Jump to content

అక్తర్ ఉల్ ఇమాన్

వికీపీడియా నుండి
అక్తర్ ఉల్ ఇమాన్
జననం1915, నవంబరు 12
ఖిలా పత్తర్‌ఘర్‌, నజీబాబాద్‌, బిజ్నోర్ జిల్లా, ఉత్తరప్రదేశ్‌
మరణం1996 మార్చి 9(1996-03-09) (వయసు 80)
సమాధి స్థలంబాంద్రా ఖబ్రిస్తాన్, ముంబై
విద్యఉర్దూ సాహిత్యంలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ
విద్యాసంస్థజాకీర్ హుస్సేన్ కళాశాల, ఢిల్లీ
అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఉర్దూ కవి, నాటక, స్క్రీన్ ప్లే రచయిత
జీవిత భాగస్వామిసుల్తానా ఇమాన్
పిల్లలుఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు
సంతకం

అక్తర్ ఉల్ ఇమాన్ (1915, నవంబరు 12 – 1996, మార్చి 9) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఉర్దూ కవి, నాటక, స్క్రీన్ ప్లే రచయిత. హిందీ సినిమాలలో పనిచేశాడు. ఇతను ఆధునిక ఉర్దూ నాజ్మ్‌పై ప్రధాన ప్రభావాన్ని చూపాడు.[1][2]

1963లో ధర్మపుత్ర, 1966లో వక్త్ సినిమాలకు ఉత్తమ సంభాషణల రచయితగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇతడు రాసిన యాదీన్ (జ్ఞాపకాలు) అనే కవితా సంకలనానికి సాహిత్య అకాడమీ నుండి ఉర్దూలో 1962 సాహిత్య అకాడమీ అవార్డును పొందాడు.[3]

జననం, విద్య

[మార్చు]

అక్తర్ ఉల్ ఇమాన్ 1915, నవంబరు 12 ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా నజీబాబాద్‌లోని ఖిలా పత్తర్‌ఘర్‌లో జన్మించాడు.[1][4] అనాథాశ్రమంలో పెరిగాడు.[5][6] బిజ్నోర్‌లో తన ప్రాథమిక విద్యను పూర్తిచేశాడు. అక్కడ కవి, పండితుడు ఖుర్షీద్ ఉల్ ఇస్లాంతో పరిచయం కలిగింది. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో బోధించాడు. రాల్ఫ్ రస్సెల్‌తో సుదీర్ఘ అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని జాకీర్ హుస్సేన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.[7] అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి ఉర్దూ డిగ్రీలో మాస్టర్స్ పూర్తి చేశాడు.[5]

వృత్తి జీవితం

[మార్చు]

ప్రారంభంలో ఆల్ ఇండియా రేడియోలో స్టాఫ్ ఆర్టిస్టుగా చేరాడు. 1945లో ఫిల్మిస్తాన్ స్టూడియోలో డైలాగ్ రైటర్‌గా చేరారు.[8][4]

రచనలు

[మార్చు]

పుస్తకాలు

[మార్చు]

ఇస్ అబద్ ఖరాబే మే (ఉర్దూ)-ఉర్దూ అకాడమీ, ఢిల్లీ, భారతదేశం ద్వారా ప్రచురించబడింది. భారతదేశంలోని ప్రముఖ ఉర్దూ రచయిత ఆత్మకథ.[6]

కవిత్వం

[మార్చు]

ఎనిమిది పుస్తకాలు ప్రచురించాడు:

  • గిర్దాబ్ (1943)[9]
  • అబ్జూ (1944-1945)
  • తారీక్ సయ్యారా (1946–47)
  • యాడెన్ (1961)[3]
  • బింట్-ఎ-లమ్హాత్ (1969)
  • నయా అహంగ్ (1977)[6]
  • సార్-ఓ-సమాన్ (1982)[4]
  • జమీన్ జమీన్ (1983-1990)
  • కుల్లియాత్-ఎ-అఖ్తర్-ఉల్-ఇమాన్ (2000)[4]

నాటకం

  • సబ్రాంగ్ (1948): పద్య నాటకం.

ఇతరులచే అనువాదం, సంకలనం

[మార్చు]
  • జమిస్తాన్ సర్ద్ మెహ్రికా (ఉర్దూ)- మరిచిపోలేని ఉర్దూ కవి చివరి కవితా సంకలనం. సుల్తానా ఇమాన్, బేదర్ బఖ్త్ సంకలనం.
  • క్వెరీ ఆఫ్ ది రోడ్ - బైదర్ బఖ్త్ ద్వారా విస్తృతమైన వ్యాఖ్యానంతో అఖ్తర్-ఉల్-ఇమాన్ ఎంచుకున్న పద్యాలు[4]

అవార్డులు

[మార్చు]

సాహిత్య పురస్కారాలు

అనేక ఇతర సాహిత్య పురస్కారాలు.

