హేమూ అధికారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హేమూ అధికారి
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హేమచంద్ర రామచంద్ర అధికారి
పుట్టిన తేదీ(1919-07-31)1919 జూలై 31
పూణే
మరణించిన తేదీ2003 అక్టోబరు 25(2003-10-25) (వయసు 84)
ముంబై
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి లెగ్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 36)1947 నవంబరు 28 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1959 ఫిబ్రవరి 11 - వెస్టిండీస్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫస్ట్ క్లాస్
మ్యాచ్‌లు 21 152
చేసిన పరుగులు 872 8,683
బ్యాటింగు సగటు 31.14 41.74
100లు/50లు 1/4 17/45
అత్యధిక స్కోరు 114* 230*
వేసిన బంతులు 170 4,000
వికెట్లు 3 49
బౌలింగు సగటు 27.33 37.93
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 3/68 3/2
క్యాచ్‌లు/స్టంపింగులు 8/– 97/–
మూలం: Cricinfo, 2022 నవంబరు 15

కల్నల్ హేమచంద్ర "హేమూ" రామచంద్ర అధికారి (1919 జూలై 31 – 2003 అక్టోబరు 25) భారతీయ క్రికెట్ ఆటగాడు. మూడు దశాబ్దాల పాటు సాగిన కెరీర్‌లో ఆటగాడిగా, కోచ్‌గా తన దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. అతను 1998లో సికె నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నాడు. ఇది మాజీ ఆటగాళ్ళకు బిసిసిఐ అందించే అత్యున్నత గౌరవం. [1]

జీవితం, వృత్తి[మార్చు]

అధికారి ప్రతిభావంతుడైన కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్. అప్పుడప్పుడు లెగ్ స్పిన్ వేసేవాడు. అతను యుక్తవయసులో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే ముందు, 1936/37 దేశీయ సీజన్‌లో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. అతను వెంటనే తన సామర్థ్యాలను ప్రదర్శించాడు. కానీ యుద్ధం కారణంగా, భారత సాయుధ దళాలలో అతని పాత్ర కారణంగా, అతని కెరీర్‌కు అంతరాయం కలిగింది.

అధికారి 1947లో 28 ఏళ్ల వయస్సులో భారతదేశం ఆస్ట్రేలియాలో పర్యటించినపుడు తన తొలి టెస్టు ఆడాడు. వెంటనే జట్టులో ముఖ్యమైన సభ్యునిగా స్థిరపడ్డాడు. కానీ, సైన్యంలో అతని అధికారిక పాత్ర కారణంగా జట్టుకు అందుబాటులో ఉండటం పరిమితంగానే ఉండేది.

స్పిన్ బౌలింగ్ ఆడటంలో అధికారికి మంచి నైపుణ్యం ఉండేది. ఫాస్ట్ బౌలింగ్‌కు వ్యతిరేకంగా ధైర్యంగా ఆడేవాడు. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో గులామ్ అహ్మద్‌తో కలిసి చివరి వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యంతో, జాతీయ రికార్డు నెలకొల్పాడు. అతను తన నలభైవ ఏట ఒక టెస్ట్‌లో భారతదేశానికి కెప్టెన్‌గా చేసాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఆ గేమ్‌లో బ్యాటింగ్ చేస్తూ 63, 40 పరుగులు చేసి, బౌలింగులో మూడు ముఖ్యమైన వికెట్లు తీసుకున్నాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

అధికారి ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైరైన తర్వాత కోచింగ్ బాధ్యతలు తీసుకున్నాడు. అతనికి చాలా మంచి బ్యాటింగ్ సగటు (41.74) ఉంది. ప్రపంచ వేదికపై తమను తాము స్థాపించుకున్న భారత జట్టుకు అతను బాధ్యత వహించాడు. 1971లో ఇంగ్లండ్‌లో భారత్‌కు మొదటి సిరీస్ విజయాన్ని అందించడంలో అతను దోహద పడ్డాడు. సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రి వంటి అత్యుత్తమ క్రికెటర్లు అభివృద్ధి చెందడానికి అతను ప్రధాన కారకుడిగా నిలిచాడు. మిలిటరీతో అతని చరిత్ర అతనికి కోచ్‌గా సహాయపడిందని కొందరు భావించారు. మాజీ జాతీయ జట్టు స్పిన్ బౌలర్ బాపు నాదకర్ణి మాట్లాడుతూ "అధికారి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. మిలటరీ మనిషి కాబట్టి, ఎవరు ఏమనుకుంటున్నారో అనేదాన్ని అతను పట్టించుకునేవాడు కాదు" అని అన్నాడు. కల్నల్ హేము అధికారి హైదరాబాద్‌కు చెందిన మరో మిలటరీ వ్యక్తి, ప్రసిద్ధ క్రికెట్ కోచ్ అయిన మీర్జా రహ్మత్ ఉల్లా బేగ్ (MR బేగ్) కు మెంటర్. అతను సర్వీసెస్ నుండి రంజీకి ఆడాడు. కల్నల్ హేమూ అధికారి మార్గదర్శకత్వంలో అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు.

2003 అక్టోబరులో 84 సంవత్సరాల వయస్సులో అతని హేమూ మరణించినపుడు, భారతీయ క్రికెట్ రచయిత సురేష్ మీనన్ మాట్లాడుతూ, "అధికారి భారీ మనిషేమీ కాదు, కానీ మైదానంలో అతని ఉనికి స్ఫుటంగా కనిపిస్తుంది.1971లో ఆ సిరీస్ విజయంతో ప్రారంభమైన భారత క్రికెట్ ఆత్మవిశ్వాస ఉద్యమంలో అతను నిర్వర్తించిన పాత్రకు గాను అతను గుర్తుండిపోతాడు".

కెరీర్ బెస్ట్[మార్చు]

టెస్ట్ మ్యాచ్‌లు[మార్చు]

తొలి టెస్టు: vs ఆస్ట్రేలియా, బ్రిస్బేన్, 1947/48చివరి టెస్టు: vs వెస్టిండీస్, ఢిల్లీ, 1958/59

  • హేమూ అధికారి అత్యుత్తమ టెస్టు బ్యాటింగు: 114 నాటౌట్ వెస్టిండీస్‌తో ఢిల్లీలో, 1948/49
  • అత్యుత్తమ టెస్ట్ బౌలింగు:వెస్టిండీస్‌తో, ఢిల్లీలో 68 పరుగులకు 3 వికెట్లు 1958/59
  • అతని టెస్ట్ కెప్టెన్సీ రికార్డు: 1 మ్యాచ్, 1 డ్రా

ఫస్ట్ క్లాస్[మార్చు]

  • అధికారి అత్యుత్తమ ఫస్ట్ క్లాస్ బ్యాటింగ్ స్కోరు 230 నాటౌట్

మూలాలు[మార్చు]

  1. "C.K. Nayudu award for Kapil Dev". The Hindu (in Indian English). 2013-12-18. ISSN 0971-751X. Retrieved 2023-04-25.