2024 లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారత పర్యటన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2024 లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు భారత పర్యటన
India
England
రోజులు 2024 జనవరి 25 – మార్చి 11
నాయకులు రోహిత్ శర్మ బెన్ స్టోక్స్
Test series

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు భారత జట్టుతో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు 2024 జనవరి నుంచి మార్చి వరకు భారత్‌లో పర్యటించింది.[1] ఈ టెస్టు సిరీస్ 2023-2025 ICC వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగం.[2] ఆంథోనీ డి మెల్లో ట్రోఫీ కోసం జట్లు పోటీ పడుతున్నాయి. 2024 జనవరి, ఫిబ్రవరిల్లో ఇండియా A ఇంగ్లాండ్ లయన్స్ మధ్య జరిగిన ఫస్ట్-క్లాస్ సిరీస్‌తో పాటు ఈ సిరీస్ జరిగింది.[3]

తొలి టెస్టులో 190 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటు నుంచి కోలుకున్న ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. [4] ఆలీ పోప్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 196 పరుగులు చేశాడు, ఆపై తొలి టెస్టు ఆడుతున్న ఆటగాడు టామ్ హార్ట్లీ 7/62తో జట్టు విజయానికి తోడ్పడ్డాడు. [5]


రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. అయితే ఇంగ్లండ్‌ బలమైన కౌంటర్‌తో లోటును 143కు తగ్గించింది. శుభ్‌మన్ గిల్ సెంచరీతో భారత్ 399 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లండ్, తమ రెండవ ఇన్నింగ్స్‌లో కొంత విజయం సాధించినా, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ ల బౌలింగ్ కారణంగా భారత్, 106 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. [6] భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 209 పరుగులు చేయడం అతని కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన.[7]

మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌటైంది. అయితే బెన్ డకెట్ చక్కటి ఆటతీరుతో ఇంగ్లండ్ లోటు 126 కు తగ్గింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్ 214* (మరో కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన) సాధించి, భారత్‌కు 557 పరుగుల ఆధిక్యాన్ని అందించడంలో సహాయపడ్డాడు. రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లండ్ 122 పరుగులకు ఆలౌటై, భారత్ 434 పరుగుల తేడాతో విజయం సాధించింది. పరుగుల పరంగా భారతదేశం సాధించిన అతిపెద్ద విజయం ఇది. సిరీస్‌లో 2-1 ఆధిక్యం లోకి వెళ్ళింది.[8]


రాంచీలో జరిగిన నాలుగవ టెస్టులో భారత జట్టు, 5 వికెట్లతో విజయం సాధించి మరో మ్యాచ్ ఉండగానే సీరీస్‌ను 3-1 తో గెలుచుకుంది.

నేపథ్యం[మార్చు]

ఈ సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య 131 టెస్టులు జరగ్గా, ఇంగ్లండ్ 50 గెలిచి, 31 ఓడిపోయింది. 50 టెస్టులు డ్రా అయ్యాయి. భారత్‌లో 14 గెలిచి 22 ఓడగా, 28 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. భారత్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మొత్తం 16 సిరీస్‌లలో ఆతిథ్య జట్టు ఎనిమిది విజయాలు సాధించగా, ఐదింటిలో ఓడిపోయింది. 2012–13లో భారత్‌లో టెస్టు సిరీస్‌ను గెలుచుకున్న చివరి సందర్శక జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. [9] [10] రెండు జట్ల మధ్య చివరి టెస్టు సిరీస్, ఇంగ్లాండ్‌లో జరిగినపుడూడు COVID-19 వలన అంతరాయం కలిగింది. అది 2-2 డ్రాగా ముగిసింది. అయితే, గత దశాబ్దంలో స్వదేశంలో ఆడిన 46 టెస్టుల్లో 36 గెలిచి, భారత్ మెరుగైన రికార్డును సొంతం చేసుకుంది. [11] ఈ సీరీస్‌కు ముందు భారతదేశం ఆడిన టెస్టులో దక్షిణాఫ్రికాతో దక్షిణాఫ్రికాలో 1-1 డ్రా చేసుకుంది. కాగా, ఇంగ్లాండ్ చివరిసారిగా స్వదేశంలో జరిగిన యాషెస్‌లో 2-2తో డ్రా అయింది. [12] ఈ సిరీస్‌కు ముందు, ఐసిసి పురుషుల టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్‌, ఇంగ్లండ్ లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. [13]

