అనబెల్ సేతుపతి
స్వరూపం
అనబెల్ సేతుపతి | |
---|---|
దర్శకత్వం | దీపక్ సుందర్రాజన్ |
రచన | దీపక్ సుందర్రాజన్ |
నిర్మాత | సుధ సుందరం జి జయరాం |
తారాగణం | విజయ్ సేతుపతి తాప్సీ జగపతి బాబు రాధిక శరత్‌కుమార్ రాజేంద్ర ప్రసాద్ యోగి బాబు వెన్నెల కిషోర్ |
ఛాయాగ్రహణం | గౌతమ్ జార్జ్ |
కూర్పు | ప్రదీప్ ఇ. రాఘవ్ |
సంగీతం | కృష్ణ కిషోర్ |
నిర్మాణ సంస్థ | ప్యాషన్ స్టూడియోస్ 8 |
పంపిణీదార్లు | హాట్ స్టార్ డిస్నీ |
విడుదల తేదీ | 17 సెప్టెంబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అనబెల్ సేతుపతి 2021లో విడుదల కానున్న హార్రర్-కామెడి సినిమా. ప్యాషన్ స్టూడియోస్ 8 బ్యానర్‌పై సుధాన్ సుందరం, జి జయరాం నిర్మించిన ఈ సినిమాకు దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి, తాప్సీ, జగపతి బాబు, రాధిక శరత్‌కుమార్, రాజేంద్ర ప్రసాద్, యోగి బాబు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు, తమిళం , మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 17న హాట్ స్టార్ డిస్నీలో విడుదల కానుంది.[1]
చిత్ర నిర్మాణం
[మార్చు]అనబెల్ సేతుపతి షూటింగ్ ఎక్కువశాతం జైపూర్‌లో జరిగింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల 27 ఆగష్టు 2021న విడుదల చేశారు.[2] అనబెల్ సేతుపతి ట్రైలర్‌ను తెలుగు, తమిళం , మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 30 ఆగష్టు 2021న విడుదల చేశారు.[3]
నటీనటులు
[మార్చు]- విజయ్ సేతుపతి [4]
- తాప్సీ
- జగపతి బాబు
- రాధిక శరత్‌కుమార్
- రాజేంద్ర ప్రసాద్
- వెన్నెల కిషోర్
- సురేఖ వాణి
- యోగి బాబు
- చేతన్
- దేవదార్శిని
- సుబ్బు పంచు
- జంగిరి మధుమిత
- రాజా సుందరం
- సురేష్ మీనన్
- జార్జ్ మర్యన్
- రాజ్ కుమార్
- సునీల్
- లింగ
- హర్షదా
- ఇందు రవి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ప్యాషన్ స్టూడియోస్ 8
- నిర్మాత: సుధాన్ సుందరం, జి జయరాం
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దీపక్ సుందరరాజన్
- సంగీతం: కృష్ణ కిషోర్
- సినిమాటోగ్రఫీ: గౌతమ్ జార్జ్
- ఎడిటర్: ప్రదీప్ ఈ. రాఘవ్
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy (26 August 2021). "డైరెక్ట్‌గా ఓటీటీలో విజయ్ సేతుపతి-తాప్సీల చిత్రం.. ఎప్పుడంటే?". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
- ↑ Eenadu (27 August 2021). "Vijay Sethupathi: ఓటీటీలోనే 'అనబెల్ సేతుపతి' - here annabelle sethupathi fitst look". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
- ↑ India Today (30 August 2021). "Annabelle Sethupathi trailer out. Vijay Sethupathi, Taapsee's horror comedy is a laugh riot" (in ఇంగ్లీష్). Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
- ↑ NTV (26 August 2021). "విజయ్ సేతుపతితో తాప్సి రొమాన్స్… పిక్స్ వైరల్". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.