అచ్చంపేట ఎత్తిపోతల పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అచ్చంపేట ఎత్తిపోతల పథకం
ప్రదేశంఅచ్చంపేట, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ
ఆవశ్యకతవ్యవసాయానికి నీరు
స్థితిప్రతిపాదనలో వున్నది
నిర్మాణ వ్యయం1,534 కోట్ల రూపాయలు
యజమానితెలంగాణ ప్రభుత్వం
నిర్వాహకులుతెలంగాణ నీటిపారుదల శాఖ
ఆనకట్ట - స్రావణ మార్గాలు
Spillway typeChute spillway
Website
నీటిపారుదల శాఖ వెబ్సైటు

అచ్చంపేట ఎత్తిపోతల పథకం అనేది తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట ప్రాంతంలో నిర్మించబడుతున్న ఎత్తిపోతల పథకం. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో 1,534 కోట్ల రూపాయలతో నిర్మించబడుతున్న ఈ ఎత్తిపోతల పథకం ద్వారా అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్‌ మండలాల్లోని 57,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది.[1]

ప్రతిపాదన[మార్చు]

నల్లమల ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతంలోని వ్యవసాయరంగానికి సాగునీరుకోసం ఒక ఎత్తిపోతల పథక నిర్మాణంకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి. దాంతో 2021 ఏప్రిల్ నెలలో ఈ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టగా సర్వే పనులు కూడా పూర్తిచేయబడ్డాయి.

అనుమతులు[మార్చు]

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం సస్యశ్యామలం కావడంకోసం ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం 1,534 కోట్ల రూపాయల నిధులను మంజూరుచేయడంతోపాటు 2023 మే 4న నిర్మాణానికి సంబంధించిన పరిపాలనా అనుమతులను జారీ చేసింది.[2]

జలాశయాలు[మార్చు]

నల్లమల ప్రాంతం ఎత్తుగా ఉండటంతో ప్రాజెక్టు నిర్మాణం అత్యంత క్లిష్టంగా మారడంతో దీనికి అనుబంధంగా మొదటి దశ పనుల్లో భాగంగా బల్మూర్ మండలంలోని మైలారం సమీపంలో 2.5 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఉమామహేశ్వర జలాశయం, అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ సమీపంలో చెన్నకేశవ జలశయాన్ని నిర్మించనున్నారు. కృష్ణ జలాలకోసం వనపర్తి జిల్లాలో నిర్మించిన ఏదుల జలాశయం నుంచి దాదాపు 25 కిలోమీటర్ల పొడవైన కాల్వద్వారా ఈ జలాశయాలకు నీటిని తరలిస్తారు.[3]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2023-05-05). "1,534 కోట్లతో ఉమామహేశ్వర లిఫ్ట్‌". www.ntnews.com. Archived from the original on 2023-05-16. Retrieved 2023-05-20.
  2. "రూ.1,534 కోట్లతో అచ్చంపేట ఎత్తిపోతలకు పరిపాలన అనుమతులు". EENADU. Archived from the original on 2023-05-04. Retrieved 2023-05-20.
  3. "'ఉమామహేశ్వర'తో నల్లమలకు సాగునీరు". EENADU. 2023-05-19. Archived from the original on 2023-05-20. Retrieved 2023-05-20.