సినిమాలు

[మార్చు]
  • విజయ్ (1988) - రచయిత
  • చోర్ పోలీస్ (1983) - రచయిత
  • లాహు పుకరేగా (1980) – దర్శకుడు
  • దో ముసాఫిర్ (1978) – రచయిత
  • చండీ సోనా (1977) – రచయిత[9]
  • జమీర్ (1975) - రచయిత
  • 36 ఘంటే (1974) – రచయిత
  • రోటీ (1974) – రచయిత[9]
  • నయ నాషా (1973) – రచయిత
  • బడా కబుటర్ (1973) – రచయిత[9]
  • దాగ్ (1973) - రచయిత
  • ధుండ్ (1973) - రచయిత
  • జోషిలా (1973) - రచయిత
  • కున్వారా బదన్ (1973) - రచయిత
  • దస్తాన్ (1972) - రచయిత
  • జోరూ కా గులాం (1972) – రచయిత
  • ఆద్మీ ఔర్ ఇన్సాన్ (1969) – రచయిత[9]
  • చిరాగ్ (1969) - రచయిత
  • ఇత్తెఫాక్ (1969) - రచయిత
  • ఆద్మీ (1968) - రచయిత
  • హమ్రాజ్ (1967) - రచయిత
  • పత్తర్ కే సనమ్ (1967) – రచయిత[10]
  • గబాన్ (1966) - రచయిత
  • మేరా సాయా (1966) - రచయిత
  • ఫూల్ ఔర్ పత్తర్ (1966) – రచయిత[9]
  • భూత్ బంగ్లా (1965) - రచయిత
  • వక్త్ (1965) – రచయిత[10]
  • షబ్నం (1964) - రచయిత
  • యాదీన్ (1964) - రచయిత
  • ఆజ్ ఔర్ కల్ (1963) – రచయిత
  • అకేలీ మత్ జైయో (1963) – రచయిత
  • గుమ్రా (1963) – రచయిత[10]
  • నీలి ఆంఖేన్ (1962) - రచయిత
  • ధర్మపుత్ర (1961) – రచయిత[10]
  • ఫ్లాట్ నం. 9 (1961) - రచయిత
  • బరూద్ (1960) - రచయిత
  • కల్పన (1960) - రచయిత్రి
  • కానూన్ (1960) – రచయిత[10][9]
  • నిర్దోష్ (1950) - రచయిత
  • యాక్ట్రెస్ (1948) - రచయిత
  • జర్నా (1948) - రచయిత

మరణం

[మార్చు]

అక్తర్ ఉల్ ఇమాన్ 1996, మార్చి 9న ముంబైలో మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Amaresh Datta (1987). Akhtar ul Iman (profile). ISBN 9788126018031. Retrieved 2023-07-17.
  2. Akhtar ul-Iman An anthology of modern Urdu poetry, by Rafey Habib. Publisher: Modern Language Association (MLA), 2003. ISBN 0-87352-797-6. p. 109.
  3. 3.0 3.1 3.2 "Sahitya Akademi Awards (1955-2007) – Urdu in 1962 for Akhtar ul Iman". Sahitya Akademi Award listings (1955-2007) website. 18 August 2008. Archived from the original on 16 September 2009. Retrieved 2023-07-17.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 Rauf Parekh (2 May 2016). "LITERARY NOTES: Remembering Krishan Chander and Akhtar ul Iman". Dawn (newspaper). Retrieved 2023-07-17.
  5. 5.0 5.1 5.2 "Akhtar ul Iman - Columbia University" (PDF). Columbia University website. Retrieved 2023-07-17.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. 6.0 6.1 6.2 Humair Ishtiaq (8 March 2009). "ARTICLE: A true symbolist (profile of Akhtar ul Iman)". Dawn (newspaper). Retrieved 2023-07-17.
  7. "Zakir Husain College: Our Famous Alumni". University of Delhi, Zakir Husain College website. 28 March 2009. Archived from the original on 10 December 2009. Retrieved 2023-07-17.
  8. Rajadhyaksha 1999, p. 40.
  9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 9.6 9.7 9.8 Profile of Akhtar ul Iman Archived 2021-11-15 at the Wayback Machine Bihar Urdu Youth Forum website, Retrieved 2023-07-17
  10. 10.0 10.1 10.2 10.3 10.4 10.5 Remembering the life and works of Akhtar ul Iman The Hindu (newspaper), Published 18 October 2016, Retrieved 2023-07-17

బయటి లింకులు

[మార్చు]