బుడితి కంచు, ఇత్తడి పని: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) ←Created page with '{{Infobox alloy art | name = బుడితి కంచు మరియు ఇత్తడి పని | image = Brass articles.JPG...' |
(తేడా లేదు)
|
00:09, 25 జనవరి 2016 నాటి కూర్పు
బుడితి కంచు మరియు ఇత్తడి పని | |
---|---|
తయారైన రకరకాల ఇత్తడి బిందెలు | |
భౌగోళికాంశాలు : | 18°30′N 84°00′E / 18.5°N 84.0°E |
పేరు | |
ఇతర పేర్లు: | బుడితిత్తడి |
ప్రధాన పేరు : | బుడితి కంచు మరియు ఇత్తడి పని |
ప్రదేశము | |
దేశము: | భారతదేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | శ్రీకాకుళం జిల్లా |
ప్రదేశము: | బుడితి |
మిశ్రమలోహ కళ యొక్క వివరాలు | |
మిశ్రమలోహం: | కంచు మరియు ఇత్తడి |
లోహాల మిశ్రమం: | కంచు (కాపర్, తగరం మరికొన్ని లోహాలు) ఇత్తడి (కాపర్ మరియు జింక్) |
మిశ్రమలోహంలో లోహాలశాతం: | కంచు (కాపర్ మరియు 12% తగరం) ఇత్తడి (కాపర్ మరియు జింక్(37%-45%)) |
తయారుచేసే వస్తువులు: | పాత్రలు, అలంకార వస్తువులు, దేవాలయ సామాగ్రి మరియు గంటలు |
వస్తువుల ఉపయోగం: | అలంకారం, వంటలకొరకు మరియు దేవాలయాలలో ఆకర్షణ |
ఈ కళకు ప్రసిద్ధ ప్రాంతాలు : | బుడితి, అజ్జరం |
ముఖ్య వస్తువులు: | దేవాలయ సామాగ్రి, అలంకార వస్తువులు |
బుడితి కంచు మరియు ఇత్తడి పని అనేది శ్రీకాకుళం జిల్లా లోని సారవకోట మండలానికి చెందిన బుడితి గ్రామంలో నెలకొన్ని ఉన్న పరిశ్రమ.[1][2] ఈ గ్ర్రామంలో కంచు మరియు ఇత్తడి మరియు గంట లోహం తయారుచేస్తారు.[3] అనేక పాత్రలు, దేవుని గుడిలో వాడే పాత్రలు, గంటలు తయారుచేసే లోహం తయారుచేస్తారు.
విశేషాలు
శ్రీకాకుళంలో బుడితి అనే గ్రామం కంచర వృత్తికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. కనుకనే "బుడితిత్తడి" అని అక్క డి ఇత్తడి వస్తువులకు పేరు.[4] దాదాపు 250 కుటుంబాలు ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తుంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా స్పోర్ట్స్ షాపులలో విక్రయిస్తున్న షీల్డులను ఎక్కువగా వీరే పంపిణీ చేస్తారు. సరికొత్త డిజైన్లతోపాటు ఫినిషింగ్ బాగా ఉంటుందనే పేరు వీరి వస్తువులకు ఉంది.[5]
ఇత్తడి పరిశ్రమ
ఈ ప్రాంతం ఇత్తడి పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది. ఇచట స్థానికులు మిశ్రమలోహాలను వివిధ ఆకృతులలో రూపుదిద్దిటకు నిరంతరం శ్రమిస్తారు. ఇత్తడి ఒక మిశ్రమ లోహము. దీనిలో ముఖ్యంగా రాగి మరియు జింకు ఉంటాయి. ఇత్తడి లోహమును ముద్దలుగా మార్చి దానినుండి పలుచటి రేకులుగా మార్చి తదుపరి వస్తువుల తయారీ కొరకు ఉపయోగిస్తారు. వీటిని వస్తువులతో పాటుగా దేవాలయాలలో కూడా అధికంగా వినియోగిస్తారు. ఈ ఆకారాలు నవీనంగా సొంపుగానూ మరియు సాంప్రదాయంగా మెరుస్తూ ఉంటాయి. ఈ కళ ద్వారా తయారైన పాత్రలు సాంప్రదాయకంగా వంటల కొరకు మరియు ఉపయోగిస్తారు. ఇవి సామాన్య ఇంటిలో కళాఖండాలుగా భాసిల్లుతున్నాయి. అన్ని వస్తువులూ ఇత్తడి లోహంతో తయారుచేస్తారు. వీటిలో కొన్ని వక్రములు మరియు సరళరేఖలు వంటి జ్యామితీయ ఆకృతులతో కూడుకొని ఉంటాయి. అనేక మంది కళాకారులు పుష్ప నమూనాలను కూడా ఇత్తడి వస్తువులతో తయారుచేస్తారు. ఈ పరిశ్రమ బుడితి గ్రామంలో ఉన్నందున ఈ వస్తువులను "బుడితిత్తడి" అని కూడా పిలుస్తారు. ఈ వస్తువులు తయారుచేయడం అనేది కొత్తగా సృష్టించబడిన పనికాదు. ఇది చాలా కాలంగా ఈ గ్రామంలో కొనసాగుతున్న పరిశ్రమ. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వ ప్రయత్నాల వల్ల ఈ పరిశ్రమ బహుళ ప్రజాదరణ పొందినది. పురాతనంగా కొనసాగుతున్న ఆకృతులు మరియు నవీన శైలులతో తయారైన ఆకృతులు చూపరులను కట్టి పడేస్తాయి. సొగసైన మనోహరంగా ఉన్న సన్నని మెడ గల పాత్రలు, అద్భుత ఆకారాలతో కూడుకున్న వస్తువులు బుడితి కళ యొక్క ప్రధాన లక్షణాలు. వంటపాత్రలు, పూల కుండీలు మరియు అలంకరణ ముక్కలు ఇచట విస్తారమైన కళారూపాలతో అందుబాటులో ఉన్నాయి.[6][7]
చేరుకొనే మార్గాలు
- బస్సు ద్వారా: శ్రీకాకుళం ఆర్.టి.సి కాంప్లెక్స్ నుండి శ్రీముఖలింగం వెళ్ళే మార్గంలో ఈ గ్రామం ఉంది. శ్రీకాకుళం నుండి సుమారు 40 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్ళడానికి తరచుగా శ్రీముఖలింగం వెళ్ళే బస్సులు దొరుకుతాయి.
- రైలు ద్వారా: తిలారు రైల్వే స్టేషన్ లో దిగితే అక్కడి నుండి సుమారు 13 కి.మీ దూరంలో గల ఈ గ్రామానికి బస్సులో ప్రయాణం చేయాలి.
చిత్రమాలిక
-
ఇత్తడి బిందెల తయారీలో కార్మికుడు
-
తయారు కాబడి ఉన్న వివిద రకాల ఇత్తడి (ఇస్త్రీ పెట్టెలు, పళ్లెములు, పూజా బల్లలు, అలంకరణ సామగ్రి) వస్తువులు
మూలాలు
- ↑ Metal Crafts of Southern India
- ↑ Brass & Metal Utensils of Andhra
- ↑ Indian Brass Crafts
- ↑ "Traditional crafts attract delegates". Staff Reporter. The Hindu. February 14, 2009. Retrieved 23 January 2016.
- ↑ కళావస్తువులకే పరిమితమైన కంచరి Updated: July 9, 2012
- ↑ "Budithi Brassware". http://www.discoveredindia.com/. Discovery of india. Retrieved 24 January 2016.
{{cite web}}
: External link in
(help)|website=
- ↑ Budithi Brassware