ఈ సీరీస్‌కు ముందు రెండేళ్లుగా ఇంగ్లండ్ బాజ్‌బాల్ తరహా క్రికెట్‌ ఆడుతోంది. ఈ పద్ధతిలో తాను ఆడిన 18 టెస్టుల్లో 13 విజయాలు సాధించింది. ఈ ఇండియా సిరీస్‌ను తన అంతిమ పరీక్షగా ఇంగ్లీష్ మీడియా పేర్కొంది. [14] [15] టెలిగ్రాఫ్ ఇలా వ్రాసింది: "బాజ్‌బాల్‌లో మొదటి నియమమైన అంతులేని సానుకూలతకు భారతదేశం అంతిమ ఒత్తిడి పరీక్ష అవుతుంది." కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ, "సిరీస్‌ సంగతి తరువాత.. భారతదేశంలో ఒక ఆటను గెలవడం కూడా చాలా కష్టతరం" అని పేర్కొన్నాడు. [15] అంతకు ముందు, వారి టాప్-ఆర్డర్ బ్యాటర్ ఓలీ పోప్, "ఎప్పటిలాగే భారతదేశంలో కూడా ఇంగ్లాండ్‌, బాజ్‌బాల్‌ను ఉపయోగిస్తుందని" పేర్కొన్నాడు. [16] ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ ఇలా అన్నాడు: "భారతదేశం తమ స్వంత పరిస్థితుల్లో అత్యుత్తమంగా ఉంటుంది. ఇది మాకు మంచి సవాలుగా ఉంటుంది. మేం విజయం సాధిస్తే, అద్భుతమైనది; సాధించకపోతే, మేం ఎలా ఓడిపోవాలని కోర్యుకుంటామో అలాగే ఓడిపోతాం." [17] అయితే, మాజీ ఇంగ్లీష్ టెస్టు కెప్టెన్ మైఖేల్ వాన్, అద్భుతమైన స్పిన్నర్లను కలిగి ఉన్న భారత జట్టుపై ఇంగ్లీష్ జట్టు "పూర్తిగా నాశనం" కావచ్చని హెచ్చరించాడు. [18] 2012–13లో అక్కడ గెలిచిన జట్టులో భాగమైన మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్, ఇంగ్లండ్ ఆటతీరు తమ స్పిన్నర్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు. అతను ఇలా అన్నాడు, "ఇంగ్లండ్ స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేస్తారనేది చూడండి. బాజ్‌బాల్ గురించి ఆలోచించకండి. బ్యాటింగ్ చేయడానికి ఇది అత్యంత అందమైన ప్రదేశం కాబట్టి వారు పరుగులు సాధిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు ఇది గొప్ప ప్రదేశం. వారు తగినంత పరుగులు గనక సాధిస్తే, స్పిన్నర్లు ఎలా బౌలింగ్ చేస్తారనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది." [19]

స్క్వాడ్స్[మార్చు]

 భారతదేశం[20]  ఇంగ్లాండు[21]

టెస్టు సిరీస్[మార్చు]

1వ టెస్టు[మార్చు]

