శ్రీధర లక్ష్మీనరసింహం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీధర లక్ష్మీనరసింహం తండ్రి శ్రీధర వెంకటసుబ్బయ్య, తల్లి రామలక్ష్మమ్మ. నరసింహం జననం1929డిసెంబర్ 27వ తారీకు. ఇతని తండ్రి వేంకటగిరి రాజాగారి ఆలయాలమీద అములుదారు అనే చిన్న ఉద్యోగి. తల్లి రామలక్ష్మమ్మ. నరసింహం హైస్కూల్ చదువు వెంకటగిరి టౌన్ లో సాగింది. ఇంటర్మీడియట్ గుంటూరు హిదూ కాలేజీలో, బీకామ్ ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నంలో సాగింది.

వెంకటగిరి నాటక ప్రదర్శనలకు, నాటక సంస్థలకు ప్రసిద్హి. ఆ ప్రభావాలతోనే నరసింహం విద్యార్ధి దశనుంచి నాటకాలలో వేషాలు వేశాడు. ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గోపాలస్వామి నాయుడు ఇతనిలోని నటనా శక్తులను గమనించి ప్రోత్సహించడంవల్ల విశ్వవిద్యాలయం నాటకాల్లో అంతర్ కళాశాలల నాటక పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నాడు.

నరసింహం 1952లో పోస్టల్ శాఖలో చేరి నెల్లూరు, చెన్నూరు, కోట, రాపూరు, వెంకటగిరి మొదలయినచోట్ల పోస్టుమాస్టర్ గ చేస్తూ పోస్టల్ శాఖ యాజమాన్యంలో ఏటా జరిగే సాంస్కృతికోత్సవాల్లో నాటక ప్రదర్శన, లలిసంగీతం , జానపద సంగీతపోటీల్లో, ఏకపాత్రాభినయంలో పాల్గొని అనేక సంవత్సరాలు పురస్కారాలు పొందాడు. వరూధిని ప్రవరాఖ్యం పేరుతొ స్వీయ రచనను ఏకపాత్రాభినయంగా ప్రదర్శిచేవాడు. ఇతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమారుడు డాక్టర్ సత్యనారాయణ M.D., భారత సైన్యంలో మేజర్ గా చేసి పదవీవిరమణ చేసాడు.

ఇతను తిరుపతిలో పబ్లిక్ రిలేషన్స్ ఇన్స్పెక్టర్ గ ఉన్న సమయంలో , డిపార్టుమెంట్ సాంస్కృతిక ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహిస్తూ తాను స్వయంగా నాటక ప్రదర్శనల్లో పాల్గొనేవాడు. ఆ రోజుల్లోనే దాసరి నారాయణరావు దర్శకుడుగా, ఆయన స్వయంగా నటించిన "మామగారు'" సినిమాలో ముఖ్యమైన పాత్రధరించాడు.తర్వాత సినిమాలలో అవకాశాలు వచ్చినా, పిల్లల చదువులు వంటి బాధ్యతలతో సినిమాలకు వీడ్కోలు చెప్పాడు.

1987లో పదవీవిరమణ చేసింతర్వాత, ఆధ్యాత్మిక సంగీతం మీద దృష్టిపెట్టి, షిర్డీసాయి భక్తులయి , బాబాగారి మీద పాటలు రచించి రికార్డు చేసాడు. వెంకగిరి రాజా డాక్టర్ భాస్కర సాయికృష్ణ యాచేంద్ర సంగీత గేయధార ప్రక్రియ ప్రదర్శనకు ముందు ప్రదర్శన నను పరిచయం చేస్తూ రాజాగారి వెంట దేశమంతా పర్యటించాడు. 92వ ఏట 2021 సెప్టెంబర్ 9న అనాయాస మరణం పొందాడు.