అక్షాంశ రేఖాంశాలు: 15°24′3.348″N 78°58′51.240″E / 15.40093000°N 78.98090000°E / 15.40093000; 78.98090000

సత్యవోలు (రాచర్ల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యవోలు (రాచర్ల)
గ్రామం
పటం
సత్యవోలు (రాచర్ల) is located in ఆంధ్రప్రదేశ్
సత్యవోలు (రాచర్ల)
సత్యవోలు (రాచర్ల)
అక్షాంశ రేఖాంశాలు: 15°24′3.348″N 78°58′51.240″E / 15.40093000°N 78.98090000°E / 15.40093000; 78.98090000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంరాచర్ల
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08405 Edit this on Wikidata )
పిన్‌కోడ్523356


సత్యవోలు భీమలింగేశ్వరస్వామి మందిరం

సత్యవోలు, ప్రకాశం జిల్లా, రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

దేవాలయాలు

[మార్చు]
సత్యవోలు భీమలింగేశ్వరస్వామి మందిరం
సత్యవోలు భీమలింగేశ్వరస్వామి లింగం
  • పట్టణానికి 8 కిలోమీటర్లదూరంలో రాచర్ల మండలం సత్యవోలు గ్రామంలో, పాండవుల మనుమడు జనమేజయుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అనంతరం చాళుక్య రాజులచే ఆలయనిర్మాణం జరిగింది. ఇక్కడ చాళుక్య శైలిలో నిర్మించబడిన భీమలింగేశ్వర, రామలింగేశ్వర ఆలయాలు ప్రసిద్ధి చెందినవి. వీటిని జాతీయ వారసత్వ సంపదగా భారత ప్రభుత్వం ప్రకటించింది.
  • శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం.

గ్రామ విశేషాలు

[మార్చు]

ఉన్నది ఒకే వీధి, ఆవీధే ఒక గ్రామం. అయినా అలాంటి ఇలాంటిదేం కాదు. 33 గృహాలూ, 109 మంది జనాభా, 1600 యెకరాల పొలం, ప్రత్యేక తలారులతో రెవెన్యూ గ్రామంగా తులతూగుతోంది. ఒక్క సర్వే నంబరు 5 లోనే 500 యెకరాల పైగా భూమి ఉంది. ఈ వీధికే ప్రత్యేకంగా శ్మశానమూ ఉంది. ఇక్కడ అలంపురం తరహాలో నిర్మించిన స్థానిక రామలింగ, భీమలింగేశ్వరాలయాలు, ఉద్యానవనంలా ఉండే పరిసరాలతోపాటు అక్కడ ఒక వీధి ఉంటుంది. కాంక్రీటు రహదారి,పొందికగా నిర్మించిన రామాలయం, పోలేరమ్మ ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ రెండు గ్రామాలూ ( సత్యవోలూ+భూపనగుంట్ల) కలిసే ఉన్నాయి. రెండు ఊర్లంటే ఒకే వీధి.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో భూపని వెంకటలక్ష్మమ్మ, 48 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]