స్వర్ణమాల్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

స్వర్ణమాల్య,  భారతీయ నటి, టీవీ వ్యాఖ్యాత. ఆమె భరతనాట్య నృత్య కళాకారిణి. ఎన్నో సంవత్సరాల నుంచీ ఎన్నో షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది ఆమె ఎన్నో భాషల చిత్రాల్లో నటించడమే కాక, ప్రపంచం మొత్తం మీద ఎన్నో స్టేజిలపై నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఆమె ప్రముఖ సంప్రదాయ నృత్య కళాకారిణి. ఆమె తన 17వ ఏట యువకళా భారత్ అనే పురస్కారాన్ని కూడా అందుకుంది. సన్ టీవీలో ప్రసారమైన ఇలమై పుదుమై అనే షో ద్వారా ప్రసిద్ధి చెందింది స్వర్ణ.[1]

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఆమె తమిళ కుటుంబంలో జన్మించింది. ఎం.ఒ.పి వైష్ణవ్ కళాశాలలో సోషియాలజీలో డిగ్రీ చేసింది ఆమె. ఆ కళాశాలలో విద్యార్థి సంఘానికి అధ్యక్షురాలిగా పనిచేసింది స్వర్ణ. అమెరికా, కాలిఫోర్నియాలోని సేన్ జోస్ స్టేట్ విశ్వవిద్యాలయంలో నటనలో డిప్లమో కోర్సు పూర్తిచేసింది ఆమె. అలాగే మద్రాసు విశ్వవిద్యాలయంలో భరతనాట్యంలో మాస్టర్స్ డిగ్రీ, నృత్య చరిత్రపై పి.హెచ్.డి చేసింది స్వర్ణ. పదేళ్ళ పాటు కె.జె.సరస వద్ద నృత్యంలో శిక్షణ పొందిన ఆమె, తరువాత కళాక్షేత్రకు చెందిన భాగవతుల సీతారామశర్మ వద్ద శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది స్వర్ణ.

సినీ కెరీర్[మార్చు]

మొదట్లో ఆమె నాటకాల్లో నటించేది స్వర్ణ. ఆ తరువాత మణిరత్నం  దర్శకత్వం వహించిన సఖి సినిమాలో షాలినీ కుమార్ అక్క పూర్ణి పాత్రతో తెరంగేత్రం చేసింది ఆమె. ఆ తరువాత ఆమె మోళి, ఎంగల్ అన్న వంటి సినిమాల్లో సహాయపాత్రల్లో నటించింది.

టీవీ కెరీర్[మార్చు]

ఆమె సన్ టీవీలో ప్రసారమైన ఇలమై పుదుమై షోతో వ్యాఖ్యాతగా పరిచయమైంది ఆమె. ఆ తరువాత విజయ్ టీవీలో ప్రసారమైన కలక్క పూవదు యారు-2కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆమె పలు సీరియల్స్ లో కూడా నటించింది. అంబుల్ల స్నేగితి అనే ధారావాహికతో సీరియల్ నటిగా మారింది స్వర్ణ. ఈ ధారావాహికలో అను హాసన్ తో కలసి నటించింది ఆమె. ఆ తరువాత ఆమె భారతీరాజా దర్శకత్వం వహించిన తీక్కతు పొన్ను, జయ టీవీలో ప్రసారమైన వందాలే మాహర్షి, రేవతి నటించిన యాతుమాగి నింద్రాల్, సన్ టీవీలో ప్రసారమైన తంగం వంటి ధారావాహికల్లో నటించింది స్వర్ణ.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

2002లో స్వర్ణమాల్యకు అర్జూన్ తో వివాహం అయింది. పెళ్ళైన తరువాత వారిద్దరూ అమెరికాకు మారిపోయారు. కానీ సంవత్సరం తిరగక ముందే స్వర్ణ సినిమాల్లో నటించేందుకు ఆమె భారత్ కు తిరిగి వచ్చేసింది. ఆ కారణం ద్వారానే వారిద్దరూ విడిపోయి, విడాకులు తీసుకున్నారు.[2][3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (17 November 2023). "21 ఏళ్లకే విడాకులు.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా: నటి". Archived from the original on 17 January 2024. Retrieved 17 January 2024.
  2. "Marriage". Veethi.com.
  3. "Controversy". One India. Archived from the original on 2014-02-02.