ముఖలింగం
శ్రీముఖలింగంలో ప్రసిద్ధ దేవాలయం గూర్చి శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం ( మధుకేశ్వరాలయం) చూడండి.
ముఖలింగం | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 18°36′N 83°58′E / 18.600°N 83.967°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
మండలం | జలుమూరు |
విస్తీర్ణం | 1.75 కి.మీ2 (0.68 చ. మై) |
జనాభా (2011)[1] | 3,022 |
• జనసాంద్రత | 1,700/కి.మీ2 (4,500/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 1,504 |
• స్త్రీలు | 1,518 |
• లింగ నిష్పత్తి | 1,009 |
• నివాసాలు | 837 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 532428 |
2011 జనగణన కోడ్ | 581094 |
శ్రీ ముఖలింగం లేదా ముఖలింగం, శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలానికి చెందిన గ్రామం.[2] ఇది మండల కేంద్రమైన జలుమూరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది.ఇక్కడ చరిత్ర ప్రసిద్ధిచెందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి.
గణాంకలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 837 ఇళ్లతో, 3022 జనాభాతో 175 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1504, ఆడవారి సంఖ్య 1518. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 202 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 4. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 581094[3].
2001 జనాభా లెక్కల ప్రకారం [4] మొత్తం జనాభా 3,204 అందులో పురుషుల సంఖ్య 1,625 కాగా స్త్రీలు 1,579 మంది ఉన్నారు.గ్రామంలో మొత్తం నివాస గృహాలు 767, 6 సం. లోపు పిల్లలు: 387 (బాలురు- 180, బాలికలు - 207) అక్షరాస్యులు1,579
శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం
[మార్చు]శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు 'పంచపీఠ' స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు. ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని సా.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తోంది.
క్షేత్ర పురాణం
[మార్చు]ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్పచెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో 'మధుకం' అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు. ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, సప్త మాతృకలలో ఆమె ఒకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం. భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి. సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే, మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి. ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది.
మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.
చరిత్ర
[మార్చు]ఆంధ్రప్రాంతమును ఏలిన తూర్పు గాంగవంశరాజులకు 6 శతాబ్దములకు పైగా రాజధానియై ఈ ప్రాంతము భాసిల్లినది. తూర్పు గాంగరాజులలో ప్రాముఖ్యుడైన అనంతవర్మ చోడగంగదేవుడు ఉత్కళమును జయించి, తన రాజధానిని సా.శ.1135 లో ఒరిస్సా లోని కటక్ నగరమునకు మార్చిన పిదప ముఖలింగపు ప్రాముఖ్యత క్రమముగా తగ్గిపోయింది. ఆనాటి వైభవుమునకు తాత్కారణముగ ముఖలింగంలో మూడు శైవ దేవాలయములున్నవి.ముఖలింగం లోని పాశుపత శైవమత ప్రాబల్యమునకు నిదర్శనముగ అచ్చటి ఆలయములలో లకుశీలుడు విగ్రహములు పెక్కు ఉన్నాయి. లకుశీలుడు [1] తను మత స్థాపకుడనియు, అతడు శివుని అవతారమనియు పాశుపత శైవమతస్థులు నమ్ముదురు.శైవమత గ్రంథములలో కూడా లకులీశుడు శివుని అవతారమనియు పేర్కొనబడెను.లింగ పురాణములో లకులీశుడు శివునియొక్క 28వ అవతారముగ చెప్పబడెను.కాని లకులీశుడు మానవుడనియు, అతడు గుజరాత్ రాష్త్రములోని కాయారోహణము (కార్వాన్) పట్టణమున సా.శ. 2 వ శతాబ్దములో జనించెననియు మనకు శాసనముల ఆధారముగ తెలియుచున్నది. లకులీశుడు ఎల్లప్పుడు లకుటమును ధరించుటచే ఆతనికి ఆపేరు వచ్చెను. అతడు పాశుపత శైవమత సిద్ధాంతములకు ఒక రూపము తెచ్చి, ఆ మతప్రచారము చేసెను. లకులీశుని శిష్యులలో ముఖ్యులు కుశినుడు, మిత్రుడు, గార్గుడు, కౌరుస్యుడు అనువారు. లకులీశుని నిరంతర కృషివలన ఆతని శిష్యులును, పాశుపత శైవ మతస్థుల సంఖ్యయు నానటికి పెరిగెను. మధ్యయుగము నాటికి పాశుపత శైవమతమునకు బహుళ ప్రాచుర్యము లభించి, ఆ మతస్థులలో లకులీశుడు దైవసంభూతుడే అను నమ్మకము గాఢముగ ఏర్పడెను.