2024 జనవరి 25–29 [n 1]
Scorecard
v
246 (64.3 ఓవర్లు)
బెన్ స్టోక్స్ 70 (88)
రవిచంద్రన్ అశ్విన్ 3/68 (21 ఓవర్లు)
436 (121 ఓవర్లు)
రవీంద్ర జడేజా 87 (180)
జో రూట్ 4/79 (29 ఓవర్లు)
420 (102.1 ఓవర్లు)
ఓలీ పోప్ 196 (278)
జస్‌ప్రీత్ బుమ్రా 4/41 (16.1 ఓవర్లు)
202 (69.2 ఓవర్లు)
రోహిత్ శర్మ 39 (58)
టామ్ హార్ట్‌లీ 7/62 (26.2 ఓవర్లు)
ఇంగ్లాండ్ 28 పరుగులతో గెలిచింది
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హైదరాబాదు
Umpires: క్రిస్ గఫానీ (న్యూజీ), పాల్ రీఫెల్ (ఆస్ట్రే)
Player of the match: ఓలీ పోప్ (ఇం)
  • ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • టామ్ హార్ట్‌లీ (ఇం) తన తొలి టెస్టు ఆడుతూ ఐదు వికెట్ల పంట తీసాడు.[22]
  • ఈ వేదికపై భారత్‌కు ఇది తొలి టెస్టు ఓటమి.[23]
  • ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లు: ఇంగ్లాండ్ 12, భారత్ 0.

2వ టెస్టు[మార్చు]

2024 ఫిబ్రవరి 2–6 [n 1]
Scorecard
v
396 (112 ఓవర్లు)
యశశ్వి జైస్వాల్ 209 (290)
జేమ్స్ ఆండర్సన్ 3/47 (25 ఓవర్లు)
253 (55.5 ఓవర్లు)
జాక్ క్రాలే 76 (78)
జస్‌ప్రీత్ బుమ్రా 6/45 (15.5 ఓవర్లు)
255 (78.3 ఓవర్లు)
శుభ్‌మ‌న్ గిల్ 104 (147)
టామ్ హార్ట్‌లీ 4/77 (27 ఓవర్లు)
292 (69.2 ఓవర్లు)
జాక్ క్రాలే 73 (132)
జస్‌ప్రీత్ బుమ్రా 3/46 (17.2 ఓవర్లు)

3వ టెస్టు[మార్చు]

2024 ఫిబ్రవరి 15–19[n 1]
Scorecard
v
445 (130.5 ఓవర్లు)
రోహిత్ శర్మ 131 (196)
మార్క్ వుడ్ 4/114 (27.5 ఓవర్లు)
319 (71.1 ఓవర్లు)
బెన్ డకెట్ 153 (151)
మహమ్మద్ సిరాజ్ 4/84 (21.1 ఓవర్లు)
430/4డి (98 ఓవర్లు)
యశశ్వి జైస్వాల్ 214* (236)
టామ్ హార్ట్‌లీ 1/78 (23 ఓవర్లు)
122 (39.4 ఓవర్లు)
మార్క్ వుడ్ 33 (15)
రవీంద్ర జడేజా 5/41 (12.4 ఓవర్లు)
భారత్ 434 పరుగులతో గెలిచింది
నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్
Umpires: కుమార్ ధర్మసేన (శ్రీ), జోయెల్ విల్సన్ (వెస్టిం)
Player of the match: రవీంద్ర జడేజా (భా)
  • భారత్ టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
  • ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్ (భా) లు టెస్టుల్లో రంగప్రవేశం చేసారు.
  • బెన్ స్టోక్స్ (ఇం) తన 100 వ టెస్టు ఆడాడు.[26]
  • రవీంద్ర జడేజా (భా) టెస్టుల్లో తన 3,000 వ పరుగు చేసాడు.[27]
  • రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే రికార్డును ఛేదించాడు.[28] కుటుంబంలో అత్యవసరమైన పని కారణంగా అతను రెండవరోజున ఆట నుండి తప్పుకుని, తిరిగి నాలుగవ రోజున వచ్చి చేరాడు[29][30]
  • యశశ్వి జైస్వాల్ (భా) టెస్టు ఇన్నింగ్సులో అత్యధిక సిక్సర్లు కొట్టిన వసీం అక్రమ్ రికార్డును (12) సమం చేసాడు.[31]
  • పరుగుల పరంగా ఇది, భారత్ సాధించిన అతి పెద్ద విజయం. పరుగుల పరంగా ఇంగ్లాండ్‌కు ఇది రెండవ అతి పెద్ద పరాజయం, 1934 లో ఆస్ట్రేలియాపై ఓటమి తరువాత వారికి ఇది అతి పెద్ద పరాజయం.[32]
  • ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లు: భారత్ 12, ఇంగ్లాండ్ 0.

