2. Express News Service (23 January 2010). "Shivraj Patil takes oath as UT Administrator". Indian Express. Retrieved 25 January 2010.
  3. Shivraj Patil resigns. Sify.com (30 November 2008). Retrieved on 29 December 2011.
  4. Patil, Shivraj V. (31 May 2014). ODYSSEY OF MY LIFE. ISBN 9788129134271. Retrieved 18 April 2015.
  5. Who is Shivraj Patil? Archived 19 మార్చి 2012 at the Wayback Machine. NDTV.com. Retrieved on 29 December 2011.
  6. "Shri Shivraj Vishwanath Patil". Archived from the original on 10 April 2009. Retrieved 2009-02-18.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link). interstatecouncil.nic.in
  7. "Shivraj Patil takes oath as UT Administrator - Indian Express".
  8. "Punjab Governor Shivraj V Patil retires on completion of five-year term". The Economic Times.
  9. Blasts kill 37 in India graveyard
  10. "'Inept' Shivraj Patil was protected by Sonia: US cables". Indian Express. 18 December 2010. Retrieved 18 December 2010.
  11. "WikiLeaks: US felt removal of Shivraj Patil was inevitable after 26/11". The Times of India. 18 December 2010. Retrieved 18 December 2010.
  12. "See 9c of US embassy cables: Indian government heads roll after Mumbai terror attacks". The Guardian. London. 16 December 2010. Retrieved 18 December 2010.
  13. "US felt removal of Shivraj Patil after 26/11 was inevitable: WikiLeaks". Daily News and Analysis. 18 December 2010. Retrieved 18 December 2010.
  14. "Shivraj Patil spectacularly inept: David Mulford". The Economic Times. 18 December 2010. Retrieved 18 December 2010.
  15. "Patil changes shirts as capital suffers". 15 September 2008.
  16. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-10-25. Retrieved 2021-11-13.
  17. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-06. Retrieved 2021-12-27.
  18. "Shivraj Patil airbrushes 26/11 from his autobiography | India News - Times of India".

వెలుపలి లంకెలు[మార్చు]