అనర్ఘ రత్నాలు
స్వరూపం
(అనర్ఘ రత్నాము నుండి దారిమార్పు చెందింది)
దేవతలు రాక్షసులు అమృతముకోసము జరిపిన క్షీరసాగర మథనంలో అమృతముతోపాటు జన్మించినవి.
క్షీరసాగర మథన సమయం లో పుట్టిన అనర్ఘ రత్నాలు
[మార్చు]- సురాభాండం, కల్లుకు అధిదేవత
- అప్సరసలు - రంభ, మేనక, ఊర్వశి, ఘృతాచి, తిలోత్తమ, సుకేశి, చిత్రలేఖ, మంజుఘోష
- కౌస్తుభము, అమూల్యమైన మాణిక్యం
- ఉచ్చైశ్రవము, ఏడు తలల దేవతాశ్వము :దేవాసురులు అమృతముకోసం క్షీరసాగర మథనంజరిపినప్పుడు పుట్టిన అనర్ఘ రత్నాములలో పుట్టిన ఏడు తలల దేవతాశ్వము. దీనిని బలి చక్రవర్తి తీసుకుంటాడు.
- కల్పవృక్షము, కోరిన కోరికలు ఇచ్చే చెట్టు
- కామధేనువు, కోరిన కోరికలీడేర్చే గోమాత, సకల గో సంతతికి తల్లి
- ఐరావతము, ఇంద్రుని వాహనమైన ఏనుగు
- లక్ష్మీదేవి, ఐశ్వర్య దేవత
- పారిజాత వృక్షము, వాడిపోని పువ్వులు పూచే చెట్టు
- హాలాహలము, కాలకూట విషము
- చంద్రుడు, చల్లని దేవుడు, మనస్సుకు అధిదేవత
- ధన్వంతరి, దేవతల వైద్యశిఖామణి
- అమృతము, మరణము లేకుండా చేసేది.