4వ టెస్టు[మార్చు]

2024 ఫిబ్రవరి 23–27[n 1]
Scorecard
v
353 (104.5 ఓవర్లు)
జో రూట్ 122* (274)
రవీంద్ర జడేజా 4/67 (32.5 ఓవర్లు)
307 (103.2 ఓవర్లు)
ధ్రువ్ జురెల్ 90 (149)
షోయిబ్ బషీర్ 5/119 (44 ఓవర్లు)
145 (53.5 ఓవర్లు)
జాక్ క్రాలే 60 (91)
రవిచంద్రన్ అశ్విన్ 5/51 (15.5 ఓవర్లు)
192/5 (61 ఓవర్లు)
రోహిత్ శర్మ 55 (81)
షోయిబ్ బషీర్ 3/79 (26 ఓవర్లు)
భారత్ 5 వికెట్లతో గెలిచింది
JSCA International Stadium Complex, Ranchi
Umpires: కుమార్ ధర్మసేన (శ్రీ) రాడ్ టకర్ (ఆస్ట్రే)
Player of the match: ధ్రువ్ జురెల్ (భా)

5వ టెస్టు[మార్చు]

2024 మార్చి 7–11
Scorecard
v

మూలాలు[మార్చు]

  1. "BCCI announces fixtures for International Home Season 2023–24". Board of Control for Cricket in India. Retrieved 25 July 2023.
  2. "India's home season: Major Test venues set to miss out on England series". ESPNcricinfo. Retrieved 26 July 2023.
  3. "England Lions to play three four-day matches against India A in Ahmedabad". ESPNcricinfo. Retrieved 11 January 2024.
  4. "India v England: Ollie Pope and Tom Hartley inspire all-time great victory". BBC Sport. Retrieved 28 January 2024.
  5. "Bazball England smash more records in historic victory among their greatest ever triumphs". The Independent. Retrieved 28 January 2024.
  6. "England fail to capture second miracle in India – but run chase reveals Bazball's true intent". The Independent. Retrieved 8 February 2024.
  7. "IND vs ENG: Sunil Gavaskar lauds Yashasvi Jaiswal for being 'quick learner' after match-winning 209 in Vizag Test". India Today. Retrieved 8 February 2024.
  8. "India vs England LIVE: Test cricket result and updates as visitors slump to woeful defeat". The Independent. Retrieved 19 February 2024.
  9. "India vs England Test series: Stats, records and head-to-head results". Business Standard. Retrieved 19 February 2024.
  10. Sportstar, Team (25 January 2024). "IND vs ENG, head to head record: India vs England overall stats, most runs and wickets". Sportstar (in ఇంగ్లీష్). Retrieved 19 February 2024.
  11. Menon, Suresh (23 January 2024). "Ind vs Eng Tests | India's home record is formidable; Bazball is England's best chance". The Hindu (in Indian English). Retrieved 19 February 2024.
  12. "England's Michael Atherton predicts winner of IND vs ENG Test series, reserves special praise for India star". Hindustan Times (in ఇంగ్లీష్). 21 January 2024. Retrieved 19 February 2024.
  13. "FACTBOX: India vs England Test series". The Times of India. 23 January 2024. Retrieved 19 February 2024.
  14. Pringle, Derek (22 January 2024). "India the ultimate test for England as Bazball takes on the tweakers". Metro (in ఇంగ్లీష్). Retrieved 19 February 2024.
  15. 15.0 15.1 Hoult, Nick (24 January 2024). "India tour will be Bazball's ultimate test of 'positive at all costs' mindset". The Telegraph. Retrieved 19 February 2024.
  16. Macpherson, Will (29 November 2023). "Ollie Pope interview: 'England will Bazball as hard as ever in India'". The Telegraph. Retrieved 19 February 2024.
