హిందూపురం లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఆంధ్ర ప్రదేశ్ లోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా ఈ నియోజకవర్గపు రూపురేఖలు స్వల్పంగా మారినాయి. కొత్తగా ఏర్పడిన రాప్తాడు, పుట్టపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లు దీనిలో భాగంకాగా, నల్లమాడ మరియు గోరంట్ల సెగ్మెంట్లు రద్దయ్యాయి.

నియోజకవర్గపు చరిత్ర[మార్చు]

హిందూపూర్ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. అంతకు క్రితం పెనుకొండ నియోజకవర్గంగా ఉన్నప్పుడు 1952లో జరిగిన ఎన్నికలలో ప్రజాపార్టీ తరఫున పోటీచేసిన కె.ఎస్.రాఘవాచారి ఎన్నికయ్యాడు. 1957 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 10 సార్లు విజయం సాధించారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు[మార్చు]

నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు[మార్చు]

1957 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అత్యధికంగా 10 సార్లు విజయం సాధించగా, తెలుగుదేశం అభ్యర్థులు 3 సార్లు గెలుపొందినారు. 1957లో నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందాడు. గత 4 లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీలు సమఉజ్జీగా ఉన్నాయి.

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
రెండవ 1957-62 కె.వి.రామకృష్ణారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 కె.వి.రామకృష్ణారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 నీలం సంజీవరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 పి.బాయపరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 పి.బాయపరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 పి.బాయపరెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 కె.రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 సానిపల్లి గంగాధర భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 సానిపల్లి గంగాధర భారత జాతీయ కాంగ్రెసు
పదకొండవ 1996-98 ఎస్.రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ
పన్నెండవ 1998-99 సానిపల్లి గంగాధర భారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ 1999-04 బి.కె.పార్థసారథి తెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ 2004-09  జి.నిజాముద్దీన్ భారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ 2009-14 నిమ్మల కిష్టప్ప తెలుగుదేశం పార్టీ
పదహారవ 2014-ప్రస్తుతం

2004 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలు[మార్చు]

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున నరేశ్ పోటీ చేస్తున్నాడు.[1] కాంగ్రెస్ పార్టీ తరఫున ఖాసింఖాన్ పోటీలో ఉన్నాడు. [2] తెలుగుదేశం పార్టీ టికెట్ నిమ్మల కిష్టప్పకు లభించింది. [3]

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009
  2. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  3. ఈనాడు దినపత్రిక, తేది 29-03-2009