Jump to content

అనంత వాసుదేవ ఆలయం

అక్షాంశ రేఖాంశాలు: 20°14′26.18″N 85°50′8.81″E / 20.2406056°N 85.8357806°E / 20.2406056; 85.8357806
వికీపీడియా నుండి
అనంత వాసుదేవ ఆలయం
అనంత వాసుదేవ ఆలయం
అనంత వాసుదేవ ఆలయం is located in Odisha
అనంత వాసుదేవ ఆలయం
అనంత వాసుదేవ ఆలయం
Location in Odisha
భౌగోళికాంశాలు:20°14′26.18″N 85°50′8.81″E / 20.2406056°N 85.8357806°E / 20.2406056; 85.8357806
స్థానం
దేశం:భారత దేశము
రాష్ట్రం:ఒడిషా
జిల్లా:ఖుర్ధా
ప్రదేశం:భువనేశ్వర్
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:అనంత వాసుదేవ(కృష్ణుడు)
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
13వ శతాబ్దం

అనంత వాసుదేవ ఆలయం శ్రీకృష్ణునికి అంకితమైన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయం శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ప్రధాన దైవంగా గలది. ఇది భారతదేశంలోని ఒడిషా రాష్ట్రం లోని భువనేశ్వర్ లో ఉంది.[1] ఈ దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ దేవాలయంలో ప్రధానంగా శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర అనే దేవతలను ప్రదానంగా కొలుస్తారు. ఈ దేవాలయంలో దేవతలైన బలరాముడు ఏడు పడగలు గల సర్పం క్రింద నిలుచుంటాడు. సుభద్ర రత్నాల కుండ, తామరపువ్వు లను ఇరు చేతులతో కలిగి యుండి. ఎడమ పాదాన్ని వేరొక రత్నాల కుండపై ఉంచేటట్లుంటుంది. శ్రీకృష్ణుడు గదను, చక్రాన్ని, కమలాన్ని, శంఖాన్ని కలిగియుండేటట్లుంటుంది. ఈ దేవాలయం "భానుదేవుని" పరిపాలనా కాలంలో "అనంగాభిమ III" యొక్క కుమార్తె అయిన చంద్రికాదేవి కాలంలో నిర్మితమైనది.

ఇతిహాసం

[మార్చు]

ఈ దేవాలయం 13 వ శతాబ్దంలో కట్టబడింది. దీనికి పూర్వం ఈ ప్రాంతంలో నిజమైన విష్ణువు చిత్రాన్ని కొలిచేవారు. "తూర్పు గంగా రాజ్యం" యొక్క రాణి అయిన చంద్రిక ఈ స్థానంలో కొత్త దేవాలయం కట్టుటకు నిశ్చయించుకుంది. అదే ప్రదేశంలో అనంత వాసుదేవ ఆలయాన్న్ని నిర్మించింది. ఈ ప్రాంతంలో విష్ణుమూర్తి చిత్రంతో కూడిన పాత దేవాలయం తప్పినిసరిగా ఉంటుంది. "మహానది" వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన "మరాఠాలు" 17 వ శతాబ్దం చివరలో భువనేశ్వర్ లో వైష్ణవాలయం పునరుద్ధరణకు బాధ్యత వహించారు.[2]

నిర్మాణం

[మార్చు]

రూపంలో ఈ దేవాలయం లింగరాజ ఆలయంతో పోలి ఉంటుంది. కానీ ఇది వైష్ణవ శిల్పాలను కలిగి ఉంటుంది.[3] ఈ ఆలయం, సూక్ష్మ రేఖాంశ పట్టీలను కలిగిన శిఖరాలు (విగ్రహాలు) కచ్చితంగా లింగరాజ ఆలయం వలెనే కలిగి ఉంటుంది. కానీ శిఖరాల సంఖ్య ఒక రేఖాంశపట్టీకి మూడు చొప్పిన కలిగి ఉంటుంది.[4] ఈ దేవాలయ భాహ్య గోడలపై గల శిల్పాలు భువనేశ్వర్ లో గల ప్రతి దేవాలయం వలెనే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ దేవాలయంలో స్త్రీ శిల్పాలు మితిమీరిన ఆభరణాలు కలిగి యున్నందున వాస్తవికత కనిపించదు.[5]

జగన్నాథ దేవాలయం, పూరి తో గల తేడాలు

[మార్చు]

ఈ దేవాలయంలో గల "గర్భగృహం"లో గల విగ్రహాలు పూర్తిగా తయారైనవి. అవి పూరీ లోని జగన్నాధ దేవాలయంలోని విగ్రహాలకు భిన్నంగా ఉంటాయి. ఇచట శ్రీమూర్తులు (విగ్రహాలు) పూరీ దేవాలయంలో వలెనే చెక్కతో కాకుండా నలుపు గ్రానైట్ శిలల నుండి తయారుచేశారు.ఈ దేవాలయం మూలంగా ఈ పట్టనానికి "చక్ర క్షేత్రం" (వృత్తాకార స్థలం) గా పిలువబడుతుంది. పూరీలో గల దేవాలయం "శంఖ క్షేత్రము" (వక్రాకార స్థలం) గా పిలువబడుతుంది.


చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Ghurye, G.S. (2005). Rajput Architecture. Popular Prakashan. p. 91. ISBN 81-7154-446-0.
  2. Tāntric art of Orissa .P.126.Jitāmitra Prasāda Siṃhadeba.
  3. Hinduism and the Religious Arts .p.149. Heather Elgood
  4. Rajput Architecture .p.126.G.S. Ghurye
  5. World heritage monuments and related edifices in India P.186.ʻAlī Jāvīd, Tabassum Javeed.