అనంత వాసుదేవ ఆలయం
అనంత వాసుదేవ ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు: | 20°14′26.18″N 85°50′8.81″E / 20.2406056°N 85.8357806°E |
స్థానం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | ఒడిషా |
జిల్లా: | ఖుర్ధా |
ప్రదేశం: | భువనేశ్వర్ |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | అనంత వాసుదేవ(కృష్ణుడు) |
చరిత్ర | |
కట్టిన తేదీ: (ప్రస్తుత నిర్మాణం) | 13వ శతాబ్దం |
అనంత వాసుదేవ ఆలయం శ్రీకృష్ణునికి అంకితమైన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ దేవాలయం శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు ప్రధాన దైవంగా గలది. ఇది భారతదేశంలోని ఒడిషా రాష్ట్రం లోని భువనేశ్వర్ లో ఉంది.[1] ఈ దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ దేవాలయంలో ప్రధానంగా శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర అనే దేవతలను ప్రదానంగా కొలుస్తారు. ఈ దేవాలయంలో దేవతలైన బలరాముడు ఏడు పడగలు గల సర్పం క్రింద నిలుచుంటాడు. సుభద్ర రత్నాల కుండ, తామరపువ్వు లను ఇరు చేతులతో కలిగి యుండి. ఎడమ పాదాన్ని వేరొక రత్నాల కుండపై ఉంచేటట్లుంటుంది. శ్రీకృష్ణుడు గదను, చక్రాన్ని, కమలాన్ని, శంఖాన్ని కలిగియుండేటట్లుంటుంది. ఈ దేవాలయం "భానుదేవుని" పరిపాలనా కాలంలో "అనంగాభిమ III" యొక్క కుమార్తె అయిన చంద్రికాదేవి కాలంలో నిర్మితమైనది.
ఇతిహాసం
[మార్చు]ఈ దేవాలయం 13 వ శతాబ్దంలో కట్టబడింది. దీనికి పూర్వం ఈ ప్రాంతంలో నిజమైన విష్ణువు చిత్రాన్ని కొలిచేవారు. "తూర్పు గంగా రాజ్యం" యొక్క రాణి అయిన చంద్రిక ఈ స్థానంలో కొత్త దేవాలయం కట్టుటకు నిశ్చయించుకుంది. అదే ప్రదేశంలో అనంత వాసుదేవ ఆలయాన్న్ని నిర్మించింది. ఈ ప్రాంతంలో విష్ణుమూర్తి చిత్రంతో కూడిన పాత దేవాలయం తప్పినిసరిగా ఉంటుంది. "మహానది" వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన "మరాఠాలు" 17 వ శతాబ్దం చివరలో భువనేశ్వర్ లో వైష్ణవాలయం పునరుద్ధరణకు బాధ్యత వహించారు.[2]
నిర్మాణం
[మార్చు]రూపంలో ఈ దేవాలయం లింగరాజ ఆలయంతో పోలి ఉంటుంది. కానీ ఇది వైష్ణవ శిల్పాలను కలిగి ఉంటుంది.[3] ఈ ఆలయం, సూక్ష్మ రేఖాంశ పట్టీలను కలిగిన శిఖరాలు (విగ్రహాలు) కచ్చితంగా లింగరాజ ఆలయం వలెనే కలిగి ఉంటుంది. కానీ శిఖరాల సంఖ్య ఒక రేఖాంశపట్టీకి మూడు చొప్పిన కలిగి ఉంటుంది.[4] ఈ దేవాలయ భాహ్య గోడలపై గల శిల్పాలు భువనేశ్వర్ లో గల ప్రతి దేవాలయం వలెనే లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ దేవాలయంలో స్త్రీ శిల్పాలు మితిమీరిన ఆభరణాలు కలిగి యున్నందున వాస్తవికత కనిపించదు.[5]
జగన్నాథ దేవాలయం, పూరి తో గల తేడాలు
[మార్చు]ఈ దేవాలయంలో గల "గర్భగృహం"లో గల విగ్రహాలు పూర్తిగా తయారైనవి. అవి పూరీ లోని జగన్నాధ దేవాలయంలోని విగ్రహాలకు భిన్నంగా ఉంటాయి. ఇచట శ్రీమూర్తులు (విగ్రహాలు) పూరీ దేవాలయంలో వలెనే చెక్కతో కాకుండా నలుపు గ్రానైట్ శిలల నుండి తయారుచేశారు.ఈ దేవాలయం మూలంగా ఈ పట్టనానికి "చక్ర క్షేత్రం" (వృత్తాకార స్థలం) గా పిలువబడుతుంది. పూరీలో గల దేవాలయం "శంఖ క్షేత్రము" (వక్రాకార స్థలం) గా పిలువబడుతుంది.
చిత్రమాలిక
[మార్చు]-
బిందుసాగర్ నుండి వాసుదేవ ఆలయం యొక్క వీక్షణ దృశ్యం
-
1869 లో అనంత వాసుదేవ ఆలయ చిత్రం
-
అనంత వాసుదేవ ఆలయంలో మహా ప్రసాదం
మూలాలు
[మార్చు]- ↑ Ghurye, G.S. (2005). Rajput Architecture. Popular Prakashan. p. 91. ISBN 81-7154-446-0.
- ↑ Tāntric art of Orissa .P.126.Jitāmitra Prasāda Siṃhadeba.
- ↑ Hinduism and the Religious Arts .p.149. Heather Elgood
- ↑ Rajput Architecture .p.126.G.S. Ghurye
- ↑ World heritage monuments and related edifices in India P.186.ʻAlī Jāvīd, Tabassum Javeed.