Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

అనూజా అయ్యర్

వికీపీడియా నుండి
అనూజ అయ్యర్
జననం (1980-01-22) 1980 జనవరి 22 (వయసు 44)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తి
  • నటి
  • మోడల్
  • వ్యాసకర్త
క్రియాశీలక సంవత్సరాలు1980–ప్రస్తుతం

అనుజా అయ్యర్ తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేసే భారతీయ నటి, మోడల్. ఆమె హర్రర్ చిత్రం సివి (2007)లో అరంగేట్రం చేసింది. నినైతలే ఇనిక్కుమ్ (2009), ఉన్నైపోల్ ఒరువన్ (2009) చిత్రాలలో ఆమె నటనకు ప్రసిద్ధి చెందింది. అలగే, ఆమె ఏప్రిల్ 2010 ప్రముఖ వినోద వెబ్సైట్ బిహైండ్‌వుడ్స్‌ లోకాలమిస్ట్ గా పనిచేస్తున్నది.[1]

ప్రారంభ జీవితం

[మార్చు]

అనూజా అయ్యర్ తమిళనాడు చెన్నైలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో సంధ్యగా జన్మించింది.[2] ఆమె చెన్నైలోని శాంతోమ్ లోని రోసరీ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఢిల్లీ శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ డిగ్రీని అభ్యసించింది.[2] ఆ తరువాత, ఆమె సన్వా బ్యాంక్ స్కాలర్షిప్ ప్రోగ్రాం కింద చదువుకుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (IIMC) ఢిల్లీ లో అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. అక్కడ, ఆమె పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డుతో పట్టభద్రురాలైంది.[2]

కెరీర్

[మార్చు]

ఆమె మొదటి చిత్రం సివి (2007), ఇందులో ఆమె దెయ్యం పాత్ర పోషించింది. ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది.[3] ఆమె రెండవ చిత్రం ముధల్ ముధల్ వరాయ్ (2008), విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా, అది చలన చిత్ర నిర్మాణంలో వినూత్న విధానానికి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అవార్డులను గెలుచుకుంది. ఆమె పాత్ర మరోసారి విమర్శకులు, ప్రేక్షకులచే ప్రశంసించబడింది.[4] 2009లో, ఆమె పృథ్వీరాజ్ నటించిన కళాశాల డ్రామా నినైతలే ఇనిక్కుంలో కనిపించింది, ఇది 2006 మలయాళ చిత్రం క్లాస్మేట్స్ పునర్నిర్మాణం. ఆమె ప్రముఖ నటులు మోహన్ లాల్, కమల్ హాసన్, వెంకటేష్ లతో కలిసి ఉన్నైపోల్ ఒరువన్.. దాని తెలుగు వెర్షన్ ఈనాడు చిత్రాలలో నటించింది. టెలివిజన్ జర్నలిస్ట్ అయిన నటాషా రాజ్‌కుమార్ పాత్రను ఆమె విమర్శకులచే ప్రశంసించబడింది. ఆమె 56వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ ఉత్తమ సహాయ నటి అవార్డుకు నామినేట్ చేయబడింది.

2013లో, అనుజా రాజ్ టీవీ కర్ణాటక మ్యూజిక్ రియాలిటీ-టాలెంట్ షో తనిష్క్ స్వర్ణ సంగీతం సీజన్ 2కి హోస్ట్ గా చేసింది.[5]

వ్యక్తిగత జీవితం

2015లో ఆమె పారిశ్రామికవేత్త భరత్ రామ్ తో నిశ్చితార్థం చేసుకుంది.[6]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనిక
2007 సివి నందినీ
2008 ముధల్ ముధల్ వరాయ్ సింధు
మలారే మౌనామా కవి కెనడియన్ సినిమా
2009 నినైతలే ఇనిక్కుమ్ షాలీ
ఉన్నైపోల్ ఒరువన్ నటాషా రాజ్కుమార్ నామినేట్, ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు-తమిళం
ఈనాడు శిల్ప కృష్ణ తెలుగు సినిమా
2011 కో. సోనాలి ప్రత్యేక పాత్ర
యువన్ యువతి తంగమీనా అతిథి పాత్ర
2012 విన్మెంగల్ ఇలా.
కాదల్ 2 కళ్యాణం విడుదల కాలేదు

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం ధారావాహిక పాత్ర భాష ఛానెల్
2012 ధర్మయుతం గాయత్రి తమిళం విజయ్ టీవి
2013 నిష్క్ స్వర్ణ సంగీతం హోస్ట్ తమిళం రాజ్ టీవి

మూలాలు

[మార్చు]
  1. Hail Thamizh! – The Times of India Archived 6 నవంబరు 2012 at the Wayback Machine. The Times of India. 29 April 2010.
  2. ఇక్కడికి దుముకు: 2.0 2.1 2.2 About me. behindwoods.com
  3. Cinema Plus / Film Review : He, she and a ghost – Sivi. The Hindu (28 September 2007). Retrieved 1 April 2011.
  4. Review: Mudhal Mudhal Mudhal Varai Archived 1 మే 2009 at the Wayback Machine. Rediff.com. Retrieved 1 April 2011.
  5. "Tanishq Swarna Sangeetham - Season 2 - The Hindu". The Hindu. 3 February 2013. Archived from the original on 19 April 2014. Retrieved 16 April 2014.
  6. "Anuja Iyer is engaged now". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2021. Retrieved 6 May 2021.