1904 ఒలింపిక్ క్రీడలు
1904లో మూడవ ఒలింపిక్ క్రీడలు అమెరికాలోని సెయింట్ లూయీస్ లో నిర్వహించబడ్డాయి. జూలై 1న ప్రారంభమైన ఈ క్రీడలు నవంబర్ 23 వరకు ప్రస్తుతం ఫ్రాన్సిస్ ఫీల్డ్‌గా పిల్వబడుతున్న సెయింట్ లూయీస్ లోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించబడినవి. వాస్తవానికి ఈ క్రీడలు చికాగో నగరం నిర్వహించడానికి బిడ్ గెల్చిననూ ఏక కాలంలో రెండు అంతర్జాతీయ పోటీలను నిర్వహించడానికి లూయిసియానా పర్చేజ్ ఎక్స్పోజిషన్ ఒప్పుకోకపోవడంతో చివరికి సెయింత్ లూయీస్ నగరానికి మార్పు చేయవలసి వచ్చింది. ఈ ఒలింపిక్ క్రీడలలో 17 క్రీడలు, 91 క్రీడాంశాలు నిర్వహించగా నిర్వాహకదేశమైన అమెరికా అత్యధికంగా 79 పోటీలలో నెగ్గి ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడింది. రెండో స్థానంలో ఉన్న జర్మనీకి కేవలం 4 స్వర్ణాలు మాత్రమే వచ్చాయి. 12 దేశాల నుంచి 651 క్రీడాకారులు ఈ క్రీడలలో పాల్గొని తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు.
విషయ సూచిక |
అత్యధిక పతకాలు పొందిన దేశాలు [మార్చు]
నిర్వాహక దేశమైన అమెరికా దాదాపు 80% స్వర్ణాలను సాధించి ఈ పోటీలలో ఏకఛత్రాధిపత్యం వహించింది. జర్మనీ, క్యూబా, కెనడాలు చెరో 4 బంగారు పతకాలను చేజిక్కించుకున్నాయి. 12 దేశాలు పాల్గొన్న ఈ పోటీలలో 9 దేశాలు స్వర్ణాలు సాధించాయి.
నిర్వహించిన క్రీడలు [మార్చు]
|
పాల్గొన్న దేశాలు [మార్చు]
ఈ ఒలింపిక్ క్రీడలలో 12 దేశాలు పాల్గొన్నాయి.
ఇవి కూడా చూడండి [మార్చు]
బయటి లింకులు [మార్చు]
- International Olympic Committee St Louis 1904
- The Olympic Games 1904, Charles J.P. Lucas
- Spalding's Athletic Almanac for 1905
- 1904 St. Louis Olympics Games at Useless Information
- Competitions on Anthropology Days
|
|||||