మధ్యయుగ కాలములో పాశుపత శైవమతము గుజరాత్, రాజస్థాన్, రాష్త్రములనుండి మధ్య్ర పదేశ్, అస్సాం, బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర, తమిళనాడు, మైసూరు ప్రాంతములకు వ్యాపించి జనాదరణ పొందెను.
ముఖలింగ ప్రాంతమునకు పాశుపత శైవ మతము సా.శ. 8 వ శతాబ్దములో ఒరిస్సానుండి వ్యాపించెను.ముఖలింగములోని లకులీశుని విగ్రహములు భువనేశ్వరములోని లకులీశుని బిగ్రహములకు పోలిఉండును.ఇదే ఇక్కడి ముక్య విగ్రహము. గుజరాత్ లోను సోమేశ్వరాలయంలో ఈయని పద్మాసనమున కూర్చొని ఉన్న విగ్రహము ఉంది.ఆతనికి నాలుగు చేతులు ఉన్నాయి.రెండు చేతులు ధర్మచక్ర ప్రవర్తన ముద్రను చూపుచున్నవి. మిగిలిన రెండు చేతులలో అక్షమాల, త్రిశులము ఉన్నాయి.ఆతని ఫాలభాగమున త్రినేత్రము ఉంది.అతడు ఊర్ధ్వ లింగముతో చెక్కబడి ఉన్నాడు.ఆతని రెండు కళ్ళు సగము మూయబడి యోగముద్రలో ఉన్నట్లు ఉంది.అతను ఎల్లప్పుడు ధరించు లకుటము అతని ఎడమ భుజముపై ఆసించబడి, ఎడమ చేతితో చుట్టబడి ఉంది.ఈవిధముగా ముఖలింగములో చెక్కుటవలన శిల్పి ఆతనిని శివుని అవతారముగా భావించానాడని చెప్పవచ్చును.ఈయన విగ్రహమునకు క్రింది భాగమున ఆతని శిష్యులు నల్గురు పద్మపు కాడకు రెండు వైపుల ఆశీనులై ఉన్నారు.ఆగూటి చుట్టును పాశుపత శైవమత గురువులు చిత్రములు చెక్కబడి ఉన్నాయి.
సోమేశ్వరాలయం లకులీశుని విగ్రహం ప్రాముఖ్యత ఏమనగా ఇచట ఈతడు చతుర్భుజుడుగా చెక్కబడియున్నాడు.ఇలా మరియొకచేట కనబడలేదు.
ముఖలింగం లోని దేవాలయములు సా.శ.9 వ శతాబ్దమునుండి 11వ శతాబ్దపు మధ్యకాలములో కట్టబడినవి.వాటిలో చివరిదైన సోమేశ్వరాలయము సా.శ.11 వ శతాబ్దమునాటిది.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి నరసన్నపేటలో ఉంది. సమీప జూనియర్ కళాశాల జలుమూరులోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల శ్రీకాకుళంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ శ్రీకాకుళంలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నరసన్నపేటలోను, అనియత విద్యా కేంద్రం మర్రివలసలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల శ్రీకాకుళం లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]ముఖలింగంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
పారిశుధ్యం
[మార్చు]గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]ముఖలింగంలో పోస్టాఫీసు సౌకర్యం ఉంది. సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరం ఉంది.జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం ఉంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]ముఖలింగంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 31 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 10 హెక్టార్లు
- బంజరు భూమి: 4 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 127 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 67 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 75 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]ముఖలింగంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 75 హెక్టార్లు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-08-01.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ Mukhalingam at Our Village India.org
- Pages using the JsonConfig extension
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- జలుమూరు మండలంలోని గ్రామాలు
- Commons category link is on Wikidata
- శ్రీకాకుళం జిల్లా పుణ్యక్షేత్రాలు
- శ్రీకాకుళం జిల్లా పర్యాటక ప్రదేశాలు
- Pages using the Kartographer extension