Jump to content

అన్డెసెలెనిక్ ఆమ్లం

వికీపీడియా నుండి
అన్డెసెలెనిక్ ఆమ్లం సౌష్టవం

అన్డెసెలెనిక్ ఆమ్లం(undecylenic acid) అనేది సూత్రంతో కూడిన కర్బన సమ్మేళనం.ఇది అసంతృప్త కొవ్వు ఆమ్లం.పండ్ల వాసనతో కూడిన లేత-రంగు ద్రవం, ఆల్కహాల్ మరియు ఈథరులో కరిగుతుంది. పరిమళ ద్రవ్యాలు, రుచులిచ్చే పదార్థాలు, ప్లాస్టిక్‌లు మరియు ఔషధాలలో ఉపయోగిస్తారు.[1]అన్దెసైలెనిక్ యాసిడ్ సమ్మేళనం, యాంటీ ఫంగల్స్(శిలీంధ్ర విరోధక/నాశక ) అని పిలువబడే ఔషధాల సమూహానికి చెందినది.ఇది కొన్ని రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.అయినప్పటికీ, ప్రస్తుతం ఫంగస్ ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం అండసైలెనిక్ యాసిడ్ స్థానంలో కొత్త మరియు మరింత ప్రభావవంతమైన మందులు తయారు అవుతున్నాయి.దీనిని,ద్రవం,లేపనం,టింక్చర్ అలాగే పొడి రూపంలో వైద్య చికిత్సలో ఉపయోగిస్తారు.[2] ఈ ఔషధం అథ్లెట్స్ ఫుట్(ఫంగస్ పట్టిన పాదము) మరియు జోక్ దురద(గజ్జల్లో దురద) వంటి చర్మపు ఫంగల్(శిలీంధ్ర/బూజు) ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు.అన్డెసెలెనిక్ యాసిడ్ అనేది ఫంగస్ పెరుగుదలను నిరోధించడం ద్వారా పనిచేసే కొవ్వు ఆమ్లం. ఈ ఉత్పత్తిని నెత్తిమీద లేదా గోళ్లకు సంబంధించిన ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి ఉపయోగించరాదు.[3]

చరిత్ర

[మార్చు]

అన్డెసెలెనెట్(Undecylenate) లేదా అన్డెసెలెనిక్ ఆమ్లం, ఆముదం నుండి ఉద్భవించిన టెర్మినల్ డబుల్ బాండ్‌వున్న(కార్బన్ శృంఖలం చివర ద్విబంధం వున్న) అసంతృప్త కొవ్వు ఆమ్లం.అన్డెసెలెనిక్ ఆమ్లం సహజంగా మానవ చెమటలో కూడా కనిపిస్తుంది.సుగంధ రసాయనాలు, పాలిమర్‌లు లేదా ఆధునీకరించిన సిలికాన్‌ల తయారీలో ఇది పూర్వగామిగా ఉపయోగించబడుతుంది.అన్డెసెలెనిక్ ఆమ్లం మొదటిసారిగా 1877లో రిసినోలెయిక్ ఆమ్లం యొక్క పైరోలిసిస్ ద్వారా ఆముదం యొక్క స్వేదన క్రియ(బాష్ప క్రియ) యొక్క ఉత్పత్తుల నుండి వేరుచేయబడింది మరియు వినైల్ ఉత్పత్తి కోసం పాలిమరైజ్ చేయబడింది.అనేక సేంద్రీయ కొవ్వు ఆమ్లాలు శిలీంద్ర సంహారిణి లేదా శిలీంధ్ర సంహారిణి చర్యలను చూపుతాయని ఇది సూచించింది.[4]అన్డెసెలెనిక్ యాసిడ్ అనేది స్ట్రెప్టోమైసెస్ మరియు సాల్వియా ఫ్రూటికోసాలో లభించే ఒక సహజ ఉత్పత్తి.

సౌష్టవం

[మార్చు]

అన్డెసెలెనిక్ ఆమ్లం, 10-అన్డెసెలెనెట్ లేదా ఒమేగాఅన్ డెసెనోయెట్(omega-undecenoate) అని కూడా పిలుస్తారు, మధ్యస్థ గొలుసు కొవ్వు ఆమ్లాలు అని పిలిచే కర్బన సమ్మేళనాల తరగతికి చెందినది.ఇవి 4 మరియు 12 కార్బన్ పరమాణువుల మధ్య ఉండే అలిఫాటిక్ తోక కలిగిన కొవ్వు ఆమ్లాలు.[5]10-అన్డెసెలెనిక్ ఆమ్లం అణువు మొత్తం 32 బంధాలను (లు) కలిగి ఉంటుంది.12 నాన్-హెచ్ బాండ్(లు), 2 మల్టిపుల్ బాండ్(లు), 9 రొటేటబుల్ బాండ్(లు), 2 డబుల్ బాండ్(లు), 1 కార్బాక్సిలిక్ యాసిడ్(లు) (అలిఫాటిక్) మరియు 1 హైడ్రాక్సిల్ గ్రూప్(లు) ఉన్నాయి.[6]

Pyrolyse von Ricinolsäuremethylester
Pyrolyse von Ricinolsäuremethylester

సంశ్లేషణ

[మార్చు]

అన్డెసెలెనిక్ ఆమ్లం(10-undecyle.ఇది ఒలీయిక్ ఆమ్లం యొక్క ఆక్సిడెరివేటివ్-రిసినోలెయిక్ ఆమ్లం-ఈ చర్యలో ఆముదం నూనె యొక్క గ్లిజరైడ్ ప్రధాన పదార్ధం. [7][8]

