అంబటి రాంబాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంబటి రాంబాబు
అంబటి రాంబాబు


జలవనరుల శాఖ మంత్రి
పదవీ కాలం
2022 ఏప్రిల్ 11 – ప్రస్తుతం

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2019 - ప్రస్తుతం
ముందు కోడెల శివప్రసాదరావు
నియోజకవర్గం సత్తెనపల్లి నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1958
రేపల్లె, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ Indian Election Symbol Ceiling Fan.svg వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు ఏవీ ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, వెంకట సుబ్బమ్మ
జీవిత భాగస్వామి విజయలక్ష్మి
సంతానం మౌనిక, మనోజ్ఞ, శ్రీజ

అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, రేపల్లె లో ఏవీ ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన విశాఖపట్నంలోని న్యాయ విద్య పరిషత్ లా కాలేజీ నుండి 1986లో బీఎల్‌ పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం[మార్చు]

అంబటి రాంబాబు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1988లో గుంటూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ కన్వీనర్, 1994లో జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, సాంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ (నెడ్‌క్యాప్‌)గా చేశాడు. ఆయన 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి ఎన్నికై, పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా నియమితుడయ్యాడు.

అంబటి రాంబాబు 1994 ,1999లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశాడు. ఆయన 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు చేతిలో 924 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అంబటి రాంబాబు 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు పై 20,876 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[4] ఆయన 2022 ఏప్రిల్ 11న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో జలవనరుల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అంబటి రాంబాబు సచివాలయంలోని నాలుగవ బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ఏప్రిల్ 21న మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[5]

మూలాలు[మార్చు]

  1. Sakshi (10 April 2022). "పడిన ప్రతిసారి అంతే వేగంగా నిలబడ్డాడు.. ప్రతిఫలంగా నేడు." Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  2. Sakshi (2019). "వైఎస్సార్సీపీ". Archived from the original on 2 November 2021. Retrieved 8 November 2021.
  3. Sakshi (19 March 2019). "గుంటూరు జిల్లా.. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా." Archived from the original on 2 December 2021. Retrieved 2 December 2021.
  4. Sakshi (2019). "MLA Candidates Winners LIST in Andhra Pradesh Elections 2019". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  5. Sakshi (21 April 2022). "మంత్రిగా అంబటి రాంబాబు బాధ్యతలు". Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.