అజయ్ రాత్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అజయ్ రాత్రా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అజయ్ రాత్రా
పుట్టిన తేదీ (1981-12-13) 1981 డిసెంబరు 13 (వయసు 42)
ఫరీదాబాదు, హర్యానా
మారుపేరుబంటీ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రవికెట్-కీపర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 243)2002 ఏప్రిల్ 19 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు2002 సెప్టెంబరు 9 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 140)2002 జనవరి 19 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2002 జూలై 9 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1999–2005హర్యానా
2007–2011గోవా
2011–2013Tripura
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 6 12 99 89
చేసిన పరుగులు 163 90 4,029 1381
బ్యాటింగు సగటు 18.11 12.85 30.29 22.63
100లు/50లు 1/0 0/0 8/17 1/6
అత్యుత్తమ స్కోరు 115* 30 204* 103
క్యాచ్‌లు/స్టంపింగులు 11/2 11/5 233/27 78/30
మూలం: Cricinfo, 2015 జూలై 23

అజయ్ రాత్రా (జననం 1981 డిసెంబరు 13) మాజీ భారత క్రికెట్ ఆటగాడు. అతను కుడిచేతి వాటం బ్యాటరు, వికెట్ కీపరు. అతను 2002 జనవరి 19 న ఇంగ్లండ్‌పై తన తొలి వన్‌డే ఆడాడు.

2000 లో, బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ మొదటి బ్యాచ్‌లో రాత్రా ఎంపికయ్యాడు. [1] 2002లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రాత్రా 115 పరుగుల ఇన్నింగ్స్‌లో నాటౌట్‌గా నిలిచాడు. రాత్రా టెస్టుల్లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన వికెట్ కీపరే కాక, విదేశాల్లో శతకం చేసిన మొదటి భారత వికెట్ కీపరు కూడా. 2002లో గాయపడడంతో, అతని స్థానంలో అత్యంత పిన్న వయస్కుడైన టెస్ట్ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్‌ని నియమించారు. ఆ తర్వాత రాత్రా మహేంద్ర సింగ్ ధోనీ, దినేష్ కార్తీక్, పటేల్‌ల వెనుక పడిపోయాడు.

2000లో యూత్ వరల్డ్ కప్‌ను గెలుచుకున్న భారత అండర్-19 జట్టులో రాత్రా ఆడాడు. నేషనల్ క్రికెట్ అకాడమీతో శిక్షణ తర్వాత 12 నెలల వ్యవధిలో భారత జట్టులో చేరడానికి ప్రయత్నిస్తున్న ఆరుగురు వికెట్ కీపర్‌లలో అతనూ ఒకడయ్యాడు. అతను గోవా తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడాడు.

2015 జూలైలో రాత్రా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 99 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు, అందులో ఎనిమిది సెంచరీలు, ఒక డబుల్ సెంచరీతో సహా 30.29 సగటుతో 4029 పరుగులు చేశాడు. రాత్రా, 89 లిస్ట్ A గేమ్‌లలో కూడా ఆడి, 22.63 సగటుతో 1381 పరుగులు చేశాడు. [2]

కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనలు

[మార్చు]

2010 అక్టోబరు 15 నాటికి

బ్యాటింగు
స్కోరు మ్యాచ్ వేదిక సీజను
టెస్టులు 115* ఇండియా v వెస్టిండీస్ సెయింట్ జాన్స్ 2002
వన్‌డేలు 30 ఇండియా v ఇంగ్లాండ్ కటక్ 2002
ఫ.క్లా 170* గోవా v జార్ఖండ్ ధన్‌బాద్ 2009
లిస్ట్ ఎ 103 గోవా v కర్ణాటక చెన్నై (GNC) 2007
టి20 13 గోవా v కర్ణాటక హైదరాబాద్ 2010

మూలాలు

[మార్చు]
  1. Ramchand, Partab (2000-04-15). "First list of NCA trainees". Cricinfo. Retrieved 2007-02-08.[permanent dead link]
  2. "Ajay Ratra calls time on 16-year career". ESPNcricinfo. 1 July 2015. Archived from the original on 4 July 2015. Retrieved 1 July 2015.