CH3―(CH)5―CH(OH)―CH2―CH=CH―(CH2)7―COOH →H2C=CH―(CH2)8―COOH+CH3―(CH2)5―CH=O

కాస్టర్ ఆయిల్ యొక్క పైరోలిసిస్ సమయంలో ఏర్పడిన ఉత్పత్తులలో ఇది ఒకటి.[9]

భౌతిక ధర్మాలు

[మార్చు]
లక్షణం/గుణం మితి/విలువ
అణు సూత్రం C11H20O2[10]
అణు భారం 184.28 గ్రా/మోల్[10]
ద్రవీభవన ఉష్ణోగ్రత 24.5°C[5]
మరుగు స్థానం 275°C[10]
వక్రీభవన గుణకం 1.4486 [10]
సాంద్రత 0.9102
ఫ్లాష్ పాయింట్ 149 °C[11]

సాధారణంగా ఘన రూపంలో వుండును.నీటిలొ తక్కువ ప్రమాణంలొ కరుగుతుంది.ఆల్కహాల్,క్లోరోఫాం, డై ఇథైల్ ఈథర్ లో కరుగుతుంది.[12]

అన్డెసెలెనిక్ ఆమ్లం-అనువర్తనాలు

[మార్చు]
  • అన్డెసెలెనిక్ ఆమ్లంచర్మం యొక్క ఫంగల్ లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది. ఇది యాంటీ ఫంగల్స్ అని పిలువబడే ఔషధాల సమూహానికి చెందినది. ఇది బ్యాక్టీరియా లేదా వైరస్‌ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌లకు చికిత్స చేయదు.[13]
  • ఈ ఔషధం బాహ్య వినియోగం కోసం మాత్రమే.లోపలికి నోటీ ద్వారా తీసుకోరాదు.మందును లేపనంగా/పూతగా పూసే ముందు,పూసిన తరువాత శుభ్రంగా చెతులు కడుక్కోవాలి.
  • 10-అండెసైలెనిక్ యాసిడ్ (UDA) యాంటీ ఫంగల్ థెరపీగా మరియు పోషకాహార సప్లిమెంట్‌గా ఉపయోగించబడుతుంది.UDA( అన్డెసెలెనిక్ ఆమ్లం)అనేది అసంతృప్త మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్ డెరివేటివ్, మరియు ఇది µ-కాల్‌పైన్‌ను నిరోధించడానికి ఒక మంచి న్యూరోప్రొటెక్టివ్ పదార్థం.[14][15]

దుష్పలితాలు

[మార్చు]
  • చికిత్స చేయబడిన చర్మం చికాకు/ప్రకోపం కల్గించడం లేదా మండు తున్నట్లు అనిపించవచ్చు . ఈ ప్రభావాలు ఏవైనా చివరిగా లేదా అధ్వాన్నంగా ఉంటే, వెంటనే డాక్టర్ లేదా ఫార్మసిస్ట్ చెప్పాలి.[16]
  • అతి సున్నితత్వం కలిగిన వ్యక్తులు ఈ మందును వాడకపోవడం మంచిది.[17]
  • 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో లేదా డైపర్ దద్దుర్లు కోసం అన్డెసెలెనిక్_ఆ మరియు ఉత్పన్నాలను ఉపయోగించరాదు.[17]

మూలాలు

[మార్చు]
  1. "undecylenic acid". dictionary.com. Retrieved 2024-04-11.
  2. "Undecylenic Acid (Topical Route)". mayoclinic.org. Retrieved 2024-04-11.
  3. "Undecylenic Acid Liquid". webmd.com. Retrieved 2024-04-11.
  4. "Undecylenic acid". go.drugbank.com. Retrieved 2024-04-11.
  5. 5.0 5.1 "Showing Compound Undecylenic acid". foodb.ca. Retrieved 2024-04-11.
  6. "Structure & Deep Data of 10-UNDECENOIC ACID (C11H20O2)". molinstincts.com. Retrieved 2024-04-11.
  7. Antifungal Drugs; R.S. Vardanyan, V.J. Hruby, in Synthesis of Essential Drugs, 2006
  8. "Antifungal Drugs". sciencedirect.com. Retrieved 2024-04-12.
  9. Antifungal free fatty acids: a review.Pohl CH, et al.Science against microbial pathogens: communicating current research and technological advances, 3, 61-71 (2011)
  10. 10.0 10.1 10.2 10.3 "Undecylenic Acid". drugfuture.com. Retrieved 2024-04-11.
  11. "Undecylenic-10 acid". merckmillipore.com. Retrieved 2024-04-11.
  12. "10-Undecenoic acid". sigmaaldrich.com. Retrieved 2024-04-11.
  13. "Undecylenic Acid Ointment or Topical Solution". clevelandclinic.org. Retrieved 2024-04-11.
  14. "Synthesis and Physicochemical Characterization of Undecylenic Acid". ncbi.nlm.nih.gov. Retrieved 2024-04-12.
  15. Jiang L., Wang W., He Q., Wu Y., Lu Z., Sun J., Liu Z., Shao Y., Wang A. Oleic acid induces apoptosis and autophagy in the treatment of Tongue Squamous cell carcinomas. Sci. Rep. 2017;7:11277. doi: 10.1038/s41598-017-11842-5.
  16. "Side Effects". webmd.com/. Retrieved 2024-04-12.
  17. 17.0 17.1 "warnings". medicinenet.com. Retrieved 2024-04-12.