అగరు (కులం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అగరు : ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితా డి గ్రూపులోని 1వ కులం. అగరు కులస్తులు ఒడిషా, ఆంధ్రా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నారు. వీరి మాతృభాష ఒరియా, తెలుగు. 1970లో ఒక నివేదిక ప్రకారం వీరి జనాభా 2,163.

చరిత్ర

[మార్చు]

హిందూ సాంప్రదాయంలో తమలపాకుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అవి లేకుండా శుభకార్యాలు జరగవంటే ఆశ్చర్యంలేదు. శుభకార్యాలేకాదు... చనిపోయిన తర్వాత పాడెకట్టి శ్మశానానికి సాగనంపే వరకు తమలుపాకు పాత్ర లేకుండా ఏ ఒక్క కార్యక్రమమూ ముగియదు. అటువంటి తమలపాకు సాగును కులవృత్తిగా ఎంచుకున్నారు అగరు కులస్తులు.అగరు కులస్తులు శ్రీకాకుళం జిల్లా,విజయనగరం జిల్లాకే పరిమిత మయ్యారు. వీరి పూర్వీకులు తమలపాకును సాగుచేసి ఆకును కోసి కావిళ్లలో పెట్టుకుని అమ్ముకునేవారు. వీరు వెదురు గడలతో పందిరి వేసి తమలపాకు తీగను వాటిపై ఎక్కించి ఆకు దిగుబడికి కృషి చేసేవారు. ఈ తోటలకు కావలసిన నీరు అందించేందుకు కూడా బాగా శ్రమిం చేవారు. అగరు కులస్తులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పరిమితమయ్యారు. వీరి పూర్వీకులు తమలపాకును సాగుచేసేవారు. విజయనగరం. కొత్తపేట. నెల్లిమర్ల. ఉత్తరావల్లి. రామద్రాపురం. పార్వతిపురం. బొబ్బిలి. గజపతినగరం. బొద్దం .బండపల్లి.‘ఆకుల’ అని కూడా పిలుస్తారు. ఆరోజుల్లో వీరు సాగు చేసి పండించిన తమలపాకులను కోసి కావిళ్లలో పెట్టుకుని అమ్ముకునేవారు. అప్పట్లో వీరు వెదురు గడలతో పందిరి వేసి తమలపాకు తీగను వాటిపెై ఎక్కించి ఆకు దిగుబడికి కృషి చేసేవారు. ఈ తోటలకు కావలసిన నీరు అందించేందుకు కూడా నిరంతరం శ్రమించేవారు. అన్నిరంగాలలో విస్తృత మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలోనూ వీరు పూర్వకాలపు పద్ధతులనే అనుసరించారు. రెండు దశాబ్దాల క్రిందట తమలపాకుకు తెగులు సోకి పంట దెబ్బతిన్న తరుణంలో అనేక జిల్లాలలో ఈ పంట సాగుకు స్వస్తిపలికారు. అయినప్పటికీ వీరు మాత్రం తమలపాకునే నమ్ముకుని సాగు చేశారు.

సమకాలీనం

[మార్చు]

అన్నిరంగాలలో విస్తృత మార్పులు చోటుచేసు కుంటున్న నేటి తరుణంలో సైతం వీరు పూర్వ కాలపు విధానాలను వదులుకోలేదు. రెండు దశాబ్దాల క్రిందట తమలపాకుకు తెగులు సోకి దెబ్బతిన్న తరుణంలో అనేక జిల్లాలలో ఈ పంట సాగును వదులుకున్నా వీరు మాత్రం దేశీవాళి తమలపాకునే నమ్ముకుని సాగు చేస్తున్నారు. ఇది వాణిజ్య పంటకావటంతో పశ్చిమ బెంగాల్‌, ఆంధ్రా కోస్తా జిల్లాలో తమలపాకు పంటను పండించి లాభాలు ఆర్జిస్తున్నా వీరు మాత్రం పాతపద్ధతులనే అనుసరిస్తున్న కారణంగా పురోభివృద్ధి సాధించలేక పోయారు. పైగా వీరిలో ఎక్కువ మందికి పది సెంట్లకు మించి భూమి లేదు. ప్రస్తుతం వీరి జనాభా రాష్ర్ట వ్యాప్తంగా 6 వేలు. ఉద్యోగ, ఉపాధి రీత్యా కొందరు విశాఖ, హైదరాబాద్‌ నగరాలకు వలస వెళ్లినా ఎక్కువమంది శ్రీకాకుళం జిల్లాలోనే జీవిస్తు న్నారు. అది కూడా 19 గ్రామాలకు పరిమితమయ్యారు. ఆ గ్రామాల్లో కూడా ఆరు నుంచి 40 కుటుంబాలు జీవిం చటం గమనార్హం. వీరి పూర్వీకులు నివసించిన గ్రామాల పేర్లే వీరి ఇంటిపేర్లుగా రూపాంతరం చెందాయి. తమలపాకును పండించి పట్టణాలలోని కిళ్లీ కొట్లలో అమ్ముకొని జీవిస్తున్నారు. కొంతమంది కిళ్లీ కొట్లు పెట్టుకుని జీవిస్తున్నారు.

సమస్యలు

[మార్చు]

వీరు ఆర్థికంగా వెనుకబడిన వారు, ఈ కులస్తులలో ఐదు శాతానికి మించి అక్షరాస్యులు లేరు. వీరిలో కూడా ప్రాథమిక పాఠశాల చదువుల తర్వాత బడి వదిలేసినవారే ఎక్కువమంది ఉన్నారు. బిసీ-డి గ్రూప్‌ నుంచి బిసీ-బి గ్రూప్‌లోకి ఈ కులాన్నిమార్చాలని

ఉత్తరాంధ్రఅగరు కుల సంక్షేమ సంఘం కోరుతోంది.

రిజిస్టర్ నెం. 184 /2021

మూలాలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]