అనురాధ (నటి)

వికీపీడియా నుండి
(అనూరాధ (నటి) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అనూరాధ
జన్మ నామంసులోచన
జననం (1966-07-21) 1966 జూలై 21 (వయసు 58)
మద్రాసు
తమిళనాడు
భారతదేశం
ప్రముఖ పాత్రలు గంధర్వకన్య,
మాయాబజార్
Aayudham 1990 Movie Poster.jpg
అనురాధ నటించిన ఆయుధం సినిమా ముఖ చిత్రం

అనురాధ 1980లలో ప్రముఖ తెలుగు నృత్యతార. ఆ దశకంలో జయమాలిని, సిల్క్ స్మిత, డిస్కో శాంతి లకు పోటీగా అనురాధ తనదైన గుర్తింపు తెచ్చుకుంది. 1985లో వివాహానంతరం ఈమె క్రమంగా సినీరంగానికి దూరమయింది. ఈమె కుమార్తె అభినయశ్రీ తల్లి బాటలోనే నడచి తెలుగులో నృత్యతారగా పేరు తెచ్చుకుంది. 2007లో ఆట చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రద్వారా ఈమె తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టింది.

నేపధ్యము

[మార్చు]

ఈవిడ తండ్రి కృష్ణకుమార్‌ నృత్య దర్శకుడు. అమ్మ సరోజ కేశాలంకరణ నిపుణురాలు. నానమ్మ కృష్ణాభాయి నటి. పెద్దమ్మ హెయిర్‌ డ్రెస్సర్‌, పెదనాన్న, అంకుల్‌ కెమెరామెన్లు. ఇలా వీరి కుటుంబంలో అందరూ సినిమాతో ముడిపడినవాళ్లే. ఈవిడ నాన్న మరాఠి, అమ్మ తెలుగు. రాజమండ్రి దగ్గర కొవ్వూరు ఈమె అమ్మ పుట్టిల్లు. వీరి ముత్తాత అంటే నాన్నమ్మ వాళ్ల నాన్నగారు మహారాష్ట్రలో స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నారు. ఆ రోజుల్లో అక్కడ గొడవలు ఎక్కువ జరుగుతుండడంతో ముగ్గురు కూతుళ్లతో అక్కడ ప్రశాంతంగా జీవించలేమని నాన్నమ్మవాళ్లు చెన్నైకి వచ్చేశారు. ఈవిడ పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. ఇండస్ర్టీకి వచ్చాకే తెలుగు నేర్చుకుంది. ఈవిడ పెద్దగా చదువుకోలేదు. సినిమాలలో నటించాలనే తపనతో పది పూర్తయిన తర్వాత చదువు మానేసింది.

సినిమా రంగ ప్రవేశం

[మార్చు]

ఈమెకు పదమూడు సంవత్సరాల వయస్సులో ప్రముఖ తమిళ దర్శకుడు కె.జి.జార్జి ఈవిడను సినిమా రంగానికి పరిచయం చేశాడు. ఈమె పేరును సులోచన నుండి అనూరాధగా మార్చాడు. కథానాయికగా పరిచయమైన ఈమె తర్వాత కాలంలో శృంగార నృత్యాలకు పేరు పొందింది. అన్ని భాషలలో కలిపి సుమారు 35 చిత్రాలలో నటించింది. తెలుగు టీవీ ధారావాహిక అంతరంగాలు కూడా నటించింది.

రజనీకాంత్‌, శ్రీప్రియ నటించిన కోకిలమ్మ చెప్పిందిలో తొలిసారిగా ఈమె వెండితెరపై కనిపించింది. ఈవిడకు అప్పుడు పదేళ్ల వయసు. ఆ సినిమా షూటింగ్‌కి అమ్మతోపాటు ఈవిడా వెళ్ళేది. ఆ సినిమాలో పిల్లలకు డ్యాన్స్‌ నేర్పించే సన్నివేశం ఒకటి ఉంది.. పిల్లలకు డ్యాన్స్‌ నేర్పిస్తున్న సన్నివేశం తీస్తున్నారు. ఈమె నృత్యం బాగా చేస్తుందని తెలిసి మిగతా పిల్లలతోపాటు ఈమెకూ మేకప్‌ వేయించి, ఆ సన్నివేశంలో నటింపజేశారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఏ సినిమాలో నటించలేదు. ఒక రోజు స్కూలు లేకపోవడంతో ఊర్వశి శారద నటిస్తున్న సినిమా షూటింగ్‌కి వెళ్ళింది. అప్పట్లో వీళ్ళ అమ్మ, శారదగారికి హెయిర్‌డ్రస్సర్‌గా వ్యవహరించేది. ఈవిడ సెట్‌లో నిల్చుని షూటింగ్‌ చూస్తున్నది. అక్కడే ఉన్న మలయాళం డైరెక్టర్‌ ఒకాయన ఈవిడను చూసి ‘చాలా అందంగా ఉంది. నా సినిమాకి ఇటువంటి అమ్మాయే కావాలి’ అని ఈమె కోసం వాకబు చేశారు. ఆయనే జాతీయ అవార్డు గ్రహీత కేజీ జార్జ్‌. అమ్మానాన్నలు అంగీకరించడంతో హీరోయిన్‌ అయిపోయింది. అప్పుడు ఈవిడకు 13 ఏళ్లు. మలయాళంలో జార్జ్‌ తీసిన ‘ఇని అవళ్‌ఉరంగట్టె’ ఈమె తొలి సినిమా. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్‌ అది. నటన గురించి ఏమీ తెలియకుండానే అలా హీరోయిన్‌ అయిపోయింది. ఆ సినిమాలో ఏం చేయాలో, ఎలా చేయాలో జార్జే చూసుకున్నారు. ఈవిడ మొదటి సినిమా కథ కూడా ఈవిడకు తెలియదు. ఈ సినిమాలో నటించడానికి ముందు ‘ఈ అమ్మాయి ఓకే... హీరోయిన్‌ ఈమే’ అని చెప్పారంతే. అప్పట్లో తమిళం, మలయాళంలో సులక్షణ అనే మరో నటి ఉండడంతో, కేజీ జార్జ్‌ ఈమె పేరుని అనురాధగా మార్చారు. ఆ తరువాత తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు వచ్చాయి. 30కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. తెలుగులో చంద్రమోహన్తో పంచకల్యాణి, రంగనాథ్తో 'ఊరు నిద్ర లేచింది... ఇంకా కొన్ని సినిమాలు చేసింది. కానీ ‘ఊరు నిద్ర లేచింది’ విడుదల కాలేదు. అందులో ఈవిడది జట్కా బండి నడిపే అమ్మాయి పాత్ర . పేరు ‘పంచకల్యాణి. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది.

