సి.ఎన్.వెంకటరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి.ఎన్.వెంకటరావు స్వీయచిత్తరువు

సి.ఎన్.వెంకటరావు భారతదేశం గర్వించదగ్గ చిత్రకారులలో ఒకడు. ఇతడు కోయంబత్తూరు ప్రాంతం నుండి వచ్చి అనంతపురం మునిసిపల్ హైస్కూలులో డ్రాయింగ్ మాస్టర్‌గా చేరాడు[1]. అక్కడ కొంతకాలం పనిచేసిన తర్వాత పెనుకొండ హైస్కూలులో డ్రాయింగ్ మాస్టర్‌గా పనిచేస్తూ చిత్రకారుడిగా ప్రసిద్ధుడైనాడు. హైస్కూలులో పనిచేస్తూనే ప్రైవేటుగా విజయనగర్ ఆర్ట్ గ్యాలరీ అనే పేరుతో ఒక చిత్రకళా పాఠశాలను తన ఇంట్లో ప్రారంభించి అనేక మంది శిష్యులను తయారు చేశాడు. ఇతడు వందలకొద్దీ చిత్రాలను సృష్టించాడు. ఇతని చిత్రాలు ఆ కాలంలో భారతి, గృహలక్ష్మి వంటి పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతడు సృష్టించిన గౌతమి అవతరణం[2], బర్త్ ఆఫ్ ఆర్ట్ అనే గొప్ప చిత్రాలు హైదరాబాదులోని సాలార్ జంగ్ మ్యూజియంలో ఉండేవి. ఇతడు తన చిత్రించిన చిత్రాలను మొదట పెనుకొండలో ఉన్న ప్రఖ్యాత వకీలు టి.శివశంకరం పిళ్లె బంగళాలో ప్రదర్శించి స్థానికుల మెప్పుపొందిన తర్వాతే ఇతర ప్రాంతాలకు పంపేవాడు. ఇతడు చిత్రించిన గీతోపదేశ చిత్రం ఇప్పటికీ అనంతపురం లోని ఆర్ట్స్ కాలేజీలో కనిపిస్తుంది. అనంతపురం పీస్ మెమోరియల్ హాల్‌లో రెండు చిత్రాలు దర్శనమిస్తాయి. ఇతని చిత్రాలను ఆ కాలంలోని ప్రముఖులు స్వంతం చేసుకున్నారు. వారిలో నీలం సంజీవరెడ్డి వంటివారు ఉన్నారు.

తను స్వంతంగా వేసిన చిత్ర్రాన్ని తానే కొనుగోలు చేసిన విచిత్ర సంఘటన ఇతని జీవితంలో చోటు చేసుకుంది. 1934 జనవరి 3 వతేదీ గాంధీ మహాత్ముడు అనంతపురం సందర్శించిన సందర్భంలో ఇతడు మహాత్ముడికి తన చిత్రాలను కొన్నింటిని సమర్పించుకున్నాడు. హరిజన నిధికి ధనం కోసం గాంధీ ఈ చిత్రాలను వేలానికి పెట్టగా అక్కడి ప్రజలు వాటిని వేలం పాడి కొన్నారు. అయితే ఒక మంచి చిత్రానికి తగిన వెల రాకపోవడంతో సి.ఎన్.వెంకటరావు దానిని పాతిక వేలకు పాటపాడి స్వంతం చేసుకున్నాడు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. గుత్తి, రామకృష్ణ (1999). "సుప్రసిద్ధ చిత్రకారుడు సి.ఎన్.వెంకటరావు". అనంతనేత్రం - వార్త దిన పత్రిక అనంతపురం జిల్లా ప్రత్యేక అనుబంధం: 182.
  2. గౌతమీ అవతరణం