ఈనాడు (2009 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈనాడు
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం చక్రి తోలేటి
నిర్మాణం కమల్ హాసన్
తారాగణం వెంకటేష్, లక్ష్మి
సంగీతం శ్రుతి హాసన్
నిడివి 106 నిమిషాలు
భాష తెలుగు

"యూటీవీ" సంస్థతో కలిసి ఈ సినిమాను కమల్ హాసన్ తెలుగు, తమిళ భాషలలో నిర్మించాడు. హిందీ సినిమా ఎ వెన్స్‌డేకు ఇది రీమేక్. ఈ సినిమాలో పాటలు లేవు.

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]

సాంకేతికబృందం

[మార్చు]

ఓ కామన్ మేన్ (కమల్ హాసన్) హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్ళ దగ్గర బాంబులు పెడతాడు. వాటితో పాటే లకడి-కా-ఫూల్ పోలీస్ స్టేషన్లోనూ ఓ బాంబు పెడతాడు... ఈ విషయాన్ని నగర పోలీస్ కమీషనర్‌కు ఫోనులో తెలియచేస్తాడు. జైల్లో ఉన్న ముగ్గురు ఉగ్రవాదుల్ని, అక్రమంగా మారణాయుధాలు సరఫరా చేస్తున్న వ్యాపారస్తుడినీ జైలు నుండి విడుదల చేసి తనకు అప్పగించాలనే షరతు పెడతాడు. అలా చేయని పక్షంలో నగరంలో తాను పెట్టిన బాంబుల్ని పేల్చేస్తానంటూ బెదిరిస్తాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వస్తుంది. వారిని విడిచిపెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. మరోపక్క ఈ కామన్ మేన్ ఆచూకీ కోసం పోలీసు వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటాయి. ఓ కామన్ మేను ఉగ్రవాదుల్ని జైలు నుండి విడిపించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? వారు స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగింది? కామన్ మేన్‌ను పట్టుకోవడంలో పోలీసులు కృతకృత్యులు అయ్యారా లేదా అన్నది పతాకసన్నివేశం.[1]

స్పందన

[మార్చు]
  • "కథ పరంగా కథనం పరంగా విశిష్టత సంతరించుకున్నా ప్రేక్షకుల మనసుల్ని గెలవడంలో మాత్రం వెనకబడింది" - జాగృతి వారపత్రిక[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ్ (21 September 2009). "'ఇమేజ్ అవరోధంగా నిలచిన ఈనాడు!'". జాగృతి వారపత్రిక.

బయటి లింకులు

[మార్చు]