శృంగార నర్తకిగా ప్రస్థానము

[మార్చు]

మలయాళంలో చేస్తున్న ఒక సినిమాలో డ్యాన్స్‌ నేపథ్యమున్న హీరోయిన్‌ క్యారెక్టర్‌ పోషించింది. కుటుంబ పోషణ కోసం డ్యాన్స్‌లు చేసే పాత్ర. మామూలుగానే ఈవిడ మంచి నృత్యకారిణి. ఇక డ్యాన్స్‌ క్యారెక్టర్‌ కావడంతో చాలా బాగా చేసింది. ఆ సినిమాలో ఈవిడ నృత్యాలు చూసి రఘురాం మాస్టారు ఐటమ్‌సాంగ్‌లో నటించమని అడిగారు. అప్పట్లో ఆ పాటలకి సిల్క్‌స్మితని మించిన వాళ్లు లేరు. అప్పటికి ఆమెతో ఈవిడకు పరిచయం లేదు. చాలా బిజీగా ఉండేది. పైగా గర్వంగా ఉండేదనేవారు. ఎక్కువగా గొడవ పడేదట. దాంతో మాస్టర్లు ఆమెకు ప్రత్యామ్నాయంగా ఈవిడను అడిగి, ఒప్పించేశారు. చేసిన ప్రతి పాట హిట్టే. దీనితో ఈవిడకూ క్రేజ్‌ పెరిగింది. దీంతో అవే పాత్రలు రావడం మొదలయ్యాయి.

వ్యక్తిగత జీవితము

[మార్చు]

1987లో ఈవిడ వివాహము నృత్యకారుడు సతీష్‌కుమార్‌తో జరిగింది. అంతకుముందే సినీ పరిశ్రమలో వీరిద్దరూ మంచి స్నేహితులు. వీరిద్దరూ ఒకరితో ఒకరం మాట్లాడుకోవటం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు. ఆయనతో మాట్లాడొద్దన్నారు. కలిసి ఎక్కడికి వెళ్లొద్దన్నారు. పెద్దవాళ్లు ఏది చేయొద్దని చెబితే దానికి విరుద్ధంగా చేసే వయసు వీరిది. ఇక తప్పక ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు అభి (అభినయశ్రీ), కాళీచరణ్. నవంబరు 7, 1996 న ఈమె భర్తకు పెద్ద యాక్సిడెంట్‌ అయ్యింది. దీని వలన అతని తలలోని ఆరు నరాలు చిట్లిపోయాయి.కదలలేని స్థితికి చేరుకున్నారు. దాంతో ఇల్లు, పిల్లల బాధ్యత అనురాధ పైనే పడింది. భర్తకు అన్నం తినిపించడం, దుస్తులు మార్చడం, నడిపించడం అన్నీ ఈవిడే దగ్గరుండి చూసుకుంది. అలా పదకొండేళ్లుగా కాపాడుకోగలిగింది. కొంచెం జ్ఞాపకశక్తి వచ్చి, బాగవుతుంది అనుకునే సమయంలో (2007) గుండెపోటు వచ్చి శాశ్వతంగా దూరమయ్యారు. ఈవిడ జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన అది. ఈవిడ తల్లి సరోజ సినీ తారలకు కేశాలంకరణ చేసేది. ఫిబ్రవరి 8, 1997 న ఆమె మరణించింది.

అనురాధ నటించిన కొన్ని తెలుగు చిత్రాలు

[మార్చు]

బయటి లంకులు

[మార్చు]