  17. "Even if we go down against India in Tests, it will be in style: McCullum". TheDailyGuardian (in ఇంగ్లీష్). 5 December 2023. Retrieved 19 February 2024.
  18. "'They may get absolutely destroyed': Michael Vaughan's stern warning to England over Bazball approach against India". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). 12 December 2023. Retrieved 19 February 2024.
  19. Agarwal, Naman (7 December 2023). "Kevin Pietersen: England's Spinners, Not Bazball, Will Be The Key To Success In India". Wisden. Retrieved 19 February 2024.
  20. "India's squad for first two Tests against England announced". Board of Control for Cricket in India. Retrieved 12 January 2024.
  21. "England Men's squad for tour of India". England and Wales Cricket Board. Retrieved 11 December 2023.
  22. "India vs England: ఓలీ పోప్ pivotal as Tom Hartley breaks curse in comeback Test victory for the ages". Sky Spots. Retrieved 29 January 2024.
  23. "England debutant Hartley sends India spinning to defeat in Hyderabad Test". Hindustan Times. Retrieved 29 January 2024.
  24. "IND vs ENG, 2nd Test: యశశ్వి జైస్వాల్ Scores Maiden Double-Century of Test Career". News18. Retrieved 3 February 2024.
  25. "IND vs ENG: Bumrah becomes fastest Indian pacer to pick 150 Test wickets". Spotstar. Retrieved 3 February 2024.
  26. "బెన్ స్టోక్స్' 100th Test: Full list of players to feature in 100 or more Test matches". Wisden. Retrieved 15 February 2024.
  27. "IND vs ENG: రవీంద్ర జడేజా joins Shane Warne, Daniel Vettori in elite club after 3000 Test runs". India Today. Retrieved 16 February 2024.
  28. "రవిచంద్రన్ అశ్విన్ surpasses Anil Kumble to become fastest Indian to reach 500 Test wicket". Hindustan Times (in ఇంగ్లీష్). 16 February 2024. Retrieved 18 February 2024.
  29. "రవిచంద్రన్ అశ్విన్: India spinner out of third Test against England because of family emergency". BBC Sport. Retrieved 16 February 2024.
  30. "Ashwin rejoins Indian team in Rajkot". ESPNcricinfo. Retrieved 18 February 2024.
  31. "IND vs ENG, 3rd Test: యశశ్వి జైస్వాల్ equals record for most sixes by a batter in a Test innings". Sportstar. Retrieved 18 February 2024.
  32. "IND vs ENG: India record biggest Test win by runs, beat England by 434 runs in Rajkot". The Indian Express (in ఇంగ్లీష్). 18 February 2024. Retrieved 18 February 2024.
  33. "IND vs ENG: షోయిబ్ బషీర్ becomes second youngest overseas bowler to pick five wickets in India". Sportstar. Retrieved 25 February 2024.
  34. "R Ashwin roars back to form, levels Anil Kumble with 35th Test five-wicket-haul". Hindustan Times (in ఇంగ్లీష్). 25 February 2024. Retrieved 25 February 2024.
  35. "IND vs ENG, 4th Test: రోహిత్ శర్మ completes 4000 runs in Tests". Sportstar (in ఇంగ్లీష్). 25 February 2024. Retrieved 25 February 2024.


ఉల్లేఖన లోపం: "n" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="n"/> ట్యాగు కనబడలేదు