Jump to content

అజిత్ సిం‍గ్

వికీపీడియా నుండి
అజిత్ సిం‍గ్
అజిత్ సిం‍గ్

అజిత్ సింగ్ 2012


లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1999 – 2014
ముందు సొంపాల్ శాస్త్రి
తరువాత సత్య పాల్ సింగ్
పదవీ కాలం
1989 – 1998
ముందు చరణ్ సింగ్
తరువాత సొంపాల్ శాస్త్రి
నియోజకవర్గం బాగ్‌పట్

పౌరవిమానయాన శాఖ మంత్రి
పదవీ కాలం
18 డిసెంబర్ 2011 – 26 మే 2014
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు వాయలార్ రవి
తరువాత అశోక్ గజపతి రాజు

వ్యవసాయ శాఖ మంత్రి
పదవీ కాలం
22 జులై 2001 – 24 మే 2003
ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి
ముందు నితీష్ కుమార్
తరువాత రాజ్‌నాథ్ సింగ్

ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ శాఖ మంత్రి
పదవీ కాలం
ఫిబ్రవరి 1995 – మే 1996
ప్రధాన మంత్రి పీవీ.నరసింహ రావు
ముందు తరుణ్ గొగోయ్
తరువాత దిలీప్ కుమార్ రే

పదవీ కాలం
5 డిసెంబర్ 1989 – 10 నవంబర్ 1990
ప్రధాన మంత్రి వీపీ సింగ్
ముందు దినేష్ సింగ్
తరువాత ప్రణబ్ ముఖర్జీ

వ్యక్తిగత వివరాలు

జననం (1939-02-12)1939 ఫిబ్రవరి 12
మీరట్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం (యునైటెడ్ ప్రావిన్సెస్ (1937–50) , బ్రిటిష్ ఇండియా)
మరణం 2021 మే 6(2021-05-06) (వయసు 82)
గురుగ్రామ్, హర్యానా, భారతదేశం
రాజకీయ పార్టీ ఆర్ఎల్‌డీ
ఇతర రాజకీయ పార్టీలు జనతాదళ్, జనతా దళ్ (అజిత్), రాష్ట్రీయ లోక్‌దళ్‌
జీవిత భాగస్వామి రాధిక సింగ్ (పెళ్లి -1967)
సంతానం జయంత్ చౌదరి

అజిత్‌ సిం‍గ్‌ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి. ఆయన మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు.

జననం, విద్యాభాస్యం

[మార్చు]

అజిత్ సింగ్ 1939, ఫిబ్రవరి 12లో ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ (అప్పటి యునైటెడ్ ప్రావిన్సెస్ (1937–50), బ్రిటిష్ ఇండియా) లో చౌదరి చరణ్ సింగ్, గాయత్రీ దేవి దంపతులకు జన్మించాడు. ఆయన ఐఐటి ఖరగ్‌పూర్ నుండి బిటెక్, చికాగోలోని ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ పూర్తి చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

అజిత్ సింగ్ రాజకీయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కుమారుడు. అజిత్ సింగ్ రాజకీయాల్లోకి వచ్చే ముందు 15 ఏళ్ల పాటు కంప్యూటర్ ఇండస్ట్రీలో పనిచేశాడు. ఆయన 1986లో తొలిసారిగా రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యాడు. అజిత్ సింగ్ 1989లో లోక్‌సభ ఎన్నికల్లో బాగ్‌పత్ లోక్‌సభ నియోజవర్గం ఎంపీగా గెలిచాడు. ఆయన బాగ్‌పత్ లోక్‌సభ నియోజవర్గం నుంచి ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1989 డిసెంబరు 5 – 1990 నవంబరు 10 వరకు విపీ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేశాడు.

అజిత్ సింగ్, పివినరసింహారావు ప్రభుత్వంలో 1995 ఫిబ్రవరి నుండి 1996 మే వరకు ఆహార శాఖ మంత్రిగా రెండవసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. 1996లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రీయ‌ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ) పార్టీని స్థాపించాడు. అనంతరం ఆయన ఎన్డీయేలో వాజ్‌పేయి ప్రభుత్వంలో 2001 జూలై 22 – 2003 మే 24 వరకు వ్యవసాయమంత్రిగా పనిచేశాడు. 2003లో ఎన్‌డీఏ నుండి బయటకు వచ్చి 2004లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ప‌లికాడు. ఆయన 2011 డిసెంబరు 18 – 2014 మే 26 వరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా పనిచేశాడు.[2][3]

మరణం

[మార్చు]

అజింత్ సింగ్ 2021, ఏప్రిల్ 22న అతడికి కోవిడ్ వ్యాధి సోకింది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందుతూ 2021మే 6 న మరణించాడు.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. Loksabha. "Ajit Singh Bioprofile". Archived from the original on 2013-02-01. Retrieved 6 May 2021.
  2. NAMASTHE TELANGANA (6 May 2021). "ఆర్ఎల్డీ అధినేత‌, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ క‌రోనాతో క‌న్నుమూత‌". www.ntnews.com. Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  3. Sakshi (6 May 2021). "కేంద్ర మాజీ మంత్రి అజిత్‌ సిం‍గ్‌ కన్నుమూత". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.
  4. TV9 Telugu (6 May 2021). "Chaudhary Ajit Singh: కరోనాతో రాష్ట్రీయ లోక్‌ద‌ళ్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి చౌద‌రి అజిత్ సింగ్ క‌న్నుమూత‌ - Former Union Minister and RLD Chief Chaudhary Ajit Singh passes away". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  5. News18 Telugu (6 May 2021). "Ajit Singh: కరోనా కాటుకు మరో నేత బలి.. ఆర్‌ఎల్డీ అధినేత అజిత్ సింగ్ ఇక లేరు." Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. The Hindu (6 May 2021). "RLD chief Ajit Singh passes away due to COVID-19 complications". Archived from the original on 6 మే 2021. Retrieved 6 May 2021.